Wednesday 28 December 2016

ఇంటర్‌నెట్‌ ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలంటే ఇలా..


  • అందుబాట్లో అన్ని శాఖల వెబ్‌సైట్‌లు 
  • ఎప్పటికప్పుడు ప్రగతి తెలుసుకునే అవకాశం
ప్రభుత్వ శాఖలలో ముఖ్యమైన రేషన్ షాపులు, ఎరువుల దుకాణాలు, ఆరోగ్య కేం ద్రాలు ఇలా ఏ శాఖకు సంబంధించిన ఉద్యో గులపై విజిలెన్సు అధికారులకు ఫిర్యాదు చేయాలనుకుంటే జీమెయిల్‌ తరహాలో ఒక ప్రత్యేక యూజర్‌ ఐడీ క్రియేట్‌ చేసుకోవాలి. మొదటిగా హెచ్ టీటీపీ://పోర్టల్‌. సీవీసీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి కుడిచేతివైపు ఉండే న్యూ యూజర్‌ /కంప్లైంట్‌ బాక్సుపై క్లిక్‌ చేయాలి. వెంటనే ఐడీని క్రియేట్‌ చేసే వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో పేరు, ఊరు, చిరునామా ఐడీ, పాస్‌వర్డ్‌ ఇలా మొత్తం ఖాళీ లను నింపి సబ్‌మిట్‌ క్లిక్‌ చేస్తే ఐడీ క్రియేట్‌ అవుతుంది. ఐడీ పాస్‌వర్డ్‌తో వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. వెంటనే మరో విండో ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఎడమవైపు ఫిర్యాదు నమోదైన బాక్సుపై క్లిక్‌చేసి దానిలో అన్ని వివరాలు నింపాలి. ఏమైనా సాక్ష్యాలు, పత్రాలు ఉంటే అదే పేజీలో దిగువ భా గంలో ఉండే అటాచ డాక్యుమెంట్స్‌పై క్లిక్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి. ఫిర్యాదును నమోదు చేశాక రిఫరెన్సు నంబరు వస్తుంది. దానిని తీసుకొని పది రోజుల్లో ఫిర్యాదు పరిస్థితిని పరిశీలించవచ్చు

బ్యాంకు లావాదేవీల విషయంలో ఏ బ్యాంకు శాఖ ఉద్యోగిపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. అది నేరుగా రిజర్వు బ్యాంకు అధికారులకు అందుతుంది. ముందుగా హెచటీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్‌బీఐ. ఓఆర్‌ఎఫ్‌.ఇన్ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించాలి. బ్యాంకు హోం పేజీలో కుడివైపు సాధారణ వ్యక్తుల కోసం అనే అప్షన్ ఉంటుంది. అది క్లిక్‌ చే స్తే వెంటనే ఫిర్యాదుల విభాగానికి సంబంధించి మరో విండో ఓపెన అవుతుంది. అందులో పూర్తి వివరాలు నమోదు చే యాలి. సాక్ష్యాలు ఉంటే అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం సేవ్‌ బటన మీద క్లిక్‌ చేస్తే ఫిర్యాదు ఉన్నతాధికారులకు వెళ్లిపో తుంది. అక్‌నాల్డెజ్‌మెంట్‌ నంబరు ద్వారా 15 రోజులలో ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

పోస్టాఫీస్‌ సిబ్బంది, కార్యాలయాలపై ఫిర్యాదు చేసేందుకు మొదట డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇండియాపోస్ట్‌. జీవోవీ.ఇన వెబ్‌సైట్‌లోని హోం పేజీలో ఉన్న కస్టమర్‌ కేర్‌ క్లిక్‌ చేసి ఫిర్యాదు నమోదు ఆప్షన ఎంచుకోవాలి. పేజీలో వివరాలు నమోదు చేయాలి. జాగ్రత్తగా నింపిన తరు వాత సబ్‌మిట్‌ బటన నొక్కాలి. వెంటనే రిఫరెన్సు నంబరు వస్తుంది. ఆ నంబరు ఆధారంగా ఫిర్యాదు పై విచారణ, తదితర అంశాలను తెలుసుకుంటూ ఉండవచ్చు.
రైల్వే ప్రయాణంలో ఎదురైన సమస్య, సిబ్బంది ని ర్వాకంపైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. మొదటగా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ.ఇండియన్ రైల్వేస్‌.జీవోవీ.ఇన వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. దిగువ భాగాన ఫిర్యాదులు, సలహాల బాక్సు ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేస్తే ఫిర్యాదు, సూచనల నమోదు ఆప్షనలు వస్తాయి. ఫిర్యాదు చేయాల్సిన విభాగాన్ని ఎంచుకుని ప్రయాణ సమయం, తేదీ, రైలు వివరాలు, బాధ్యులైన సిబ్బంది, సమస్య, ఫిర్యాదు చేస్తున్న వ్యక్తి పేరు, ఫోన్ నంబరు లాంటి వివరాలన్నీ నింపి సబ్‌మిట్‌ చేయాలి. వెంటనే ఓ అక్‌నాల్డెజ్‌మెంట్‌ నంబరు వస్తుంది. వారం రోజుల తరువాత ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో ఫోన నంబరుకు మెసేజ్‌ వస్తుంది. గడువులోగా స్పందన రాకుంటే వెబ్‌సైట్‌ మొదటిపేజీలో ఫిర్యాదు ప్రస్తుత పరిస్థితి (ట్రాక్‌ కంప్లైంట్‌ లేదా రిఫరెన్సు) ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫిర్యాదుపై వెంటనే నిర్ధారణకు వచ్చేందుకు ప్రయాణ టికెట్‌ను స్కాన చేసి అప్‌లోడ్‌ చేయవచ్చు. అదే సాక్ష్యంగా ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment