Tuesday, 29 November 2016

RBI గవర్నర్ ఉర్జిత్ పటేల్ , ముకేశ్ అంబానీ తోడల్లుళ్ళ ? నీతా అంబానీ చెల్లెలు భర్తేనా ఉర్జిత్ పటేల్ ? అసలు నిజ నిజాలు మీకోసం..,.

ప్రధాని మోడీ నోట్ల రద్దుపై చరిత్రాత్మక నిర్ణయం ప్రకటించారు… ఈ నిర్ణయం నిజానికి ఆర్బీఐ గవర్నర్ గా రఘురామరాజన్ ఉన్నప్పుడే ఆలోచించారు… కానీ ఆయన వెళ్లిపోయాక, తనకు అత్యంత అనుకూలుడైన ఓ గుజరాతీ ఉర్జిత్ పటేల్ ను ఆర్బీఐ గవర్నర్ గా తెచ్చుకున్నాక మాత్రమే ఈ నిర్ణయం ప్రకటించారు… నిజానికి దీనివెనుక ఉన్నది ముఖేష్ అంబానీ… ఉర్జిత్ ఎవరో తెలుసా…? గతంలో రిలయెన్స్ లో పనిచేసిన ఉర్జిత్ స్వయానా ముఖేష్ భార్య నీతా అంబానీకి మరిది… ఉర్జిత్, ముఖేష్ తోడల్లుళ్లు… నీతా చెల్లెనే ఉర్జిత్ పెళ్లిచేసుకున్నాడు… ముఖేష్ ఆలోచన మేరకే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నాడు…’’ ఇదండీ కొద్దిరోజులుగా సోషల్ మీడియా మొత్తుకుంటున్న వార్తలు, విశేషాలు, ప్రచారాలు, కథలు, కథనాలు, కాకరకాయలూ…. కానీ అసలు నిజాలు ఏమిటో తెలిస్తే మీరే విస్తుపోతారు… ఆ అసలు నిజాలు మీ కోసం… అసలు నిజం తెలిసిన తర్వాత తప్పకుండా షేర్ చేయండి...

ముందు ఉర్జిత్ ఎవరో చూద్దాం… తను గుజరాతీ, ప్రభావం చూపే పటేల్ సామాజికవర్గం… తను 1963లో పుట్టింది ఎక్కడో తెలుసా… కెన్యాలోని నైరోబీలో…!! నిజం… తరువాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో డిగ్రీ, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎంఫిల్, యాలె యూనివర్శిటీలో డాక్టరేట్ చేశాడు…, మొదట్లో ఐఎంఎఫ్ లో పనిచేసిన ఆయన డిప్యుటేషన్ పై ఆర్బీఐకి వచ్చాడు…, తరువాత కేంద్ర ఆర్థిక శాఖ కన్సల్టెంటుగా పనిచేసి…, రిజర్వ్ బ్యాంకుకు డిప్యూటీ గవర్నర్ అయ్యాడు…, మొన్నమొన్న రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్ అయ్యాడు… తను గతంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ బిజినెస్ డెవలప్ మెంట్ విభాగానికి ప్రెసిడెంటుగా చేసింది నిజమే…, గుజరాత్ ప్రభుత్వానికి చెందిన చమురు సంస్థ జీఎస్పీఎస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా చేశాడు…, అప్పుడే మోడీ తన పనితీరు గమనించి, ఆర్బీఐ గవర్నర్ విషయంలోనూ తనపట్ల మొగ్గు చూపించాడు… ఇదీ ఉర్జిత్ కథ…

ఇక ఉర్జిత్ వదినగా చెబుతున్న ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి చూద్దాం… వాళ్లూ గుజరాతీలే… ముంబై శివార్లలో ఉండే కుటుంబం… తల్లి ఓ శాస్త్రీయ నాట్యగత్తె… నీతాకు కూడా నేర్పింది… నీతా దలాల్ కూడా మంచి డేన్సర్… తరువాత ఆమె ధీరూభాయ్ అంబానీ ఇంట్లోకి ముఖేష్ భార్యగా అడుగుపెట్టింది… ఆమెకు ఒకతే చెల్లెలు… పేరు మమతా దలాల్… ఇదే ధీరూభాయ్ అంబానీ బాంద్రాలో పెట్టిన స్కూల్ లో టీచర్… షారూఖ్, సచిన్ పిల్లలు సుహానా, సారాలకూ పాఠాలు చెప్పింది…

పైన ఫోటోలో నీతా అంబానీతో ఉన్నది ఆమే… ఇక అసలు విషయం చెప్పనే లేదు కదూ… ఉర్జిత్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు అనేది పచ్చి అబద్ధం… ముంబైలోనే నీతాకు పది మంది కజిన్స్ ఉన్నారు… వాళ్లలో ఒకర్ని చేసుకున్నాడేమో అనే డౌట్లూ కొందరు వెలిబుచ్చారు…
అసలు నిజం ఏమిటంటే… అసలు ఉర్జిత్ పెళ్లే చేసుకోలేదు… 53 ఏళ్ల బ్రహ్మచారి…!!

No comments:

Post a Comment