Tuesday, 29 November 2016

రోజుకి 2 అరటిపండ్లు తింటే శరీరంలో కనిపించే అద్భుత మార్పులు..

అరటిపండులో ఫైబర్, విటమిన్స్, న్యాచురల్ షుగర్స్, ఫ్రక్టోజ్, సక్రోజ్ ఉంటాయి. అందుకే.. డాక్టర్లు కూడా.. అరటిపండుని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవాలని సూచిస్తుంటారు. అమెరికన్లు అరటిపండ్లను చాలా ఎక్కువగా తింటారు. అలాగే మనం అరటిపండ్లను తింటాం. కానీ.. నల్లగా, మచ్చలు ఏర్పడిన వాటిని పడేస్తుంటాం. కానీ.. అందులోనే ఎక్కువ పోషకాలుంటాయి.
ఎనర్జీ
అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. ఇమ్యునిటీని బలంగా మారుస్తాయి. తెల్ల రక్తకణాలను మెరుగుపరుస్తాయి. ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ ని కూడా అరికడతాయి. డైలీ డైట్ లో అరటిపండ్లను ఎందుకు చేర్చుకోవాలి ? రోజుకి రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి ఎలా సహాయపడుతుందో, ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం..
హార్ట్ బర్న్

హార్ట్ బర్న్

అరటిపండ్లలో న్యాచురల్ యాంటీ యాసిడ్ ఉంటుంది. ఇది నిమిషంలో హార్ట్ బర్న్ ని నివారిస్తుంది. ఒకవేళ హార్ట్ బర్న్ లక్షణాలు గమనించారంటే.. వెంటనే అరటిపండు తినేయండి.
బ్లడ్ ప్రెజర్

బ్లడ్ ప్రెజర్

అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే సోడియం ఉండదు. కాబట్టి.. ఇది గుండెకు మంచిది. అలాగే ప్రతిరోజూ రెండు అరటిపండ్లు తింటే.. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవడంతో పాటు, స్ట్రోక్, హార్ట్ ఎటాక్ ని అడ్డుకుంటుంది.

ఎనర్జీ

అరటిపండ్లు తక్షణ శక్తిని ఇస్తాయి. కాబట్టి.. వర్కవుట్ కి ముందు స్నాక్ గా.. అరటిపండు తీసుకోవాలి. ఇందులో విటమిన్స్, మినరల్స్, తక్కువ గ్లిసెమిక్ ఉంటుంది. ఇవన్నీ.. ఎనర్జీ లెవెల్స్ ని మెరుగుపరుస్తాయి.
అనీమియా

అనీమియా

అనీమియాతో బాధపడే వాళ్లకు అరటిపండు అద్భుతంగా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడేవాళ్లు డైట్ లో అరటిపండు చేర్చుకుంటే.. వాళ్లకు అవసరమైన ఐరన్ అందుతుంది. ఐరన్ సరిపడా అందితే.. హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ ని మెరుగుపరిచి.. బ్లడ్ సప్లైని మెరుగుపరుస్తుంది.
అల్సర్స్

అల్సర్స్

అల్సర్స్ వల్ల స్టమక్ అప్ సెట్ సమస్య వస్తుంది. కాబట్టి.. పొట్టలో అల్సర్లతో బాధపడేవాళ్లు.. అరటిపండ్లు తీసుకోవడం వల్ల.. ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు.
డిప్రెషన్

డిప్రెషన్

డిప్రెషన్ తగ్గించడంలో.. అరటిపండ్లు సహాయపడతాయి. ఇందులో ట్రైప్టోఫాన్ ఉంటుంది. ఇది సెరోటొనిన్ గా మారుతుంది. ఈ సెరోటొనిన్ అనేది.. హ్యాపీగా ఫీలవడానికి సహాయపడుతుంది. రిలాక్స్ అయి, మూడ్ ని మార్చడానికి సహాయపడుతుంది. కాబట్టి.. ఎప్పుడైతే .. మీరు ఆందోళనగా ఫీలవుతారో.. అప్పుడు అరటిపండు తింటే మంచిది.
కాన్ట్సిపేషన్

కాన్ట్సిపేషన్

అరటిపండ్లలో హై ఫైబర్ ఉంటుంది. ఇది.. కాన్ట్సిపేషన్ తో బాధపడేవాళ్లకు సహాయపడుతుంది. ఇది బోవెల్ మూవ్మెంట్ ని సజావుగా మార్చి.. కాన్ట్సిపేషన్ లక్షణాల నుంచి బయటపడేస్తుంది.
నరాలకు

నరాలకు

ఒకవేళ మీరు చాలా ఒత్తిడికి లోనవుతున్నారంటే.. అరటిపండు తినండి.. అది మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్న్ ని రెగ్యులేట్ చేసి.. విటమిన్స్ బి అందించి.. నారల వ్యవస్థ రిలాక్స్ అవడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ.. రెండు అరటిపండ్లను డైట్ లో చేర్చుకోండి. ఎఫెక్టివ్ ఫలితాలను పొందండి..

No comments:

Post a Comment