దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు
అధికంగా ఉన్నాయి. ఇవి ముఖంపై మచ్చలూ, మొటిమల్ని తగ్గించడంలో సాయపడతాయి.
చర్మానికి నిగారింపునిస్తాయి. కొన్ని
దానిమ్మ గింజలను మెత్తగా చేసుకుని, దానికి చెంచా తేనె కలపాలి. ఈ
మిశ్రమాన్ని ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే ముఖం తాజాగా
మారుతుంది.
• దానిమ్మ, గ్రీన్ టీ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ముఖ చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. అందుకు ఏం చేయాలంటే... కొన్ని దానిమ్మ గింజలను మెత్తగా చేసి దానికి చెంచా చొప్పున పెరుగూ, గ్రీన్ టీ, తేనె కలపాలి. దీన్ని ముఖానికి పూతలా రాసుకుని అరగంట తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ మురికిని తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది.
• చెంచా దానిమ్మ గింజల పేస్ట్‌లో... రెండు చెంచాల చొప్పున తేనె, అవకాడో నూనె, చెంచా నారింజ తొక్కల పొడీ వేసి కలపాలి. ఈ స్క్రబ్‌ని వేళ్లతో తీసుకుని ముఖంపై వలయాకారంగా రుద్దుతూ ఉండాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
• చెంచా దానిమ్మ గింజల పేస్ట్‌కి చెంచా మిల్క్ క్రీమ్, అరచెంచా గులాబీ నీళ్లూ కలపాలి. దీన్ని పెదాలకు రాసి ఐదు నిమిషాల పాటు వలయాకారంగా రుద్దాలి. ఐదు నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే పెదాలు రంగు తేలతాయి.

No comments:
Post a Comment