Tuesday, 29 November 2016

ఇంట్లో గడప అవసరం ఎంతైనా ఉంది. మరి దాని ఉపయోగమేమీ

దేహళి’ అంటే ‘కడప’ ద్వారం దాటడానికి వేసే ‘నడిమి పడిని’ కడప అంటారు. కడప పట్టణానికి ఆ పేరు రావడానికి అది తిరుపతి వెంకటేశ్వరస్వామి యొక్క దేవుని కడప కావటమే. అయితే కొన్ని ప్రాంతాలలో గడపగా కూడా పిలుస్తుంటారు.
కడప ఇళ్లల్లోకైతే మేలైన కలపతో ద్వారానికి అనుసంధానంగాను, దేవాలయాలలో అయితే శిలా రూపంలోనూ చెక్కుతారు. ఈ గడపను తొక్కుతూ ఇంట్లోకి కాని, దేవాలయంలోకి కాని వెళ్లకూడదు.దాటుతూ వెళ్లాలి. ఈ కడపను ద్వార ప్రమాణానికి అనుప్రమాణ రీతిలో నిర్మించాలి. అలా కాకుండా నిర్మిస్తే అది దేహళీ భిన్న వేధగా ఇంట్లో నివసించే వారికి అనేక రకములైన ఇబ్బందులకు గురి చేస్తుంది.




గడప నిర్మాణంవలన మరొక వాస్తు ప్రయోజనం లౌకిక ప్రయోజనం కూడా ఉంది. ఏ గదికి ఆ గదికి గడప, లేకపోతే పడక గదికీ, వంట గదికీ దేవుని గదికీ తేడాయే ఉండదు.
ఒక సామాన్యమైన ఉదాహరణ గమనించండి. ఒక భూస్వామికి పదెకరాల పొలం ఉందనుకోండి, ఆ మొత్తం పొలానికి ఏకంగా నీరు పెడతాడా? పెట్టడు. మడికీ మడికీ మధ్య గట్టు ఏర్పరచి మళ్లు మళ్లుగా నీరు పెడతాడు. కారణం ‘మడి’ అంటే హద్దు గట్టు అంటే హద్దును ఏర్పరిచే ఒక గడప.




దేవుని పూజకు మడికట్టుకోవడమంటే కూడా అదే అర్థం. ఒక ప్రత్యేకమైన పనికి కట్టుబడి ఉండడం. అందుకే ఇంట్లో గడప అవసరం ఎంతైనా ఉంది.
గడప వలన మరొక లౌకిక ప్రయోజనం కూడా ఉంది. పాములూ, తేళ్లు వంటి పాకుడు క్రిమి కీటకాలు (సరీసృపాలు) ఎప్పుడూ ఏదో ఒక ఆధారంగా ఓరగా పాకుతుంటాయి. అదే గడప ఉన్నట్టయితే ఇంట్లోకి రాకుండా బయటినుండే వెళ్లిపోతాయి. అందుకే ఇంట్లో ప్రతి గదికీ గడప (కడప) ఉండాలి అని వాస్తు శాస్త్రం సర్వార్ధ సాధక నియమాన్ని నిర్దేశించింది. ఆ గడప ద్వార ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి. చీలికలు, నరుకులు ఉండకుండా అఖండంగా ఉండాలి. అది దోషంగా ఉన్నప్పుడు దేహళీభిన్న వేధగా పీడిత ద్వార దోషంగా హాని కలిగిస్తుంది.
ఏ గృహానికయినా గడపలు తప్పనిసరి. పల్లెటూళ్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వా రానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారా లు బిగించబడ వు. గడపలేని గృహం కడుపులేని దేహం లాంటిది. పెదాలు లేని నోరులాగే గడపలేని గృహాలు ఉండకూడదు.


 గృహం కడుపులేని దేహం లాంటిది. పెదాలు లేని నోరులాగే గడపలేని గృహాలు ఉండకూడదు.

షేర్ చేయండి share this

 Dehali 'means' Kadapa 'entrance to the crossing of a "mid padini' is Kadapa. The name of the town to take it venkatesvarasvami Kadapa Tirupati

No comments:

Post a Comment