Tuesday, 29 November 2016

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సోషల్ మీడియా ప్ర‌భావం పెర‌గ‌డంతో వెబ్‌సైట్లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. సోష‌ల్ మీడియాను వాడుకుంటూ త‌మ సైట్ల‌ను ప్ర‌మోట్ చేసుకుంటూ గూగుల్ యాడ్స్ ద్వారా వెబ్‌సైట్లు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. దీంతో అన్ని భాష‌ల్లోను విప‌రీతంగా వెబ్‌సైట్లు పుట్ట‌గొడుగుల్లా వ‌చ్చేస్తున్నాయి. ఇదే క్ర‌మంలో చాలా వెబ్‌సైట్ల‌లో వార్త‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్టు వచ్చేస్తున్నాయి.
వెబ్‌సైట్ల‌లో గాసిప్స్‌కు అంతే లేకుండా పోతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు గూగుల్ ఇలాంటి వెబ్‌సైట్స్ కొర‌డా ఝులిపించింది. అవాస్తవ వార్తలు ప్రచురించే వెబ్‌సైట్స్‌ యాడ్స్‌ ఇవ్వమని సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌, ఫేస్‌బుక్ కఠిన నిర్ణయం తీసుకున్నాయి. సంచలనాల కోసం ప్రచురించే ఇటువంటి వార్తలను చదవి ప్రజలు తప్పుదోవలో నడుస్తున్నారని…ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు.

తాజాగా అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మీడియా మొత్తం ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ పెట్టించేలా సమాచారం విస్తృతంగా వ్యాప్తికావడంపై వస్తోన్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ ప్రకటన చేశారు. అవాస్తవ వార్తలను ప్రచురించి పలు వెబ్‌సైట్లు, ప్రజాభిప్రాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి…దీంతో ఏవి నిజ‌మైన వార్త‌లో…ఏవి బోగ‌స్ వార్త‌లో కూడా ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా ఉంది. మ‌రి గూగుల్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఇలాంటి బోగ‌స్ వార్త‌ల‌కు ఫుల్‌స్టాప్ పెడుతుంద‌న‌డంలో సందేహం లేదు.

No comments:

Post a Comment