18 సంవత్సరాలు. నా బరువు 82
కిలోలు. ఎత్తు అయిదు అడుగుల మూడు అంగుళాలు. స్థూలకాయం సమస్యతో బాధపడుతున్న
నాకు స్థూలకాయం తగ్గించే ఆహారాన్ని సూచించగలరు.
స్థూలకాయాన్ని ఒకేసారి కాకుండా నెమ్మదిగా తగ్గించుకోవాలి. నెలకు రెండు కిలోల చొప్పున బరువును తగ్గించుకోవటం ఉత్తమం. మన ఆహారంలో వంద కేలరీలు తగ్గించుకుంటే అయిదు వారాల్లో ఒక పౌండు బరువు తగ్గవచ్చు. రోజుకు వెయ్యి కేలరీల ఆహారం తగ్గించుకోవచ్చు. సమతుల ఆహారంలో ధాన్యాలతోపాటు పప్పులు, పాలు లేదా పెరుగు, సరిపడా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో చికెన్, చేపలు, కోడిగుడ్లు, ఆయిల్, చక్కెరను నియంత్రించుకోవాలి. ప్రాసెస్‌డ్, ఫాస్ట్‌ఫుడ్ ఎప్పుడైనా తప్ప ఎక్కువగా తీసుకోరాదు. బిస్కెట్లు, కేక్‌లు, కుకీస్‌లు పూర్తిగా నివారించాలి. మీరు సాధారణంగా రెండు రసగుల్లాలు తినేటట్లయితే, ఒక రసాగుల్లాకే పరిమితం చేసుకోండి. పెద్ద పళ్లెంలో ఐస్‌క్రీం తినేటట్లయితే దాన్ని వదిలి చిన్న కప్‌కు మాత్రమే పరిమితం చేసుకోండి. లో కేలరీలున్న స్నాక్స్, పెరుగు, తాజా పండ్లు, తీపిగా లేని హోల్ గ్రెయిన్ బిస్కెట్లు, వేయించిన శనగలు, పన్నీరు మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీంతోపాటు కనీసం వారంలో అయిదురోజులు రోజుకు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం తప్పనిసరి. ఇలా చేస్తే ఆరు వారాల్లో మీకు ఫలితం కనిపిస్తుంది.

కార్న్‌ఫ్లేక్స్, ఓట్స్, గోధుమలు కలిపి తింటే ఓట్స్ యొక్క ప్రభావం తగ్గిపోతుందా?
ఓట్స్‌ను ఇతర ఆహార పదార్థాలతో కలిపితే ఓట్స్ ప్రభావం తగ్గిపోతుంది.
అయితే వారానికో రోజు వినూత్న రుచితో కూడిన ఆహారం తీసుకునేందుకు ఇలా
ఓట్స్‌ను కార్న్‌ఫ్లెక్స్, గోధుమలతో కలిపి తీసుకోవచ్చు.
నా వయసు 33 సంవత్సరాలు. నేను
శాకాహారిని. ఎత్తు అయిదు అడుగుల ఆరు అంగుళాలు. బరువు 58 కిలోలు. నాకు
దయచేసి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సూచించండి. నా వయసులో ఆహారానికి
ప్రత్యామ్నాయాలు తీసుకోవచ్చా తెలుపగలరు?
మీకు మూడు పూటలా భోజనంతోపాటు రోజుకు రెండు సార్లు కొద్దిగా స్నాక్స్
తీసుకోవటం మేలు. అతిగా తినకండి. మెల్లగా తినటంతోపాటు కడుపు నిండుతుండగా
ముందే తినడం ఆపండి. సమతుల ఆహారంలో తృణధాన్యాలు, పప్పులు, పాలు, పండ్లు,
కూరగాయలు ఉండేలా చూసుకోండి. మాంసం, కోడిగుడ్లు, చక్కెర, సుగంధద్రవ్యాలు
మితంగా ఉండేలా చూసుకోండి. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో తప్ప
ప్రాసెస్‌డ్ ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోకండి. మీ తినే పళ్లెంలో
కార్బోహైడ్రేట్‌లు, ప్రోటీన్‌లు ఉండాలి. అంటే అన్నం, పప్పు లేదా పన్నీర్,
రోటి, కూరగాయలు, తక్కువ కేలరీలున్న పెరుగు, హోల్ గ్రెయిన్ బిస్కెట్లు,
వేయించిన శనగలు తీసుకోవచ్చు. జంక్ ఫ్యాటీ ఫుడ్‌ను నివారించండి. దీంతోపాటు
వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ ఆడటం లాంటి
వ్యాయామాలు తప్పనిసరి. వీటిలో వాకింగ్ మంచి వ్యాయామం. దీంతోపాటు వారానికి
రెండు లేదా మూడు రోజులు 20 నిమిషాల పాటు యోగా చేయడం మేలు. మీ వయసు వారికి
న్యూట్రిషనల్ సప్లిమెంట్లు తీసుకోవటం మంచిది. అయితే వీటిని తీసుకునే ముందు
మీ డాక్టర్‌ను సంప్రదించాలి.
No comments:
Post a Comment