Tuesday, 29 November 2016

వెబ్‌సైట్‌లో సమాచారం తెలుసుకోవడo..ఎలా ?

గుంపులో గోవిందంలాగా బతికితే ఏముంది మజా. విభిన్నంగా ఉంటేనే గుర్తింపు. అలాగే కోట్ల వెబ్‌సైట్లలో ఒకటిగా ఉండకుండా... ‘కోటికి ఒకటి’ అనిపించుకునేవీ కొన్ని ఉన్నాయి. విలక్షణంగా, వైవిధ్యమైన సేవలు అందించే ఆ వెబ్‌సైట్లు నిత్య జీవితంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అవేంటో... వాటి ప్రత్యేకతలేంటో చూద్దాం!

ఖాతా మూసేయాలంటే
account killer.com
అవసరం కోసం రెండు మూడు మెయిల్‌ ఐడీలు క్రియేట్‌ చేశారు, ఇంకేదో పని ఉందని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో రెండేసి ఖాతాలు తెరిచారు. ఇప్పుడు వాటిని క్లోజ్‌ చేద్దామంటే ఆయా వెబ్‌సైట్లు సవాలక్ష ప్రశ్నలు, అనవసర సూచనలు ఇస్తుంటాయి. మీరు కొన్నాళ్లు ఖాతాను హైడ్‌ చేసుకోండి... వాడకుండా అలా ఉంచేసినా ఫర్వాలేదు అని ఆయా వెబ్‌సైట్ల వాళ్లు చెబుతుంటారు. ఇంకొన్నింటిలో అయితే ఖాతాను క్లోజ్‌ చేయడం క్లిష్టతరం.accountkiller.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆయా వెబ్‌సైట్లలో ఖాతాలను సులభంగా డీయాక్టివేట్‌/డిలీట్‌ చేయొచ్చు.


తాళం తెరవడానికి
pdfunlock. com
పోస్ట్‌పెయిడ్‌ మొబైల్‌ బిల్లు, క్రెడిట్‌ కార్డు బిల్లు... ఇలాంటివాటికి పాస్‌వర్డ్‌ రక్షణ ఉంటుంది. అలాంటివాటిని ప్రతిసారీ ఓపెన్‌ చేసినప్పుడు పాస్‌వర్డ్‌ ఇవ్వడం ఇబ్బందిగా ఉందా? అయితే అలాంటి పీడీఎఫ్‌లనుpdfunlock.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి పాస్‌వర్డ్‌ రక్షణ లేని పీడీఎఫ్‌ను పొందొచ్చు. వెబ్‌సైట్‌లో పీడీఎఫ్‌ను అప్‌లోడ్‌ చేసి పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేస్తే రక్షణ పాస్‌వర్డ్‌ లేని పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే రక్షణ ఉన్న ప్రతి పీడీఎఫ్‌ను ఇలా మార్చుకోవడం మంచిది కాదు. ఈ వెబ్‌ సైట్‌కు అనుబంధంగా పీడీఎఫ్‌ మెర్జ్‌ లాంటి సౌకర్యాలూ ఉన్నాయి.


దేంట్లో ఎంతుంది
twofoods. com
ఏ ఆహార పదార్థం తింటే శరీరానికి ఎంత కొవ్వు వస్తుంది, ఎన్ని కేలరీల శక్తి వస్తుంది. ఏది తింటే ఎంత శాతం ప్రొటీన్లు వస్తాయి... అంటూ ఎప్పుడూ లెక్కలేసుకుంటుంటారా? అయితేtwofoods.comవెబ్‌సైట్‌ మీకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో మీకు కావల్సిన ఆహార పదార్థం పేరు ఎంటర్‌ చేస్తే దానికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఈ వెబ్‌సైట్‌లో ఒకేసారి రెండు ఆహార పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. దీని వల్ల బేరీజు వేసుకోవడం సులభ మవుతుంది.


కాపీ.. పేస్ట్‌
ssavr.com
మొబైల్‌లో కాపీ చేసుకున్న మెసేజ్‌ ల్యాపీలో, ల్యాపీలో కాపీ చేసుకున్న సమాచారం ట్యాబ్‌లో... ఇలా టెక్స్ట్‌ని సులభంగా యాక్సెస్‌ చేసుకోగలిగితే బాగుంటుంది కదా.ssavr.comవెబ్‌సైట్‌తో ఇది సాధ్యమవుతుంది. అయితే మొబైల్‌, ల్యాపీ, ట్యాబ్‌ ఒకే వైఫై నెట్‌వర్క్‌ పరిధిలో ఉండాల్సి ఉంటుంది. మీ మొబైల్‌లో ఈ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి అందులో ‘స్టార్ట్‌ టైపింగ్‌’ బాక్స్‌లో మీరు విషయాన్ని టైప్‌ చేసుకోవచ్చు లేదా కాపీ చేయాలనుకున్న సమాచారాన్ని పేస్ట్‌ చేయొచ్చు. ఆ తర్వాత మీ ట్యాబ్‌, ల్యాపీలో అదే వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే మీరు ‘టైపింగ్‌’ బాక్సులో ఉంచిన సమాచారం పేస్ట్‌ చేయడానికి సిద్ధంగా ఉంటుంది.


చూశాక చెరిగిపోతుంది
privnote. com
ఏటీఎం పిన్‌, బ్యాంకు ఖాతా ఆన్‌లైన్‌ పాస్‌వర్డ్‌, ఈమెయిల్‌ పాస్‌వర్డ్‌... ఇలాంటి వాటిని ఎవరికైనా మెసేజ్‌ చేసినప్పుడు తర్వాత ఎవరైనా వాటిని చూస్తే ఇబ్బంది. అందుకేprivnote.com వెబ్‌సైట్‌ ద్వారా వాటిని పంపించడం మంచిది. ఇందులో మీరు పంపాల్సిన విషయాన్ని రాయండి... ఆ తర్వాత అది వెబ్‌సైట్‌ లింక్‌లా కన్వర్ట్‌ అవుతుంది. దాన్ని మీరు అవతలి వ్యక్తికి పంపించండి. దాన్ని క్లిక్‌ చేసి మెసేజ్‌ చదవగానే... ఆ లింక్‌ ఆటోమేటిక్‌గా మూతపడిపోతుంది. అంటే మళ్లీ ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తే మీకు ఎలాంటి సమాచారం కనిపించదన్నమాట.

No comments:

Post a Comment