పూజలో కొబ్బరికాయ క్రుళ్ళితే మంచిదా?
పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదు. అపచారం అంతకన్నా కాదు
తెలిసి పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ
కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు.
అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదేకాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని
పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన
భాగాన్నితీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా
కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి
అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి.
No comments:
Post a Comment