Tuesday, 29 November 2016

రూ.500, రూ. 1000 నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఏం చేయనుంది?

రూ.500, రూ. 1000 నోట్లు కుప్పలు తెప్పలుగా బ్యాంకులకు చేరుతున్నాయి. ఎంతమాత్రం పనికిరాని ఆ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఏం చేయనుంది? కాల్చేయనుందా..



 దేనికైనా ఉపయోగించనుందా? చిత్తు కాగితాల్లా మారిన ఆ నోట్లతో ఆర్బీఐ చేయనున్న పని ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమిచ్చింది ఆర్బీఐ. వాటితో బొగ్గుకోసం తీసిన గుంతలను పూడుస్తారట.



పర్యావరణానికి హాని కలగకుండా ఉపయోగించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది ఆర్బీఐ.


కరెన్సీ వెరిఫికేషన్ అండ్ అండ్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఉపయోగించి నోట్లను చిన్నముక్కలుగా చేస్తారు. దీన్ని మళ్లీ అతికించడానికి ఉండదు



. దేశంలో సుమారు 15 లక్షల రూ. 500 నోట్లు, 6 లక్షల రూ. 1000 నోట్లు ఉన్నాయి. వీటిని మొత్తం చిన్నచిన్న ముక్కలు చేయనుంది ఆర్బీఐ.
… వీటిని ఇటుకలుగా మారుస్తారు. ఆ తర్వాత టెండర్ల ద్వారా అమ్మేస్తారు.
… ఆ ముద్దలను పర్యావరణానికి హాని కలుగని రీతిలో వినియోగిస్తారు.





… కనీస ధర కిలో రూ.6 పలుకుతుందని చెబుతున్నారు.
… ఇండ్లు, ఆఫీసులకు పనికివచ్చే ఉపకరణాలను, లేదా పేపర్‌బోర్డులుగా తయారు చేస్తారు.
… ఆ ముద్దలను రీసైకిల్ చేసి ఫైళ్లు, క్యాలెండర్ల తయారీకి ఉపయోగిస్తారు.



… తలుపులు, ఇతర ఫర్నీచర్ తయారీలో కూడా ఈ ముద్దలను ఉపయోగిస్తారు.

No comments:

Post a Comment