బావి తవ్వుతుండగా.. ఊటలుగా ఊరిన రక్తం.. కాణిపాకం వినాయకుడి గుడి రహస్యం.. నిజాలు
వినాయకుడు
అనగానే మనకి ప్రథమంగా గుర్తొచ్చేది చిత్తూరు జిల్లాలోని “కాణిపాకం”.
వినాయకుడు వెలసిన క్షేత్రాలలో ప్రధానమైంది కాణిపాకం. కాణిపాకం అంటే
“వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు” అని అర్ధం. మరి అలాంటి ప్రసిద్ది
చెందిన దేవాలయ చరిత్ర ఏంటో మనం తెలుసుకుందాము!
* పదకొండవ శతాద్బములో చోళ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ విగ్రహం
ప్రతిష్టించినది కాదు. వర సిద్డి వినాయకుడు అక్కడ వెలిసాడు. అందుకే కాణిపాక
వినాయకుడిని “స్వయంబు” అంటారు.
కాణిపాకం వినాయక దేవాలయం.
ఈ విగ్రహ ప్రత్యేకత ఏమిటంటే. విగ్రహ పరిమాణం రోజురోజుకి పెరుగుతూ ఉండటం.
యాబై సంవత్సరాల కిందట ఇచ్ఛిన్న వెండి కిరీటం ఇప్పుడు సరిపోకపోవడమే దీనికి
నిదర్శనం.
ఇప్పుడు ఆలయం ఉన్న భూమి
ముగ్గురు అన్నదమ్ముల వ్యవసాయ భూమి. వారిలో ఒకరు మూగ, మరొకరు చెవిటి,
ఇంకొకరు గుడ్డి వారు. కొంతకాలం తరవాత వారు ఏకం వేస్తున్న భావిలో నీరు
ఎండిపోవటం చూస్తారు.
భావిని తొవ్వుతూ ఉండగా ఒక గట్టి రాయి తగిలినట్టు వారికి అనిపిస్తుంది.
క్షణాలలోనే రక్తం ఊరడం. భావి నిండిపోవడం జరుగుతుంది. భావిలో మహత్యం ఉందని
భావించి పరిశీలించి చూడగా వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. అప్పటినుండి
భక్తులందరు పూజలు చేయడం మొదలుపెట్టారు.
ఏదైనా వివాదాస్పద సంఘటన ఎదురయ్యినప్పుడు నిజానిజాలు తెలుసుకోవాడానికి
వివాదానికీ కారణమైన వ్యక్తితో విగ్రహం ముందు ప్రమాణం చేయిస్తారు. తప్పు
చేసినవారిని వినాయకుడు తప్పక శిక్షిస్తాడని భక్తుల నమ్మకం.
No comments:
Post a Comment