టీ, కాఫీలు, మసాలా, కారం ఉన్న
ఆహారం, ఇతర వేడి చేసే పదార్థాలను చాలా మంది వేసవిలో తినరు. ఎందుకంటే
అవి శరీరంలో బాగా వేడిని పెంచడమే కాదు, నీళ్ల విరేచనాలు, డయేరియాను
కలిగిస్తాయి. కనుక ఆయా ఆహార పదార్థాలను వేసవిలో తినరు. చల్లగా ఉంటూ,
తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను వేసవిలో తింటారు. మరి చలి కాలం దానికి
పూర్తిగా వ్యతిరేకం కదా. మరి ఈ కాలంలో మనం ఏవి తినాలి..?
శరీరాన్ని వెచ్చగా ఉంచే పదార్థాలు తినాలి. అలా అని చెప్పి టీ, కాఫీలు, మసాలా ఆహారం మాత్రం తినకూడదు. ఎందుకంటే వాటితో ఆరోగ్యం కన్నా అనారోగ్యాలే ఎక్కువగా కలుగుతాయి. కనుక మనకు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చేలా, కీలక పోషకాలను అందించేలా ఉంటూ, శరీరంలో వేడిని పెంచే పలు సహజ సిద్ధమైన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని తింటే శరీర ఉష్ణోగ్రత సమ స్థాయిలో ఉండడమే కాదు, మన శరీరానికి కీలక పోషకాలు కూడా అందుతాయి. తద్వారా ఈ సీజన్‌లో వచ్చే పలు వ్యాధులు కూడా నయమవుతాయి. ఈ క్రమంలో మనం చలికాలంలో ఏయే ఆహార పదార్థాలను తినాలో ఇప్పుడు చూద్దాం.

జొన్నలు…
ఈ కాలంలో జొన్నలను కనీసం వారంలో ఒకసారి అయినా తీసుకోవాలి. జొన్న గడక, జొన్న రొట్టె, అన్నం రూపంలో జొన్నలను తినవచ్చు. దీంతో మన శరీరానికి కాల్షియం పెద్ద ఎత్తున అందుతుంది. తద్వారా కండరాలు బిగుసుపోకుండా వాటి కదలికలు చక్కగా ఉంటాయి. ఇది ఈ కాలంలో మనకు మేలు చేస్తుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పలు కూడా మాయమవుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఈ కాలంలో వచ్చే వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది.

చిలగడ దుంపలు…
చూడ చక్కని పింక్ రంగులో ఉండే చిలగడ దుంపలను కొన్ని ప్రాంతాల్లో కంద గడ్డ అని కూడా పిలుస్తారు. ఈ కాలంలో మనకు ఇవి ఎక్కువగా లభిస్తాయి. వీటిలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని పోగొడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మధుమేహం ఉన్న వారు వీటిని తింటే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. విటమిన్ ఎ, సి, మాంగనీస్, కాపర్ వంటివి అధికంగా ఉండడంతో శరీరానికి కీలక పోషకాలు అందుతాయి. ఇవి ఈ కాలంలో మనకు ఎంతగానో అవసరం. చిలగడ దుంపలను ఉడికించి వాటిపై ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని అలాగే తినవచ్చు. లేదంటే కూర రూపంలోనూ తీసుకోవచ్చు. కొందరు వీటిని పచ్చిగానే తినేస్తారు.

దానిమ్మ పండు…
చలి కాలంలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల నుంచి దానిమ్మ మనకు రక్షణనిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, పాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షణనిస్తుంది.

పాలకూర…
ఆకుపచ్చ రంగులో చూడగానే తినబుద్ది అయ్యేలా ఉండే పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఈ కాలంలో మనకు సంక్రమించే వ్యాధుల నుంచి కాపాడతాయి. అంతేకాకుండా ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. ఇది రక్తం పెరగడానికి దోహద పడుతుంది. కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. కండరాలు సులభంగా కదులుతాయి. బిగుసుకోవు. ప్రతి రోజూ పాలకూరను తింటుంటే సీజనల్ వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు.

నువ్వులు…
చలికాలంలో రాత్రే కాదు పగటి పూట కూడా వాతావరణం చల్లగానే ఉంటుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత క్రమబద్దంగా ఉండదు. అయితే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే శరీరంలో వేడి పెరిగి శరీర ఉష్ణోగ్రత ఒకే లెవల్‌లో ఉంటుంది. ఇలా ఉండడం మనకు ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాదు నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల ఐరన్, కాల్షియం, మాంగనీస్, మెగ్నిషియం, కాపర్ వంటి పోషకాలు ఎన్నో మనకు లభిస్తాయి. ఇవి ఈ కాలంలో మనకు ఎంతగానో అవసరం.

వేరుశెనగ…
విటమిన్ ఇ, బి 3 వంటి కీలకపోషకాలు వేరుశెనగల్లో ఉంటాయి. అంతేకాదు, మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. చర్మంలో తేమ శాతాన్ని పెంచే గుణం ఉండడం వల్ల చలి కాలంలో మన చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.

నట్స్, డ్రై ఫ్రూట్స్…
ఆప్రికాట్స్, ఖర్జూరం, అంజీర్, పీచెస్, పియర్స్, ప్రూన్స్, కిస్‌మిస్, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్ వంటి పలు రకాల ఎన్నో డ్రై ఫ్రూట్స్, నట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి అన్ని కాలాల్లోనూ మనకు లభిస్తాయి. అయితే ప్రత్యేకంగా వీటిని చలికాలంలో తింటేనే మంచిది. ఎందుకంటే ఈ కాలంలో మెదడు నిస్తేజంగా ఉంటుంది. ఈ క్రమంలో ముందు చెప్పిన నట్స్, డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. రోజంతా ఉత్తేజంగా ఉండవచ్చు. జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. శరీరానికి కావల్సిన విటమిన్ ఎ, బి, సి, మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్లు వీటితో మనకు లభిస్తాయి. ఇవన్నీ ఈ కాలంలో మన శరీరానికి అత్యంత అవసరమైన కీలక పోషకాలు.
షేర్ చేయండి share this

No comments:
Post a Comment