Friday, 23 December 2016

మ‌న‌డ‌బ్బు మ‌నం తీసుకుంటే స‌ర్‌ఛార్జ్‌

రోజుకో నిబంధన తెస్తూ ప్ర‌జ‌ల‌ను అయోమ‌యానికి గురిచేస్తున్న ప్ర‌భుత్వం తాజాగా మ‌రో రూల్ తీసుకొచ్చేందుకు త‌యారైంది. డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించే భాగంలో ఇక‌పై ప‌రిమితికి మించిన డ‌బ్బును బ్యాంక్‌నుంచి కానీ, ఏటీఎం నుంచి కాని విత్ డ్రా చేస్తే స‌ర్‌ఛార్జ్ విధించాల‌ని కేంద్రం యోచిస్తోంది. ఈ సర్ ఛార్జ్ 0.5 శాతం నుంచి 2 శాతం మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది డిసెంబ‌ర్ 30 త‌ర్వాత అమ‌లు కానున్న‌ట్లు స‌మాచారం. క‌నీస ప‌రిమితికి మించి డ‌బ్బు డ్రాచేస్తే సర్ ఛార్జ్ వ‌డ్డ‌న త‌ప్ప‌ద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.
బ్యాంకుల నుంచి రోజుకు రూ.50వేలు, ఏటీఎంల నుంచి రూ.15 వేలు క్యాష్ విత్ డ్రా చేసుకుంటే స‌ర్‌ఛార్జ్ పేరుతో వ‌డ్డ‌న విధించ‌నున్నారు.
ప్ర‌స్తుతం ఉన్న క్యాష్ విత్‌డ్రాల్ లిమిట్ డిసెంబ‌ర్ 30తో ముగుస్తుంది. ఆ త‌ర్వాత క్యాష్‌ను ఎంతైనా తీసుకోవ‌చ్చ‌ని చెప్పిన ప్ర‌భుత్వం దానికి కూడా స‌ర్‌ఛార్జ్ పేరుతో మెలిక పెట్టింది. బ్యాంకుల్లో న‌గ‌దు నిల్వ‌లు లేవు కాబ‌ట్టి  స‌ర్‌ఛార్జ్ విధిస్తే కొంత నియంత్రించొచ్చు అన్న ఆలోచ‌న‌లో కేంద్రం ఉన్న‌ట్లు స‌మాచారం.నల్లధనాన్ని అదుపు చేయడంపై జస్టిస్‌ ఎం.బి.షా కమిటీ చేసిన సిఫార్సుల్లో ఒకటయిన సర్‌ఛార్జి విధింపును పరిశీలిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కూ ఒకే పరీక్ష

దేశ వ్యాప్తంగా నీట్ మాదిరిగానే ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం ఒకే ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ అధికారులు అత్యున్నతస్థాయిలో చర్చలు జరిపినట్లు సమాచారం.  ఈ నిర్ణయం అమలైతే అవకతవకలకు ఆస్కారం ఉండే అవకాశం లేదని భావిస్తోంది. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో పారదర్శకత వస్తుందంటున్నారు ఉన్నతాధికారులు. ఇంజనీరింగ్ ప్రవేశాల గురించి గతంలో ఎన్నో ఫిర్యాదులొచ్చాయి. ఈ క్రమంలో ఓ పారదర్శకమైన విధానాన్ని తీసుకు రావాలనే లక్ష్యంతో మంత్రిత్వశాఖ ఉందని హెచ్ఆర్డీకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టాలని హెచ్ఆర్డీ నిర్ణయం తీసుకున్నా… అది 2018 నుంచి అమలయ్యే అవకాశముంది.

డిపాజిట్లపై వెనక్కి తగ్గిన ఆర్బీఐ

బ్యాంకుల్లో పెద్దనోట్ల డిపాజిట్లపై మొన్న ప్రకటించిన నిర్ణయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి తగ్గింది. ఐదువేల డిపాజిట్ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ప్రజల నుంచి వెల్లువెత్తిన విమర్శలకు జడిసి యూ టర్న్ తీసుకుంది. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇకపై నగదు జమ చేయడానికి వెళ్లిన కస్టమర్ల నుంచి ఎలాంటి ప్రశ్నలు లేకుండా డిపాజిట్లు స్వీకరించనున్నట్టు ప్రకటించింది. దీంతో దఫదఫాలుగా చేతిలో ఎంత మొత్తం ఉంటే అంతా బ్యాంకుల్లో జమ చేసే వీలు కలిగింది.

ఒక్క రూపాయకే చీర.. కిక్కిరిసిన మహిళలు

నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూ కర్ణాటక బీదర్‌లోని సృష్టి దృష్టి బట్టల దుకాణం యజమాని చంద్రశేఖర్ పసార్గే ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నోట్ల రద్దును సమర్థిస్తూ రూపాయకే చీర అమ్మారు. ఇప్పటివరకూ మూడు వేల చీరలు అమ్మారు
ఒక్కో చీర ధర వంద ఉన్నా కేవలం ఒక్కరూపాయికే అమ్మారు. లక్ష చీరలు అమ్మాలనేది తన టార్గెట్ అని చెప్పారు. రూపాయకే చీర అనే విషయం తెలియడంతో మహిళలు పోటెత్తారు. గుంపును అదుపుచేయడానికి పోలీసులు రావాల్సి వచ్చింది

40 ఏళ్ళ తరువాత కూడా సెక్స్ లో అదే స్పీడ్ ఉండాలంటే..

మొన్నటివరకు శృంగారానికి వయసుతో సంబంధం ఉండదు అని కొందరు శృంగార నిపుణులు అన్న విషయం వాస్తవం. కానీ తాజాగా పరిస్థితుల్లో వస్తున్న మార్పులు, తినే తిండి, చెడు అలవాట్ల వాల్ల తప్పకుండా లేటు వయసులో శృంగారం చెయ్యడం కష్టంగా మారుతుందని వాళ్ళే అంటున్నారు. అసలు 40 ఏళ్ళ దాటిన దంపతుల్లో చాలా వరకు సెక్స్ చెయ్యలేకపోతున్నారని చెప్తున్నారు. నాలుగు పదులకు ముందు ఉన్నంత ‘స్పీడ్’ ఆ తరువాత ఉండటం లేదట. దానికి కారణం కొదరికి ఎలాంటి సమస్యలు లేనప్పటికీ పని ఒత్తిడి, రతిలో పాల్గొనే సమయం లేకపోవడం ఒకటైతే, కొన్ని చెడు అలవాట్ల వల్ల శృంగారానికి దూరంగా ఉంటున్నారని చెప్తున్నారు నిపుణులు.
కొందరు శృంగార ప్రియులకు వయసుతో పని లేకుండా సెక్స్ చెయ్యాలని ఉంటుంది. అలాంటి వారు తమ దాంపత్య జీవితాన్ని సుఖవంతంగా గడపాలంటే మాత్రం కొన్ని నియమాలు పాటిస్తే చాలట. అవేంటో ఇప్పుడు చూద్దాం. పొగాకు దూరంగా ఉంటే చాలా వరకు శృంగార సమస్యలు దూరం అవుతాయట. పొగతాగే అల‌వాటు వ‌ల్ల‌ రక్తనాళ ఇబ్బందులు శరీరంలో ఎక్కడైనా వస్తాయి. దీనివలన రక్త ప్రవాహంలో అవరోధాలు ఏర్పడి పురుషాంగంలోకి రక్త ప్రవాహం తగ్గుతుంది. పురుషాంగ స్తంభన రక్త ప్రవాహం వల్ల జరిగేదన్న విషయం తెలిసిందే. రక్త ప్రవాహం లోపం వల్ల అంగం సరిగా స్థంభించదు. దీనితో పాటు మగవాళ్ళకు శ్రీఘ్రస్థలన సమస్య కూడా వస్తుందట.
ఇక మ‌హిళ‌ల విషయానికొస్తే..పొగాకు ఉపయోగించే వారిలో యోని కండరాలకు, క్లైటోరిస్‌కి రక్త ప్రసరణ తగ్గుతుంది. అంగ ప్రవేశాన్ని ఆనందించలేని పరిస్థితి మహిళలకు కలుగుతుంది. పొగాకు వాడకం వల్ల మగవారిలోనూ, ఆడవారిలో నూ సెక్స్‌ సమస్యలు పెరిగిపోతున్నాయి. దీనికి దూర‌మైతే మ‌నిషి ఆరోగ్య‌ప‌రంగాను, శృంగార‌ప‌రంగాను హాయిగా జీవించవచ్చు అంటున్నారు. మొన్నటి వరకు పొగాకు అంటే క్యాన్సర్ వస్తుంది అనేవారు. ఇప్పుడు దాని ప్రభావం సెక్సువల్ లైఫ్ మీద కూడా పడుతుందని నిర్ధారణ అయ్యింది. సో..పొగాకు వాడకపోవడమే మంచిదన్నామాట.

అమ్మ మృతిపై ట్విస్ట్.. రెండు కాళ్లు ప‌నిచెయ్య‌లేదు… మెర్సీ కిల్లింగ్‌..?

కొన్ని విష‌యాలు అంతే.. ఎప్ప‌టికీ వివాదంగానే మిగిలిపోతాయి. వాటికి ఓ ముగింపు అంటూ ఉండ‌దు. దివంగ‌త సీఎం, అన్నాడీఎంకే నేత జ‌య‌ల‌లిత మృతి కూడా ఈ లిస్ట్‌లోకి చేరిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఆమె మృతిపై ఇప్ప‌టికే అనేక క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. వాటిలో భాగంగా కొత్త రూమ‌ర్ ఒక‌టి ప్ర‌చారంలో ఉంది. అది ఏంటంటే, జ‌య‌ల‌లితకు చివ‌రి క్ష‌ణంలో కాళ్లు ప‌నిచేయలేద‌ని, అలా బ‌తక‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని, మెర్సీ కిల్లింగ్‌కి చాన్స్ ఇవ్వాల‌ని ఆమె శ‌శిక‌ళ‌తో అన్న‌ట్లు మ‌లేషియాలోని ఓ పత్రిక క‌థ‌నం రాసింది.
మ‌లేషియా, సింగ‌పూర్‌లో త‌మిళులు ఎక్కువ‌. అక్క‌డ స్థానికంగా న‌డిచే ఓ టాబ్లాయిడ్ ఈ క‌థ‌నం ప్ర‌చురించిన‌ట్లు స‌మాచారం. అయితే, ఈ క‌థ‌నంలోని నిజానిజాల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది ఈ స్టోరీ. మొత్త‌మ్మీద‌, జ‌య‌ల‌లిత మృతిపై మ‌రో కొత్త స్టోరీ వెలుగులోకి రావ‌డం విశేషం.

శృంగారం ఎక్కువ మందితో చేస్తే వచ్చేది ఎయిడ్స్ కాదంట… ఏంటో తెలుసుకోండి మరి

మగవారికి శృంగారానికి సంబంధించిన కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే సాధమైనంత వరకు ఎక్కువ అమ్మాయిలతో సెక్స్ చెయ్యాలని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ తాజాగా జరిపిన ఒక సర్వ్ లో 7మంది అమ్మాయిలకు మించి ఎక్కువగా శృంగారంలో పాల్గొనే మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు రెండింతలు ఎక్కువని ఆస్ట్రేలియాలోని క్యాన్సర్ కౌన్సిల్ కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధకులు తెలిపారు.
అంతే కాదు..శృంగారం చేసేటప్పుడు పురుషుల్లోని హార్మోన్లలో పెనుమార్పులు సంభవిస్తాయని పరిశోధనలో తేలింది. ఇది పురుషుల జీవక్రియ, లైంగిక చర్యల్లో మార్పులకు దారితీస్తుంది.
టీనేజీ నుండే పలువురు అమ్మాయిలతో సెక్సువల్ రిలేషన్ షిప్స్ కలిగి ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తేల్చారు. అధికబరువు, కుటుంబ పెద్దకు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉంటే సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు.
మొన్నటి వరకు ఎవరితో పడితే వారితో శృంగారం చెయ్యడం వల్ల ఎయిడ్స్ వస్తుందని తెల్చినప్పటికీ, రీసెంట్ గా అంతకంటే ముందు 7 మంది ఆడవాళ్ళకు మించి సెక్స్ చేస్తే ఇదిగో ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ వస్తుందని తేలడంతో, విచ్చలవిడిగా శృంగారాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఆలోచనలో పడ్డారు.