Friday, 23 December 2016

అమ్మాయిది పారిస్.. అబ్బాయిది కరీంనగర్

కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు హిందూ సంప్రదాయం ప్రకారం ఫ్రాన్స్ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. జిల్లాలోని వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన పరశురాములు, వీరలక్ష్మీ దంపతుల కుమారుడు చిరంజీవి పెద్ద చదువుల కోసం మూడేళ్ల క్రితం పారిస్ వెళ్లాడు. నగరంలోని ఓ యూనివర్సిటీలో పీహెచ్ డీ చేస్తున్న చిరంజీవికి అదే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేస్తున్న సఖినా గ్రిల్స్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. 
 
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇరువురు తమ విషయాన్ని కుటుంబ పెద్దలకు చెప్పారు. పిల్లల ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో శుక్రవారం మధ్యాహ్నం జమ్మికుంటలోని ఓ ఫంక్షన్ హాల్లో హిందూ సంప్రదాయం ప్రకారం ఇరువురి వివాహం జరిగింది. ఈ వేడుకకు వరుడి తరఫు బంధువులతో పాటు వధువు తరఫు వారు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.
 

ఉద్యోగంతో పాటు అద‌న‌పు ఆదాయానికి 8 మార్గాలు

  • మీ ఉద్యోగం ప‌నిగంట‌ల వ‌ర‌కే మీరు కార్యాల‌యంలో ప‌ని చేస్తూ ఉండి మీకు ఫ్రీ టైం ఉండేట్ల‌యితే అద‌న‌పు డ‌బ్బు సంపాదించ‌డానికి అవకాశాలు ఉంటాయి. మీరు ఉద్యోగంతో పాటు అద‌న‌పు ఆదాయం సంపాదించేందుకు గ‌ల 8 మార్గాల‌ను ఇక్క‌డ చూద్దాం. ఇది ఎక్కువ పట్ట‌ణ ప్రాంతాల‌కు న‌ప్పుతుంది.
  • యూట్యూబ్ వీడియోలు ఎక్కువ శాతం మంది ల్యాప్‌ట్యాప్‌, ఇంట‌ర్నెట్ ఉంటే చాలు యూట్యూబ్ వీడియోలు చూసేందుకు స‌మ‌యం కేటాయిస్తారు. అలా కాకుండా మీకు కొంచెం చిన్న సినిమాలు, సందేశాత్మ‌క వీడియోలు తీసే నైపుణ్యం ఉంటే మీరే వీడియో తీసేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. మీ వీడియోకు స‌గ‌టు వీక్ష‌కుల సంఖ్య పెరిగిన త‌ర్వాత మానిటైజింగ్ ట్యాబ్‌ను నొక్క‌డం ద్వారా మీరు డ‌బ్బు రాబ‌ట్టుకోవ‌చ్చు. ఇందుకోసం మీ యూట్యూబ్ చాన‌ల్‌కు యాడ్‌సెన్స్ అకౌంట్ ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. తద్వారా మీ మానిటైజ్‌డ్ వీడియోల‌కు డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు. కాలం గ‌డిచే కొద్దీ యూట్యూబ్ వీక్ష‌కుల సంఖ్య పెరిగి వారు ప్ర‌క‌ట‌న‌లపైన క్లిక్ చేయ‌డాన్ని బ‌ట్టి మ‌న‌కు చెల్లింపులు వ‌స్తాయి.
  • ఆన్‌లైన్ టీచింగ్‌ /ట్యూట‌ర్‌ ప్ర‌స్తుతం గూగుల్ లో వెతికితే ఎన్నో ఆన్‌లైన్ టీచింగ్ అవ‌కాశాలు ల‌భిస్తున్నాయి. ఇందులో మీకు అనుకూల‌మైన అంశం ఏమిటంటే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు పాఠాలు చెప్ప‌వ‌చ్చు. ఆన్‌లైన్ ట్యూట‌ర్ వెబ్‌సైట్ల‌లో న‌మోదు చేసుకునేందుకు కొన్ని ఉచితంగా అవ‌కాశాలు క‌ల్పిస్తుండ‌గా కొన్ని రుసుములు వ‌సూలు చేస్తున్నాయి. ఒక‌సారి ఆ వెబ్‌సైట్ల‌లో ట్యూట‌ర్‌గా నమోదు చేసుకున్న త‌ర్వాత మీకు అనుకూల‌మైన స‌మ‌యాన్ని అందులో పేర్కొన‌వ‌చ్చు. స్టేట్ సిల‌బ‌స్‌, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పదో త‌ర‌గ‌తి లోపు పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పేందుకు అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండీడ్‌, అర్బ‌న్‌ప్రో, వేదాంతు,షైన్ వంటి వెబ్‌సైట్ల‌లో మీరు న‌మోదు చేసుకోవ‌చ్చు.
  • ఆన్‌లైన్ రైటింగ్ ఎస్ఈవో రిలేటెడ్ కంటెంట్ అవ‌స‌ర‌మైన చాలా పోర్ట‌ల్స్ కంటెంట్ రైట‌ర్ల‌కు మంచి అవ‌కాశాల‌ను క‌ల్పిస్తున్నాయి. ఒక్కో ప‌దానికి రూ. 40 పైస‌ల నుంచి రూ. 1.00 వ‌ర‌కూ డ‌బ్బు చెల్లిస్తారు. ఇలాంటి వెబ్‌సైట్లు వారం వారీగా, నెల‌వారీగా చెల్లింపులు చేస్తుంటాయి. వారం వారం చెల్లింపు విధానాన్ని ఎంచుకోవ‌డం మంచిది. ఈ విధంగా ఇప్ప‌టికే చాలా మంది డ‌బ్బు సంపాదిస్తున్నారు. మీకు రాయ‌టంలో ఆస‌క్తి, నైపుణ్యం ఉంటే ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.
  • ఆన్‌లైన్ అనువాదం అనువాదకుల‌కు మ‌న దేశంలో చాలా డిమాండ్ ఉంది. దేశంలో భాష‌లు ఎక్కువ‌గా ఉండ‌టం మూలంగా మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆన్‌లైన్ అనువాద‌కుల‌కు సంబంధించి సైతం ఎన్నో వెబ్‌పైట్లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో లేఖ‌ఖా(Lekhakha) ఒక‌టి.
  • స్టాక్ ట్రేడింగ్ మీరు ఉద్యోగంతో పాటు అద‌న‌పు డ‌బ్బు(లిక్విడ్ క్యాష్‌) ఉన్న వారు స్టాక్ ట్రేడింగ్‌ను సైతం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. మీకు స్టాక్ మార్కెట్‌పై స‌రైన అవ‌గాహ‌న లేక‌పోతే ఇది మంచి ఆప్ష‌న్ కాదు. మీ ఉద్యోగానికి ఆటంకంల క‌ల‌గ‌కుండా ఉండేట్లుగా దీన్ని చేయ‌డానికి ప్ర‌య‌త్నించండి. లేక‌పోతే ఉద్యోగం స‌రిగా చేయ‌లేరు, ట్రేడింగ్ స‌రిగా చేయ‌లేరు.
  • నైట్ జాబ్స్‌ రాత్రుల్లో ప‌నిచేయ‌గ‌లిగి ఉంటే వీటిని ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. బార్ టెండింగ్‌, రెస్టారెంట్లు, డీజే వంటి వాటిని చేసే స‌మ‌యం, ఒపిక ఉంటే ఈ ఉద్యోగాలు చేయ‌వ‌చ్చు. అయితే మీ రోజు వారీ ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా ఉండేట‌ట్లు చూసుకోవాలి. దీని ద్వారా డ‌బ్బు సంపాదించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ మీరు స‌మ‌ర్థ‌వంతంగా మేనేజ్ చేయ‌గ‌లిగిత‌నే ఇటువైపు ఆలోచించండి.
  • ఫైనాన్సియ‌ల్ క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్‌ బీమా కంపెనీల‌కు ఏజెంట్లుగా ఉండొచ్చు. మీ ఉద్యోగం సాయంత్రం 5,6 గంట‌ల‌క‌ల్లా ముగిస్తే వివిధ వ్య‌క్తుల‌ను క‌లిసి బీమా పాల‌సీల‌ను అమ్మ‌వ‌చ్చు. ఎల్ఐసీ కంపెనీని ఈ కేట‌గిరీలో ఉత్త‌మ‌మైన‌దిగా చెప్పుకోవ‌చ్చు. జీవిత బీమా సంస్థ గౌర‌వ‌ప్ర‌ద‌మైన క‌మిష‌న్ల‌నే ఇస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇత‌ర ఆర్థిక సాధనాల‌కు సంబంధించిన ఏజెన్సీల‌ను సైతం ఎంచుకోవ‌చ్చు.
  • ఇత‌ర క‌న్స‌ల్టెన్సీ సేవ‌లు మీకు ఒక రంగంలో నైపుణ్యం ఉంద‌ని భావిస్తే దానికి సంబంధించి ఒక క‌న్స‌ల్టీన్సీని నిర్వ‌హించుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు వెబ్ డిజైనింగ్‌, వెబ్ డెవ‌ల‌ప్‌మెంట్‌, యాప్‌ల‌కు సంబంధించి మీకు వృత్తి నైపుణ్యం ఉంటే దానికి సంబంధించి మీకు మీరుగా ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లో పాంప్లెంట్ల ద్వారా ప్ర‌చారం చేసుకోవ‌చ్చు. ఇంకా రియ‌ల్ ఎస్టేట్ క‌న్స‌ల్టెన్సీ, ఆర్కిటెక్చ‌ర్ ఈ కోవ‌లోకి వ‌స్తాయి.
షేర్ చేయండి

విదేశీయురాలిని పెళ్లాడిన కరీంనగర్ యువకుడు

ఫ్రాన్స్ దేశానికి చెందిన సఖినా గ్రిల్స్ అనే యువతిని కరీంనగర్‌కు చెందిన చిరంజీవి అనే యువకుడు పెళ్లి చేసుకున్నాడు. జిల్లాలోని వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన పరశురాములు, వీరలక్ష్మీ దంపతుల కుమారుడు చిరంజీవి ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం పారిస్ వెళ్లాడు. పారిస్‌లోని ఓ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఈ సమయంలో చిరంజీవికి అదే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేస్తున్న సఖినా గ్రిల్స్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయాన్ని తమ తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లారు. వీరి ఇష్టానికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం మధ్యాహ్నం జమ్మికుంటలోని ఓ ఫంక్షన్ హాల్లో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు వరుడి తరఫు బంధువులే కాదు వధువు తరఫు వారు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అంగరంగ వైభవంగా సామూహిక గృహ ప్రవేశం

నిరుపేదల స్వప్నం సాకారమైంది. ఇన్నాళ్లకు సొంతింటి కల నెరవేరింది. సీఎం దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో అద్భుతం ఆవిష్కృతమైంది. రెండు గ్రామాల్లోనూ పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగానే ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మొత్తం 580 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారు. సీఎం కేసీఆర్ ఆద్వర్యంలో ఈ గృహప్రవేశం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ముఖ్యమంత్రి ఇళ్లను ప్రారంభించిన లాంఛనంగా లబ్ధిదారులకు అందజేశారు.   సరిగ్గా ఏడాదిక్రితం అయిత చండీయాగం ప్రారంభించిన రోజే… సామూహిక గృహ ప్రవేశం జరగడం విశేషం.
ముందుగా  నర్సన్నపేట చేరుకున్న సీఎం…  అధ్యాధునిక సదుపాయాలతో నిర్మించిన 200 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. ముఖ్యమంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గృహసముదాయాల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్  పద్మా దేవేందర్  రెడ్డి, మంత్రులు హరీశ్  రావు, ఇంద్రకరణ్  రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు  పాల్గొన్నారు.
అనంతరం  ఎర్రవల్లిలోనూ 380 డబుల్ బెడ్రూం ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. గృహసముదాయాల ప్రాంగణంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించి.. పూజలు నిర్వహించారు.  గ్రామంలో తిరుగుతూ డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు.
ఎర్రవల్లి, నర్సన్నపేటలో కష్టపడి డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించుకున్నామని చెప్పారు సీఎం కేసీఆర్. అందరం కలిసి మిగిలిన అన్ని పనులను పూర్తి చేసుకుందామన్నారు. లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేటను క్యాష్ లెస్ గ్రామాలుగా ప్రకటించారు. నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండాలన్నారు. బంగారు తెలంగాణకు బాటలు వేసేలా ఈ గ్రామాలు  ఉండాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్.
నూతన గృహ ప్రవేశం చేసిన లబ్దిదారుల కళ్లల్లో ఆనందం తొనికిసలాడింది. సీఎం కేసీఆర్ స్వయానా.. గృహప్రవేశానికి రావడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. సొంతింటి కలను నిజం చేసిన ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిదంటూ జనం ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్ కు మనసారా కృతజ్ఞతలు తెలిపారు.

ఎర్రవల్లి, నర్సన్నపేటలో రేపు సామూహిక గృహప్రవేశాలు

సీఎం దత్తత గ్రామాల దశ తిరిగింది. మొన్నటిదాకా పాత పెంకులతో.. మట్టిగోడలతో.. ఇరుకుగా ఉన్న నివాసాలు.. ఇప్పుడు పక్కా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లుగా మారాయి! పదీ ఇరవై కాదు.. ఏకంగా ఆరు వందల ఇండ్లు! అన్నీ ఒక్క తీరులో.. ఎల్‌ఈడీ కాంతులు వెదజల్లే వీధులతో.. వైఫై కనెక్టివిటీతో ఆధునికతను చాటుతూనే.. ఇంటింటికీ ఒక గేదె, నాటు కోళ్లు.. ఇంటి ఆవరణలో ఫల పుష్పాల మొక్కలతో తన పల్లె వాతావరణం ఛాయలు కోల్పోని ఒక అద్భుతం.. ఆవిష్కారానికి సిద్ధమయ్యింది! సీఎం కేసీఆర్ అక్కున చేర్చుకున్న ఎర్రవల్లి.. నర్సన్నపేటలో ఇప్పుడు పండుగ వాతావరణం వెల్లివిరుస్తున్నది! శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన వెంటనే.. లబ్ధిదారులు ఇండ్లలోకి వెళుతారు. సంప్రదాయిక రీతిలో ప్రత్యేక పూజలు, వ్రతాలతో కొత్త ఇండ్లలోకి వెళ్లేందుకు గృహస్తులు చేసుకుంటున్న ఏర్పాట్లు.. అందుకు సహకరిస్తున్న అధికారులు.. వెరసి.. ఆ రెండు గ్రామాలు ఇప్పుడు సందడిగా మారాయి.
దత్తత గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల గృహ ప్రవేశాలకు సీఎం కేసీఆర్ శుక్రవారం లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. 600 మంది బ్రాహ్మణులతో ప్రత్యేక పూజలు, సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించబోతున్నారు. ప్రతిఇంటికి పాడి గేదెలు, పది దేశీయ కోళ్లు అందజేస్తున్నారు. ఇంటింటికీ ఐదు ఫల పుష్ప మొక్కలు అందిస్తున్నారు. వైఫై సేవలు.. ఎల్‌ఈడీ విద్యుత్ కాంతులు వెల్లివిరియనున్నాయి. జిల్లా కలెక్టర్ పీ వెంకట్రామ్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో పండుగ వాతావరణం నెలకొన్నది. శుక్రవారం రోజున రెండు పడకల గదుల ఇండ్లను లాంఛనంగా సీఎం కేసీఆర్ ఉదయం 7.53 గంటలకు ప్రారంభించనున్నారు. ఎర్రవల్లిలోని ఫంక్షన్ హాల్‌లో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. 600 మంది బ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. ఆ రోజు రెండు గ్రామాల్లో ఇంటింటా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించనున్నారు. సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన రెండు పడకల గదుల ఇండ్లు దేశానికే ఆదర్శం కానున్నాయి. సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో పండుగ సందడి నెలకొన్నది. సామూహిక గృహ ప్రవేశ ఆహ్వాన పత్రికలను గ్రామ అభివృద్ధి కమిటీ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు అందజేశారు.

ఫేస్‌బుక్‌ అందుకు కూడా పనికొస్తోందట!

ఫేస్‌బుక్.. ఇప్పుడీ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఎఫ్‌బీలో ఎకౌంట్ లేదంటే ఆశ్చర్యంగా చూసే వారు కూడా ఎందరో. ప్రజల జీవితాలతో ఫేస్‌బుక్ అంతగా పెనవేసుకుపోయింది మరి. అయితే ఫేస్‌బుక్‌లో లైకులు, పోస్టింగులతో మనుషుల మానసిక రుగ్మతలను కూడా తెలుసుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. ‘‘పేస్‌బుక్ ఓ ప్రముఖ సామాజిక మాధ్యమం. అధ్యయనం కోసం మాతో చాలా సమాచారాన్ని పంచుకుంది. ఒత్తిడి, మనోవైకల్యం కోసం నిర్వహించిన అధ్యయనం కోసం అది ఎంతగానో ఉపకరించింది’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ బెకీ ఇంక్‌స్టర్ పేర్కొన్నారు. మానసిక రుగ్మతలను తెలుసుకునేందుకు ఫేస్‌బుక్ ఎంతగానో ఉపయోగపడుతోందని ఆయన తెలిపారు. ఫేస్‌బుక్ ఖాతాదారుల ఆఫ్‌లైన్ ప్రవర్తన వారి పోస్టుల్లో వెల్లడవుతోందని అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూల్‌కు చెందిన మైఖెల్ కోసిన్స్కి పేర్కొన్నారు.
 
ఖాతాదారుల పోస్టింగులు, వారు ఉపయోగించే భాష, స్టేటస్ అప్‌డేట్స్, షేర్లు, లైకులు తదితరాలు యూజర్ల గురించి బోల్డంత సమాచారాన్ని అందించినట్టు అధ్యయనకారులు తెలిపారు. వాటిని విశ్లేషించగా మానసిక రుగ్మత లక్షణాలు చాలామందిలో కనిపించినట్టు తేలిందన్నారు. వారు అప్‌లోడ్ చేసే ఫొటోలు కూడా చాలా సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. సామాజికంగా ఒంటరి అయినవారు డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నట్టు తమ అధ్యయనంలో తేలినట్టు అధ్యయనకారులు వివరించారు. కాబట్టి తల్లిదండ్రులు అటువంటి వారిని గురించి వారిలో మార్ప తెచ్చేందుకు ప్రయత్నించాలని ఇంక్‌స్టర్ సూచించారు. ఫేస్‌బుక్ ప్రపంచంలోనే అతి పెద్ద ఫొటో షేరింగ్ వెబ్‌సైట్. ఇందులో రోజుకు 350 మిలియన్ ఫొటోలు అప్‌లోడ్ అవుతున్నాయి.

గిన్నీస్ బుక్ లో వరంగల్ అమ్మాయిలు

రుద్రమదేవి స్పూర్తిగా మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచారు వరంగల్ పోలీసులు. ఒకేసారి ఒకే వేదిక నుంచి 21 వేల మంది మహిళలకు మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇచ్చి గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేశారు. సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ ఉమెన్ పేరుతో నిర్వహించిన ఈ మోగా ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అటెండయ్యారు డీజీపీ అనురాగ్ శర్మ.
సిటీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం పబ్లిక్ తో కిక్కిరిసిపోయింది. 21762 మంది మహిళలు, యువతులు 51 నిమిషాల 32 సెకండ్లపాటు మార్షల్ ఆర్ట్స్ సాధన చేశారు. ట్రైనర్స్ గైడ్ లైన్స్ తో అంతా ఒకే వేదిక నుంచి మహిళాశక్తిని చాటారు. డీపీజీ అనురాగ్ శర్మ, సీపీ సుదీర్ బాబు, కలెక్టర్లు అమ్రపాలి, ప్రశాంతిపాటిల్, దేవసేన, ఎస్పీలతో పాటు గిన్నీస్ బుక్ పరిశీలకులు ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఇలాంటి ఈవెంట్ ను గతంలో బ్రెజిల్ లో నిర్వహించారు. 2 వేల 272 మందితో అక్కడ ఈ తరహా కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ పోలీసులు కూడా 3 వేల మందితో శిక్షణ నిర్వహించి… రికార్డు బ్రేక్ చేయాలని భావించారు. ఎన్ రోల్ మెంట్ కు పిలుపునివ్వడంతో ఏకంగా 27 వేల మంది రెస్పాండ్ అయ్యారు. ఈవెంట్ లో 21 వేల 762 మంది పార్టీసీపేట్ చేశారు. గిన్నీస్ బుక్ లో చోటు దక్కేలా ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసిన సీపీ సుదీర్ బాబును అభినందించారు డీజీపీ. మహిళలు తక్కువనే భావన పోవాలన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. సమస్య ఏదైన ధైర్యంగా ఎదుర్కొవాలని సూచించారు. షీటీమ్ ఎప్పుడు వారికి అండగా ఉంటుందని చెప్పారు. వరంగల్ వేదికగా మహిళా శక్తిని ప్రపంచానికి చాటామన్నారు కలెక్టర్ అమ్రపాలి. గత రికార్డులన్నింటిని వరంగల్ ఈవెంట్ బ్రేక్ చేసిందన్నారు గిన్నీస్ రికార్డు పరిశీలకులు జయసింహా.
మార్షల్ ఆర్ట్స్ శిక్షణ  తమలో ధైర్యాన్ని నింపిందన్నారు ఈవెంట్ లో పాల్గొన్న యువతులు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలమన్న నమ్మకం కలిగిందన్నారు. షీటీమ్ తోడుగా ఆకతాయిల ఆటకట్టిస్తామన్నారు.వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ లో భాగసామ్యులైనందుకు హ్యాపీగా ఉందన్నారు. రుద్రమదేవి స్పూర్తిగా మహిళాశక్తిని ప్రపంచానికి చాటారని వరంగల్ యవతను అభినందించారు డీజీపీ.