Friday, 30 December 2016

husbend భర్తకు పట్టిన బ్లూ పిచ్చి తట్టుకోలేక భార్య ఏం చేసిందంటే…

ప్రపంచంలో వినేకొద్ది రోజుకో వింత అన్నట్టు ఉంటుంది ఈ వార్త. భర్తకు పట్టిన బ్లూ పిచ్చి తట్టుకోలేక ఓ భార్య విడాకులు కోరింది. అయితే విడాకులు ఇవ్వడానికి ఆ భర్త ఒప్పుకోకపోగా భార్య తన అదృష్టమని వదలను అని అంటున్నాడు. ఇంతకీ అసలు సంగతి ఏమితంటే…
నెలకు లక్షల్లో సంపాదించే నితిన్ విశాల్ సింగ్(36) బ్లూ రంగును ఎక్కువగా ఇష్టపడతాడు. అతని భార్యను కూడా అలానే బ్లూని ఇష్టపడి బ్రతకమని చెప్పాడు. భర్త వింత చేష్టలకు ఆశ్చర్యపోయిన ఆమె విడాకులు కోరింది. దానికి అతను ఒప్పుకోకపోవడంతో… అతని గురించి ఆమె ఆరా తీయడం మొదలు పెట్టింది. అప్పుడు అసలు విషయం బయట పడింది. కొద్ది కాలం కిందట సింగ్ ఓ స్వామిని కలిశాడు. ఆయన ‘బ్లూ’ జీవిత విధానాన్ని అవలంభించాలని సూచించడంతో సదరు టెకీ ఆయన భార్య నవీన(30)ను కూడా అలాగే జీవించాలని ఆర్డర్ వేశాడు.

సింగ్, నవీనలకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. నెలకు రూ.5 లక్షలు సంపాదించే ఈ జంట డీఎస్ఆర్ లేఔట్ లో సొంత ఫ్లాట్ ను కూడా కలిగివుంది. సాఫీగా వీళ్ళ జీవితం సాగిపోతున్న సమయంలో… తాను స్పిరిచ్యువల్ లైఫ్ అనుభవించాలని అనుకుంటున్నట్లు భర్త సింగ్ భార్యతో చెప్పాడు. ఆ తరవాత అతని అలవాట్లు, పద్దతులు మార్చుకుని… మొత్తం బట్టలు ఓ అనాథ ఆశ్రమానికి ఇచ్చేసి, భార్యను సాధారణ దుస్తులు కాకుండా ‘బ్లూ’ రంగు దుస్తులే ధరించాలని ఆదేశించారు. అధ్యాత్మిక జీవితాన్ని మొదలుపెట్టినా.. కార్యాలయానికి మాత్రం నిత్యం వెళ్తునే ఉన్నారు. తన ఇంటి మొత్తాన్ని బ్లూ కలర్ లోకి మార్చివేశారు.  ప్రతి రోజూ తెల్లవారు జామున 2.00 గంటలకు మేల్కొని చన్నీళ్ల స్నానం చేస్తారు. భార్యను కూడా తనతో పాటే నిద్రలేచి మెడిటేషన్ చేయమని కోరతారు.
సింగ్ ను నిశితంగా గమనించిన ఆమె.. ఆయన కలలో వచ్చిన ఓ స్వామిజీ ‘బ్లూ’ జీవితాన్ని ఆరంభించాలని ఉపదేశించినట్లు తెలుసుకుంది. ఈ విషయంపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అతని నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతున్నట్లు పోలీసులు తెలిపారు. కానీ, సింగ్ అందుకు నిరాకరిస్తుండటంతో పోలీసులు కేసును కోర్టు పంపే యోచనలో ఉన్నారు.

ఈ భూమండలంలో ఎక్కడ కనిపించని లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం

ఈ భూమండలంలో ఎక్కడ కనిపించని లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం
శ్రీవారి వజ్రం ….
శ్రీవారికి ధరించే స్వర్ణమాల 12 కిలోల బరువుతో కూడుకున్నది. దీనిని స్వామివారికి అలంకరించేందుకు ముగ్గురు పండితులు అవసరమట. ఆలయంలోని నీలపు వజ్రం ప్రపంచంలో ఎక్కడా లేదని పురోహితులు చెబుతున్నారు. దీనివిలువ మాత్రమే రూ. లక్ష కోట్లు.
రాజేంద్ర చోళుడు, కృష్ణదేవరాయలు పలు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించారు. ఆజానుబాహుడైన శ్రీవారు విలువలేని ఆభరణాలు ధరించినా నిరాయుధపాణిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.
11986517_10206685472208272_3340691000872907648_n gold-venky
tiruppathi-crown
gold_crown
ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవిందా అంటూ అ స్వామిని చూడటానికి ఎంతో ఆత్రుతగా వెళితే, ఆయన్ని చూసే సమయం చాలా తక్కువ దొరుకుతుంది. అలాంటి సమయంలో ఆయన వేసుకునే దండలు, ఎన్ని ఉన్నాయి అనేది చూడటానికి టైం దొరకదు.సమయం సరిపోదు. ఆ ఆపదమొక్కుల వాడిని, అనాధరక్షకుడిని చూస్తుంటే… కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో మనసు పొంగిపోతాది. అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూల దండలు వేస్తారో తెలుసుందాం…
1.శిఖామణి;
 శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు ఉంటుంది.
2.సాలిగ్రామాలు;
 ఇవి రెండు మాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటుంది. శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు.
3.కంఠసరి;
ఈ దండ మూడున్నర మూరలు ఉంటుంది. మెడలో రెండు పోర్వలుగా రెండు భుజాల మీదికి అలంకరింపబడే దండ బకటి.

లక్ష్మీ దేవిని శుక్రవారమే ఎందుకు పూజించాలంటే.?

అసలు శుక్రవారమే లక్ష్మీదేవికి ఆరాధనకు అనుకూలమైన రోజుగా ఎందుకు పేరుమోసింది?
రాక్షసులు కూడా ఆరోజే లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధించేవారు?
అందునా రాక్షస సంహారి అయిన విష్ణుమూర్తి భార్యను రాక్షసులు పూజించడమేమిటి?
ఈ సందేహాలన్నీ వస్తాయి.
ఈ సందేహాలకు సమాధానం ఏమిటంటే ….
రాక్షసుల గురువు శుక్రాచార్యుడు.
ఈ శుక్రాచార్యుల పేరుమీదుగానే శుక్రవారం ఏర్పడిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి.
ఇకపోతే శుక్రాచార్యుడి తండ్రి భృగుమహర్షి. ఈ భృగుమహర్షి బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు.
ఇతడు లక్ష్మీదేవికి తండ్రి కూడా! అందుకే లక్ష్మీదేవికి భార్గవి అని పేరు.
ఈ విధంగా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు. అందుకే ఆమెకు శుక్రవారం అంటే ప్రీతికరమైనది.
లక్ష్మీదేవి రూపురేఖలలో వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం వుంది.
లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు.
ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిథి.
అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు.
ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు.
బంగారం ఐశ్వర్యనికి సంకేతం. ఐశ్వర్యాధిదేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీపూజకు ప్రాధాన్యం ఉంది.
లక్ష్మీదేవి అనుగ్రహంతో కానీ, విష్ణుమూర్తిని దరిచేరలేరు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారం, సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు.
ఈ రెండూ ఉంటె ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు

లక్ష్మీదేవి ఆలయాలు మనదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?

విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలలోని దేవి మూర్తులు కొందరు మహాలక్ష్మీ, రాజ్యలక్ష్మీ మొదలైన పేర్లు కలిగి ఉండటమే సాధారణం. అయితే కేవలం లక్ష్మీదేవి పేరుతోనే ప్రసిద్ధమైన ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న మహాలక్ష్మీ ఆలయం ఒక్కటే.ముంబాయి నగరంలో ఉన్న మహాలక్ష్మీ ఆలయం కూడా ప్రసిద్ధమైనదే కాని ఎందుకనో అది ఆ నగరవాసులకే తప్ప బయట వారికి అంతగా తెలియదనే చెప్పవచ్చు. కాగా, జమ్ము దగ్గర ఉన్న వైష్ణోదేవి ఆలయంలో, లక్ష్మీదేవితో పాటు సరస్వతి, కాళిమూర్తులు కూడా ఉంటాయి. మద్రాసులోని అష్టలక్ష్మీ ఆలయం ఇటీవలది.

ఇవి గాని మీ పర్సులో పెట్టుకుంటే… ధనం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు…

ఈ రోజుల్లో అందరూ పర్సుని వాడటం అనేది కామన్. చిన్న పర్సు నుంచి పెద్ద హ్యాండ్ బ్యాగ్ వరకు వాడే వాళ్ళ అందరికి ఉండే అలవాటు ఏమిటంటే… చేతికి ఏది దొరికినా అందులో పెట్టేయడమే. కొన్ని పెట్టడం మంచిదే కాని కొన్ని పెడితే అస్సలు మంచిది కాదు. ఎంత సంపాదించినా డబ్బు ఖర్చు అయిపోవడం లేదా అనుకున్న అమౌంట్ రాక ఇబ్బంది పడటం జరుగుతుంది. ఇంతకీ ఆ పెట్టకూడని వస్తువులు ఏమిటో చూద్దాం…
  • పర్సులో అనవసరమైన పాత పేపర్లు, ఏటీఎం రిసీప్ట్స్, చాక్లెట్ పేపర్లు, షాప్ బిలల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే పర్సును అస్తవ్యస్తంగా పెట్టడం వలన, మన ఆర్ధిక పరిస్థితి కూడా ఇలాగే అస్తవ్యస్తంగా ఉంటుంది.
  • నెగటివ్ ఎనెర్జీ ఇచ్చే ఫోటోలు ఉదాహరణకి అసభ్య ఫోటోలు, దయ్యం పొటోలు, హింస, యుద్ధం ఇలాంటివి ఏవీ పెట్టకూడదు.
  • చిరిగిన పర్సు వాడటం వలన నెగటివ్ ఎనేర్జీ వచ్చి డబ్బు ని నష్టపోతాము.
పర్సులో పెట్టుకోవలసినవి…
లక్ష్మి ఫోటో, శ్రీ యంత్రం, రావి చెట్టు ఆకు, వెండి ఇలాంటివి పెట్టుకోవడం వలన ధనం, అదృష్టం, కుటుంబ సౌక్యం అన్నీ కలుగుతాయి

లక్ష్మి దేవి మిమ్మల్ని మెచ్చి మీకు సంపదలు ఇవ్వాలంటే. ?

లక్ష్మి దేవి మిమ్మల్ని మెచ్చి మీకు సంపదలు ఇవ్వాలంటే. ?????
“ధనం మూలం ఇదం జగత్” అన్నారు మన పెద్దలు,అయితే లక్ష్మి దేవికి చెంచు లక్ష్మి అని కూడా పేరు ఉంది, అంటే ఆవిడా ఒక చోట స్తిరంగా ఉండదు.అందుకే ఆవిడా అనుగ్రహం పొందాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయ్,అవేమిటో ఇపుడు చూద్దాం.
లక్ష్మి గణపతిని పూజించడం:-
లక్ష్మి గణపతి అంటే లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం అయితే ఎక్కడైతే అయన పూజింపబదాతాడో,అక్కడ లక్ష్మి అమ్మవారు స్థిరంగా ఉంటుంది,అంతే కాదు గణపతి పేరు కూడా లక్ష్మి గణపతి అని వచ్చింది.
తామర పువ్వులతో:-
లక్ష్మి అమ్మవారు పాలా సముద్రం నుండి తామర పువ్వుతో బైటకి వచ్చింది,అందుకే ఆవిడకి తామర పువ్వు తో ఆవిడను పూజిస్తే ఎంతో సంతోషించి మనల్ని అనుగ్రహిస్తుంది.
ఇంటిని,ఇంటి వాకిలిని శుభ్రంగా ఉంచాలి
హిందూ ధర్మం ప్రకారం గుమ్మము పైన భాగం శక్తి స్వరుపినిగ పూజిస్తే గుమ్మమ్ కింద భాగాన్ని లక్ష్మి దేవిగా పూజిస్తారు అటువంటి గుమ్మానికి మరియు ఇంటి ప్రధాన ద్వారాన్ని మనం పూజిస్తే,అమ్మవారికి మనం స్వాగతం పలికినట్టే.
సాయంత్రం వేళలో నిద్రపోవడం
సాయంత్రం నిద్రపోవడం వల్ల అమ్మవారి కోపానికి గురికావడం ఖాయం అంతే కాకుండా లక్ష్మి దేవి సోదరి ఐన జ్యేష్ట దేవి( ఎవరైతే దరిద్రాన్ని ఇస్తుందో) ఆ దేవతా మన ఇంటికి వస్తుంది,అందుకే సంధ్య వేళల్లో నిద్ర అనేది ఎప్పుడు పోరాదు.