Wednesday, 28 December 2016

సీన్‌ రివర్స్‌ అయింది

ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. మొన్నటిదాకా కొత్త నోట్లను ఎగబడి కొన్న నల్లకుబేరులు ఇప్పుడు పాతనోట్లపై పడ్డారు. పెద్దనోట్ల రద్దు తర్వాత వచ్చిన కొత్త రూ.2000 నోట్లను 15 శాతం దాకా కమిషన్‌ ఇచ్చిన కొన్న నల్లధనవంతులు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. కొన్నాళ్ల తర్వాత రెండు వేల నోట్లు రద్దుకానున్నాయని వార్తలు రావడం.. ప్రభుత్వం 50 శాతం పన్నుతో బ్లాక్‌ను వైట్‌ చేసుకోవచ్చని చెప్పడంతో నల్లకుబేరులు ఇప్పుడు 50-50 వైపు మొగ్గు చూపుతున్నారు. తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను తిరిగి ఇచ్చి పాత రూ.500, రూ.1000 నోట్లను కొనుగోలు చేస్తున్నారు. దీనికీ పది శాతం కమీషన్‌ ఇస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి వాటికి 50 శాతం పన్ను కట్టాలని చూస్తున్నారు. మొదట పాత నోట్లను కొత్త నోట్లకు మార్చుకోడానికి 15 శాతం కమీషన్‌ ఇచ్చిన నల్లకుబేరులు పాత నోట్లకు మళ్లీ 10 శాతం కమీషన్‌ ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. ఇలా నోట్ల మార్పిడిలో 25 శాతం 50-50 స్కీం కింద 50 శాతం పన్ను మొత్తం 75 శాతం కోల్పోయినా ఫర్వాలేదు.. కనీసం 25 శాతం డబ్బులైనా వైట్‌ అయితే చాలని అనుకుంటున్నారు. లేకుంటే భవిష్యత్తులో మొత్తం డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. రూ.2వేల నోట్లు భారీగా కనిపిస్తే ఐటీ శాఖ సీజ్‌ చేస్తుండటం.. కొత్త నోట్లను పెద్దఎత్తున బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తే అధికారులకు అనుమానం వచ్చే అవకాశం ఉండటం కూడా నల్లకుబేరులు మళ్లీ పాత నోట్లవైపు మొగ్గుచూపేలా చేస్తోంది. భవిష్యత్తులో రూ.2000 నోటు రద్దయితే వాటిని దాచుకున్న నల్లకుబేరులు మొత్తం విలువను కోల్పోయే ప్రమాదం ఉంది. వాటిని మార్చుకోవాలంటే అప్పుడు క్యాష్‌ అందుబాటులో ఉండటం గగనమే. పైగా 2వేల నోటును రద్దు చేయాల్సి వచ్చినపుడు ప్రభుత్వం.. వాటిని అక్రమంగా మార్చుకొనే అవకాశం కూడా లేకుండా ప్రణాళిక రూపొందించే వీలుంది. అందువల్ల వీలైనంత వరకు ఈ నెల 30లోపే పాత నోట్లను కొనుగోలు చేసి వాటిని డిపాజిట్‌ చేయాలని నల్లధనవంతులు చూస్తున్నారు.

చేతిలో నగదు చూపడం కోసం..!

కోల్‌కతా: కోల్‌కతాలోని బుర్రాబజార్‌లో పాత 500, 1000 నోట్లకు రూ.50, రూ.100 ఎదురిచ్చి మరీ తీసుకుంటున్నారు. ఎందుకలా? అని అంటే.. కొన్ని ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికం ముగుస్తోంది. దీంతో అన్ని కంపెనీలు తమ వద్ద ఉన్న నగదు నిల్వ, లావాదేవీల లెక్కలు ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ క్రమంలో కొన్ని డబ్బా కంపెనీలు తమ బ్యాలెన్స్‌ షీట్లలో ‘చేతిలో నగదు’ను చూపించేందుకు ఇలా పాత నోట్లను ఎదురు డబ్బు ఇచ్చి కొంటున్నాయి. బుర్రాబజార్‌లోని ఓ దుకాణంలో ఓ వ్యక్తి భారీ మొత్తంలో కొత్త నోట్లను పెట్టుకుని, పాత రూ.500, రూ.1000 నోట్లను కొనుగోలు చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
కొద్దిపాటి వ్యాయామం... సంపూర్ణ ఆరోగ్యం...
వారానికి 150 నిమిషాల వ్యాయామం చాలు
హైదరాబాద్‌: అందరిదీ ఉరుకుల పరుగుల జీవనమే. ఉదయం లేచింది మొదలు మళ్లీ నిద్రపోయే వరకు హడావిడి. వృత్తి, వ్యక్తిగత జీవితంలో బిజీబిజీ. ఈ క్రమంలో తమ గురించి...తమ ఆరోగ్యం గురించి పట్టించుకోక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు. నాలుగు పదులు దాటకుండానే చాలామంది హృద్రోగ, అధిక రక్తపోటు, మధుమేహం ఇతర అనేక సమస్యతో బాధపడుతున్నారు. కొందరు చిన్న వయస్సులోనే మృత్యువాత పడుతున్నారు. సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు తీవ్ర ఆవేదన మిగుల్చుతున్నారు. ఇప్పటికే నగరానికి మధుమేహ రాజధానిగా పేరుంది. దీనికితోడు 30-35 శాతం మంది అధిక రక్తపోటు సమస్యను, మరో 25 శాతం మంది అధిక బరువు సమస్య ఎదుర్కొంటున్నారు. మూత్ర పిండాల వైఫల్యం సరేసరి. చిన్న నిర్లక్ష్యం చక్కటి ఆరోగ్యంపై కోలుకోలేని ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ కమిటీ ప్రత్యేక అధ్యయనంతో కొన్ని సూచనలు చేసింది. ఏమిటవంటే... కొంచెం శారీరక శ్రమతో ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన ‘హెల్త్‌, హ్యూమన్‌ సర్వీసెస్‌ ఫిజికల్‌ యాక్టివిటీ గైడ్‌లైన్స్‌ అడ్వైజరీ కమిటీ’ నివేదిక ఇదే విషయాన్ని తేల్చింది. వ్యాయామం ఎంత చేయాలి? దీని వల్ల ఏయే వ్యాధులను నియంత్రణలో పెట్టుకోవచ్చు...ఎంత శాతం నివారించవచ్చు...ఇలా అనేక అంశాలపై సూచనలు చేసింది. వారంలో కేవలం 150 నిమిషాలు శారీరక శ్రమ కలిగించే చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల దాదాపు 12 వ్యాధుల నుంచి ముప్పు తప్పించుకోవచ్చునని సూచించింది. అలానే 20-80 శాతం వరకు ఆయా వ్యాధులను అదుపులో పెట్టుకోవచ్చు. అదీ వీలుకాకపోతే 75 నిమిషాలు పాటు కాస్త ఎక్కువ శ్రమ చేస్తే సరిపోతుందని పేర్కొంది. దీనిని పట్టించుకోకపోవడం వల్లే ప్రస్తుతం అనేక సమస్యలకు కారణమవుతోంది. ఇందుకు తెలంగాణ మినహాయిపు కాదని నిపుణులు పేర్కొంటున్నారు.
ముందే చేయాలి
సాధారణంగా చాలామంది తమకేదైనా అనారోగ్య సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెడుతుంటారు. ఉదయం పూట నడక, ఇతర వ్యాయామాలు చేసే వారు 5-7 శాతంలోపే ఉన్నారని నిపుణులు పేర్కొంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వచ్చిన తర్వాతే వ్యాయామానికి పలువురు ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఈ అలవాటు చేసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారి తీయకుండా హాయిగా జీవితాన్ని గడిపేయవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ సూచనలు పాటిస్తే..
* వ్యాయామం అంటే వేలకు వేలు చెల్లించి వ్యాయామశాలలకు వెళ్లాలనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అది అపోహ మాత్రమే. ఉదయపు నడక లేదంటే ఈత, బ్యాడ్మింటన్‌, తోటపని ఇలా ఏదైనా చేయవచ్చు.
* వారానికి 150 నిమిషాలు సాధారణ వ్యాయామం లేదంటే వారంలో 75 నిమిషాలు కాస్త ఎక్కువ శ్రమ కలిగించే వ్యాయామాలు చేయవచ్చు. యువకులైతే రెండూ చేసినా సరిపోతుంది.
* 65 ఏళ్లు పైబడిన వారైతే వారంలో కనీసం రెండు రోజులపాటు 45 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి.
* శరీరంలో కండరాలు పుష్టిగా ఉండేందుకు వారంలో రెండు రోజులు కొంత సమయం పాటు కేటాయించాలి. ఈత, పులప్స్‌, డిప్స్‌, చిన్నచిన్న బరువులు ఎత్తడం చేయాలి. దీనివల్ల కాళ్లు, తొడలు, చేతుల కండరాలు గట్టిపడతాయి.
* 30-45 నిమిషాల పాటు ఒకే చోట కూర్చోకూడదు. ప్రతి అరగంటకు ఒకసారి కుర్చీలో నుంచి లేచి 2-3 నిమిషాలు అటు ఇటు నడవాలి. ఉద్యోగులైనా ఇదే పద్ధతి పాటించాలి. 
* ముఖ్యంగా ధూమపానానికి దూరంగా ఉండాలి. మితిమీరిన మద్యం అలవాటూ ప్రమాదకరమే.

చైన్నై, బెంగళూరు టూ అమరావతి కొత్త సినిమాలతో రూ. కోట్లలో వ్యాపారం

థియేటర్లో సినిమా ఇలా పడటం పాపం... నిమిషాల్లో దాని ప్రింట్‌ చేతికొస్తుంది. అదీ కూడా హెచ్‌డీ నాణ్యతతో.. అద్భుతంగా ఉంటుంది. ఇంకా దారుణం ఎంటంటే... ఒక్కోసారి సినిమా ఇంకా థియేటర్లో పడకముందే దాని ప్రింట్‌ బయటకు వచ్చేస్తుంది... రూ.కోట్ల నిర్మాత డబ్బు... దర్శకుడి ప్రతిభ... హీరోల కష్టం.. డిస్టిబ్యూటర్ల ఆశలు అన్నీ ఇలా కాపీ పేస్ట్‌ వ్యాపారంలా సాగిపోతున్నాయి. ఇదంతా ఒక మాఫియా తరహాగా సాగుతోంది. తెలుసుకుంటే విస్తుపోవడమే మన వంతు అవుతుంది. కొత్త సినిమాల పైరసీ వ్యాపారం నవ్యాంధ్రరాజధానిలో జోరుగా సాగుతోంది. దీన్ని నిఘావర్గాలు కనిపెట్టాయి.

గుంటూరు : వారం రోజుల కిందట గుంటూరు నగరంలో పైరసీ సీడీల తయారీ కేంద్రంపై అర్బన్‌ ఎస్పీ త్రిపాఠికి వచ్చిన సమాచారం మేరకు విస్తృతంగా దాడులు చేశారు. ఇటీవలే విడుదలైన ధృవ, రెమో, మన్యంపులి, జయమ్మ నిశ్చయమ్మురా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, బేతాళుడు లాంటి కొత్త డీవీడీలను పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నీలిచిత్రాలు దొరికాయి. 524 కొత్త సినిమాల డీవీడీలు, 207 నీలి చిత్రాలు, 600 కొత్త సినిమాలకు సంబంధించిన హార్డు డిస్కు, 2000 కొత్త సినిమాల పేర్లుతో ముద్రించిన కవర్లు పోలీసుల తనిఖీల్లో బయటపడ్డాయి. కొత్త సినిమాలను నిమిషాల్లో డీవీడీల్లోకి మార్చే కంప్యూటర్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారికి కొత్త సినిమాల మాస్టర్‌ ప్రింట్‌ ఎక్కడ నుంచి వచ్చింది..? ఎలా పైరసీ చేస్తున్నారనే కోణంలో లోతుగా దర్యాప్తు చేపడితే అసలు తీగ బయటపడింది.

పైరసీ సీడీలను ఎలా చేస్తారంటే!
కొత్త సినిమాలను డీవీడీల్లో రైట్‌ చేసి విక్రయించే వ్యాపారానికి అలవాటుపడిన ముఠాలు సినిమా విడుదలకు నెలల ముందుగానే పక్కా ప్రణాళికలు రూపొందించుకుంటారు.కొన్ని సందర్భాల్లో సినిమా విడుదలకు ముందుగానే పైరెటెడ్‌ డీవీడీలు బయటకు వచ్చిన ఘటనలు ఉన్నాయి. ఇతర దేశాల్లోని చిత్ర ప్రదర్శనను డౌన్‌లోడ్‌ చేసుకోటానికి ప్రయత్నిస్తుంటాయి. అలాగే రాష్ట్రంలో సినిమా విడుదలైన గంటల్లోనే సాంకేతిక పరిజ్ఞానంతో థియేటర్లలో కాపీ చేసుకోవడం చేస్తుంటాయి. ఆ విధంగా కాపీ చేసుకున్న సినిమా ప్రింట్‌ను పెన్‌డ్రైవ్‌ ద్వారా, డీవీడీ ద్వారా తొలి కాపీని తయారు చేసుకుంటారు.

రూ.4 పెట్టుబడి.. రూ. కోట్లలో వ్యాపారం
ఒక్కో ఖాళీ డీవీడీ రూ. 4 నుంచి రూ. 5 వరకు ఉంటుంది. వాటిని కొత్త సినిమాలు ఎక్కిస్తుంటారు. ఒక్కో డీవీడీలో మూడు సినిమాలు ఉండేలా చూస్తారు. వాటి ధర ఒకటి రూ. 30 నుంచి రూ. 40 వరకు ఉంటుంది. హెచ్‌డీ అయితే ఒక్కొ డీవీడీలో ఒక్క సినిమా ఉంటుంది. వాటి ధర రూ. 40 నుంచి రూ. 50 ఉంటుంది. కొత్త సినిమాలకు సంబంధించి పాటల విడుదల సందర్భంలోనే వాటి డీవీడీల ముఖచిత్రాలు (కవర్లు) కలర్‌లో ముద్రించి నిల్వ చేసుకుంటారు. సినిమా కాపీ రాగానే వాటిని పైరసీ చేసి ముఖచిత్రాలను పెట్టి మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. రహదారులపక్కన తోపుడుబండ్లపై అందుబాటులో ఉంచుతారు. ఒక్కో తోపుడు బండి వద్ద ఉన్న వ్యక్తికి కొందరు సీడీ దుకాణాల యజమానులు రోజుకు రూ. 500 చొప్పున నెలకు రూ. 15 వేల వరకు జీతం చెల్లిస్తున్నారంటే ఆదాయం ఎంతమేరకు ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన ఓ వ్యక్తి దశాబ్దాలుగా ఇదే వ్యాపారం చేస్తూ రూ. కోట్లు గడించి ఖరీదైన బంగ్లాలు కొనుగోలు చేశాడనే వాదనలు ఉన్నాయి. కొత్తపేటకు చెందిన ఓ వ్యాపారి, సంజీవనగర్‌కు చెందిన మరో వ్యక్తి, బ్రాడీపేటకు చెందిన మరో వ్యాపారి, రాజాగారితోటకు చెందిన మరో వ్యాపారి ఇలా ప్రధాన ప్రాంతాల్లో అనేకమంది వ్యాపారులు పైరసీ డీవీడీల విక్రయించడంతో రూ. కోట్లు సంపాదిస్తున్నారు.

మాస్టర్‌ కాపీ ఎలా.. ఎక్కడ..?
బెంగళూరు, చైన్నై వంటి నగరాల్లో తెలుగుభాషా చిత్రాలకు అంతగా ప్రాధాన్యం ఉండకపోవంతో అక్కడ పైరసీ మాస్టర్‌ కాపీలను తయారు చేసే వారికి సమస్యలు తక్కువగా ఉంటాయి. అక్కడ సాంకేతిక నిపుణులు ఎక్కువ ఉండటంతో తొలికాపీని అక్కడే సిద్ధం చేస్తుంటారు. అక్కడ నుంచి గుంటూరు, విజయవాడలకు కొత్త సినిమాలను పెన్‌డ్రైవ్‌లో, డీవీడీల్లో నగదు చెల్లించి రహస్యంగా తెచ్చుకుంటారు. తెచ్చుకున్న కాపీలతో గుంటూరు, విజయవాడల్లో పైరేటెడ్‌ డీవీడీలు చేసే ముఠాలు తమ కార్యకలాపాలు సాగిస్తుంటాయి. కొత్త సినిమాలను నిమిషాల్లో పైరసీ చేయడంలో గుంటూరు, విజయవాడకు ప్రత్యేకమైన పేరుంది. మాస్టర్‌ కాపీలతో నిమిషాల్లో పదుల సంఖ్యలో పైరసీ సీడీలను చేస్తుంటారు. మాస్టర్‌ కాపీ రావడం ఆలస్యమైతే అంతర్జాలంలోనూ ప్రయత్నిస్తుంటారు. అలా కుదరకపోతే మారుమూల గ్రామాల్లోని సినిమా థియేటర్లలో ప్రదర్శించే వేళల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తొలి ప్రదర్శనను తమ కెమేరాలతో చిత్రీకరిస్తారు. వాటిని చిత్రం బాగా కనిపించడంతోపాటు మాటలు వినిపించేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

రాజధాని నుంచి ఇతర జిల్లాలకు..
గుంటూరు, విజయవాడల్లో పైరసీ డీవీడీలు తయారు చేసే ముఠాలు సుమారు 20కిపైగా ఉన్నట్లు నిఘా వర్గాల విచారణలో తేలింది. కంప్యూటర్‌ సీపీయూకు ఇరవై, 40 డీవీడీలను తయారు చేసే డీవీడీ రైటర్లను అమర్చుకుంటారు. అలా 40 డీవీడీలు అమర్చిన సీపీయులు పది నుంచి ఇరవై వరకు సిద్ధం చేసుకుంటారు. ఇలా ఒక్కసారిగా 300 నుంచి 500 డీవీడీలు తయారు చేసే విధానాన్ని సమకూర్చుకుంటారు. గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లాల్లోని ఏ పట్టణానికి, మారుమూల గ్రామానికైనా డీవీడీలు కావాలంటే రాజధాని ప్రాంతంలోని ముఠాలు సమకూర్చాల్సిందే. కేవలం ఈ మూడు జిల్లాలకే కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు గుంటూరు, విజయవాడల నుంచే పైరసీ డీవీడీలు వెళ్తున్నాయి.

తనిఖీలు తర్వాత షరా మూములే!
పోలీసులు తనిఖీలు చేసినప్పుడు ఆయా దుకాణాలపై కేసులు నమోదు చేయడం కొత్త సినిమాల డీవీడీలు స్వాధీనం చేసుకోవడం, దుకాణ యజమానులను అరెస్టు చేయడం జరుగుతోంది. అంతటితో పైరేటెడ్‌ డీవీడీల వ్యాపారం అడ్డుకట్టపడుతుందా అంటే అది జరగని పని. పోలీసులు తనిఖీలు చేసిన కొద్ది రోజులు మాత్రం దుకాణాలను మూసివేస్తారు. కొద్ది రోజుల తర్వాత షరా మామూలే. ఇటీవల ఓ యువకుడు ఎస్పీకి వాట్సప్‌కు పైరసీ డీవీడీలు తయారు చేస్తున్నారని, విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు హడావిడిచేసి కొన్ని దుకాణాలపై దాడులు చేశారు. ఆ రెండు రోజులు

Saturday, 24 December 2016

క్రిస్టమస్ శుభాకాంక్షలు : రాష్ట్రపతి ప్రణభ్ happy christmas -india president



ప్రతి ఏడాది డిసెంబర్ 25 న క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ మతస్తులతో పాటు ఇతరులు క్రిస్టమస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. విద్యుత్ దీపాలంకరణలతో పాటు కేక్ లు, గిఫ్ట్స్, కొత్త దుస్తులు ధరించి.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటారు ప్రజలు.
ప్రణభ్ ముఖర్జీ. ప్రజా సంక్షేమం కోసం మతబోధనలు చేసిన ఏసు క్రీస్తు పుట్టిన రోజును ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు. మతసామరస్యం వెల్లువిరిసేలా ప్రజలందరూ ఈ పవిత్ర దినాన్ని జరుపుకోవాలన్నారు.


Christmas wishes of the people of the country, President Pranab Mukherjee said. Matabodhanalu the birth of Jesus Christ for the welfare of the public who wanted to celebrate sukhasantosalato people. Matasamarasyam velluvirisela people celebrated this holy day.Each year, on the occasion of the birth of Christ on December 25 itself Christian and others around the world who celebrate Christmas was a grand. In addition to the lighting of the cake, gift, new clothes and special prayers in churches to celebrate the people ...

గుర్తింపు కార్డు ఉంటేనే వెంకన్న దర్శనం…. షేర్ చెయ్యండి

గుర్తింపు కార్డు ఉంటేనే వెంకన్న దర్శనం…. షేర్ చెయ్యండి..
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ గుర్తింపు కార్డును తప్పనిసరి చేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. భక్తులకు తితిదే అందిస్తున్న సేవల్లో పారదర్శకత పెంచడంతో పాటు, అక్రమాలను అడ్డుకోవడానికి ఇప్పటికే గదుల బుకింగ్‌, శ్రీవారి అర్జిత సేవలతో పాటు దర్శనం టిక్కెట్లు, అంగప్రదక్షిణం టోకెన్ల జారీ, శ్రీవారి సేవకుల నమోదు కోసం ఆధార్‌కార్డును స్వీకరిస్తున్నారు. తాజాగా ఇదే విధానాన్ని కాలినడక భక్తులకు కూడా అమలు చేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో తిరుమలకు చేరుకునే యాత్రికులకు గాలిగోపురం వద్ద, శ్రీవారిమెట్టు మార్గంలో వచ్చే వారికి 1200వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. ఇకపై భక్తుడి ఫోటోతో పాటు గుర్తింపుకార్డు నంబరును పొందుపరిచి దర్శనం టిక్కెట్లు జారీ చేయనున్నారు. గుర్తింపు కార్డు నంబరు పొందుపరిచిన యాత్రికులకు మాత్రమే లడ్డూ టోకెన్లు, శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వీలవుతుందని.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని భక్తులను తితిదే కోరింది.
షేర్ చెయ్యండి.

స్కూల్లో రచ్చ జరిగింది..యాజమాన్యం మౌనం పాటించింది

:అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో అది ఒక స్కూల్.. కానీ అక్కడ వినిపించింది పిల్లల మాటలు కాదు.. ఉపాధ్యాయుల పాఠాలూ కాదు. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే భారీ దాడి జరిగిపోయింది. 10 మంది విద్యార్థినులు విచక్షణారహితంగా ముగ్గురు తోటి విద్యార్థులపై స్కూల్ ఆవరణలోనే భయంకరంగా దాడిచేశారు. దాడి చేసినవారంతా పట్టలేని ఆవేశంతో ముగ్గురిని ఎక్కడ కొడుతున్నారో, ఎలా కొడుతున్నారో అర్థంకాని విధంగా, వర్ణించలేని రితీలో  చితకబాదారు.


 ముగ్గురు బాధితుల్లో ఒకరైన తాజానా హమ్మోద్ అనే బాలిక దాడికి సంబంధించిన వీడియోని ట్వీట్టర్‌లో పోస్ట్ చేసింది. వారిపై జరిగిన దారుణ దాడి గురించి వివరించింది. 10 విద్యార్థునులు తమ చేష్టలతో మిగతావారిని వేధించేవారని వారి మాట వినని తమపై దారుణంగా దాడిచేశారని తెలిపింది. ఇది వరకు తమపై జరిగిన దాడి సీసీ ఫుటేజీలను స్కూల్ యాజమాన్యం ఇవ్వడం లేదని విద్యార్థిని తెలిపింది.  నిందితులు తమపై పదేపదే దాడి చేస్తున్నా సెక్యూరిటీ గార్డులు చూసి కూడా తమను పట్టించుకోలేదని వాపోయింది. దాడి చేసిన వారి జీవితాల గురించి ఆలోచించి పోలీసులు కేసు నమోదుచేయకపోవడాన్ని ఆమె వ్యతిరేకించింది. తమకు న్యాయం జరగాలంటే వారికి తగిన శిక్ష పడాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తోంది.

5 Must-Have Elements of Every Small Business Online Marketing Plan

Of course, this is by no means an exhaustive list, but the following could be considered the most conducive to the budget of even the most frugal of business owners.
  1. On-Site SEO
The concept of building a website to cater to customers seems almost forgone nowadays, but the cruel reality is that a considerable number of small business owners ignore the one online marketing technique over which they have the most control.
Let’s forget for a moment a recent study found that 46 percent of small businesses do not yet own a website. For those that do, the primary concern should be executing a two-prong plan that is equal parts technical and creative.
First, buck up to hire a reputable SEO firm to evaluate your website. I’m talking top to bottom, through and through, including the code behind it all, which acts as the meat and potatoes of any website. Until this is done, everything else is trivial.
Once your site is given the green light, fill it with content that people will actually want to read. Sounds easy, but it’s not. Using your own intuition and some competitor analysis as a guide, figure out what terms your potential customers are searching on Google. Then, once you have a list, make a concerted effort to target each keyword – or a group of related keywords – one page at a time, treating each like its own mini-website.
If you need to hire a professional writing service to flesh out text for every page, don’t hesitate. Trust me, it will return huge dividends and more than pay for itself later on.
  1. Content Marketing
Your site’s looking good, but now what? The answer: more content. Don’t be stale.
Maintaining a blog is one of the easiest ways to consistently fill your site with content that will keep people coming back. Determine how often you can blog and commit to it. Take the time to develop a content calendar, and see it through. Write about specific topics and establish yourself as an expert in your field.
But that’s only half the battle. To win the war, put forth the effort to market your content, so that more and more people realize its worth. Think big. Identify people who you consider to be influencers in your industry, and develop a mutually beneficial relationship with them. If you put yourself out there, and it’s done right, soon others will begin to do your marketing for you.
  1. Social Media
According to a study conducted by the Pew Research Center last year, 65% of American adults engage with some form of social media. In today’s wireless world, people are more connected than ever, and we want others to know exactly what we like and what we don’t.
If you provide customers with an enjoyable experience – whether it’s on your site, in the store, or a mixture of the two – they’ll take to social media to influence others to follow suit. You’ll begin to ignite relationships with new customers you never would have reached otherwise.
And don’t worry about trying to promote your business on every social media site known to man. Start with one you feel best caters to your target audience, and invest all of your available resources there.
  1. Mobile
The numbers don’t lie. Today, we spend more time searching on our phones than we do computers. For businesses, this means opportunities to reach more people than ever before, and doing so at absolutely crucial times.
Yet, a reported 32 percent of small business owners either do not have a mobile-friendly website or are unsure whether their website is mobile-friendly.
Remember the SEO firm from earlier? They’ll likely tell you your site needs to be optimized for mobile devices. If so, embrace the idea. Mobile is the future, so you may as well start now. It will pay off.
  1. Reviews
Everyone’s a critic. And when it’s so easy to do so now, why not be?
The prominence of review engines such as Yelp, TripAdvisor, and Google My Business has given every consumer a voice, which can be intimidating for a business owner. But fear not, and instead focus on fostering healthy reviews from people for whom you provided a positive experience. The word will spread.
Establishing a presence on top review sites will show new and existing customers you are interested in receiving feedback – both good and bad. And yes, for every 50 glowing reviews, there may be a venomous one – however erroneous – that threatens to submarine everything.
Meet the vitriol head-on. Rather than react accordingly, be proactive by responding in a manner that not only extinguishes the situation, but also resonates with those who are using online reviews to make purchasing decisions. Which is just about everyone.