Friday, 23 December 2016

శృంగారం ఎక్కువ మందితో చేస్తే వచ్చేది ఎయిడ్స్ కాదంట… ఏంటో తెలుసుకోండి మరి

మగవారికి శృంగారానికి సంబంధించిన కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే సాధమైనంత వరకు ఎక్కువ అమ్మాయిలతో సెక్స్ చెయ్యాలని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ తాజాగా జరిపిన ఒక సర్వ్ లో 7మంది అమ్మాయిలకు మించి ఎక్కువగా శృంగారంలో పాల్గొనే మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు రెండింతలు ఎక్కువని ఆస్ట్రేలియాలోని క్యాన్సర్ కౌన్సిల్ కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధకులు తెలిపారు.
అంతే కాదు..శృంగారం చేసేటప్పుడు పురుషుల్లోని హార్మోన్లలో పెనుమార్పులు సంభవిస్తాయని పరిశోధనలో తేలింది. ఇది పురుషుల జీవక్రియ, లైంగిక చర్యల్లో మార్పులకు దారితీస్తుంది.
టీనేజీ నుండే పలువురు అమ్మాయిలతో సెక్సువల్ రిలేషన్ షిప్స్ కలిగి ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తేల్చారు. అధికబరువు, కుటుంబ పెద్దకు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉంటే సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు.
మొన్నటి వరకు ఎవరితో పడితే వారితో శృంగారం చెయ్యడం వల్ల ఎయిడ్స్ వస్తుందని తెల్చినప్పటికీ, రీసెంట్ గా అంతకంటే ముందు 7 మంది ఆడవాళ్ళకు మించి సెక్స్ చేస్తే ఇదిగో ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ వస్తుందని తేలడంతో, విచ్చలవిడిగా శృంగారాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఆలోచనలో పడ్డారు.

13ఏళ్ళ అబ్బాయితో 19ఏళ్ళ అమ్మాయి 60 సార్లు సెక్స్..!చివరకు..

టీనేజీ వయసులో మహా అంటే పిల్లలు ఏం చేస్తారు? చదువు, నచ్చిన తిండి తినడం, తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకోవడం ఇంతే కదా అందరూ చేసేదే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇద్దరు టీనేజీ పిల్లలు మాత్రం పెద్ద వాళ్ళు చేసే పనులు చేశారు! వాళ్ళెం చేశారో మీకు ఇప్పటికే అర్ధమైంది కదా. అవును..మీరు గెస్ చేసిందే కరెక్ట్. 19ఏళ్ళ అమ్మాయి 13ఏళ్ళ బాలుడుతో అనేక సార్లు సెక్స్ చేస్తూ తన కోరికను తీర్చుకుంది. ఈ సంఘటన మన దేశంలో జరిగింది కాదులెండి.

బ్రిటన్ దేశంలో ఒక టీనేజీ అమ్మాయి 16 ఏళ్ళ నుంచే కోరుకలను పెంచుకుంది. ఎలాగైనా వాటిని తీర్చుకోవడానికి స్కూల్ కి వెళ్ళే ఒక బాలుడును లొంగదీసుకుంది. ఇక ఇద్దరూ కూడా పలు మార్లు మద్యం సేవిస్తూ, సెక్స్ చేసుకున్నట్టు ఆలస్యంగా బయటపడింది. సమయం దొరికినప్పుడల్లా, వారి ఇంట్లో, బయట వివిధ ప్లేసుల్లో వాళ్ళు శృంగారంలో పాల్గొన్నారు. ఒక రోజు ఆ బాలుడు తను ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నానని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వెంటనే ఆ యువతిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి, కోర్టులో విచారణ చేపట్టారు. విచిత్రం ఏంటంటే..తీర్పు ఇచ్చిన న్యాయస్థానం..బాలుడుపై అత్యాచారంలో భాగంగా అతనికి ఏమీ కాలేదని, ఎలాంటి హింసకు గురి కాలేదని, పరిస్థితి చూస్తుంటే ఇద్దరూ ఇష్టపూర్వకంగా సెక్స్ జరిపినట్టు తెలిపారు. విచారణలో ఆ యువతి చాలా మంచిదని, కొన్ని సామాజిక నైపుణ్యాలు లోపం వల్లనే ఇలా ప్రవర్తించిందని కూడా తెలిపింది బ్రిటన్ కోర్ట్. ఇక అన్ని సార్లు శృంగారంలో పాల్గొన్నప్పటికీ ఆ అమ్మాయికి కూడా గర్భం కూడా రాలేదని, కేవలం ఆమె కోరిక తీర్చుకోవడానికి మాత్రమే ఇలా ప్రవర్తించిందని, అందుకు సంబంధించిన మెసేజ్ లు కూడా ఆమె దగ్గర లభ్యమయ్యాయని కోర్టు తెలిపింది.

ఇలా చేసినందుకు గాను ఆమెలు 16 నెలల పాటు శిక్ష విధిస్తూ..రిమాండ్ కు తరలించాలని న్యాయస్థానం తీర్పుచెప్పింది.

ఓ వ్యక్తి కోట్ల రూపాయలతో దొరికాడు..ఎక్కడిది అని ప్రశ్నిస్తే అతని జవాబుకి పోలీసులు షాక్ అయ్యారు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో అర్థ రాత్రి తాగి రోడ్డు మీద తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు తనిఖీ చేయగా అతని వద్ద భారీ మొత్తంలో డబ్బులు ఉన్నట్లు గమనించారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మె విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని పేరు సందీప్ కుమార్. అతను ఇండియాలోనే అత్యంత ఖరీదైన బెగ్గర్. అతని ఆస్తులు అక్షరాల కోట్లలోనే ఉంటుంది. మార్కెట్ విలువ ప్రకారం దానికి రెట్టింపే ఉండొచ్చు, ఉంటుంది కూడా. ఈయన రోజుకి రూ 2500-3000, నెలకు 75000 పై మాటే. అలా వచ్చిన డబ్బుతోనే ముంబయ్ లోని పరేల్ ప్రాంతంలో రెండు ఫ్లాట్లు.., మరో షాప్ ను నడుపుతున్నాడు. వాటి అద్దె మరో రూ 63000 రూపాయల వరకూ ఉంటుంది.
ఒక్క భారత్ లోనే కొన్న లక్షలాది మంది బిలీనియర్ బెగ్గర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లి బిక్షాటన చేస్తారు. అలా వచ్చిన డబ్బులతో తమ పర్మినెంట్ ప్లేస్ లో ఇళ్లు, విలాసవంత మైన భవనాలు ఏర్పరుచుకుంటారని తేలింది. అంతే కాదు వీరిలో సీజనల్ యాచకూలు కూడా ఉంటారంటా వాళ్లు పండగటైంలో యాచిస్తారు. మరో రకం బిచ్చగాళ్లు ముంబై, హైదరాబాద్, కోల్ కతా వంటి నగరాల కూడళ్లలో పిల్లల్ని చేతబట్టుకొని యాచిస్తారు. ఆ పిల్లలకు కూడా గంటల చొప్పున డబ్బు చెల్లిస్తారు. పిల్లల్ని వెంట తెచ్చుకోవడం వల్ల రోజు వారి సంపాదనకంటే ఎక్కువ మొత్తంలో అర్జిస్తారట. వాళ్లు రాని పక్షంలో పిల్లల్ని చిత్ర హింసలకు గురిచేస్తారని పోలీసుల విచారణ లో వెల్లడైంది.

దేశంలో డెంటల్ సమస్య తీవ్రంగా ఉంది: ప్రణబ్

దేశంలో సరైన వైద్యం అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఆర్మీ డెంటల్ కాలేజీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రణబ్.. విద్యార్ధులకు మంచి విద్యనందిచాలన్నారు. మహిళలు ఎడ్యుకేట్ అయితే ఓ ఫ్యామిలీనే ఎడ్యుకేట్ చేస్తారని తెలిపారు. దేశంలో డెంటల్ సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని…జంక్ ఫుడ్, కూల్ డ్రింక్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. స్నాతకోత్సవంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి.

దత్తత గ్రామాల్లో గృహప్రవేశాలుపైలాన్, కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన సీఎం

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో పండుగ వాతావరణం నెలకొంది. వేద పండితుల మధ్య శాస్త్రోక్తంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. రెండు గ్రామాల్లో 600 డబుల్ బెడ్‌రూం ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాలు జరిగాయి. గ్రామాల్లోని ప్రజలంతా ఒకేసారి గృహప్రవేశం చేశారు. ఒక్కో ఇంట్లో ఒక్కో బ్రహ్మణుడిచే వాస్తుపూజ, పూణ్యాహవచనం, సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. సుమూహుర్తం 7.53 గంటలకు వేద మంత్రోచ్చారణ నడుమ గ్రామస్తులు గృహప్రవేశం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన దత్తత గ్రామాల్లో ఒకటైన నర్సన్నపేటకు చేరుకున్నారు. సీఎం చేతుల మీదుగా నర్సన్నపేట, ఎర్రవల్లి గ్రామాల్లో సామూహిక గృహప్రవేశాలు జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నర్సన్నపేటకు చేరుకున్న సీఎంకు పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. నర్సన్నపేట గ్రామంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. తర్వాత ఎర్రవల్లికి  చేరుకుని కమ్యూనిటీ హాల్‌ను  ప్రారంభించారు సీఎం. కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.

పాతనోట్ల చెలామణికి మరో వెసలుబాటు

పాత నోట్లు అయిన రూ.500, వెయ్యి రూపాయల చెలామణికి మరో వెసలుబాటు కల్పించింది కేంద్రం. బ్లాక్ మనీ వెల్లడికి ప్రకటించిన ప్రధానమంత్రి గరీభ్ కళ్యాణ్ యోజన కింద ఈ చెల్లింపులు చేయొచ్చంట. ఈ పథకం కింద.. మీ దగ్గరున్న పాత నోట్లతో పన్నులు చెల్లించుకోవచ్చని ప్రకటించింది కేంద్రం. పన్నులతోపాటు జరిమానాలు చెల్లించటానికి కూడా అవకాశం ఇచ్చింది కేంద్రం. ( ఉదా: వెహికల్ చలానాలను పాతనోట్లతో బ్యాంకు ద్వారా చెల్లింపు ) ఈ పన్నులు బ్యాంకు ద్వారా మాత్రమే అనే కండీషన్ పెట్టింది. ఇప్పటి వరకు మీరు బ్యాంకుల ద్వారా ఏయే పన్నులు అయితే చెల్లిస్తున్నారో.. వాటిని గరీభ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద చెల్లించవచ్చు. పన్నులు వసూలు చేసే బ్యాంకుల్లో మాత్రమే పాతనోట్లతో చెల్లింపులు చేసుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. ఇది కూడా డిసెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకు కేంద్రం చేసిన సవరణల్లో ఇదొకటి. ఇప్పటికే చాలా బ్యాంకులు ఖాతాదారులకు ఫోన్లు చేసి.. పాతనోట్ల మీ బిల్లులు చెల్లిస్తామని ఆఫర్ ఇస్తున్నాయి. ఈ వారం రోజుల్లో ఈ వెసలుబాటు కింద ఎంత డిపాజిట్ అవుతాయో చూడాలి.

కారు కొనాలంటే ఆ సర్టిఫికెట్ మస్ట్The certificate must konalante car

కారు కొనుక్కోవాలనే మీ కల సాకారం కావాలంటే ఇక నుంచి అంత ఈజీకాదు. జేబులో డబ్బులుంటే సరిపోదు.. పార్కింగ్ సర్టిఫికెట్ మస్ట్ గా ఉండాలి. ఈ నిబంధన అతి త్వరలో అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది కేంద్రం. సిటీల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్, ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ తో ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ కండీషన్ తీసుకొస్తోంది కేంద్రం. నా కారు పార్కింగ్ కు స్థలం ఉన్నది అని మనమే చూపించుకోవాలి. పార్కింగ్ ప్లేస్ సర్టిఫికెట్ లేకపోతే మీ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయరు. మనం నివసించే ఇంటిలో పార్కింగ్ ప్లేస్ ఉన్నట్లు.. సంబంధిత బిల్డర్ లేదా సొసైటీ లేదా బిల్డింగ్ అప్రూవ్ చేసే కార్పొరేషన్, మున్సిపాలిటీ, పంచాయతీలోని ప్లానింగ్ డిపార్ట్ మెంట్ నుంచి సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఈ విషయంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు.. రవాణా శాఖ మంత్రి గడ్కరీతో కూడా చర్చించారు. అతిత్వరలో మార్గదర్శకాలు రానున్నాయి. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని 60శాతం కార్లకు ఇళ్లలో పార్కింగ్ ప్లేస్ లేదు. వీళ్లందరూ ఇళ్ల ముందే పార్క్ చేస్తున్నారు. పంచాయతీల్లో అయితే 10, 12 కుటుంబాలు నివాసం ఉండేలా అపార్ట్ మెంట్ల నిర్మాణాలు చేశారు. అందుకు తగ్గట్టు పార్కింగ్ ప్లేస్ మాత్రం ఉండటం లేదు.