Friday, 30 December 2016

నోట్లకు ఎక్స్‌పైరీ డేట్! ఎన్నినెలలకో తెలుసా…

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన మన ప్రధాని మోడీ నల్ల ధనాన్ని రూపుమాపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రజలు కూడా దానికి మద్దతు పలికారు. అయితే ఇప్పుడు లెక్కలు ఎలా ఉన్నాయంటే.రద్దు చేసిన రూ.500 – రూ.1000 నోట్లలో సుమారు 14.5 లక్షల కోట్ల విలువైనవి మళ్లీ డిపాజిట్ల రూపంలో బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేశాయి. రద్దు నాటికి దేశంలో చలామనీలో. లేదంటే నల్లధనంగా మూలుగుతున్న డబ్బు విలువకు ఇది దాదాపు సమానం. అంటే.మోడీ నిర్ణయంతో నల్లధనం ఏమీ బయటపడలేదన్నమాటే. ఆదాయపు పన్ను శాఖ దాడులతో బయట పడిన కొంత డబ్బు గురించి ఇంత నిర్ణయం తీసుకోవలసియన అవసరం లేదని, అదేదో ముందే దాడులు చేసి పట్టుకోవచ్చని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మోడీ మొరో ప్లాన్ వేస్తున్నారంట. కొత్తగా వచ్చిన 2000, 500 రూపాయల నోట్లను కూడా రద్దు చేస్తారని అనుకుంటున్నారు. ఈ నిర్ణయంతో పాటు నోట్లకు ఎక్స్పయిరీ డేట్ ఉంటుందని, అంటే దానిపై అలాంటి తేదీ ఏమీ ముద్రించకపోయినా తయారీ తేదీ ఉంటుందని.. అక్కడి ఆర్నెళ్లలో దాని కాలపరిమితి ముగిసిపోయేలా కొత్త నోట్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్నెళ్ల తరువాత వాటికవే కరిగిపోతాయట. నేషనల్ సైన్స్ రీసెర్చి మిషన్ ఈ టెక్నాలజీ తయారుచేయగా
ఆర్బీఐ దీన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదేగాని జరిగితే డబ్బుని ఎక్కువ మొత్తంలో ఎవ్వరు ఇళ్ళల్లో పెట్టుకోలేరు. చచ్చినట్టు బ్యాంక్ లో వెయ్యాలి. అర్థక్రాంతి సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బోకిల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. డీమానిటైజేషన్ ముఖ్యంగా నకిలీ నోట్ల ఏరివేత – ఉగ్రవాద నిరోధానికి బాగా తోడ్పడుతుందని ఆయన చెబుతున్నారు. మరి ఇది నిజంగా అమలులోకి వస్తే దొంగ డబ్బు దొంగలా మెల్ట్ అయ్యి మాయం అయిపోతాది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత.. బాబాకు భారీగా విరాళాలు

పెద్ద నోట్ల రద్దు తర్వాత మహారాష్ట్రలోని ప్రముఖ షిరిడీ సాయి బాబా ఆలయానికి కోట్లలో విరాళాలు అందాయి. ఈ 50 రోజుల్లో సుమారు రూ.31.73 కోట్లు వచ్చినట్లు సాయి సంస్థాన్ శుక్రవారం ప్రకటించింది. హుండీల ద్వారా రూ.18.96 కోట్ల విరాళాలను భక్తులు సమర్పించారు. ఇందులో రూ.4.53 కోట్లు రద్దైన రూ.500, రూ.1000 నోట్లు కాగా రూ.3.8 కోట్లు కొత్త రూ.2000, రూ.500 నోట్లు.
 
షిరిడీ సాయికి మరో రూ.4.25 కోట్లు ఆన్‌లైన్ ద్వారా అందాయి. వీటిలో రూ.2.62 కోట్లు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా రాగా, రూ.3.96 కోట్లు డీడీలు, మరో రూ.1.45 కోట్లు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా, రూ.35 లక్షలు మనీ ఆర్డర్ల ద్వారా వచ్చాయి. వీఐపీ దర్శనాలు, హారతి పాసుల ద్వారా మరో రూ.3.18 కోట్లు అందాయి. అంతేగాక రూ.73 లక్షల విలువైన 2.9 కిలోల బంగారు ఆభరణాలు, రూ.18 లక్షల విలువైన 56 కేజీల వెండి వస్తువులను భక్తులు సమర్పించారు.
 
షిరిడీ సాయి బాబా ఆలయానికి గత ఆర్థిక సంవత్సరంలో హుండీల ద్వారా రోజుకు సగటున రూ.44.38 లక్షల చొప్పున ఏడాదిలో రూ.162 కోట్లు విరాళాలుగా వచ్చాయి. అయితే పెద్ద నోట్లు రద్దు తర్వాత రోజుకు సగటున రూ.37.92 లక్షల చొప్పున విరాళాలను భక్తులు సమర్పించినట్లు సాయి సంస్థాన్ ట్రస్ట్ ప్రతినిధి సచిన్ తాంబి వివరించారు.

సీఎం అఖిలేష్‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించిన ములాయం

సమాజ్‌వాదీ(ఎస్‌పీ) పార్టీలో సంక్షోభం ముదిరిపోయింది. పార్టీ అధ్య‌క్షుడు ములాయంసింగ్ యాద‌వ్ త‌న కుమారుడు, ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎం అఖిలేష్‌యాద‌వ్‌ను పార్టీ నుంచి బ‌హిష్కరించారు. అఖిలేష్‌తోపాటు రాజ్య‌స‌భ స‌భ్యుడు రాంగోపాల్‌యాద‌వ్‌ను సైతం పార్టీ నుంచి ఆరేళ్ల‌పాటు బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ములాయంసింగ్ ప్ర‌కటించారు.
‘అఖిలేష్‌ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు. సమాజ్‌వాదీ పార్టీని కాపాడటం నా బాధ్యత, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మీడియా సమావేశంలో ములాయం వెల్లడించారు. సీఎం అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదని తెలిపారు.
మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ టికెట్ల వ్యవహారం తండ్రీకొడుకుల మధ్య దూరాన్ని పెంచింది. సీఎం అఖిలేశ్‌ సూచించినవారికి కాకూడా తనకు నచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తూ ములాయం 325 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే తండ్రి నిర్ణయాన్ని ధిక్కరిస్తూ అఖిలేశ్‌.. 235 మంది పేర్లతో కూడి రెబర్స్‌ జాబితాను ప్రకటించారు. అఖిలేశ్‌ తిరుగుబాటు చర్యను తీవ్రంగా పరిగణించిన ములాయం.. శుక్రవారం ఉదయం షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. నోటీసు జారీ చేసిన కొద్ది గంట‌ల్లోనే అఖిలేష్‌, రాంగోపాల్‌ను పార్టీ నుంచి బహిష్క‌రించిన‌ట్లు ములాయం ప్ర‌క‌ట‌న చేశారు. తండ్రే కుమారుడ్ని సస్పెండు చేయ‌డంతో రాష్ట్రంలో రాజ‌కీయం ఎన్ని మ‌లుపులు తిరుగుతోందోన‌ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌తోపాటు రాజ‌కీయ నేత‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.
देवी देवता को कौन सा फूल अति प्रिय है ,भगवान को चढ़ता है कौन सा फूल
भगवान अपने भक्त को छप्पन प्रकार का भोग लगा कर पूजा करने के लिए नहीं कहते हैं. वे तो केवल आपके सच्चे भक्ति-भाव से ही प्रसन्न हो जाते हैं.
भगवान श्रीगणेश- आचार भूषण ग्रंथ के अनुसार भगवान श्रीगणेश को तुलसीदल को छोड़कर सभी प्रकार के फूल चढाएं जा सकते हैं। पद्मपुराण आचाररत्न में भी लिखा है कि ‘न तुलस्या गणाधिपम’ अर्थात् तुलसी से गणेश जी की पूजा कभी न करें। गणेश जी को दूर्वा चढ़ाने की परंपरा है। गणेश जी को दूर्वा बहुत ही प्रिय है । दूर्वा के ऊपरी हिस्से पर तीन या पांच पत्तियां हों तो बहुत ही उत्तम है।
भगवान शिव- भगवान शंकर को धतूरे के फूल, हरसिंगार, व नागकेसर के सफेद पुष्प, सूखे कमल गट्टे, कनेर, कुसुम, आक, कुश आदि के फूल चढ़ाने का विधान है। भगवान शिव को केवड़े का पुष्प नहीं चढ़ाया जाता है।
भगवान विष्णु- इन्हें कमल, मौलसिरी, जूही, कदम्ब, केवड़ा, चमेली, अशोक, मालती, वासंती, चंपा, वैजयंती के पुष्प विशेष प्रिय हैं। विष्णु भगवान तुलसी दल चढ़ाने से अति शीघ्र प्रसन्न होते है । कार्तिक मास में भगवान नारायण केतकी के फूलों से पूजा करने से विशेष रूप से प्रसन्न होते है । लेकिन विष्णु जी पर आक, धतूरा, शिरीष, सहजन, सेमल, कचनार और गूलर आदि
सूर्य नारायण- इनकी उपासना कुटज के पुष्पों से की जाती है। इसके अलावा कनेर, कमल, चंपा, पलाश, आक, अशोक आदि के पुष्प भी इन्हें प्रिय हैं।
भगवान श्रीकृष्ण- अपने प्रिय पुष्पों का उल्लेख महाभारत में युधिष्ठिर से करते हुए श्रीकृष्ण कहते हैं- मुझे कुमुद, करवरी, चणक, मालती, पलाश व वनमाला के फूल प्रिय हैं।
भगवती गौरी- शंकर भगवान को चढऩे वाले पुष्प मां भगवती को भी प्रिय हैं। इसके अलावा बेला, सफेद कमल, पलाश, चंपा के फूल भी चढ़ाए जा सकते हैं।
लक्ष्मीजी- मां लक्ष्मी का सबसे अधिक प्रिय पुष्प कमल है। उन्हें पीला फूल चढ़ाकर भी प्रसन्न किया जा सकता है। इन्हें लाल गुलाब का फूल भी काफी प्रिय है।
हनुमान जी- इनको लाल पुष्प बहुत प्रिय है। इसलिए इन पर लाल गुलाब, लाल गेंदा आदि के पुष्प चढ़ाए जा सकते है।
माँ काली – इनको अड़हुल का फूल बहुत पसंद है। मान्यता है की इनको 108 लाल अड़हुल के फूल अर्पित करने से मनोकामना पूर्ण होती है।
माँ दुर्गा- इनको लाल गुलाब या लाल अड़हुल के पुष्प चढ़ाना श्रेष्ठ है।
माँ सरस्वती- विद्या की देवी माँ सरस्वती को प्रसन्न करने के लिए सफेद या पीले रंग का फूल चढ़ाएं जाते यही। सफेद गुलाब, सफेद कनेर या फिर पीले गेंदे के फूल से भी मां सरस्वती वहुत प्रसन्न होती हैं।
शनि देव- शनि देव को नीले लाजवन्ती के फूल चढ़ाने चाहिए, इसके अतिरिक्त कोई भी नीले या गहरे रंग के फूल चढ़ाने से शनि देव शीघ्र ही प्रसन्न होते है।
ध्यान रखने योग्य बातें-भगवान की पूजा कभी भी सूखे व बासी फूलों से न करें।
कमल का फूल को लेकर मान्यता यह है कि यह फूल दस से पंद्रह दिन तक भी बासी नहीं होता।
चंपा की कली के अलावा किसी भी पुष्प की कली देवताओं को अर्पित नहीं की जानी चाहिए।
आमतौर पर फूलों को हाथों में रखकर हाथों से भगवान को अर्पित किया जाता है। ऐसा नहीं करना चाहिए। फूल चढ़ाने के लिए फूलों को किसी पवित्र पात्र में रखना चाहिए और इसी पात्र में से लेकर देवी-देवताओं को अर्पित करना चाहिए।
तुलसी के पत्तों को 11 दिनों तक बासी नहीं माना जाता है। इसकी पत्तियों पर हर रोज जल छिड़कर पुन: भगवान को अर्पित किया जा सकता है।
शास्त्रों के अनुसार शिवजी को प्रिय बिल्व पत्र छह माह तक बासी नहीं माने जाते हैं। अत: इन्हें जल छिड़क कर पुन: शिवलिंग पर अर्पित किया जा सकता है। 🌿🌿

డేంజర్ : 3 గంటల్లోనే కోట్ల అకౌంట్స్ హ్యాక్

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత క్యాష్ లెస్ ట్రాన్సాక్ష‌న్స్ చేయాలంటూ కేంద్రం విప‌రీతంగా ప్ర‌మోట్ చేస్తోంది. అయితే కార్డ్‌తో లావాదేవీలు జ‌ర‌ప‌డం ఎంత‌వ‌ర‌కు సుర‌క్షితం అనేదే పెద్ద ప్ర‌శ్న‌గా మిగులుతోంది. అంతేకాదు కార్డుతో లావాదేవీలు జ‌రిపితే బ్యాంక్ అకౌంట్ల‌నే హ్యాక్ చేసే కేటుగాళ్లు త‌యార‌య్యారు. ఆ త‌ర్వాత మ‌న‌కు తెలియ‌కుండానే ఖాతాలోని డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తూ ఆన్‌లైన్ చోరీల‌కు పాల్ప‌డుతున్నారు హ్యాక‌ర్స్‌.
తాజాగా ఓ ప్ర‌ధాన బ్యాంక్‌నుంచి ప‌లువురి ఖాతాలు హ్యాక్ చేశారు ఐదుగురు యువ‌కులు. ఢిల్లీ ప‌రిస‌రాల్లో ఉన్న గురుగ్రామ్ సాఫ్ట్‌వేర్ కంపెనీల‌కు పెట్టింది పేరు. అక్క‌డే బ‌గ్స్ బౌంటీ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఓ ఐదుగురు యువ‌కుల‌ను నియ‌మించుకుంది. ఈ ఐదుగురు ఏమి చేస్తారో తెలిస్తే నోళ్లెళ్ల బెడ‌తారు. వారి ప‌ని ఓ ప్ర‌ధాన బ్యాంకు అకౌంట్ల‌ను హ్యాక్ చేయ‌డ‌మే. ఎవ‌రైతూ బ్యాంక్ ఖాతాల‌ను ముందుగా హ్యాక్ చేస్తారో వారికి ల‌క్ష రూపాయ‌లు బ‌హుమ‌తి కూడా ప్ర‌క‌టించింది ఆ కంపెనీ. ఇక రేస్ మొద‌లైంది. ఐదుగ‌రు ఐదు ల్యాప్‌టాప్‌లు తీసుకుని ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. కేవ‌లం 3 గంట‌ల్లోనే ఓ ప్ర‌ధాన బ్యాంకుకు సంబంధించిన వివ‌రాల‌న్నిటినీ రాబ‌ట్టి వంద‌ల కోట్ల రూపాయ‌లు తారుమారు చేసేందుకు రూట్ క‌నుగొన్నారు. అంటే అకౌంట్ల‌ను హ్యాక్ చేశారు.
కంగారు ప‌డ‌కండి. బ‌గ్స్ బౌంటీ కంపెనీ నియ‌మించుకుంది నిజ‌మైన కేటుగాళ్ల‌ను కాదు. మ‌న బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ఎంత ప‌టిష్టంగా ఉందో ఆన్‌లైన్ సెక్యూరిటీ ఎంత సుర‌క్షితంగా ఉందో తెలిపేందుకు ఈ ఐదుగురు యువ‌కుల‌ను రిక్రూట్ చేసుకుంది. ఈ కుర్రాళ్లు కేవ‌లం 3 గంట‌ల్లోనే మ‌న బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో ఉన్నఆన్‌లైన్‌ లొసుగుల‌ను బ‌య‌ట‌పెట్టారు. హ‌ర్జీత్ అనే వ్య‌క్తి ఓ ప్ర‌ధాన బ్యాంక్‌కు సంబంధించిన రౌట‌ర్‌ను హ్యాక్ చేశాడు.
బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల‌కు ఏదైనా లావాదేవీల‌పై ఏమైనా సందేహం క‌లిగినా అది రౌట‌ర్ ద్వారానే జ‌రుగుతాయి. ఇప్పుడు పాస్‌వ‌ర్డ్, రౌట‌ర్‌పై నియంత్ర‌ణ నా చేతుల్లో ఉంది. ఇప్పుడు బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల లావాదేవీలను నేను ఓ ఫేక్ సైట్ క్రియేట్ చేసుకుని అందులోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేయొచ్చు. వారు లావాదేవీలు జ‌ర‌పాలంటే లాగిన్ ఐడీ పాస్ వ‌ర్డ్‌లు త‌ప్ప‌కుండా ఇవ్వాలి గ‌న‌క‌.. ఈ ప్రాసెస్‌లో లాగిన్ ఐడీ పాస్‌వ‌ర్డ్‌ను హ్యాక్ చేసేస్తా అని హ‌ర్జీత్ తెలిపాడు.
ఇదే ప‌ద్ధ‌తిని క్రిమిన‌ల్స్ అవ‌లంబిస్తే కొన్ని ల‌క్ష‌ల కోట్లు తారుమార‌య్యే ఆస్కారం ఉంద‌ని హ‌ర్జీత్ తెలిపాడు. త‌మ వెబ్‌సైట్ ఎంత సుర‌క్షితంగా ఉందో ప‌రీక్షించి,  అన్ని ప‌ద్ద‌తుల్లో త‌మ సైట్ల‌ను హ్యాక్‌ చేసి వాటికి ప‌రిష్కారం ఇవ్వాల‌ని చాలా కంపెనీలు ఆహ్వానం పంపుతాయ‌ని హ‌ర్జీత్ పేర్కొన్నాడు.
ఇంట్లో కూర్చొనే చాలా వెబ్‌సైట్ల‌ను హ్యాక్ చేయొచ్చు కానీ అలా చేయ‌మ‌ని,  దేశ‌భ‌ద్ర‌తే త‌మ‌కు ముఖ్య‌మ‌ని క్రిమిన‌ల్ హ్యాక‌ర్స్ నుంచి మ‌న ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ట‌ప‌ర‌చ‌డ‌మే త‌మ ప‌ని అని మ‌రో కుర్రాడు జోరీ చెప్పాడు.

రాష్ట్రపతి నిలయంలో గ్రాండ్ గా ఎట్ హోం ఫంక్షన్

రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. నేతలు, ప్రముఖుల రాకతో ప్రెసిడెంట్ హోం సందడిగా మారింది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన  ప్రణబ్ … ఇవాళ సాయంత్రం రెండు రాష్ట్రాల నేతలకు విందును ఏర్పాటు చేశారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, మాజీ గవర్నర్ రోశయ్య, డిప్యూటీ సీఎం  మహమూద్ అలీ,  స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు జి.వివేక్, విపక్ష నేతలు, అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.  రాష్ట్రపతిని కలిసేందుకు ప్రముఖులు కూడా వచ్చారు. ఈ నెల 22న నగరానికి వచ్చిన రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. హైదరాబాద్ తో పాటు తిరువనంతపురం, మైసూర్, బెంగళూర్, ఏపీలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ్టితో ప్రెసిడెంట్ వింటర్ టూర్ ముగిసింది. దీంతో రేపు ఉదయం ఆయన స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లనున్నారు.

జియో కస్టమర్లకు శుభవార్త

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన కస్టమర్లకు అభయమిచ్చింది. టెలికం రంగం చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా బంపర్ ఆఫర్స్ ప్రకటించింది జియో. కస్టమర్లకు మూడునెలల పాటు ఉచిత వాయిస్, డాటా, ఎస్ ఎమ్ ఎస్ లను ప్రకటించిన సంగతి తెలిసిందే. హ్యాపి న్యూ ఇయర్ పేరుతో మరో మూడు నెలలు ఉచిత సేవలు అందిస్తున్నట్టు డిసెంబర్ మొదటి వారంలో వెల్లడించారు ముఖేష్ అంబానీ. దీనిపై ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ కంపెనీలు మండిపడ్డాయి. జియో దెబ్బకు కొన్ని కంపెనీలు మూత పడ్డాయి.
హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్  పేరుతో మరో 90 రోజులు పొడిగించిన ఆఫర్ పై ట్రాయ్ లో ఫిర్యాదు చేశాయి రైవల్ కంపెనీలు.  ఈ ఆఫర్ పొడిగింపు నిబంధనల ఉల్లంఘన కిందకు ఎందుకు రాదో వివరణ ఇవ్వాలని రిలయన్స్‌ను కోరింది టెలికం రెగ్యులేటరీ అథారిటీ(TRAI).
హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పై వివరణ ఇచ్చింది జియో. తాము ప్రకటించిన రెండు ఫ్రీ ప్యాకేజీలు వేర్వేరని తెలిపింది. వెల్ కం ఆఫర్ ముగిసినా..దానికి రీచార్జ్ చేసుకునే అవకాశం లేదని ప్రకటించింది. హ్యాపి న్యూ ఇయర్ ఆఫర్ లో ఈ అవకాశం ఉందన్నారు. కస్టమర్లు కొనసాగాలనుకుంటే.. మళ్లీ రీఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. ట్రాయ్ నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చింది జియో.