Friday, 30 December 2016

లక్ష్మీదేవిని ఉసిరికాయ దీపాలతో పూజిస్తే

శ్రీరంగేశహృత్కమలస్థితతేజోవిరాజితసురుచిరపావనాకృతిం
స్వీయాలంకృతబ్రహ్మానందభరితమనోహరాముక్తమాల్యదాం
కలికల్మషఘ్నభక్తమనోరధఫలదాయకకరుణాంతరంగిణీం
శ్రీ గోదాదేవి మమ దేహి కరావలంబం

 క్ష్మీదేవిని ఉసిరికాయ దీపాలతో పూజిస్తే ……….!!
👉�శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది. శుక్రవారం సాయంత్రం ఉత్తర భారతదేశంలో శీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు. దీనివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలు, అనుగ్రహం కలుగుతుంది అని వారి ప్రగాఢ విశ్వాసం.
👉�శంకరాచార్యులవారు విరచించిన కనకధారా స్తోత్రం పఠించిన తరువాత ఉసిరికాయ బొబ్బట్టు లేదా గుజ్జును శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించడం వల్ల శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.
👉�ఉసిరికాయ దీపంతో శ్రీమహాలక్ష్మీదేవికి హారతి సమర్పిస్తే ఇంట్లో ఉన్న దారిద్ర్యం నివారింపబడుతుంది.
👉�అష్టనిధి ప్రాప్తి కోసం కార్తీకమాసంలో ధాత్రి హవనం తరువాత ఉసిరికాయను హోమం పూర్ణాహుతికి సమర్పించండి.
👉�అప్పుల బాధనుండి బయటపడాలంటే ఉసిరికాయ దీపాన్ని శ్రీమహాలక్ష్మీదేవి చక్రానికి ఎనిమిది దిక్కులలో పెట్టి చక్రపూజ చేయాలి.
👉�ఉసిరికాయ గుజ్జు, ఉసిరికాయ పచ్చడి శ్రీమహాలక్ష్మీదేవికి నైవేద్యంగా నివేదించిన తరువాత ముత్తైదువులకు వాయనం ఇస్తే మొండి బకాయిలు వసూలు అవుతాయి.
👉�ఉసిరికాయను శ్రీలక్ష్మీదేవి ‘శ్రీ’ చక్రానికి నైవేద్యంగా నివేదించిన తరువాత దాన్ని అందరికీ పంచితే ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.
👉�శ్రీమహాలక్ష్మీదేవి కవచం లేదా లక్ష్మీదేవి హృదయ స్తోత్రాన్ని పఠించిన తరువాత ఉసిరికాయను దానం చేస్తే నిత్య దారిద్ర్యం నుండి విముక్తి పొంది లక్ష్మీ కటాక్షానికి నోచుకుంటారు.
👉�శ్రీసూక్తం పఠించిన తరువాత శ్రీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ, పాలు నైవేద్యంగా నివేదిస్తే ఇంట్లో ఖర్చు తగ్గిపోయి ఆదాయం వృద్ధి చెందుతుంది.
👉�ఉసిరికాయ చెట్టుకి ప్రతిరోజూ పూజ చేసిన తరువాత నీళ్ళు పోస్తూ నమస్కరిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.
👉�ప్రతిరోజూ రోజూ పూజా చేసే ప్రదేశంలో శంఖం ప్రక్కన ఈశాన్య దిశగా ఉసిరికాయని పెట్టినట్లయితే కుటుంబంలో ప్రశాంతత, శాంతి కలిగిస్తుంది.
👉�ఉసిరికాయ ఊరగాయ పక్కన నివశిస్తున్నవారికి లేదా బంధువుల ఇళ్ళకి పంచితే ఇంట్లోని కలహాలు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి చేకూరి ప్రశాంతవంతమైన జీవనాన్ని సాగిస్తారు.
👉�ఉసిరికాయను చేతపట్టుకుని సంగమ తీరాలలో రెండు లేదా ఎక్కువ నదులు సంగమించే స్థలంలో ప్రాయశ్చిత్త సంకల్పం చెప్పుకున్న తరువాత శివాలయంలో అర్చకులకు దానం ఇస్తే గత కర్మదోషాల నుండి విముక్తి పొందుతారు.
👉�ఉసిరికాయను కాలితో తొక్కిన వారు నిత్య దారిద్ర్యం అనుభవిస్తారు.
👉�ఉసిరికాయను డబ్బులు భద్రపరిచే స్థలంలో ఉంచినట్లయితే ధనం స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది.
👉�ఉసిరికాయ దీపాలను తులసికోట ముందు వెలిగించినట్లయితే దైవ భక్తి వృద్ధి చెందడంతో పాటు అపమృత్యువు నివారింపబడి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
👉�కన్యలు ఉసిరికాయను శుక్రవారం ముత్తైదువులకు పంచిపెట్టినట్లయితే ఇష్టమైన కోరుకున్న కోరికలు ఫలిస్తాయి.
👉�శ్రీ గణపతి హోమంలో శక్తిగణపతిని ధ్యానించి ఉసిరికాయను హోమగుండంలో వేస్తె అన్ని కార్యాలలో జయం మరియు వ్యాపారాలలో అధిక లాభాలు సిద్ధిస్తాయి.
👉�కమలాక్షి మణితో శ్రీమహాలక్ష్మీదేవి జపాన్ని చేసిన తరువాత పండు ముత్తైదువుకి (60 సంవత్సరాలు పైబడిన) తాంబూలంలో పెట్టి దానం చేస్తే శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు…..�
లోకాస్సమస్తాస్సుఖినోభవంతు ,

శబాష్ శ్రీలక్ష్మి....వాట్సప్‌ వేధింపులపై పవర్‌పంచ్!

‘నన్ను ఎప్పుడు రమ్మంటావు? నీ ‘‘రేటు’’ ఎంత’’?.... ‘‘రూ.3000 సరిపోతుందా? ఏదైనా హోటల్ రూమ్ బుక్ చేయమంటావా?’’... కేరళలలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సీఈవో, మోటివేషనల్ స్పీకర్ శ్రీలక్ష్మి సతీష్‌కు గుర్తు తెలియని ఓ వ్యక్తి నుంచి తరచూ వస్తున్న కాల్స్ ఇవి... అది మొదలు అనేక మంది మానవ మృగాల నుంచి ‘‘రేటు’’ అడుగుతూ వరుసగా కాల్స్, మెసేజ్‌లు రావడం మొదలైంది. మరొకడు రూ.25వేలు ఇస్తాను రమ్మంటూ వేధించాడు. దీంతో శ్రీలక్షి తన ఫోన్ స్విచ్చాఫ్ చేసేశారు. అయితే మరో గంటలోనే షాక్ నుంచి తేరుకుని ఎవరైతే ఫోన్లు చేశారో వారిలో ఒకరి నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆమె తన హోదా గురించి చెప్పే సరికి అతగాడు గజగజ వణికిపోయాడు. క్షమించమంటూ వేడుకున్నాడు. ఇతనొక్కడికే కాదు... సదరు వాట్సాప్ గ్రూప్‌లోని సంభాషణల ద్వారా ఈ మొత్తానికి కారణమైన మృగాడి ఫోన్ నంబర్ కూడా కనిపెట్టారామె. ఆయా సంభాషణలను స్క్రీన్‌షాట్ తీసి ఫొటోలు సంపాదించారు. ఈ గ్రూప్‌లో తన ఫోన్ నంబర్ పోస్టు చేసిన వ్యక్తి... ఓ జాతీయ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడని గుర్తించారు. బయటికి మంచి వ్యక్తిలా నటిస్తూ... నీచంగా ప్రవర్తిస్తున్న అతడిపై ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ విషయం పసిగట్టిన సదరు పార్టీ కార్యకర్తలు ఆమెకు ఫోన్ చేసి కాళ్లబేరానికి వచ్చారు. క్షమాపణ చెబుతూ.. కోర్టుబయటే రాజీ కుదుర్చుకుందామని బతిమాలారు. అయితే అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలని, బహిష్కరించినదానికి రుజువుగా పార్టీ సమావేశం మినిట్స్‌ను తనకు అప్పగించాలని శ్రీలక్ష్మి డిమాండ్ చేశారు. దీంతో ఆ యువనేత తండ్రి శ్రీలక్ష్మిని కలుసుకుని పోలీసుకు ఫిర్యాదు చేయవద్దంటూ వేడుకున్నారు. దీంతో ఏదయినా స్వచ్ఛంద సేవా సంస్థకు రూ.25 వేల విరాళం ఇచ్చి... రసీదు తనకు అప్పగించాలని శ్రీలక్ష్మి వారికి సూచించారు. అలా చేసినప్పటికీ శ్రీలక్ష్మి తన కోపం చల్లారక ఈ వృత్తాంతం మొత్తాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో... నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే 1300 మందికి పైగా షేర్ చేసుకోగా 1200 మంది ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు. 4500 మంది లైక్ చేశారు.
శనిదోష నివారణ కోసం శనివారం ఆంజనేయ స్వామి పూజ.!
శనిదోషం ఉన్నవారు సదరు దోష నివారణ కోసం ఆంజనేయ స్వామి పూజ చేస్తే ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణకథ ప్రకారం, ఓసారి శని, ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడట.
అప్పుడు శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర ఏళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది.
ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు – శనివారం, మంగళవారం మరియు గురువారం.

శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోను మందవారం అని పిలువబడే.. శనివారం శ్రేష్టమైనది. “సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః
హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః”
అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడు అని అర్ధం. శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారంనాడు రుద్రమంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధసింధూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడు అని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి, యశోవంతులైన పుత్రులు కలుగుతారు.
మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో ఏ మాసంలోనైనా కాని, కార్తీక శుద్ధ ద్వాదశినాడు కాని శనివార వ్రతం చేయాలి. శనివారవ్రత విధానం : ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని, కొత్త పాత్రలతో బయటి నుండి నీరు తెచ్చుకొని హనుమంతునికి అభిషేకం చేయాలి. అన్ని వర్ణాలవారు, స్త్రీలు కూడా చేయవచ్చు. నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి. అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యథావిధిగా జపించాలి. దీనివల్ల జనవశీకరణ కలుగుతుంది. ధనలాభం, ఉద్యోగప్రాప్తి, కారాగృహ విమోచనం లభిస్తాయి.

సాయంత్రం వేళ ఈ పనులు చేయకండి.. చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహనికి గురికాక తప్పదు..!

పూర్వం మన పెద్దవాళ్ళు ఎన్నో నియమాలు, నిబంధనలు పెట్టారు. అవి నమ్మకం ఉన్నవారు పాటిస్తారు, నమ్మకం లేని వాళ్ళు పాటించరు. అయితే సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. సాయంత్రం సమయంలో అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ.. కొన్ని సందర్భాల్లో వాళ్ల మాటలు పట్టించుకోకుండా.. నియమాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ.. మనకు ఉన్న కొన్ని అలవాట్లు.. మనపై, మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆగ్రహించేలా చేస్తాయట. హిందువుల ప్రకారం లక్ష్మీదేవిని సంతోషపెట్టినప్పుడు, మన ఇంటిని ఆమె ఆకర్షించేలా చేసినప్పుడు.. సంపద, శ్రేయస్సు ఎప్పటికీ.. మీ ఇంటిని వదిలివెళ్లదు.
సంపద, శ్రేయస్సు పొందడానికి రకరకాల మార్గాలు ఉన్నాయని మన శాస్త్రాలు, హిందూ పురాణాలు చెబుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే.. ధనం మన ఇంటికి వస్తుందని చెబుతాయి. మీకు తెలుసా? మీకున్న చిన్న చిన్న అలవాట్లే.. మీ అదృష్టాన్ని, ఆర్థిక పరిస్థితులను వెంటనే మార్చేస్తాయి. మీరు శాస్త్రాలను నమ్మేట్టు అయితే.. మీరు ఖచ్చితంగా.. కొన్ని నియమాలను పాటించాలి. మన చిన్న చిన్న అలవాట్లే.. ఆర్థిక స్తోమతపై చాలా ప్రభావం చూపుతాయి. మీకు దురదృష్టం, లక్ష్మీదేవికి ఆగ్రహం తీసుకొచ్చే అలవాట్లేంటో ఇప్పుడు చూద్దాం..
తులసిని పూజించకూడదు:

హిందూ పురాణాలు, శాస్త్రాల ప్రకారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసీని పూజించడం,ముట్టుకోవడం నిషేధం. ఇలా చేస్తే దురదృష్టం, పేదరికం మీ కుటుంబాన్ని వెంటాడుతుంది. తులసి మొక్కను పూజించడం, నీళ్లు పోయడం చాలా పవిత్రంగా భావిస్తాం. కానీ.. సాయంత్రంపూట ఇది మంచిది
నెయ్యి దీపం వెలిగించొచ్చు:

సూర్యాస్తమయం తరివాత తులసిని పూజించకూడదని బాధ పడుతున్నారా? చింతించకండి సూర్యాస్తమయం తరువాత కేవలం నెయ్యితో తులసి దగ్గర దీపం వెలిగించొచ్చు. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే.. లక్ష్మీదేవిని ఇంటికి ఆకర్షించవచ్చు.
చెత్త ఊడవకూడదు:
సూర్యాస్తమయం తరువాత చెత్త ఊడవటాన్ని అపవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవడం వల్ల.. మీ సంతోషాన్ని, అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్టే అవుతుందట. ఈ విషయం చాలా మంది ఆడవాళ్ళకు తెలిసే ఉంటుంది. అయితే తెలియని వాళ్ళు ఇక నుంచి ఈ పని చెయ్యకండి.
శృంగారం చెయ్యకూడదు:
సాయంత్రం సమయంలో.. సెక్స్ చెయ్యడం, శారీరకంగా కలవడం వంటి పనులు మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం.. సాయంత్రం సమయంలో శారీరక సంబంధం.. దురదృష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి శృంగార ప్రియులు ఇక నుంచి ఆ పనులు పగటి పూటే కానిచ్చేయండి.
నిద్రపోకూడదు:
ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలిసిన పెద్దగా పట్టించుకోరు. సూర్యాస్తమయం సమయంలో.. నిద్రపోవడం వల్ల దురదృష్టంతో పాటు, నెగటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది. అలాగే సాయంత్రం పూట నిద్రపోతే.. ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలకు.. కారణం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇక నుండి సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకండి.
తిన్న వెంటనే కడిగేయాలి:
ఆహారం తిన్న వెంటనే.. పాత్రలు శుభ్రం చేయకపోతే.. శని, చంద్రుల దుష్ప్రభావం మీ మీద పడుతుంది. అలాగే.. అన్నం తిన్నవెంటనే ప్లేట్ శుభ్రం చేయడం వల్ల.. లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద, శ్రేయస్సు పొందగలుగుతారు. కాబట్టి ఇక నుంచి తిన్న వెంటనే శుభ్రం చేసేయండి.
చదువుకోకూడదు:
ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు, సూర్యాస్తమయం సమయంలో.. చదువుకోకూడదు అట. ఎందుకంటే పురాణాల ప్రకారం సూర్యాస్తమయం సమయంలో.. చదువుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట.
ఆటలు ఆడితే చాలా మంచిది:
సాయంత్రంపూట ఇంట్లో కూర్చుని చదువుకోవడం కన్నా.. పిల్లలు బయట ఆడుకోవడం లేదా, ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం చాలా మంచిదట. ఇది ఎలాగో పిల్లలు చేసేదే. అయితే కొంతమంది తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని ఆటలకు పంపించారు. ఈ విషయం ఆ తల్లిదండ్రులు బాగా తెలుసుకోవాలి.
పరిసరాలు శుభ్రంగా ఉంచాలి:
మీ చుట్టూ ఉన్న పవిత్ర ప్రదేశాల్లో, ఉమ్మకూడదని చెప్పిన ప్రాంతాల్లో ఉమ్మేయడం వల్ల దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇలా చేయడం వల్ల.. మీ చుట్టు పక్కల ప్రాంతాలను అసహ్యంగా మార్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట. కాబట్టి ఇక నుంచి ఇలాంటి పనులు చేసే వాళ్ళు మానుకోండి.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే..
లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉన్న ఇళ్లు.. ధనంతో కలకలలాడుతూ ఉంటుంది. అయితే.. ఎక్కడైతే.. ఎక్కువ భక్తి, అనుకూలంగా ఉంటుందో.. అక్కడికి లక్ష్మీదేవి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఎప్పుడూ.. లక్ష్మీదేవిను పూజిస్తూ ఉండాలి.

వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసముంటే..?

వైకుంఠ ఏకాదశీ వ్రతం” ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకొనే శుభపర్వ దినం వైకుంఠ ఏకాదశి. దీనినే ‘ముక్కోటిఏకాదశి’ పేరుతో వైషవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు.
ఈ ద్వారం ద్వార స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదం. శ్రీమహావిష్ణువుతో బాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగివస్తారని శాస్త్రవచనం. దక్షియణాయానంలో దివంగతులైన పుణ్యాత్ములు ఈ రోజున వైకుంఠ ద్వార౦ ద్వారా స్వర్గానికి చేరుకుంటారు.
ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి. ఏకాదశి ఉపవాస తిథి విష్ణు స్వరూపమైనది. ఈ వైకుంఠ ఏకాదశీనే ‘పుత్రదా ఏకాదశి’ అని అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. దశమి రాత్రి కూడా భుజించకూడదు.
ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే పారణం (భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు.
అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి రోజున లభిస్తుంది

తొలి వైకుంఠ ఉత్తర ద్వారా దర్శన చరిత్ర

మాసానాం మార్గశీర్షోహం’ అని శ్రీకృష్ణపరమాత్మ ‘భగవద్గీత’ విభూతియోగంలో చెప్పాడు. అంటే, ‘మాసాలలో మార్గశిర మాసాన్ని నేను’ అని అర్థం. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఈమాసం, ప్రకృతిని అంటా సౌందర్యమాయం చేస్తుంది. ఈ మార్గశిర మాసం హేమంత ఋతువులో మెదటినెల. దీనినే సారమానాన్ని అనుసరించి ధనుర్మాసం అని, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అన్నారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే, మన పెద్దలు సంవత్సరకాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయణం అని రెండు భాగాలుగా విభజించారు. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు ఉత్తమమైనదనీ, ఆకాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అలాగే ఉత్తరాయణం దేవతలకు పగటికాలమైతే, దక్షిణాయణం రాత్రికాలమని చెప్పబడుతోంది. విష్ణుమూర్తి రాత్రికాలమైన దక్షిణాయనంలో ఆషాడ శుద్ధ ఏకాదశినుండి నాలుగునెలలపాటు యోగ నిద్రలో గడుపుతూ లోకం తీరుతెన్నులను గమనిస్తుంటాడు. అందుకే ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘శయన ఏకాదశి’ (తొలిఏకాదశి) అని అన్నారు. తొలి ఏకాదశికి యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణువు కార్తీక శుద్ద ఏకాదశి రోజున మేల్కొంటాడు. అందుకే దీనినిన్ ‘ఉత్థాన ఏకాదశి’ అని అన్నారు.
తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడేది ‘ఏకాదశి’. ఏకాదశి అంటే తిథులలో పదకొండవది. ప్రతి నెలలో శుక్లపక్షంలో ‘ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తుంటాయి. ఆవిధంగా సంవత్సరంలో ఇరవైనాలుగు ఏకాదశులు.’ చాంద్రమానం ప్రకారం, మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులోస్తాయి. ప్రతిఏకాదశి ఓపర్వదినమనే చెప్పొచ్చు. అసలు ఏకాదశి ఆవిర్భావం కొన్ని విచిత్రమైన పరిస్థితుల మధ్య ఏర్పడింది. పూర్వం మృదుమన్యుడు అనే రాక్షసుడు, శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసి, ఆ స్వామిని మెప్పించి స్త్రీ పురుషుల నుండి తనకు మరణం లేకుండా ఉండేట్లుగా వరాన్ని పొందాడు. వరాన్ని అనుగ్రహించిన శివుడు అయోనిజ అయిన స్త్రీ చేతిలో మరణం తప్పదని చెప్పాడు. అయోనిజ జన్మించడం సాధారణం కాదని గ్రహించిన మృదుమన్యుడు, వరగర్వంతో సకల లోకాలను ఆక్రమించాడు. అతని ధాటికి దేవతలంతా పారిపోగా, వారి దేవేరులంతా ఒక ఉసిరిచెట్టు తొర్రలో దాక్కున్నారు. ఆ తొర్ర చాలా ఇరుకుగా ఉన్నందువల్ల అప్పుడు జరిగిన ఒరిపిడి నుంచి ఓ కన్య ఉదయించింది. ఇంతలో దేవతలను వెదుక్కుంటూ వచ్చిన మృదుమన్యుడు చెట్టు తొర్రను సమీపించాడు. అతడు చెట్టు తొర్రలో వెదకడానికి ప్రయత్నిస్తుండగా, దేవేరుల ఒరిపిడి వలన పుట్టిన అయోనిజ అయిన కన్య చెట్టుతొర్ర నుంచి బయటకు వచ్చి మృదుమన్యుడిని సంహారించింది. ఆ కన్యక పేరే ‘ఏకాదశి’, అప్పట్నుంచి ప్రతి పక్షంలో పదకొండవ రోజున ఆమెను పూజించడం ఆచారమైంది.
ఏకాదశి మహాత్యాన్ని తెలిపే అనేక కథలు మన పురాణాలలో ఉన్నాయి. ఆ కథలలో రుక్మాంగదుని కథ ఒకటి. పూర్వం రుక్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ, ప్రజలను కంటి పాపలవలె చూసుకుంటుండేవాడు. ప్రజలు కూడ ధర్మవర్తనులై జీవిస్తుండే వారు. ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది. పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలసి ఓ పన్నాగం పన్నాడు. ఆ పథకం ప్రకారం, రంభ మోహినీ వేషధారిణియై, రుక్మాంగదుని వ్రతభ్రష్టుని చేయాలి. ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళ్తుండగా, మార్గమధ్యంలో తారసపడిన మోహినీ రూపంలోనున్న రంభను చూసిన రుక్మాంగదుడు మొహావేశపరవశుడై తనను వివాహమాడమని బ్రతిమాలాడు. అందుకు ఆమె ఎల్లవేళలా తన వశవర్తియై ఉంటేనే పెండ్లాడతానని నిబంధన పెట్టింది. అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. రుక్మాంగదుని వ్రతబ్రష్టున్ని చేయడమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశినాడు తనతో దాంపత్యసుఖాన్ని పంచుకోమని చెప్పింది. అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకించాడు. అయితే దానికి ప్రతిగా అతని కుమారుని సంహరించమని ఆమె కోరింది. ఏకాదశివ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగదుడు కన్నకొడుకును చంపడానికి నిర్ణయించుకోగా, అతని భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై, జరిగిన మోసాన్ని అతనికి వివరించి, రుక్మాంగదునికి మోక్షాన్ని ప్రసాదించాడు.
ఇక ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి పర్వం సుఖసంతోషాలను అందించే పర్వంగా భక్తజనులచే ఎంతో గొప్పగా జరుపబడుతుంటుంది. మన తెలుగువాళ్ళు ఈ పండుగను ‘ముక్కోటి ఏకాదశి’ అని పిలుచుకుంటూఉంటారు. ఈ రోజున విష్ణువు మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చాడనీ, అందుకే ఈ పండుగ ‘ముక్కోటి ఏకాదశి’ అని పిలువబడుతోంది అంటారు. స్వామి భూలోకానికి దిగి రావడం వెనుక ఓ ఉదంతం ఉంది. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా మురాసురుడు అనే రాక్షసుడు రాజ్యపాలన చేస్తూ, దేవతలను విపరీతంగా పీడిస్తుండేవాడు. అతని హింసను తట్టుకోలేక పోయిన దేవతలు, వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. దేవతల అభ్యర్థనలను ఆలకించిన విష్ణువు వైకుంఠాన్నుంచి దిగి వచ్చి మురాసురుని సంహరించాడు. ఆ సంహారం ఏకాదశినాడు జరిగినందువల్ల, ఈ రోజుకి ‘వైకుంఠ ఏకాదశి’ అని పేరు వచ్చింది

వైకుంఠ ఏకాదశి రోజున తులసి పూజను మరిచిపోకండి..

వైకుంఠ ఏకాదశి రోజున తులసి పూజను మరిచిపోకండని పండితులు సూచిస్తున్నారు. మహావిష్ణువుకు తులసిదళాలు ఎంతో ప్రీతికరమైనవి. వివిధరకాల పూలతో స్వామిని పూజించడం వలన కలిగే ఫలితం, కేవలం తులసిదళాలతో పూజించడం వలన కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా ‘ముక్కోటి ఏకాదశి’ రోజున స్వామివారిని అనేక రకాల పూలతో అలంకరించడం, అర్చించడం జరుగుతుంది. ఆ రోజున పూజలోను ‘తులసి’ విశిష్టమైన పాత్రనే పోషిస్తుంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం, ఉపవాస జాగరణలనే నియమాలను పాటించడంతో పాటు తులసిదళాలతో పూజించడం శుభప్రద ఫలితాలను ఇస్తుంది.
ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేకపోయినవాళ్లు, వైష్ణవ సంబంధమైన ఆలయాలను దర్శించడం వలన … తులసిదళాలతో స్వామివారిని అర్చించడం వలన కూడా పుణ్యఫలరాశి పెరుగుతుందనీ, మోక్షానికి అవసరమైన అర్హత ప్రసాదించబడుతుందని చెప్పబడుతోంది.
అందువలన వైకుంఠ ఏకాదశిగా పిలవబడుతోన్న ముక్కోటి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు జరిపే పూజలో తులసిదళాలు ఉండేలా చూసుకోవడం మరచిపోకూడదని పండితులు అంటున్నారు.