Thursday, 29 December 2016

తప్పు రష్యాది కాదు.. కంప్యూటర్లది: ట్రంప్‌

ఫ్లోరిడా: కంప్యూటర్ల హ్యాకింగ్‌ వ్యవహారంలో అమెరికా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలను భావి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తప్పుబట్టారు. రష్యా, అమెరికాలను ఈ వివాదం నుంచి దూరంగా ఉంచాలన్నారు. మనం దీనిని ఇంతటితో వదిలి ముందుకెళ్లాలని ఆయన సూచించారు. అసలు రష్యా హ్యాకర్లు డెమొక్రటిక్‌ పార్టీ కంప్యూటర్లు, వ్యక్తుల నుంచి సమాచారం సేకరించి తనకు మద్దతుగా ఆన్‌లైన్‌లో పోస్టు చేశాయన్న ఇంటెలిజెన్స్‌ వర్గాల నివేదికలపై ట్రంప్‌ అనుమానం వ్యక్తం చేశారు. రష్యాపై అమెరికా అంక్షలు విధించాలని ప్రయత్నిస్తోందన్న వార్తలపై ఆయన్ను ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. అసలు మన జీవితాల్ని కంప్యూటర్లు జటిలం చేశాయని ట్రంప్‌ అన్నారు. ఒక కంప్యూటర్‌ జీవితకాలంలో ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరన్నారు.
ట్రంప్‌ ప్రస్తుతం క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల నిమిత్తం ఫ్లొరిడాలోని మార్‌ ఎ లాగో రిసార్ట్‌లో ఉన్నారు. ఇదే సమయంలో ఆయన తన కార్యనిర్వాహక బృందం ఎంపికల కోసం ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నారు.

మోదీ ప్రకటనకు 3గంటల ముందే..

నవంబర్‌ 8న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన దేశంలో పెను సంచలనం సృష్టించింది. దేశంలో నల్లధనం, అవినీతి, ఉగ్రవాదం నిర్మూలనే ధ్యేయంగా పెద్ద నోట్లను రద్దుచేసినట్లు చేసిన మోదీ ప్రకటనకు కేవలం మూడు గంటల ముందే ఆర్బీఐ ఆమోదం తెలిపిందట. ఈ విషయాన్ని ఆర్బీఐ స్వయంగా వెల్లడించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎంతమంది స్వాగతించారు, ఎందరు వ్యతిరేకించారు అనే అంశం తాము రికార్డు చేయలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌ సంస్థ సమాచార హక్కుచట్టం కింద అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆర్బీఐ పైవిధంగా స్పందించింది.
దేశంలో సుమారు 86శాతం చలామణిలో ఉన్న కరెన్సీని రద్దుచేస్తున్నట్టుఅకస్మాత్తుగా ప్రధాని చేసిన ప్రకటనతో ప్రజలు పలు అవస్థలు ఎదుర్కొన్న నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తాయి. సరైన సంసిద్ధత లేకుండానే ఈ నిర్ణయం చేశారంటూ కొన్ని విపక్షాలు సైతం ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయగా, ఆర్బీఐ స్వయంప్రతిపత్తి, ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ నాయకత్వంపైనా అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. నవంబర్‌ 8న జరిగిన రిజర్వు బ్యాంకు బోర్డు సమావేశంలో రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై సాయంత్రం 5.30గంటలకు నిర్ణయం తీసుకున్నట్టు రిజర్వు బ్యాంకు వెల్లడించింది. అయితే ఈ సమావేశంలో రిజర్వుబ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌, ముగ్గురు డిప్యూటీ గవర్నర్లైన ఆర్‌. గాంధీ, ఎస్‌.ఎస్‌. ముంద్రా, ఎన్‌.ఎస్‌. విశ్వనాథన్‌ సహా పలువురు ఆర్థిక నిపుణులు, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ కూడా ఉన్నట్టు పేర్కొంది.
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఎన్ని రూ.2000, రూ.500 కొత్త నోట్లు రోజుకు ముద్రిస్తున్నారనే అంశాలను వెల్లడించలేదు. నోట్లరద్దు నిర్ణయం జరిగి 50 రోజులు గడుస్తున్నప్పటికీ నగదు కొరత ఇప్పటివరకు తీరలేదు. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు.

jayalalitha

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సందేహాలున్నాయంటూ మద్రాస్ హైకోర్టులో వేసిన పిటిషన్స్ ఇవాళ విచారణకొచ్చాయి. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు ఆమె మృతిపై ఉన్న సందేహాలకు మరింత ఊతమిచ్చాయి. జయలలిత మృతిపై తనకు సందేహాలున్నాయని జస్టిస్ వైద్యనాథన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఆయన చెప్పారు. జయలలిత అనుమానాస్పద మృతిపై సందేహాలు తొలగేందుకు ఆమె మృతదేహానికి రీపోస్ట్‌మార్టమ్ ఎందుకు చేయకూడదనే పిటిషనర్ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలా చేస్తే వాస్తవాలు బయటికొచ్చే అవకాశమున్నట్లు న్యాయస్థానం భావిస్తోంది. అయితే రీపోస్ట్‌మార్టానికి సంబంధించి కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు.

 మీడియాలో కూడా జయలలిత మృతిపై అనేక సందేహాలు వ్యక్తపరుస్తూ వార్తలొచ్చాయని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. ఇదిలా ఉంటే కొద్దిసేపటి క్రితమే శశికళ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. జయలలిత తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు వేరే వారి చేతుల్లోకి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కోర్టు వ్యక్తం చేసిన అనుమానాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి

Wednesday, 28 December 2016

తొలి వైకుంఠ ఉత్తర ద్వారా దర్శన చరిత్ర

మాసానాం మార్గశీర్షోహం’ అని శ్రీకృష్ణపరమాత్మ ‘భగవద్గీత’ విభూతియోగంలో చెప్పాడు. అంటే, ‘మాసాలలో మార్గశిర మాసాన్ని నేను’ అని అర్థం. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఈమాసం, ప్రకృతిని అంటా సౌందర్యమాయం చేస్తుంది. ఈ మార్గశిర మాసం హేమంత ఋతువులో మెదటినెల. దీనినే సారమానాన్ని అనుసరించి ధనుర్మాసం అని, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అన్నారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే, మన పెద్దలు సంవత్సరకాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయణం అని రెండు భాగాలుగా విభజించారు.
ఉత్తరాయణం పుణ్యకార్యాలకు ఉత్తమమైనదనీ, ఆకాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అలాగే ఉత్తరాయణం దేవతలకు పగటికాలమైతే, దక్షిణాయణం రాత్రికాలమని చెప్పబడుతోంది. విష్ణుమూర్తి రాత్రికాలమైన దక్షిణాయనంలో ఆషాడ శుద్ధ ఏకాదశినుండి నాలుగునెలలపాటు యోగ నిద్రలో గడుపుతూ లోకం తీరుతెన్నులను గమనిస్తుంటాడు. అందుకే ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘శయన ఏకాదశి’ (తొలిఏకాదశి) అని అన్నారు. తొలి ఏకాదశికి యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణువు కార్తీక శుద్ద ఏకాదశి రోజున మేల్కొంటాడు. అందుకే దీనినిన్ ‘ఉత్థాన ఏకాదశి’ అని అన్నారు.
తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడేది ‘ఏకాదశి’. ఏకాదశి అంటే తిథులలో పదకొండవది. ప్రతి నెలలో శుక్లపక్షంలో ‘ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తుంటాయి. ఆవిధంగా సంవత్సరంలో ఇరవైనాలుగు ఏకాదశులు.’ చాంద్రమానం ప్రకారం, మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులోస్తాయి. ప్రతిఏకాదశి ఓపర్వదినమనే చెప్పొచ్చు. అసలు ఏకాదశి ఆవిర్భావం కొన్ని విచిత్రమైన పరిస్థితుల మధ్య ఏర్పడింది. పూర్వం మృదుమన్యుడు అనే రాక్షసుడు, శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసి, ఆ స్వామిని మెప్పించి స్త్రీ పురుషుల నుండి తనకు మరణం లేకుండా ఉండేట్లుగా వరాన్ని పొందాడు. వరాన్ని అనుగ్రహించిన శివుడు అయోనిజ అయిన స్త్రీ చేతిలో మరణం తప్పదని చెప్పాడు. అయోనిజ జన్మించడం సాధారణం కాదని గ్రహించిన మృదుమన్యుడు, వరగర్వంతో సకల లోకాలను ఆక్రమించాడు. అతని ధాటికి దేవతలంతా పారిపోగా, వారి దేవేరులంతా ఒక ఉసిరిచెట్టు తొర్రలో దాక్కున్నారు. ఆ తొర్ర చాలా ఇరుకుగా ఉన్నందువల్ల అప్పుడు జరిగిన ఒరిపిడి నుంచి ఓ కన్య ఉదయించింది. ఇంతలో దేవతలను వెదుక్కుంటూ వచ్చిన మృదుమన్యుడు చెట్టు తొర్రను సమీపించాడు. అతడు చెట్టు తొర్రలో వెదకడానికి ప్రయత్నిస్తుండగా, దేవేరుల ఒరిపిడి వలన పుట్టిన అయోనిజ అయిన కన్య చెట్టుతొర్ర నుంచి బయటకు వచ్చి మృదుమన్యుడిని సంహారించింది. ఆ కన్యక పేరే ‘ఏకాదశి’, అప్పట్నుంచి ప్రతి పక్షంలో పదకొండవ రోజున ఆమెను పూజించడం ఆచారమైంది.
ఏకాదశి మహాత్యాన్ని తెలిపే అనేక కథలు మన పురాణాలలో ఉన్నాయి. ఆ కథలలో రుక్మాంగదుని కథ ఒకటి. పూర్వం రుక్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ, ప్రజలను కంటి పాపలవలె చూసుకుంటుండేవాడు. ప్రజలు కూడ ధర్మవర్తనులై జీవిస్తుండే వారు. ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది. పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలసి ఓ పన్నాగం పన్నాడు. ఆ పథకం ప్రకారం, రంభ మోహినీ వేషధారిణియై, రుక్మాంగదుని వ్రతభ్రష్టుని చేయాలి
. ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళ్తుండగా, మార్గమధ్యంలో తారసపడిన మోహినీ రూపంలోనున్న రంభను చూసిన రుక్మాంగదుడు మొహావేశపరవశుడై తనను వివాహమాడమని బ్రతిమాలాడు. అందుకు ఆమె ఎల్లవేళలా తన వశవర్తియై ఉంటేనే పెండ్లాడతానని నిబంధన పెట్టింది. అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. రుక్మాంగదుని వ్రతబ్రష్టున్ని చేయడమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశినాడు తనతో దాంపత్యసుఖాన్ని పంచుకోమని చెప్పింది. అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకించాడు. అయితే దానికి ప్రతిగా అతని కుమారుని సంహరించమని ఆమె కోరింది. ఏకాదశివ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగదుడు కన్నకొడుకును చంపడానికి నిర్ణయించుకోగా, అతని భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై, జరిగిన మోసాన్ని అతనికి వివరించి, రుక్మాంగదునికి మోక్షాన్ని ప్రసాదించాడు.
ఇక ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి పర్వం సుఖసంతోషాలను అందించే పర్వంగా భక్తజనులచే ఎంతో గొప్పగా జరుపబడుతుంటుంది. మన తెలుగువాళ్ళు ఈ పండుగను ‘ముక్కోటి ఏకాదశి’ అని పిలుచుకుంటూఉంటారు. ఈ రోజున విష్ణువు మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చాడనీ, అందుకే ఈ పండుగ ‘ముక్కోటి ఏకాదశి’ అని పిలువబడుతోంది అంటారు. స్వామి భూలోకానికి దిగి రావడం వెనుక ఓ ఉదంతం ఉంది. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా మురాసురుడు అనే రాక్షసుడు రాజ్యపాలన చేస్తూ, దేవతలను విపరీతంగా పీడిస్తుండేవాడు. అతని హింసను తట్టుకోలేక పోయిన దేవతలు, వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. దేవతల అభ్యర్థనలను ఆలకించిన విష్ణువు వైకుంఠాన్నుంచి దిగి వచ్చి మురాసురుని సంహరించాడు. ఆ సంహారం ఏకాదశినాడు జరిగినందువల్ల, ఈ రోజుకి ‘వైకుంఠ ఏకాదశి’ అని పేరు వచ్చింది

సంతానం లేని వారికి దివ్య ఔష‌ధం… అంజీర్ పండు..!

అంజీర్‌… ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా డ్రై ఫ్రూట్స్ రూపంలోనే దొరుకుతున్నాయి. అయితే నిజానికి ఈ పండ్లు సాధార‌ణ రూపంలో కూడా ఉంటాయి. ఎలా తిన్నా అంజీర్ వ‌ల్ల మ‌న‌కు బోలెడు ఉప‌యోగాలు ఉన్నాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో కీల‌క పోష‌కాలు అంజీర్ ద్వారా మన‌కు అందుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. చిన్నా, పెద్దా అంద‌రూ ఈ పండ్ల‌ను నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు. రోజుకు రెండు అంజీర్ పండ్ల‌ను తిన‌డం అల‌వాటు చేసుకుంటే దాంతో ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఇట్టే న‌యం చేసుకోవ‌చ్చ‌ని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ క్ర‌మంలో అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


1. పిల్ల‌లు లేని వారు అంజీర్ పండ్ల‌ను త‌మ రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. మెగ్నిషియం, మాంగ‌నీస్‌, జింక్ ఖ‌నిజాలు సంతాన సాఫ‌ల్య‌త‌ను పెంచుతాయి. స్త్రీ, పురుషులిద్ద‌రూ ఈ పండ్ల‌ను తింటే దాంతో వారికి సంతానం క‌లిగే అవ‌కాశం చాలా ఎక్కువ‌గా ఉంటుంది.
2. ఈ కాలంలో అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య అంద‌రినీ వేధిస్తోంది. దీనికి స‌రైన మందు అంజీర పండు. రోజూ తింటే అధిక ర‌క్త‌పోటు అదుపులోకి వ‌స్తుంది. పొటాషియం, సోడియం, పుష్క‌లంగా ఉంటాయి క‌నుక అంజీర్‌ను తింటే అధిక ర‌క్త‌పోటును త‌గ్గిస్తాయి.
3. ఫైబ‌ర్ అధిక‌గా ఉండడం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ శుభ్ర‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం ఉన్న వారు రోజూ ఉద‌యం, సాయంత్రం అంజీర పండును తింటే ఆ స‌మ‌స్య ఇక‌పై బాధించ‌దు. ప్ర‌ధానంగా ఇది పిల్ల‌ల‌కు చాలా మంచిది. దీంతోపాటు ఇత‌ర జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లైన గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటివి త‌గ్గిపోతాయి.
4. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నేడు చాలా మందిని బాధిస్తోంది. అలాంటి వారు నిత్యం రెండు అంజీర్ పండ్ల‌ను భోజనానికి ముందు తిన్న‌ట్ట‌యితే వారిలో ర‌క్తం బాగా ప‌డుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగీ వంటి విష జ్వ‌రాల బారిన ప‌డి ప్లేట్‌లెట్లు త‌గ్గిన వారికి ఈ పండ్ల‌ను తినిపిస్తే వెంట‌నే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.
5. నిత్యం అంజీర్ పండ్ల‌ను తింటుంటే గుండె సంబంధ స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. అంజీర్ పండ్ల‌లో ఉండే పెక్టిన్ అనే ప‌దార్థం శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాల‌ను తొల‌గిస్తుంది. ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది.
6. అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఇప్పుడు అధిక‌మైంది. ఈ క్ర‌మంలో అంజీర్ పండ్ల‌ను రెండు పూట‌లా భోజనానికి ముందు తింటే దాంతో పొట్ట నిండిన భావ‌న క‌లుగుతుంది. దీని వ‌ల్ల ఎక్కువ‌గా ఆహారం తీసుకోవ‌డం త‌గ్గుతుంది. ఫ‌లితంగా బ‌రువు కూడా త‌గ్గుతారు. అంతేకాదు అంజీర్‌లో ఉండే పోష‌కాలు మ‌న శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా త‌గ్గిస్తాయి.
7. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌య్యే ప‌దార్థాలు నాశన‌మ‌వుతాయి.
8. అంజీర్ పండ్లు మ‌ధుమేహం ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. భోజనానికి ముందు వీటిని తింటే అనంత‌రం ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు అంత‌గా పెర‌గ‌వు.
9. ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అంజీర్ పండ్ల‌ను తింటే ఆ అనారోగ్యాల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
10. అంజీర్ పండ్ల‌లో కాల్షియం కూడా పుష్క‌లంగానే ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢ‌మ‌వుతాయి. ఎముక‌లు విరిగి ఉన్న వారికి వీటిని పెడితే ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.
11. గొంతు నొప్పి ఉన్న‌వారు అంజీర్ పండ్ల‌ను తింటే వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ద‌గ్గు కూడా త‌గ్గుతుంది.
12. జ్వ‌రం, చెవి నొప్పి, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఉంటే అంజీర్ పండ్ల‌ను తినాలి. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
  These are the types of dry fruits largely dorukutunnayi Fig. However, the fact that these fruits are a common form. Uses of Fig boledanni we have to eat. Many of the key nutrients needed by our body to produce Fig. Also alienate many health problems. Big and small can eat all the fruits and fearless. He had the habit of eating two fruits per day Fig Many health problems can be treated quickly with medical experts say. Fig order to explain the benefits of eating fruits of this kind we see now.




Fig 1. They are the children who are part of the fruit to their daily diet. Magnesium, manganese, zinc minerals increase Fertility. Women, men, and those who eat this fruit is very high risk children.
2. During this period, all the harassing problem of high blood pressure. It is the drug of choice anjira fruit. Diet high blood pressure is under control. Potassium, sodium, there are plenty of high blood pressure and reduce the consumption of Fig.
3. Due to the high fiber empty the digestive system. Constipation is the daily morning and evening anjira eaten the fruit of the problem is no longer annoying. It is very good for the children. In addition, gas and other digestive-related problems, Acidity, such as a reduced indigestion.
4. anemia problem affecting many people today. They regularly take the blood of those who tinnattayite before eating the fruit of the fig. Hemoglobin levels. Malaria, typhoid, dengue fever infects as vicious as those lower down the platelets and platelets immediately fed the fruit to grow.
5. Fig regularly eats fruits also alienate cardiac problems. Fig fruits pectin, a substance in the body that removes waste materials. Purifies the blood.
6. The problem of overweight also increased now. Fig fruit before a meal is consumed in the process, two putala the stomach feel full. This is largely due to reduced food intake. As a result of a fall in weight. He also reduce the bad cholesterol in our body the nutrients in Fig.
7. To strengthen the body's immune system. Cancer causing substances are destroyed.
8. Fig fruits diabetes will benefit greatly. Blood sugar levels before and after consumption of a meal will not grow much.
9. People with respiratory problems such as asthma relief from illnesses that can be consumed fruits in Fig.
10. Fig fruits are also rich in calcium. Drdhamavutayi bones by eating them. If they attach to the bones as those with broken bones.
Fig 11. Those with throat pain can be relieved as soon as the fruit is consumed. Reduces cough.
12. fever, ear pain, if there are problems, such as stomach pain, eat fruits Fig. This is available to relieve the problems.

ద్రవిడ్‌, లక్ష్మణ్‌లే అత్యుత్తమం

తన బౌలింగ్‌ ఎదుర్కొన్న వాళ్లలో రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌లే అత్యుత్తమ బ్యాట్స్‌మెనని పాకిస్థాన్‌ కళంకిత ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ అన్నాడు. ‘‘ద్రవిడ్‌, లక్ష్మణ్‌ సాంకేతికంగా చాలా మంచి బ్యాట్స్‌మెన్‌. ఆఫ్‌స్టంప్‌ నుంచి బంతిని అలవోకగా లెగ్‌సైడ్‌కు కొట్టగలరు. వాళ్లకు బౌలింగ్‌ చేయడం పెద్ద సవాల్‌’’ అని ఆసిఫ్‌ చెప్పాడు. ‘‘విరాట్‌ కోహ్లి కూడా సాంకేతికంగా బలమైన బ్యాట్స్‌మన్‌. అతడికి బౌలింగ్‌ చేయడం బౌలర్లకు కష్టమే’’ అని అన్నాడు

నాకొద్దీ పదవి.. ఐఓఏకు స్పష్టం చేసిన కల్మాడీ ఎదురుదాడికి దిగిన అభయ్‌ సింగ్‌ చౌతాలా సంఘానికి కేంద్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీస్‌ దిల్లీ

నకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) జీవిత కాల గౌరవ అధ్యక్ష పదవి ఇవ్వడంపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో సురేశ్‌ కల్మాడీ వెనక్కి తగ్గాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఈ పదవి చేపట్టలేనంటూ ఐఓఏకు కల్మాడీ లేఖ రాశాడు. ‘‘నన్ను జీవిత కాల అధ్యక్ష పదవితో గౌరవించాలనుకున్నందుకు ఐఓఏకు ధన్యవాదాలు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పదవిని నేను అంగీకరించడం సబబు కాదని భావిస్తున్నా. నా పేరు స్వచ్ఛంగా బయటికి వస్తుందని నమ్మకంతో ఉన్నా. అప్పటి వరకు ఈ గౌరవాన్ని నేను స్వీకరించలేను’’ అని కల్మాడీ ఈ లేఖలో పేర్కొన్నాడు. ఐఓఏ అధ్యక్షుడిగా ఉండగా బయటపడ్డ కామన్వెల్త్‌ కుంభకోణంలో కల్మాడీపై తీవ్ర ఆరోపణలు రావడం, దీనికి సంబంధించిన కేసులో కల్మాడీ పది నెలల జైలు శిక్ష కూడా అనుభవించిన నేపథ్యంలో అతడికి ఐఓఏ పదవి కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కల్మాడీ లాగే ఐఓఏ జీవిత కాల అధ్యక్ష పదవికి నామినేట్‌ అయిన అభయ్‌ సింగ్‌ చౌతాలా మాత్రం తన విషయంలో జరుగుతున్నది అనవసర రాద్దాంతం అన్నాడు. తన గురించి కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డాడు. ‘‘గోయల్‌ స్పందన చూసి నాకు ఆశ్చర్యమేసింది. నా మీద క్రిమినల్‌, అవినీతి కేసులున్నట్లు గోయల్‌ చెప్పాడు. కానీ నాపై క్రిమినల్‌ కేసులేమీ లేవు. ఉన్నదల్లా రాజకీయ కేసు మాత్రమే. క్రీడల మంత్రిగా తన బాధ్యతల్ని నిర్వర్తించడంలో గోయల్‌ విఫలమయ్యాడు. అతను తన పనిని సక్రమంగా నిర్వర్తిస్తే ఒలింపిక్స్‌ లాంటి టోర్నీల్లో మన పతకాల సంఖ్య పెరిగేది. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడి వివాదాల్లో చిక్కుకోవడం మాని, గోయల్‌ తన పనిపై దృష్టిసారిస్తే మేలు’’ అని చౌతాలా అన్నాడు. ఐఓఏ జీవిత కాల అధ్యక్ష పదవిని చేపట్టేందుకు తనకు అర్హత ఉందని.. తాను ఒలింపిక్‌ క్రీడల కోసం చాలా చేశానని చౌతాలా పేర్కొన్నాడు.
గుర్తింపు రద్దు చేస్తాం..: మరోవైపు కల్మాడీ, చౌతాలాను జీవిత కాల అధ్యక్షులుగా నామినేట్‌ చేయాలన్న ఐఓఏ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేంద్ర క్రీడల శాఖ.. షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఐఓఏ గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. ‘‘ఇది ఐఓఏ రాజ్యాంగానికి విరుద్ధం. మేం దీన్ని అంగీకరించం. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు పదవులివ్వాలన్న నిర్ణయంపై తీవ్రంగా నిరాశ చెందాం. క్రీడల్లో మేం పారదర్శకత కోరుకుంటున్నాం. వీళ్లిద్దరినీ తప్పించడమో.. వాళ్లే రాజీనామా చేయడమో జరిగే దాకా మేం ఐఓఏతో సంబంధాలు సాగించబోం’’ అని క్రీడల మంత్రి విజయ్‌ గోయల్‌ స్పష్టం చేశాడు. కల్మాడీ, చౌతాలాను జీవిత కాల అధ్యక్షులుగా నామినేట్‌ చేయాలన్న ఐఓఏ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటన రాగా.. సంఘం అసోసియేట్‌ ఉపాధ్యక్షుడు నరిందర్‌ బత్రా మాత్రం మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం గమనార్హం. వారిపై పడ్డ మచ్చ తొలగిన తర్వాతే ఈ పదవుల్ని స్వీకరించాలని అతను స్పష్టం చేశాడు.