Wednesday, 28 December 2016

స్మార్ట్‌.. ఒక వ్యసనం నిద్ర లేచింది మొదలు దానితోనే 53 శాతం కొనుగోళ్లు ఆన్‌లైన్‌లో డేటా కోసం వైఫై పైనే ఆధారపడటం లేదు 4జీ యే కీలకంగా మారుతోంది ఆర్థిక లావాదేవీలకూ ఇవే కీలకం డెలాయిట్‌ గ్లోబల్‌ మొబైల్‌ కన్జూమర్‌ సర్వే

రోజును మొదలు పెట్టేది స్మార్ట్‌ఫోన్‌తో.. ముగించేదీ దాని పరిశీలనతోనే.. అంతేనా రోజంతా కూడా వేర్వేరు కార్యకలాపాల కోసం, తాజా సమాచారం సేకరించేందుకు వాటిపైనే ఆధారపడుతున్నారు.. ఒకరకంగా స్మార్ట్‌ఫోన్‌ భారతీయుల్లో అత్యధికులకు ‘వ్యసనం’గా మారింది. మొబైల్‌ వినియోగ అలవాట్లపై ప్రపంచవ్యాప్తంగా సర్వే నిర్వహించిన డెలాయిట్‌ గ్లోబల్‌ మొబైల్‌ కన్జూమర్‌ తన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది.
స్మార్ట్‌ఫోన్లను ఇ కామర్స్‌ పోర్టళ్లలో 53 శాతం మంది కొనుగోలు చేస్తున్నారని, వీటి కోసం సంప్రదాయ దుకాణాలకు వెళ్తున్న వారు 39 శాతం మందే అని సర్వే వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్లు డేటా కోసం గతంలో వైఫై పై అధికంగా ఆధారపడే వారని, 4జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చాక, మొబైల్‌ డేటానే ఎక్కువగా వినియోగిస్తున్నామని 59 శాతం మంది తెలిపారు. 4జీ డేటా వినియోగం వచ్చే ఏడాదిలో మరింతగా పెరిగి, దేశీయంగా ఇదే కీలకంగా మారనుందని వివరించింది. రాబోయే 12 నెలల్లో 4జీ డేటా కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటామని 45 శాతం మంది తెలిపారని సర్వే పేర్కొంది. రాబోయే 12 నెలల్లో కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసుకుంటామని 63 శాతం మంది తెలిపారు.
దినచర్య ప్రారంభం, ముగింపు ఫోన్‌తోనే
స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్లలో అత్యధికులు రోజూ నిద్ర లేవగానే ఫోన్‌ను పరిశీలించుకోవడంతోనే దినచర్య ఆరంభిస్తారని, నిద్రకు ఉపక్రమించేముందు కూడా ఫోన్‌ పరిశీలనే చేస్తారని తేలింది.
* నిద్ర లేవగానే ఫోన్‌ను 5 నిమిషాల్లోపే పరిశీలించేవారు 61% మంది అయితే, 30 నిమిషాల్లోపు చూసుకునేవారు 88% మంది. గంటలోగా పరిశీలించుకునే వారు 96% మంది కావడం గమనార్హం. నిద్రకు ఉపక్రమించే ముందు 15 నిమిషాల పాటు ఫోన్‌ చూసుకుంటామని 74 శాతం మంది తెలిపారు.
పనులకూ అంతరాయం
స్మార్ట్‌ఫోన్‌ వినియోగం ఎంతలా పెరిగిందంటే, రోజువారీ పనులకు ఆటంకం కలిగించే స్థాయికి చేరింది. తరచు తనిఖీ చేసుకునేలా, వ్యక్తిగత సమయాన్ని హరించే స్థాయికి స్మార్ట్‌ఫోన్‌ చేరిందని డెలాయిట్‌ టచ్‌ తోమత్సు ఇండియా భాగస్వామి నీరజ్‌ జైన్‌ పేర్కొన్నారు.
ఆర్థిక లావాదేవీలకు వినియోగం
పెద్దనోట్ల రద్దు అనంతరం ఆర్థిక కార్యకలాపాలకు డిజిటల్‌ సంస్థలు కీలకమయ్యాయి. కొనుగోళ్లు, చెల్లింపులకు ఆన్‌లైన్‌, మొబైల్‌ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకోసం ఫీచర్‌ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లకు మారుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. డేటా చౌకగా లభించడం కూడా ఇందుకు ఉపకరిస్తోంది. అందువల్ల స్మార్ట్‌ఫోన్‌ వినియోగం మరింత పెరగనుంది. బ్యాంక్‌ ఖాతాలో నగదు నిల్వ పరిశీలన-బిల్లుల చెల్లింపునకు 54 శాతం మంది, నగదు బదిలీకి 38 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారు.
* దుకాణాల్లో చెల్లింపునకు మొబైల్‌ వాడేందుకు 29 శాతం మంది వెనుకాడుతున్నారు. అదనపు ప్రయోజనం లేనందున వాడటం లేదని 19 శాతం మంది చెబితే, క్రెడిట్‌కార్డులు వాడితే రివార్డు పాయింట్లు వస్తాయని 15 శాతం మంది తెలిపారు.
ఉదయాన్నే ఫేస్‌బుక్‌, వాట్సాప్‌
అత్యధికులు ఉదయాన లేవగానే సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వంటివే చూసుకుంటారు. అనంతరం వ్యక్తిగత ఇ మెయిళ్లు, సంక్షిప్త సందేశాలు (ఎస్‌ఎంఎస్‌) పరిశీలిస్తున్నారు. ఎక్కువసార్లు ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ చూసుకునేవారు 74 శాతం మంది అయితే, సామాజిక మాధ్యమాలు తనిఖీ చేసుకునేవారు 64 శాతం, మెయిల్‌ పరిశీలించుకునేవారు 63 శాతంగా ఉన్నారు. కనీసం వారానికి ఒకసారైనా మెసేజింగ్‌ యాప్‌లు వినియోగించేవారు 80 శాతం మంది ఉన్నారు.
ల్యాప్‌టాప్‌ల కంటే ఇవే ఎక్కువ
ల్యాప్‌టాప్‌ల కంటే స్మార్ట్‌ఫోన్లే అత్యధికులకు చేరువయ్యాయని నివేదిక పేర్కొంది. 71 శాతం మంది దగ్గర ల్యాప్‌టాప్‌లుంటే, 86 శాతం మంది దగ్గర స్మార్ట్‌ఫోన్లున్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే, టాబ్లెట్‌ల కొనుగోలుపై ప్రజలకు ఆసక్తి తగ్గింది. రోజువారీ కార్యకలాపాలకు, సన్నిహితులతో అనుసంధానమై ఉండేందుకు, తాజా సమాచారం కోసం తరచు స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్న/తనిఖీ చేసుకునే ధోరణి ఎక్కువమందికి ఒక వ్యసనంలా మారింది.
31 దేశాల్లో అభిప్రాయ సేకరణ
మొబైల్‌ వినియోగ అలవాట్లపై ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాల్లోని 31 దేశాలకు చెందిన 53,000 మంది, దేశీయంగా 2,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి, విశ్లేషణ చేసినట్లు సంస్థ తెలిపింది. ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్న దేశంలోని 8 నగరాలలో 18-54 ఏళ్ల వారి నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు వెల్లడించింది.

సోయాతో వీర్యానికి ఎసరు!

పురుషులకు హెచ్చరిక! ఆహారంలో సోయా స్థాయిలు ఎక్కువైతే తండ్రయ్యే అవకాశాలకు గండి పడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. సోయాలోని రసాయనాలు వీర్యాన్ని దెబ్బ తీస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. స్పెయిన్‌లోని వాలెన్సియా వర్సిటీ, బ్రిటన్‌లోని ఐవీఐ ఫెర్టిలిటీ కేంద్రం నిపుణులు సంయుక్తంగా దీన్ని నిర్వహించారు. 25 మంది పురుషులు దీనిలో పాల్గొన్నారు. దాదాపు రెండేళ్లపాటు వీరి ఆహారంలో సోయా స్థాయిలు ఎక్కువగా ఉండేలా చూశారు. సోయా పైపొరల్లో ఉండే బిస్ఫెనాల్‌-ఏ రసాయన ప్రభావాన్ని గుర్తించేందుకు దీన్ని చేపట్టారు. అయితే వూహించని రీతిలో ఫైటోఈస్ట్రోజన్‌గా పిలిచే మరో రసాయన ప్రభావం దీనిలో వెలుగు చూసింది. ఇది వీర్య కణాల ఉత్పత్తి వేగాన్ని తగ్గిస్తోందని, క్రోమోజోమ్‌ల నిష్పత్తిపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తోందని బయటపడింది. ఇటీవల కాలంలో మాంసానికి ప్రత్యామ్నాయంగా సోయా ఉత్పత్తులను విరివిగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ లో భారీగా తగ్గనున్న ఫోన్ ధరలు


కొత్త ఫోన్ లు కొనుగోళు చేసేవారికి శుభవార్త. తెలంగాణ లో ఫోన్ ల ధరలు ఇకపై భారీగా తగ్గనున్నాయి.

రాష్ట్రంలో వ్యాట్‌ చట్ట సవరణ బిల్లును బుధవారం శాసనసభ ఏకగ్రీవంగా అమోదించింది.

ఈ బిల్లులో మొబైల్ ఫోన్లపై పన్నును భారీగా తగ్గించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ లపై పన్ను14.5 శాతం గా ఉంది. దీనిని ఇకపై భారీగా తగ్గించి 5 శాతానికి తీసుకొచ్చారు.

బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అందరూ ఫోన్ లను వినియోగించాలనే ఉద్దేశంతో ఫోన్లపై ఉన్న పన్నును  14.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు

నమ్మక ద్రోహం ? జయలలిత, శశికళ రహస్య అగ్రిమెంట్ లీక్

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు శశికళ రాజకీయాల్లో రావడం అసలు ఇష్టం లేదని, అందుకే గతంలో జయలలిత నెచ్చెలి శశికళను దూరం పెట్టారని తాజాగా వెలుగు చూసింది. తండ్రితో సమానం అయిన చో రామస్వామి (తుగ్లక్ పత్రిక వ్యవస్థాపకుడు) దగ్గర జయలలిత 2011లో జరిగిన అసలు రహస్యాలు చో రామస్వామికి చెప్పడంతో ఆ విషయాలు మొత్తం బయటకు వచ్చాయి. 2011లో జయలలిత ముఖ్యమంత్రి అయిన తరువాత పోయెస్ గార్డెన్ లో ఉన్న నెచ్చెలి శశికళ కుటుంబ సభ్యులను బయటకు పంపించేసిన విషయం తెలిసిందే. శశికళ వస్తే అన్నాడీఎంకే అంతం చూస్తారు: తుగ్లక్! తరువాత శశికళ కాళ్ల మీద పడటంతో జయలలిత కొంత కరుణించారు. శశికళను మాత్రం జయలలిత దగ్గరకు తీసుకున్నారు. అయితే శశికళ భర్త నటరాజన్, వారి కుటుంబ సభ్యులను మాత్రం పోయెస్ గార్డెన్ నుంచి మెడపట్టి బయటకు నెట్టేశారు.
అదే సంవత్సరంలో పోయెస్ గార్డెన్ కు వెళ్లిన చో రామస్వామితో జయలలిత అసలు విషయాలు చెప్పారు. తను ఎంతో నమ్మిన శశికళ, ఆమె కుటుంబ సభ్యులు తన అంతం చూడటానికి ప్రయత్నించారని, అందుకే వారిని బయటకు పంపించేశానని జయలలిత చెప్పారంట. శశికళ తనకు స్నేహితురాలు అయినందున ఆమెను మాత్రం దగ్గరకు తీసుకున్నానని జయలలిత వివరించారంట. శశికళ షరతులు అంగీకరించడంతోనే తాను దగ్గరకు తీసుకున్నానని జయలలిత అసలు విషయం చెప్పారంట. అజిత్ దెబ్బ: చేతులు ఎత్తేసిన హీరో, నేనురాను, శశికళకు షాక్ ఆ షరతులు కూడా జయలలిత చో రామస్వామికి చెప్పారు. శశికళ అగ్రీమెంట్ లో రాసి ఇచ్చిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తాను జీవితంలో ఎప్పుడూ రాజకీయాల జోలికిరానని, తన కుటుంబ సభ్యులను సైతం రాజకీయాలకు దూరంగా పెడుతానని శశికళ అగ్రిమెంట్ రాసి ఇచ్చారంట.
అంతే కాకుండా అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా తాను పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని, ఎలాంటి రాజకీయాలు మాట్లాడనని జయలలిత మీద ఒట్టు వేసి అగ్రిమెంట్ రాసి ఇచ్చారని చో రామస్వామికి చెందిన తుగ్లక్ పత్రిక అన్ని విషయాలు బయటపెట్టేసింది. అందుకే జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జరిగిన మూడు శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో శశికళ ధైర్యం చేసి పోటి చెయ్యలేకపోయారని తుగ్లక్ పత్రిక గుర్తు చేసింది. జయలలిత మరణించిన తరువాత శశికళ అన్నాడీఎంకే పార్టీ చీఫ్ కావాలని ఆశ పెట్టుకున్నారని, ఇప్పుడు జయలలితకు ఇష్టం లేని పని చేస్తే అన్నాడీఎంకే నాయకులకు చెడ్డపేరు వస్తుందని తుగ్గక్ పత్రిక గుర్తు చేసింది. సీన్ రివర్స్: శశికళకు చుక్కలు చూపిస్తున్న అనుచరులు! శశికళ చేతికి పార్టీ పగ్గాలు వస్తే అది తమిళనాడు ప్రజలకు మంచిది కాదని, రోజురోజుకు పార్టీ పరువు పోతుందని, చివరికి అన్నాడీఎంకే ఏమవుతుందో అని ఆ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉందని తుగ్లక్ పత్రిక తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఇప్పటికైనా అన్నాడీఎంకే నాయకులు జయలలిత మాటను గౌరవించి చిన్నమ్మ భజన చెయ్యడం మానుకోవాలని తుగ్గక్ పత్రిక హితవుపలికింది. రాజకీయ నాయకుల అసలు బండారం బయట పెడుతూ వస్తున్న తుగ్లక్ పత్రికకు కొన్ని శతాబ్దాలుగా తమిళనాడులో మంచి గుర్తింపు ఉంది.

మరిదితో రొమాన్స్ చేస్తూ.. భర్తకి అడ్డంగా దొరికిన భార్య

Sudarshan caught his wife arpitha and brother adarsh doing romancing after he left for office.
రానురాను మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. కొడుకు సమానమైన సొంత మరిదితోనే ఓ వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుని.. తన భర్తకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకి చెందిన సుదర్శన్‌కి అర్పితతో రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. కొన్ని నెలలకిందట ఈ దంపతులు బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఉద్యోగం కోసం సుదర్శన్ వేట ప్రారంభించగా.. ఓ ప్రైవేట్ నిర్మాణ కంపెనీలో అతనికి గుమస్తాగా జాబ్ వచ్చింది. కొన్నాళ్లు ఈ దంపతులు హాయిగానే తమ దాంపత్య జీవితాన్ని గడిపారు. అయితే.. ఎప్పుడైతే సుదర్శన్ తమ్ముడు ఆదర్ష్ వీరి ఇంటికి వచ్చాడో.. అప్పటినుంచే అసలు సమస్య మొదలైంది. కొన్ని రోజుల కిందటే హైదరాబాద్‌కి వచ్చిన అతడు.. అన్నయ్య, వదినల దగ్గరే ఉండసాగాడు.
మొదట్లో అంత సవ్యంగానే సాగింది కానీ.. భార్య అర్పిత, తమ్మడు ఆదర్ష్ ప్రవర్తనలో మార్పు రావడాన్ని సుదర్శన్ గమనించాడు. దాంతో.. వాళ్లిద్దరిపై అతనికి అనుమానం వచ్చింది. రానురాను వాళ్లు మరింత క్లోజ్‌గా మూవ్ అవ్వడం చూసి.. సుదర్శన్ అనుమానం మరింత బలపడింది. వీరిమధ్య ఎలాంటి బంధం ఉందోనని కనిపెట్టడం కోసం.. ఓరోజు ఒక పథకం వేశాడు. తాను ఆఫీస్‌కి వెళుతున్నానని చెప్పి బయటికి వెళ్ళాడు. అతను వెళ్ళిపోవడంతో.. ఆదర్ష్, అర్పితలు శృంగారంలో మునిగిపోయారు.
వదిన, మరిది ఇద్దరూ మాంచి రసపట్టులో ఉన్న సమయంలో.. కిటికీలోంచి సుదర్శన్ తొంగిచూశాడు. అంతేకాదు.. తన ఫోన్‌లో మొత్తం తతంగం రికార్డ్ చేశాడు. వెంటనే వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని.. కుటుంబసభ్యులకు విషయం తెలియజేశాడు. చివరికి సుదర్శన్ విడాకులు తీసుకున్నాడు.

ఖైదీ’ ‘యూ అండ్ మీ’ పాట టాక్ : మెస్మరైజ్ చేసిన దేవీశ్రీప్రసాద్ మెలోడీ

khaidi no 150 movie unit has released another single song you and me. This time Devi Sri has give melodius tunes and mesmerized everyone
సడెన్‌గా ఆడియో వేడుకని క్యాన్సిల్ చేసిన ‘ఖైదీ నెంబర్ 150’ మూవీ యూనిట్.. వరుసగా ఒక్కో పాటకు నాలుగైదు రోజుల గ్యాప్‌తో విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పటికే ‘అమ్మడు లెట్స్ డు కుమ్మడు’ అనే మాస్ సాంగ్‌తోపాటు ‘సుందరి’ అనే రొమాంటిక్ పాటని విడుదల చేసిన ఈ చిత్రబృందం.. తాజాగా ‘యూ అండ్ మీ’ అనే మెలోడియస్ పాటని రిలీజ్ చేసింది.
ఈ పాట విషయానికొస్తే.. దీనికి దేవిశ్రీ వినసొంపైన ట్యూన్స్ అందించాడు. ‘ఇకపై ఓన్లీ యూ అండ్ మీ’ అనే సాగే ఈ పాట లిరిక్స్ కూడా అర్థవంతంగానే ఉన్నాయి. మధ్యమధ్యలో అతను అందించిన ప్రత్యేకమైన ట్యూన్స్ ఈ పాటకి హైలైట్‌గా నిలిచాయి. గత రెండు పాటలతో పోల్చుకుంటే.. ఈ మూడో పాటకి దేవి కాస్త డిఫరెంట్ ట్యూన్సే అందించాడు. చూస్తుంటే.. ఈ పాట సినిమాలోనే హైలైట్‌గా నిలిచేలా కనిపిస్తోంది.
గత రెండు పాటలకు విశేష స్పందన రావడంతోపాటు యూట్యూబ్‌లో అవి అత్యధిక వ్యూస్‌తో రికార్డ్ సృష్టించడంతో.. మూడోపాట కూడా అదే రేంజులో సక్సెస్ అవుతుందని యూనిట్ ఆశిస్తోంది. ఈ పాట ఎలా ఉందో.. ఓసారి విని మీ అభిప్రాయం క్రింద కామెంట్ బాక్సుల్లో వెల్లడించండి.

శశికళతో శ్రీదేవి రహస్య మంతనాల వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా ?

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. ముఖ్యమంత్రి జయలలిత మరణంతో పార్టీపై ఆధిపత్యం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలే జరుగుతున్నాయి. తమిళ రాజకీయాలన్నీ శశికళ చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళను కలుసుకున్నారు ప్రముఖ నటి శ్రీదేవి. అమ్మ మరణం తరువాత శశికళను ఆమె చెన్నైకి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ మేరకు ఎ.ఐ.డి.ఎమ్.కె. వర్గాలు ఒక ఫొటోను మీడియాకు విడుదల చేశాయి. జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్ లో శశికళను శ్రీదేవి కలుసుకున్నారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అయితే ఈ భేటీకి సంబంధించి ఎలాంటి వివరాలను పార్టీ వర్గాలు బయటకి చెప్పడం లేదు. మర్యాదపూర్వంగానే శ్రీదేవి ఆమెను కలుసుకున్నారు అంటున్నారు. శశికళను కలుసుకున్న తరువాత ఎంజీఆర్ మెమోరియల్ కు వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు శ్రీదేవి నివాళులు అర్పించారు.



శశికళతో శ్రీదేవి భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. శ్రీదేవి బాలనటిగా ఉన్నప్పుడు జయలలిత సినిమాల్లో నటించారనీ దాంతో అమ్మపై ఉన్న గౌరవాభిమానాలు కారణంగానే శ్రీదేవి నివాళులు అర్పించడానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాని ఆమె రాజకీయరంగ ప్రవేశం గురించే కలిసిందని రాజకీయ వర్గాల విశ్వసనీయ సమాచారం. మొత్తానికి ఈ భేటీకి ఏదైనా రాజకీయ ప్రాధాన్యం ఉందంటారా..?