Wednesday, 28 December 2016

గౌతమీపుత్ర శాతకర్ణిపై అల్లు అర్జున్ ‘సంక్రాంతి కామెంట్’!


నేటి తరం హీరోల్లో బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. వరుస సక్సెస్‌లతో మంచి జోరు చూపిస్తున్నాడు అల్లు అర్జున్. సరైనోడు తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో డీజే-దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్నాడు. ఇటీవలే బన్నీకి కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. ఆ ఆనందంలోనే మునిగి తేలుతున్నాడు ప్రస్తుతం అతడు.


 తాజాగా ఓ సిమెంట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎంపికయ్యాడు. ఆ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు మంగళవారం వైజాగ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. అక్కడ తనను కలిసిన కొందరు అభిమానులతో బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి పరోక్షంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 గురించి అడిగిన అభిమానులతో.. ‘ఈ సారి సంక్రాంతి మనదే’ అని వ్యాఖ్యానించినట్టు టాక్.
ఆ మాట నందమూరి ఫ్యాన్స్‌కి తెలియడంతో.. అంటే బాలకృష్ణ శాతకర్ణి సినిమా కన్నా ఖైదీ నంబర్ 150నే సూపర్ హిట్ అన్న అర్థంలోనే బన్నీ ఆ వ్యాఖ్యలు చేశాడని అనుకుంటున్నారు. దీంతో బన్నీపై నందమూరి అభిమానులు మరింత పదునైన వ్యాఖ్యలను ఎక్కు పెట్టేందుకు సిద్ధమవుతున్నారట. కాగా, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను డైరెక్ట్ చేస్తున్న క్రిష్.. సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా ‘ఖబడ్దార్’ అన్న పదాన్ని వాడాడు.
దానిపై అతడు వివరణ ఇచ్చినా.. బన్నీ ఎందుకు ఇలాంటి కామెంట్ చేయాల్సి వచ్చిందని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారట. కాగా, అంతకు ముందు కూడా పవన్ కల్యాణ్‌నుద్దేశించి ‘చెప్పను బ్రదర్’ అని బన్నీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యతో బన్నీ.. కొంత పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైన విషయమూ తెలిసిందే. మరి తాజా కామెంట్ ఎంత వరకు దారితీస్తుందో చూడాలి. బన్నీ ఏమన్నాడో క్రింద వీడియో లో మీరు కూడా చూడండి.

ర‌చ్చ ర‌చ్చ‌గా మారిన క్రిష్ ఖ‌బ‌డ్దార్ డైలాగ్‌

బాల‌య్య 100వ సినిమాలో డైరెక్ట‌ర్ క్రిష్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఈ సినిమా ఆడియో వేడుక‌లో క్రిష్ ప్ర‌సంగం త‌ర్వాత చివ‌ర్లో ఖ‌బ‌డ్దార్ అనే హెచ్చ‌రిక డైలాగ్ వ‌దిలారు. క్రిష్ చేసిన ఈ డైలాగ్ ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద కాంట్ర‌వ‌ర్సీల‌కు దారితీసింది. సంక్రాంతి బరిలో తమ సినిమాతో పోటీ పడుతున్న ‘ఖైదీ నెంబర్‌ 150’ని ఉద్దేశించే క్రిష్‌ అలా అన్నాడని పలు ఛానళ్లు కథనాలను ప్రసారం చేశాయి.
క్రిష్ డైలాగ్స్‌పై కాంట్ర‌వ‌ర్సీ క‌థ‌నాలు మీడియాలో రావ‌డంతో మెగా ఫ్యాన్స్ సైతం ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నారు. ఈ వివాదం పెద్ద‌ది అయ్యే సూచ‌న‌లు క‌నిపించ‌డంతో క్రిష్ దీనిపై స్పందించాడు. తాను ఖ‌బ‌డ్దార్ అన్న ప‌దానికి కొత్త అర్థాలు వెత‌క‌వ‌ద్ద‌ని సూచించాడు.




ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు వారి త‌ర‌పున తాను ఆ మాట అన్నాన‌ని… తెలుగు సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు స‌రైన గౌర‌వం ద‌క్క‌డం లేద‌నే బాధ‌తో తాను ఖ‌బ‌డ్దార్ అన్నాన‌ని ఆయ‌న తెలిపారు. ఈ డైలాగ్ తెలుగు వారిని గౌర‌వించ‌ని దేశం, ప్ర‌పంచానికే వ‌ర్తిస్తుందే త‌ప్ప వ్య‌క్తుల‌కు కాద‌ని స్ప‌ష్టం చేశాడు.
త‌న‌కు మెగా హీరోల‌తో ఉన్న అనుబంధాన్ని కూడా క్రిష్ తెలిపాడు. త‌న రెండో సినిమా బ‌న్నీతో వేదం చేశాన‌ని, నాలుగో సినిమా కంచెను వ‌రుణ్ తేజ్‌తో తీశాన‌ని..ఇక తాను సినిమాల్లోకి రాక‌ముందు నుంచే చెర్రీ త‌న‌కు మంచి ఫ్రెండ్ అని చెప్పాడు. తాను సినిమాల్లోకి వ‌చ్చేందుకు చిరంజీవి గారు స్ఫూర్తి అని ద‌య‌చేసి ఈ ఖ‌బ‌డ్దార్ డైలాగ్‌కు మెగా ఫ్యామిలీకి లింక్ పెట్టి త‌న‌కు, మెగా ఫ్యామిలీకి మ‌ధ్య కంచె నిర్మించ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశాడు.

నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం

1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ
2.కాలాత్మక పరమేశ్వర రామ
3.శేషతల్ప సుఖనిద్రిత రామ
4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
5.చందకిరణ కులమండన రామ
6.శ్రీమద్దశరధనందన రామ
7.కౌసల్యాసుఖవర్ధన రామ
8.విశ్వామిత్రప్రియధన రామ
9.ఘోరతాటకఘాతక రామ
10.మారీచాదినిపాతక రామ
11.కౌశిక మఖసంరక్షక రామ
12.శ్రీ మదహల్యో ద్దారక రామ
13.గౌతమమునిసంపూజిత రామ
14.సురమునివరగణసంస్తుత రామ
15.నవికధావితమృదుపద రామ
16.మిధిలాపురజనమోదక రామ
17.విదేహమానసరంజక రామ
18.త్రయంబకకార్ముకభంజక రామ
19.సితార్పితవరమాలిక రామ
20.కృతవైవాహిక కౌతుక రామ
21.భార్గవదర్పవినాశక రామ
22.శ్రీ మాధయోద్యా పాలక రామ
23.ఆగణితగుణగణభూషిత రామ
24.అవనితనయాకామిత రామ
25.రాకాచంద్రసమానన రామ
26.పితృవాక్యాశ్రితకానన రామ
27.ప్రియగుహావినివేధితపద రామ
28.తత్ క్షాళితనిజమృదుపద రామ
29.భరద్వాజముఖానందక రామ
౩౦.చిత్రకూటాద్రినికేతన రామ
31.దశరధసంతతచింతిత రామ
32.కైకేయీతనయార్థిత రామ
౩౩.విరచితనిజపాదుక రామ
34.భారతార్పిత నిజపాదుక రామ
35.దండకవనజనపావన రామ
36.దుష్టవిరాధవినాశాన రామ
37.శరభoగసుతీక్షార్చిత రామ
38.అగస్త్యానుగ్రహవర్ధిత రామ
39.గృద్రాధిపగతిదాయక రామ
40.పంచవటీతటసుస్థిత రామ
41.శూర్పణఖార్తి విధాయక రామ
42.ఖరదూషణముఖసూదక రామ
43.సీతాప్రియహరిణానుగ రామ
44.మరిచార్తికృదాశుగా రామ
45.వినష్ట సేతాన్వేషక రామ
46. గృధ్రాధిపగతిదాయక రామ
47.శబరిదత్తఫలాశన రామ
48.కబంధభాహుచ్చేధన రామ
49.హనుమత్సేవితనిజపద రామ
50.నతసుగ్రివభిష్టద రామ
51.గర్వితవాలివిమోచక రామ
52. వానరదుతప్రేషక రామ
53.హితకరలక్ష్మణసంయుత రామ
54.కపివరసంతతసంస్మృత రామ
55.తద్గతి విఘ్నద్వంసక రామ
56.సీతాప్రాణాదారక రామ
57.దుష్టదశాన ధూషిత రామ
58. శిష్టహనూమద్భూషిత రామ
59.సీతూధితకాకావన రామ
60.కృతచూడామణిదర్శన రామ
61. కపివరవహనశ్వాసిత రామ
62.రావణధనప్రస్థిత రామ
63.వనరసైన్యసమావృత రామ
64.శొశితసరిధీశార్థిత రామ
65.విభిషణాభయదాయక రామ
66. సర్వతసేతునిభందక రామ
67.కుంబకర్ణ శిరశ్చెదక రామ
68.రాక్షససంఘవిమర్ధక రామ
69.ఆహిమహిరావణ ధారణ రామ
70.సంహ్రృతదశముఖరావణ రామ
71.విభావముఖసురసంస్తుత రామ
72.ఖస్థితధశరధవీక్షిత రామ
73.సీతాదర్శనమోదిత రామ
74.అభిషిక్త విభీషణ రామ
75.పుష్పకయానారోహణ రామ
76.భరధ్వజాభినిషేవణ రామ
77.భరతప్రాణప్రియకర రామ
78.సాకేత పురీభుషన రామ
79.సకలస్వీయసమానత రామ
80.రత్నలసత్పీఠాస్థిత రామ
81.పట్టాభిషేకాలంకృత రామ
82.పార్థివకులసమ్మానిత రామ
83.విభీషణార్పితరంగక రామ
84.కీశకులానుగ్రహకర రామ
85.సకలజీవసంరక్షక రామ
86.సమస్తలోకోద్ధారక రామ
87.అగణితమునిగాణసంస్తుత రామ
88.విశ్రుత రాక్షసఖండన రామ
89.సితాలింగననిర్వృత రామ
90.నీతిసురక్షితజనపద రామ
91.విపినత్యాజితజనకజ రామ
92.కారితలవణాసురవధ రామ
93.స్వర్గతశంబుక సంస్తుత రామ
94.స్వతనయకుశలవనందిత రామ
95.అశ్వమేధక్రతుదీక్షిత రామ
96.కాలావేదితసురపద రామ
97.ఆయోధ్యజనముక్తిద రామ
98.విధిముఖవిభుదానందక రామ
99.తేజోమయనిజరూపక రామ
100.సంసృతిబన్ధవిమోచక రామ
101.ధర్మస్థాపనతత్పర రామ
102.భక్తిపరాయణముక్తిద రామ
103.సర్వచరాచరపాలక రామ
104.సర్వభవామయవారక రామ
105.వైకుంఠలయసంస్ఠీత రామ
106.నిత్యనందపదస్ఠిత రామ
107.కరుణా నిధి జయ సీతా రామ
108.రామరామ జయరాజా రామ
రామ రామ

కాస్త నవ్వండి సార్‌ : ముఖ్యమంత్రులతో సానియా

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన విందుకు ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. తన వద్దకు వచ్చిన అతిధులను పలకరించి వారితో ఫొటోలు దిగే పనిలో రాష్ట్రపతి ఉండటంతో ముఖ్యమంత్రులు ఇద్దరూ కొద్దిగా పక్కకు వచ్చి లోకాభిరామాయణం మాట్లాడుకొన్నారు. 20 నిమిషాల పాటు ఇద్దరూ నిలబడే కబుర్లు చెప్పుకొన్నారు.
 
ముఖ్యమంత్రులు మాట్లాడుకొంటున్నప్పుడు క్రీడాకారిణులు సానియా మీర్జా, పీవీ సింధు, కోచ్ గోపీచంద్ వారి వద్దకు వచ్చారు. ‘మీరిద్దరూ ఒకేచోట చాలా తక్కువగా ఉంటారు. మీ ఇద్దరితో కలిసి మేం సెల్ఫీ తీసుకొంటాం’ అని సానియా కోరగానే సీఎంలిద్దరూ నవ్వుతూ అంగీకరించారు. ఫొటో తీసేటప్పుడు నవ్వండి సార్‌ అని సానియా విజ్ఞప్తి చేసినప్పుడు ఇద్దరూ గట్టిగా నవ్వేశారు.

రామ్మోహన్‌నాయుడు పెళ్లి చేసుకోబోయేది ఈ అమ్మాయినే..

ఏపీ రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ అయిన టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు వచ్చే ఏడాది ఓ ఇంటివారు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఆమె ఏం చదువుకుంది అనే విషయాలపై రాష్ట్ర రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఆమె పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చిన్న కుమార్తె శ్రీ శ్రావ్య అని మాత్రమే అందరికీ తెలుసు. అయితే భరత నాట్యంలో ఆమె ఎక్స్‌పర్ట్ అని చాలామందికి తెలియదు. విశాఖ పట్నంలోని గాయత్రి విద్యాపరిషత్ కాలేజీలో శ్రావ్య ఇంజనీరింగ్ పూర్తి చేసింది. చిన్నతనం నుంచి చదువులో ఆమె ముందుండేదని, ఇంజనీరింగ్‌లో కూడా మంచి మార్కులు సాధించిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
 
శ్రావ్య, రామ్మోహన్ జంటను చూసిన వారు జోడీ అదిరిందని చెబుతున్నారు. అమ్మాయికి, అబ్బాయికి అన్ని విషయాల్లోనూ బాగా సెట్ అయిందని అంటున్నారు. బండారు ఫ్యామిలీతో కింజారపు కుటుంబానికి ముందు నుంచే సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో ఎర్రన్నాయుడితో కలిసి బండారు సత్యనారాయణమూర్తి పనిచేశారు. ఇప్పుడు సత్యనారాయణ మూర్తి కుమారుడు, రామ్మోహన్‌నాయుడు మంచి మిత్రులు. ఈ నేపథ్యంలో శ్రావ్యను రామ్మోహన్ తొలి చూపులోనే ఇష్టపడ్డాని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో టీడీపీకి బలమైన శక్తిగా ఉన్న కింజారపు ఎర్రన్నాయుడి అకాల మరణం తర్వాత రామ్మోహన్‌నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రాజకీయ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. పెద్దల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుంటూ తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. పార్లమెంటులో తన ప్రసంగాలతో సీనియర్ల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. టీడీపీ యూత్ బ్రిగేడ్‌లో కీలక సభ్యుడని సీనియర్ నేతలు రామ్మోహన్ ఆటపట్టిస్తుంటారు. సంబంధాలు చూడమంటావా?.. అంటూ కలిసినప్పుడల్లా జోకులేస్తుంటారు. ఇప్పుడు టీడీపీ ఫ్యామిలీలోని ఎమ్మెల్యే కుమార్తెతోనే రామ్మోహన్‌నాయుడి వివాహం జరగనుంది.

ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తున్న ‘సౌదీఅరేబియా 18 నిజాలు’


సౌదీఅరేబియా.. అక్కడ చేసేది మంచిపనైనా.. చెడు పనైనా.. ప్రపంచ దృష్టిని ఆకర్షించడం మాత్రం ఖచ్చితం. అత్యంత పకడ్బందిగా అక్కడ అమలు చేసే చట్టాలు, దేశ విశిష్టతలు ప్రతీది ప్రత్యేకమే. సౌదీఅరేబియాకు చెందిన 18 వాస్తవాలు తెలిస్తే నోరెళ్లబెట్టి, కనురెప్పలు పైకి ఎగరేస్తూ ఔనా..? అంటారు.

1. మంత్రాలు, చేతబడి విద్యలు సౌదీలో నిషేదం. ఇలాంటి విద్యలు ఏ రూపంలో ప్రదర్శించినా నేరంగా పరిగణిస్తారు.
 
2. ఒక వ్యక్తి చావుకి కారణమైన నిందితుడు చట్టాల ప్రకారం ఎదుర్కోవలసిన శిక్షల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ‘దియ్యా’ చట్ట ప్రకారం మరణించిన వ్యక్తి కుటుంబానికి చెందిన వారు నిందితుడిని క్షమించి, అతడి నుంచి పరిహారాన్ని పొందేందుకు అంగీకరిస్తే నిందితుడికి కేసుల నుంచి విముక్తి లభిస్తుంది.
 
3. ‘దియ్యా’ చట్టప్రకారం నిందితుడు ఒక పురుషుని మరణానికి చెల్లించే పరిహార మొత్తంలో కేవలం సగం మాత్రమే స్త్రీ మరణానికి చెల్లించాల్సి ఉంటుంది.
 
4. సౌదీ వ్యక్తులు ‘దియ్యా’ చట్టం ద్వారా ఇన్సూరెన్స్‌ పొందే అవకాశం ఉంది. భవిష్యత్తులో వేరోకరి మరణానికైనా కారణమైనప్పుడు తాను ఎంత చెల్లించడానికి సిద్ధమవుతాడో అదే స్థాయి మొత్తాన్ని అతడు చనిపోయినప్పుడు దియ్యా పరిహారంగా పొందే అవకాశమే ‘దియ్యా ఇన్సూరెన్స్’.
 
5. మహిళలు డ్రైవింగ్ చేయడం సౌదీఅరేబియాలో నిషిద్ధం. చట్టరిత్యానేరం.
 
6. జనాలు తిరిగే రోడ్లపై కారుని ఒకవైపు వంచుతూ రెండు చక్రాలపై కారుని నడపడం, వేగంగా వెళుతున్న కారుపై నిలబడడం సౌదీలో ఎక్కువగా ఆడుతున్న, ఆదరణ కలిగిన క్రీడ.
 
7. ఉప్పగా ఉండే సముద్రపు నీటిని అత్యధికంగా మంచినీటిగా మారుస్తున్న దేశంగా  సౌదీఅరేబియా గుర్తింపుపొందింది.
 
8. ప్రపంచలోనే అత్యంత ఎత్తైన భవనం ‘కింగ్‌డామ్’ని సౌదీలోనే నిర్మించనున్నారు. 2018 నాటికి భవన నిర్మాణం పూర్తి కానుంది.
 
9. మహిళలకు ఓటు హక్కుని కల్పించిన చివరి దేశంగా సౌదీఅరేబియా గుర్తించారు. అక్కడి మహిళలు మొదటిసారిగా 21 ఆగష్టు 2015న ఓటు వేశారు.
 
10. దేశ రాజధాని రియాద్ ప్రపంచలోనే అతిపెద్ద ఒంటెల మార్కెట్‌గా గుర్తింపుపొదింది. అక్కడ రోజుకు కనీసం 100 ఒంటెల అమ్మకం జరుగుతుంది. 
 
11. సౌదీలోని ‘ఘవార్ ఫీల్డ్స్’ ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ క్షేత్రంగా గుర్తించారు. ఇప్పటివరకు 75 మిలియన్ బారెల్ ఆయిల్‌ ఇక్కడి నుంచి వెలికితీశారు.
 
12. వైశాల్యంలో 13వ అతిపెద్ద దేశంగా సౌదీ గుర్తింపు పొందింది. దేశ భూభాగంలో 95 శాతం ఏడారే కావడం విశేషం.
 
13. 2012లో సుమారు 3.16 మిలియన్ల మంది హజ్‌కు వెళ్లగా కేవలం 1.7 మిలియన్ల ముస్లింలు మిగతాదేశాల నుంచి హజరయ్యారు.
 
14. ఒక్క నది కూడా ప్రవహించని అతిపెద్ద దేశంగా సౌదిఅరేబియాకు గుర్తింపు ఉంది.
 
15. సౌదీఅరేబియన్స్ రోజుకు 8 మిలియన్ అమెరికన్ డాలర్లను కేవలం సిగరెట్ల మీదే ఖర్చుచేస్తారు.
 
16. ఒక దేశంగా ఏర్పడిన 23 సెప్టెంబర్ 1932 నాటి నుంచి సౌదీలో రాచరికపాలన కొనసాగుతోంది. అల్ సాద్ కుటుంబం రాజకుటుంబంగా కొనసాగుతోంది.
 
17. జెడ్డా పరిసర ప్రాంతాలు, హిజాజ్ ప్రాంతాలలో ఒంటె పిల్లల మాంసాన్ని ఎక్కువగా తింటున్నారు.
  
18. భర్త అనుమతి లేకుండా భార్యలు విదేశాలకు ప్రయాణించడం నేరం. నేరానికి తగిన చట్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.

ఇంటర్‌నెట్‌ ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలంటే ఇలా..


  • అందుబాట్లో అన్ని శాఖల వెబ్‌సైట్‌లు 
  • ఎప్పటికప్పుడు ప్రగతి తెలుసుకునే అవకాశం
ప్రభుత్వ శాఖలలో ముఖ్యమైన రేషన్ షాపులు, ఎరువుల దుకాణాలు, ఆరోగ్య కేం ద్రాలు ఇలా ఏ శాఖకు సంబంధించిన ఉద్యో గులపై విజిలెన్సు అధికారులకు ఫిర్యాదు చేయాలనుకుంటే జీమెయిల్‌ తరహాలో ఒక ప్రత్యేక యూజర్‌ ఐడీ క్రియేట్‌ చేసుకోవాలి. మొదటిగా హెచ్ టీటీపీ://పోర్టల్‌. సీవీసీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి కుడిచేతివైపు ఉండే న్యూ యూజర్‌ /కంప్లైంట్‌ బాక్సుపై క్లిక్‌ చేయాలి. వెంటనే ఐడీని క్రియేట్‌ చేసే వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో పేరు, ఊరు, చిరునామా ఐడీ, పాస్‌వర్డ్‌ ఇలా మొత్తం ఖాళీ లను నింపి సబ్‌మిట్‌ క్లిక్‌ చేస్తే ఐడీ క్రియేట్‌ అవుతుంది. ఐడీ పాస్‌వర్డ్‌తో వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. వెంటనే మరో విండో ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఎడమవైపు ఫిర్యాదు నమోదైన బాక్సుపై క్లిక్‌చేసి దానిలో అన్ని వివరాలు నింపాలి. ఏమైనా సాక్ష్యాలు, పత్రాలు ఉంటే అదే పేజీలో దిగువ భా గంలో ఉండే అటాచ డాక్యుమెంట్స్‌పై క్లిక్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి. ఫిర్యాదును నమోదు చేశాక రిఫరెన్సు నంబరు వస్తుంది. దానిని తీసుకొని పది రోజుల్లో ఫిర్యాదు పరిస్థితిని పరిశీలించవచ్చు

బ్యాంకు లావాదేవీల విషయంలో ఏ బ్యాంకు శాఖ ఉద్యోగిపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. అది నేరుగా రిజర్వు బ్యాంకు అధికారులకు అందుతుంది. ముందుగా హెచటీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్‌బీఐ. ఓఆర్‌ఎఫ్‌.ఇన్ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించాలి. బ్యాంకు హోం పేజీలో కుడివైపు సాధారణ వ్యక్తుల కోసం అనే అప్షన్ ఉంటుంది. అది క్లిక్‌ చే స్తే వెంటనే ఫిర్యాదుల విభాగానికి సంబంధించి మరో విండో ఓపెన అవుతుంది. అందులో పూర్తి వివరాలు నమోదు చే యాలి. సాక్ష్యాలు ఉంటే అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం సేవ్‌ బటన మీద క్లిక్‌ చేస్తే ఫిర్యాదు ఉన్నతాధికారులకు వెళ్లిపో తుంది. అక్‌నాల్డెజ్‌మెంట్‌ నంబరు ద్వారా 15 రోజులలో ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

పోస్టాఫీస్‌ సిబ్బంది, కార్యాలయాలపై ఫిర్యాదు చేసేందుకు మొదట డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇండియాపోస్ట్‌. జీవోవీ.ఇన వెబ్‌సైట్‌లోని హోం పేజీలో ఉన్న కస్టమర్‌ కేర్‌ క్లిక్‌ చేసి ఫిర్యాదు నమోదు ఆప్షన ఎంచుకోవాలి. పేజీలో వివరాలు నమోదు చేయాలి. జాగ్రత్తగా నింపిన తరు వాత సబ్‌మిట్‌ బటన నొక్కాలి. వెంటనే రిఫరెన్సు నంబరు వస్తుంది. ఆ నంబరు ఆధారంగా ఫిర్యాదు పై విచారణ, తదితర అంశాలను తెలుసుకుంటూ ఉండవచ్చు.
రైల్వే ప్రయాణంలో ఎదురైన సమస్య, సిబ్బంది ని ర్వాకంపైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. మొదటగా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ.ఇండియన్ రైల్వేస్‌.జీవోవీ.ఇన వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. దిగువ భాగాన ఫిర్యాదులు, సలహాల బాక్సు ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేస్తే ఫిర్యాదు, సూచనల నమోదు ఆప్షనలు వస్తాయి. ఫిర్యాదు చేయాల్సిన విభాగాన్ని ఎంచుకుని ప్రయాణ సమయం, తేదీ, రైలు వివరాలు, బాధ్యులైన సిబ్బంది, సమస్య, ఫిర్యాదు చేస్తున్న వ్యక్తి పేరు, ఫోన్ నంబరు లాంటి వివరాలన్నీ నింపి సబ్‌మిట్‌ చేయాలి. వెంటనే ఓ అక్‌నాల్డెజ్‌మెంట్‌ నంబరు వస్తుంది. వారం రోజుల తరువాత ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో ఫోన నంబరుకు మెసేజ్‌ వస్తుంది. గడువులోగా స్పందన రాకుంటే వెబ్‌సైట్‌ మొదటిపేజీలో ఫిర్యాదు ప్రస్తుత పరిస్థితి (ట్రాక్‌ కంప్లైంట్‌ లేదా రిఫరెన్సు) ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫిర్యాదుపై వెంటనే నిర్ధారణకు వచ్చేందుకు ప్రయాణ టికెట్‌ను స్కాన చేసి అప్‌లోడ్‌ చేయవచ్చు. అదే సాక్ష్యంగా ఉపయోగపడుతుంది.