Friday, 23 December 2016

శృంగార కోరికలు ఎక్కువగా ఉండేది ఈ వయసులోనేనట

యుక్తవయసులో ఉన్న వారికే శృంగార పరమైన కోరికలు ఎక్కువగా ఉంటాయని, వయస్సు పెరిగే కొద్దీ శృంగార కోరికలు తగ్గిపోతాయనే భావన చాలామందిలో ఉంటుంది. ఈ అంశంపై కొందరు మహిళలపై సర్వే చేయగా కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. యవ్వనంలో కంటే 30 నుంచి 40 ప్రాయంలోనే శృంగార పరమైన కోరికలు ఎక్కువగా ఉంటాయని సగటు మహిళలు భావిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఈ విషయమై రెండు విభిన్నమైన సర్వేలు నిర్వహించారు. ఒకటేమో టెక్సాస్‌ యూనివర్సిటీ వారు నిర్వహిస్తే, మరొకటేమో ప్రముఖ విటమిన్ కంపెనీలలో ఒకటి అయిన హెల్త్‌స్పాన్ అనే కంపెనీ నిర్వహించింది. ఈరెండు సర్వేలూ వెల్లడించిన విషయాలన్నీ దాదాపు సమానంగానే ఉన్నాయి.
 
          హెల్త్‌స్పాన్ కంపెనీ ఈవిషయమై నిర్వహించిన పరిశోధనలో దాదాపు 75 శాతం మంది మహిళలు మెనోపాజ్‌ దశ అనేది వారి రిలేషన్‌మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని తేలింది. నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు మెనోపాజ్‌కి చేరువలో ఉంటారు. దీనివల్ల వారిలో హార్మోన్లలో అసమతుల్యం ఏర్పడి ఎక్కువగా మూడ్‌స్వింగ్స్‌, ఆత్రుత ఏర్పడతాయి. అందువల్ల వారికి ఆ వయసులో శృంగారంపట్ల కోరికలు కాస్త ఎక్కువగానే కలుగుతాయని వెల్లడైంది.
 
         ఇక టెక్సాస్‌ యూనివర్సిటీ 827 మంది మెనోపాజ్‌కి చేరువైన విదేశీ మహిళలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న మహిళలు తమ శృంగార జీవితం గతంలో కంటే మెనోపాజ్‌ తర్వాత ఇంకా బాగుందని చెప్పారు. 20 లేదా 30 ఏళ్ల ప్రాయంలో తాము నెలలో 10 సార్లు పాల్గొనగా, 45 నుంచి 60 ఏళ్ల మధ్యకాలంలో అంతకు రెట్టింపుగా శృంగార జీవితం గడుపుతున్నామని చెప్పారు. 34 నుంచి 38 ఏళ్ల వయసులో తాము సెక్స్‌ జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించినట్టు వారు చెప్పారు.

Thursday, 22 December 2016

విత్ డ్రా పరిమితి రూ.24 వేలకు పెంపు

పాతనోట్ల మార్పిడిపై ఉన్న నిబంధనల్లో కాస్త సడలింపును ఇచ్చింది కేంద్రం. మనీ విత్ డ్రా పరిమితుల్లో మార్పులు చేసింది. ఇపుడున్న 4 వేల రూపాయల ఎక్సేజీని 4వేల  5వందలకు పెంచింది. అలాగే బ్యాంకుల నుంచి రోజుకు రూ.10 వేలు మాత్రమే విత్ డ్రా నిబంధనను ఉపసంహరించుకుంది. వారానికి విత్ డ్రాయల్ పరిమితిని 20వేల నుంచి 24వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ATM ల ద్వారా డ్రా చేసుకునే వెసులుబాటును 2వేల నుంచి 2వేల 5వందల పెంచింది కేంద్రం. అయితే ఇది సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయ్యాకే ఉంటుందని చెప్పిది ఆర్బీఐ.

ATM నుంచి అన్ లిమిటెడ్ విత్ డ్రా!

గంటలకొద్దీ ATM క్యూలో ఉంటే వచ్చేది కేవలం రెండు వేల రూపాయల నోటు మాత్రమే. ఆ నోటుకు చిల్లర దొరకటం దేవుడెరుగు.. ఇంటి అద్దె చెల్లించటం కోసం కూడా మూడు రోజులు ATM చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. ఇక నుంచి అలాంటి తిప్పలు ఉండవు అంటోంది ఆర్థిక శాఖ. న్యూఇయర్ గిఫ్ట్ కింద.. ATM విత్ డ్రా లిమిట్ ఎత్తివేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. రూ.2వేల నోట్లు జనం అందరికీ చేరాయని.. రెండు రోజులుగా దేశవ్యాప్తంగా రూ.500 నోట్లు పంపిణీ ఉధృతం చేసినట్లు ప్రకటించారు అధికారులు. అన్ని ATMలను అందుబాటులోకి తీసుకొచ్చి.. విరివిరిగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లోకి 500 నోట్లు రాకతో చిల్లర సమస్య కూడా తీరిపోతుందని భావిస్తోంది. దీంతో జనవరి ఒకటో తేదీ నుంచి ATM విత్ డ్రా లిమిట్ ఎత్తివేయాలనే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. మొత్తానికి న్యూఇయర్ లో అయినా క్యూ బాధలు తప్పుతాయని భావిస్తున్నారు జనం. మళ్లీ నెల వస్తుంది.. జీతాల టైం కావటంతో ముందస్తుగా భారీ ప్రణాళికతో ముందుకు వస్తామంటోంది కేంద్రం. కొత్త ఏడాదిలో నోట్ల కష్టాలు లేకుండా చూస్తామని గట్టిగా చెబుతోంది.

న‌వంబర్ 8నుంచి డిసెంబ‌ర్ 21వర‌కు రూ.505కోట్లు స్వాధీనం

నోట్ల‌ర‌ద్దు త‌రువాత భారీ మొత్తంలో పాత‌, కొత్త నోట్ల‌ను స్వాధీన‌ప‌రుచుకున్న‌ట్లు ఐటీశాఖ పేర్కొంది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం పాత పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన న‌వంబ‌ర్ 8వ తేదీ నుంచి డిసెంబ‌ర్ 21 వ‌ర‌కు ఐటీశాఖ సుమారు రూ.505కోట్లు స్వాధీన ప‌రుచుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఐటీశాఖ స్వాధీనం చేసుకున్న రూ.505కోట్లలో రూ.90కోట్లకు పైగా కొత్త‌నోట్లు ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. నోట్ల‌ర‌ద్దు త‌రువాత రూ.3,950కోట్ల లెక్క‌చూప‌ని అక్ర‌మాస్తుల‌ను గుర్తించిన‌ట్లు పేర్కొన్నారు. లెక్క‌చూప‌ని అస్తుల‌కు సంబంధించిన 3,589మందికి నోటీసులు కూడా జారీ చేసిన‌ట్లు అధికారులు చెప్పారు.

Tuesday, 20 December 2016

సోష‌ల్ మీడియా‌ పోస్టులతో కుంభకోణం మాస్కోలో బట్టబయలు . Social media posts scam uncovered ;Russia


రష్యాలోనూ అలా డబ్బును కూడబెట్టుకున్న నల్లబాబులు చాలా మంది ఉన్నారు. అలాగే నల్లడబ్బును మార్చడానికి.. విదేశాలకు తరలించడానికి దళారులు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి విషయాలు ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా చేస్తుంటారు. కానీ.. దళారుల్లో సభ్యురాలైన ఓ యువతి చేసిన పొరపాటు భారీ కుంభకోణమే బయటపడింది.
రష్యాకి చెందిన 22ఏళ్ల అనాస్టిషియా సిరెన్‌ష్వికొవా మాస్కోలో డిగ్రీ చదువుతోంది. అయితే సోషల్‌మీడియాలో తరుచూ తన ఫోటోలు పోస్టు చేయడం ఆమెకు అలవాటు. ఎన్నడు లేనిది గత కొంత కాలంగా ఖరీదైన దుస్తులు ధరించి.. ఖరీదైన కార్లను నడుపుతూ ఫోటోలు దిగి సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తోంది. అంతేకాదు ఖరీదైన హోటళ్లలో తింటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది.



 అలా ఎప్పటికప్పుడు ఆమె ఫోటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుండటంతో ఆమెకు క్రేజ్‌ పెరిగింది. కానీ.. పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. సాధారణ విద్యార్థికి విలాస జీవితాన్ని గడిపేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని సందేహించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే పోలీసులకు నల్లధనాన్ని విదేశాలకు తరలించే కుంభకోణం గురించి తెలిసింది.


 క్రెడిట్‌-మాస్కో బ్యాంక్‌కు చెందిన మాజీ ఉద్యోగి మికైల్‌ గోమా అనే దళారి గ్యాంగ్‌లో అనాస్టిషియా సభ్యురాలు. ఈ గ్యాంగ్‌ వ్యాపారస్థులు వద్ద ఉన్న నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తోంది. మార్పిడి చేయాల్సిన డబ్బు మొత్తంలో 2.5శాతం కమీషన్‌ కింద తీసుకుంటున్నారట. రష్యాలో సంచలనం సృష్టించిన ఈ స్కామ్‌పై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.



 . How many of those who commit crimes of corruption palpadevallu a mistake, but it was taken care of by the police after he was caught across. Nalladabbunu proper tax collection for the government to prevent crime vallakante the black child is very difficult to catch. Nallababulu money, so there are many people in Russia for purchasing. As well as the change nalladabbunu .. to move abroad are also mediums. However, without knowing to whom these things are very carefully. But she made a mistake .. a member of mediums was a huge scam.
Russia's 22-year-old graduate student in Moscow anastisiya sirensvikova. However, the photos are often posted sosalmidiyalo her habit. .. For some time in the past is never expensive cars, expensive clothes and ran down to the photos is sosalmidiyalo posts.  





The more expensive hotels, eating lead a life of luxury. From time to time, so she got out of the photos being posted on social media craze has increased her. But .. the police suspected her. Where the money came from a life of luxury hesitant gadipenta normal student. As soon as she was arrested. Moving to a foreign country after the realization that the police learned about the scandal.


Monday, 19 December 2016

ప్రెసిడెంట్ ఎవరో తేల్చేసిన ఎలక్టార్స్

ప్రపంచాధినేత, అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరో తేలిపోయింది.  జనవరి 20న ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేయాల్సింది ఎవరో ఎలక్టార్స్ తేల్చేశారు. సోమవారం జరిగిన ఎలక్ట్రోరల్ కాలేజీ ఎన్నికల్లో తమ విస్పష్టమైన ఓటింగ్ ద్వారా శ్వేతసౌధ 45వ పాలకుడిని ఎలక్టార్స్ ఎన్నుకున్నారు. హ్యాకింగ్ ద్వారా గెలిచారని ఆరోపణలు వచ్చినా, పాలకుడిగా పనికిరారంటూ విమర్శలెదుర్కొన్న డోనాల్డ్ ట్రంప్‌ను మెజారిటీ ఎలక్టార్స్ తమ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఎక్కువ ఓట్లు వచ్చిన హిల్లరీకే ఓటేయాలంటూ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేసిన ప్రజలకు.. రాజ్యాంగంలో పేర్కొన్నట్లు అధిక ఎలక్ట్రోరల్ కాలేజీ సీట్లు పొందిన ట్రంపే అధినేతగా ఉంటారని స్పష్టం చేశారు. నవంబర్ 9న వచ్చిన ఫలితాల్లో మొత్తం 538 సీట్లలో.. ట్రంప్‌కు 306 ఎలక్ట్రోరల్ కాలేజీ సీట్లు లభించాయి. హిల్లరీకి 232 సీట్లు వచ్చాయి.
మెజారిటీ సీట్లు సంపాదించినప్పటికీ డిసెంబర్ 19న(సోమవారం) జరిగిన ఎన్నికల్లో 270 మంది ఎలక్టార్స్ ఎవరిని ఎన్నుకుంటారో వారే ప్రెసిడెంట్‌గా జనవరి 20న ప్రమాణస్వీకారం చేస్తారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌కు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగానే ఓట్లు వచ్చాయి. కేవలం ఇద్దరు రిపబ్లికన్ ఎలక్టార్స్ మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అంతర్జాతీయ దేశాలతో సంబంధాలు, శాంతిభద్రత, అల్లర్లు, అభ్యర్థి ప్రవర్తనను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సీట్లు వచ్చిన హిల్లరీకే ఓటేయాలంటూ ఎలక్టార్స్‌కు నిరసనలు తెలిపినా, వేల కొద్ది మెయిల్స్ పంపినా ట్రంప్‌నే గెలిపించడం గమనార్హం. ట్రంప్ గెలుపును సూచిస్తూ.. అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ మన ట్రంపేనని ఉపాధ్యక్షుడిగా ఎంపికయిన మైక్ పెన్స్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను ట్రంప్ రీట్వీట్ చేశారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా తనకు అండగా నిలిచినందుకు మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ ట్విటర్ వేదికగా ట్రంప్ తెలిపారు. ఈ ఎన్నికపై ఆశపెట్టుకున్న డెమొక్రటిక్ మద్దతుదారులకు ఫలితం తీవ్ర నిరాశకు గురిచేసింది. అద్భుతం జరిగి హిల్లరీ ప్రెసిడెంట్‌గా ఎన్నికవుతారని ఆశలు పెట్టుకున్న ట్రంప్ వ్యతిరేకులకు ఆశాభంగం ఎదురైంది.

జయలలిత మృతికి అసలు కారణం ఇదే... తెలిపిన అపోలో చైర్మన్

అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం చేరినప్పటి నుంచి ఒకటి రెండు రోజులు మినహా ఆమెకు అందిస్తున్న చికిత్సలన్నింటిని తానే దగ్గరుండి మరీ పరిశీలిస్తూ వచ్చాననని, అయితే ఆమె గుండెపోటు వస్తుందని తామెవరమూ ఊహించలేకపోయామని అపోలో ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్‌ ప్రతాప్‌ సి. రెడ్డి పేర్కొన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్‌ 22న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి జయలలిత చికిత్సలకు బాగా స్పందించారని, ప్రతి రోజూ ఆమె తనను చూసినప్పుడల్లా చిరునవ్వు నవ్వేవారని చెప్పారు. జయలలిత సుగుణాలను చూసి తానెంతో ఆశ్చర్యపోయానని, తలచిన కార్యాన్ని కచ్చితంగా నిర్వర్తించగల సత్తా ఆమెకు మాత్రమే ఉండేదని అన్నారు. అపోలో ఆస్పత్రి ప్రారంభించకమునుపు తాను హెచ్‌ఎం ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు జయలలిత ఓసారి చికిత్స కోసం తన వద్దకు వచ్చారని, అస్వస్థతతో ఉన్నా ఆ సమయంలో ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించిందన్నారు. ఆ తర్వాత ఆమె ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా పలుమార్లు తాను ఆమెను కలుసుకున్నానని, చిరునవ్వుతోనే తనకు స్వాగతం పలికేవారని తెలిపారు.
 
            సెప్టెంబర్‌ 22న అపోలో ఆస్పత్రిలో చేరినప్పటినుంచి జయలలితకు అందించిన చికిత్సలన్నింటిని దగ్గరుండి పరిశీలించానని, నిజానికి రెండు మాసాలపాటు నేను నగరాన్ని విడిచిపెట్టలేదని, తమ శక్తికి మించి చేయాల్సిన చికిత్సలన్నింటినీ ఆమెకు అందించామని ఆయన తెలిపారు. జయలలిత మృతి చెందటానికి కొద్ది రోజులముందు అత్యసవర పనుల మీద హైదరాబాద్‌కు వెళ్ళాల్సి వచ్చిందని, బయలుదేరటానికి ముందు ఆమెను పలకరించానని, ఆమె ముఖంపై అదే చిరునవ్వు కనిపించిందని, ఆ సమయంలో టీవీ చూస్తున్నారని, తానే దగ్గరగా వెళ్లి ‘హైదరాబాద్‌ నుండి తిరిగొచ్చేలోపున మీరు లేచి నడుస్తారు’ అంటూ చెప్పానని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి తిరిగొచ్చాక జయలలితను డిశ్చార్జి చేద్దామని నిర్ణయించుకున్నానని, చెన్నైకి తిరిగొచ్చాక ఆ విషయాన్ని పరిశీలిద్దాంలే ననుకుంటూ హైదరాబాద్‌కు వెళ్లానని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి తిరిగొచ్చాక జయలలితకు గుండెపోటు వచ్చిందని తెలియగానే తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యానని పేర్కొన్నారు. హృద్రోగశస్త్ర చికిత్స వైద్యనిపుణుడొకరు జయలలితను నిరంతరం పరిశీలిస్తుండగానే ఆమెకు గుండెపోటు రావడం పట్ల ఆవేదన చెందానని, ఎందుకంటే అప్పటిదాకా ఆమెకు గుండెపోటు వచ్చేందుకు ఎలాంటి ఆనవాళ్లు అగుపడలేదని ప్రతాప్‌రెడ్డి చెప్పారు. గుండెపోటు వచ్చిన వెంటనే ప్రత్యేక వైద్యనిపుణుల బృందం రంగంలోకి దిగి చికిత్సలు ప్రారంభించిందని, ‘గోల్డెన్ అవర్‌’గా పరిగణించే ఆ సమయంలో జయలలితకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య చికిత్సలు చేపట్టామని, ఆమె చికిత్స పొందుతున్న గదికి సమీపంలోనే ‘ఎక్మో’ విభాగపు గది ఉందని, వెంటనే ఆమెకు ఆ పరికరాన్ని అమర్చామని చెప్పారు. ‘ఎక్మో’ చికిత్స చేసుకున్న పలువురు ప్రాణగండం నుంచి బయటపడ్డ సందర్భాలెన్నో ఉన్నాయని, దురదృష్టవశాత్తూ జయలలిత విషయంలో అది సాధ్యం కాలేకపోయిందని ప్రతాప్‌రెడ్డి అన్నారు. జయలలిత చికిత్సలకు బాగా సహకరించారని, అనారోగ్యం సృష్టించిన బాధలన్నింటిని తట్టుకుని ధైర్యాన్ని ప్రదర్శించారని ఆయన కీర్తించారు. జయలలిత అసాధారణ మహిళ అని, ఆమె కోపంలోనూ ఓ న్యాయం దాగి ఉంటుందని, పార్టీ కార్యకర్తల్లోనే కాదు సామాన్య ప్రజానీకం మదిలోనూ ఆమె సుస్థిరస్థానం సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు.