Tuesday, 29 November 2016

జామ చెట్టు ఆకులతో జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.

ఊర్లో ప్రతి పెరట్లో ఖచ్చితముగా ఉండే చెట్లలో జామ ఒకటి. జామ కాయలు ఆరోగ్యానికి మంచి ఔషధం. జామ పండులో ఆరోగ్యానికి మంచి చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. ఆలాంటి గుణాలు జామ ఆకుల్లో కూడా ఉన్నాయి అని ఎంత మందికి తెలుసు?


 ఈ జామ ఆకులు జుట్టు రాలడం ను నివారించి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. జామ ఆకుల్లో ఉండే అధిక పోషకాలు దీనికి కారణం. జామ ఆకులలో విటమిన్ – బి ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అలాగే జామ ఆకులో ఉండే విటమిన్ బి5, బి3, బి6 చర్మం కాంతివంతంగా మారేందుకు సహాయపడుతాయి. విటమిన్ బి2 చర్మంలో మృత కణాలను నివారించటంతోపాటు, చురుకైన కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.



అవసరానికి సరిపడ జామ ఆకులను శుభ్రంగా కడిగి 15-20 నిమిషాల పాటు నీటిలో వేడి చేయాలి. వేడి నీరు చల్లారే వరకు ఉంచి, ఆ మరిగించిన నీటిని తలపై నెమ్మదిగా పోస్తూ మునివేళ్లతో వెంట్రుకల కుదుళ్ళలో పట్టేలా మసాజ్ చేస్తున్నట్టు చేయాలి. తలకు ఆ మరిగించిన నీరు పట్టించిన తరవాత ఒక గంటపాటు అలానే ఉండి తరువాత తలస్నానం చేయాలి. ఇలా కంటిన్యూగా ఒక నెల రోజులు చేస్తే వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడి, వెంట్రుకలు ఊడిపోకుండా ఉంటాయి.

కాకి పదే పదే ఇంటి ముందు అరిస్తే దేనికి సంకేతం..?

घर के कौवा चीखना  सामने और अधिक से अधिक फिर से करता है ..?

 

షేర్ చేయండి share this
జంతువులు, పక్షులతో.. అనేక నమ్మకాలు కనెక్ట్ అయినట్టు.. హిందూ సంప్రదాయాలు వివరిస్తాయి. కొన్ని జంతువులు, పక్షులు బయటకు వెళ్లేటప్పుడు ఎదురొస్తే.. శుభం జరుగుతుందని, అశుభం కలుగుతుందని నమ్ముతారు.
జంతువులు, పక్షులతో.. అనేక నమ్మకాలు కనెక్ట్ అయినట్టు.. హిందూ సంప్రదాయాలు వివరిస్తాయి. కొన్ని జంతువులు, పక్షులు బయటకు వెళ్లేటప్పుడు ఎదురొస్తే.. శుభం జరుగుతుందని, మరికొన్ని ఎదురైతే.. అశుభం కలుగుతుందని హిందువులు నమ్ముతారు.
అలాగే కాకి గురించి కూడా..
ఇలాంటి నమ్మకాలు చాలానే ఉన్నాయి. మన పూర్వీకుల ప్రకారం మనుషుల జీవితం, మరణం.. కాకితో లింక్ అయి ఉన్నట్టు విశ్వసిస్తారు. అలాగే కొన్నిసార్లు చనిపోయిన మన పూర్వీకులే కాకి రూపంలో ఉంటారని కూడా నమ్ముతారు. దీన్నిబట్టి.. కాకులు మన భవిష్యత్ ని అంచనా వేయగలుగుతాయని అర్థం చేసుకోవచ్చు.


బయటకు వెళ్లేటప్పుడు
ఒకవేళ మీరు బయటకు వెళ్లేటప్పుడు.. కాకి వచ్చి.. గట్టిగా అరిచి.. వెళ్లిపోయింది అంటే.. మీరు వెళ్తున్న పని లేదా మీ ప్రయాణం సక్సెస్ అవుతుందని సంకేతం.
నీటికుండపై కాకి
నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకి కూర్చుని ఉండటం ఎవరైతే చూస్తారో.. వాళ్లు.. త్వరలోనే.. ధనవంతులు కాబోతున్నారని సంకేతం.



ఆహారం పట్టుకెళ్లే కాకి
ఒకవేళ కాకి తన నోట్లో.. రోటి లేదా బ్రెడ్ లేదా మాంసం ముక్క పట్టుకుని వెళ్లడం చూశారంటే.. మీరు ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారని, మంచి జరగబోతోందని సంకేతం.
మనిషిపై పడేస్తే
ఒకవేళ మాంసం ముక్కను కాకి పట్టుకెళ్తుండగా.. ఎవరిపైన అయినా.. పడింది అంటే.. అది అశుభానికి సంకేతం. కొన్ని గ్రంథాల ప్రకారం.. అది మరణానికి సంకేతం.
ఎగురుతున్న కాకి
ఒకవేళ ఎగురుతూ పోతున్న కాకి మగవాళ్లు లేదా ఆడవాళ్లను తాకడం లేదా కొట్టడం జరిగిందంటే.. ఆ వ్యక్తి.. కాస్త అనారోగ్యానికి గురవుతారని సంకేతం


గుంపుగా అరిస్తే
గుంపులు గుంపులు కాకులు ఒక దగ్గరికి చేరి.. అరుస్తూ ఉంటే.. అంటే ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర లేదా ఒక ఊళ్లో అరిస్తే.. అది బ్యాడ్ న్యూస్ కి సంకేతం. అలాగే ఆ ప్రాంతం ఓనర్ సమస్యల్లో పడతారని సంకేతం.
తలపై వాలితే
ఒక వ్యక్తి తలపై కాకి వాలితే.. వాళ్లు స్కాం లేదా అవమానాల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని.. సంకేతం.
తలపై కూర్చుంటే
ఒకవేళ కాకి.. మహిళ తలపై లేదా ఆమెపై కూర్చుంటే.. ఆమె భర్త సమస్యల్లో పడతారని సూచిస్తుంది.
ద్రవ్యలాభం
ఒకవేళ సాయంత్రం పూట కాకి ఆగ్నేయం వైపు నుంచి రావడం చూశారంటే.. ద్రవ్యలాభం పొందుతారని సూచిస్తుంది.
రెక్కలు ఊపుతూ, అరిస్తే
ఒకవేళ కాకి రెక్కలు కొడుతూ.. గట్టిగా కంటిన్యూగా అరుస్తూ కనిపించిందంటే.. మరణం ఉందని.. సూచిస్తూ.. సందేశాన్ని ఇస్తోందని అర్థం

రోజుకి 2 అరటిపండ్లు తింటే శరీరంలో కనిపించే అద్భుత మార్పులు..

అరటిపండులో ఫైబర్, విటమిన్స్, న్యాచురల్ షుగర్స్, ఫ్రక్టోజ్, సక్రోజ్ ఉంటాయి. అందుకే.. డాక్టర్లు కూడా.. అరటిపండుని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవాలని సూచిస్తుంటారు. అమెరికన్లు అరటిపండ్లను చాలా ఎక్కువగా తింటారు. అలాగే మనం అరటిపండ్లను తింటాం. కానీ.. నల్లగా, మచ్చలు ఏర్పడిన వాటిని పడేస్తుంటాం. కానీ.. అందులోనే ఎక్కువ పోషకాలుంటాయి.
ఎనర్జీ
అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. ఇమ్యునిటీని బలంగా మారుస్తాయి. తెల్ల రక్తకణాలను మెరుగుపరుస్తాయి. ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ ని కూడా అరికడతాయి. డైలీ డైట్ లో అరటిపండ్లను ఎందుకు చేర్చుకోవాలి ? రోజుకి రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి ఎలా సహాయపడుతుందో, ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం..
హార్ట్ బర్న్

హార్ట్ బర్న్

అరటిపండ్లలో న్యాచురల్ యాంటీ యాసిడ్ ఉంటుంది. ఇది నిమిషంలో హార్ట్ బర్న్ ని నివారిస్తుంది. ఒకవేళ హార్ట్ బర్న్ లక్షణాలు గమనించారంటే.. వెంటనే అరటిపండు తినేయండి.
బ్లడ్ ప్రెజర్

బ్లడ్ ప్రెజర్

అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే సోడియం ఉండదు. కాబట్టి.. ఇది గుండెకు మంచిది. అలాగే ప్రతిరోజూ రెండు అరటిపండ్లు తింటే.. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవడంతో పాటు, స్ట్రోక్, హార్ట్ ఎటాక్ ని అడ్డుకుంటుంది.

ఎనర్జీ

అరటిపండ్లు తక్షణ శక్తిని ఇస్తాయి. కాబట్టి.. వర్కవుట్ కి ముందు స్నాక్ గా.. అరటిపండు తీసుకోవాలి. ఇందులో విటమిన్స్, మినరల్స్, తక్కువ గ్లిసెమిక్ ఉంటుంది. ఇవన్నీ.. ఎనర్జీ లెవెల్స్ ని మెరుగుపరుస్తాయి.
అనీమియా

అనీమియా

అనీమియాతో బాధపడే వాళ్లకు అరటిపండు అద్భుతంగా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడేవాళ్లు డైట్ లో అరటిపండు చేర్చుకుంటే.. వాళ్లకు అవసరమైన ఐరన్ అందుతుంది. ఐరన్ సరిపడా అందితే.. హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ ని మెరుగుపరిచి.. బ్లడ్ సప్లైని మెరుగుపరుస్తుంది.
అల్సర్స్

అల్సర్స్

అల్సర్స్ వల్ల స్టమక్ అప్ సెట్ సమస్య వస్తుంది. కాబట్టి.. పొట్టలో అల్సర్లతో బాధపడేవాళ్లు.. అరటిపండ్లు తీసుకోవడం వల్ల.. ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు.
డిప్రెషన్

డిప్రెషన్

డిప్రెషన్ తగ్గించడంలో.. అరటిపండ్లు సహాయపడతాయి. ఇందులో ట్రైప్టోఫాన్ ఉంటుంది. ఇది సెరోటొనిన్ గా మారుతుంది. ఈ సెరోటొనిన్ అనేది.. హ్యాపీగా ఫీలవడానికి సహాయపడుతుంది. రిలాక్స్ అయి, మూడ్ ని మార్చడానికి సహాయపడుతుంది. కాబట్టి.. ఎప్పుడైతే .. మీరు ఆందోళనగా ఫీలవుతారో.. అప్పుడు అరటిపండు తింటే మంచిది.
కాన్ట్సిపేషన్

కాన్ట్సిపేషన్

అరటిపండ్లలో హై ఫైబర్ ఉంటుంది. ఇది.. కాన్ట్సిపేషన్ తో బాధపడేవాళ్లకు సహాయపడుతుంది. ఇది బోవెల్ మూవ్మెంట్ ని సజావుగా మార్చి.. కాన్ట్సిపేషన్ లక్షణాల నుంచి బయటపడేస్తుంది.
నరాలకు

నరాలకు

ఒకవేళ మీరు చాలా ఒత్తిడికి లోనవుతున్నారంటే.. అరటిపండు తినండి.. అది మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్న్ ని రెగ్యులేట్ చేసి.. విటమిన్స్ బి అందించి.. నారల వ్యవస్థ రిలాక్స్ అవడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ.. రెండు అరటిపండ్లను డైట్ లో చేర్చుకోండి. ఎఫెక్టివ్ ఫలితాలను పొందండి..

మీ ఇంట్లో పదే పదే బల్లి కనిపిస్తే.. దేనికి సంకేతం..?छिपकली अपने घर में बार-बार प्रकट होता है क्या .. ..?

మన ఇంట్లో బల్లి కనిపించిందంటే.. చాలా అసహ్యంగా, ఇబ్బందిగా ఫీలవుతాం. బల్లులు ఇంట్లో ఉండటాన్ని, తిరగడాన్ని ఎవరూ ఇష్టపడరు. కానీ.. బల్లులు ఇంట్లో ఉండటం, బల్లి ఇంట్లో తిరగడం వంటి లక్షణాలన్నీ కొన్ని ఆశ్చర్యకర సంకేతాలను ఇస్తాయి. బల్లులకు ముందుగా భవిష్యత్ ని అంచనావేసే సత్తా, మున్ముందు ఏం జరగబోతుందని సూచించే తెలివి ఉంటుందట. మనం అంటే.. మనుషులు కూడా అంచనా వేయలేని విషయాలను బల్లులు ముందుగానే ఊహిస్తాయట.
బల్లిలు కూడా ఇతర జంతువుల లాగే.. మెస్సంర్స్ లా వ్యవమరిస్తాయి. ఏదైనా విపత్తు జరగబోతుందనే విషయాన్ని జంతువులు.. వాటికున్న సెన్సింగ్ పవర్స్ అవి ముందుగానే పసికట్టేస్తాయి. అలాగే బల్లులు కూడా.. కొన్ని సందర్భాల్లో కమ్యునికేట్ అవుతాయి. బల్లులు అరిచినప్పుడు, రెండు బల్లులు పోట్లాడినప్పుడు, బల్లులు పదే పదే తిరిగినప్పుడు ఇచ్చే సందేశం, సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం..
రెండు బల్లులు
ఒకవేళ మీ ఇంట్లో రెండు బల్లులు ఒకేచోట చేరి గొడవ పడుతున్నాయి అంటే.. మీరు ప్రేమించే వ్యక్తి నుంచి విడిపోతారని సంకేతం.
గృహప్రవేశం సమయంలో
గృహప్రవేశం సమయంలో.. చనిపోయిన బల్లి కనిపించింది అంటే.. ఆ ఇంట్లో ఉండబోయేవాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిక
బల్లి శబ్ధం
పగటిపూట బల్లి శబ్ధాన్ని విన్నారు అంటే.. అది చెడు సంకేతం కాదు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

పొట్టపై బల్లి
ఆడవాళ్ల పొట్టపై బల్లి పడింది అంటే.. త్వరలోనే గర్భం పొందుతారని సంకేతమని.. జమైకాన్ లెజెండ్ ప్రకారం తెలుస్తోంది.
పరిష్కరించలేరని
ఒకవేళ మీరు సమస్యను పరిష్కరించే పనిలో నిమగ్నమైనప్పుడు.. బల్లిని చూశారంటే.. మిమ్మల్ని మీరు.. ఆ సమస్య పరిష్కారం చేయకుండా వదిలిపెట్టాలని సంకేతం.
సరిపడా నిద్ర
ఒకవేళ మీరు వెళ్తున్న దారిలో బల్లి అడ్డం వచ్చిందంటే.. మీరు సరిపడా నిద్రపొందడం లేదని సూచిస్తుంది
మోకాలిపై బల్లి
మోకాలిపై పడింది అంటే.. మీరు ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారని సంకేతం.



ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సోషల్ మీడియా ప్ర‌భావం పెర‌గ‌డంతో వెబ్‌సైట్లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. సోష‌ల్ మీడియాను వాడుకుంటూ త‌మ సైట్ల‌ను ప్ర‌మోట్ చేసుకుంటూ గూగుల్ యాడ్స్ ద్వారా వెబ్‌సైట్లు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. దీంతో అన్ని భాష‌ల్లోను విప‌రీతంగా వెబ్‌సైట్లు పుట్ట‌గొడుగుల్లా వ‌చ్చేస్తున్నాయి. ఇదే క్ర‌మంలో చాలా వెబ్‌సైట్ల‌లో వార్త‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్టు వచ్చేస్తున్నాయి.
వెబ్‌సైట్ల‌లో గాసిప్స్‌కు అంతే లేకుండా పోతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు గూగుల్ ఇలాంటి వెబ్‌సైట్స్ కొర‌డా ఝులిపించింది. అవాస్తవ వార్తలు ప్రచురించే వెబ్‌సైట్స్‌ యాడ్స్‌ ఇవ్వమని సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌, ఫేస్‌బుక్ కఠిన నిర్ణయం తీసుకున్నాయి. సంచలనాల కోసం ప్రచురించే ఇటువంటి వార్తలను చదవి ప్రజలు తప్పుదోవలో నడుస్తున్నారని…ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు.

తాజాగా అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మీడియా మొత్తం ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ పెట్టించేలా సమాచారం విస్తృతంగా వ్యాప్తికావడంపై వస్తోన్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ ప్రకటన చేశారు. అవాస్తవ వార్తలను ప్రచురించి పలు వెబ్‌సైట్లు, ప్రజాభిప్రాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి…దీంతో ఏవి నిజ‌మైన వార్త‌లో…ఏవి బోగ‌స్ వార్త‌లో కూడా ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా ఉంది. మ‌రి గూగుల్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఇలాంటి బోగ‌స్ వార్త‌ల‌కు ఫుల్‌స్టాప్ పెడుతుంద‌న‌డంలో సందేహం లేదు.

స్థూలకాయాన్ని తగ్గించే ఆహారమేంటి?

18 సంవత్సరాలు. నా బరువు 82 కిలోలు. ఎత్తు అయిదు అడుగుల మూడు అంగుళాలు. స్థూలకాయం సమస్యతో బాధపడుతున్న నాకు స్థూలకాయం తగ్గించే ఆహారాన్ని సూచించగలరు.
స్థూలకాయాన్ని ఒకేసారి కాకుండా నెమ్మదిగా తగ్గించుకోవాలి. నెలకు రెండు కిలోల చొప్పున బరువును తగ్గించుకోవటం ఉత్తమం. మన ఆహారంలో వంద కేలరీలు తగ్గించుకుంటే అయిదు వారాల్లో ఒక పౌండు బరువు తగ్గవచ్చు. రోజుకు వెయ్యి కేలరీల ఆహారం తగ్గించుకోవచ్చు. సమతుల ఆహారంలో ధాన్యాలతోపాటు పప్పులు, పాలు లేదా పెరుగు, సరిపడా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో చికెన్‌, చేపలు, కోడిగుడ్లు, ఆయిల్‌, చక్కెరను నియంత్రించుకోవాలి. ప్రాసెస్‌డ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ ఎప్పుడైనా తప్ప ఎక్కువగా తీసుకోరాదు. బిస్కెట్లు, కేక్‌లు, కుకీస్‌లు పూర్తిగా నివారించాలి. మీరు సాధారణంగా రెండు రసగుల్లాలు తినేటట్లయితే, ఒక రసాగుల్లాకే పరిమితం చేసుకోండి. పెద్ద పళ్లెంలో ఐస్‌క్రీం తినేటట్లయితే దాన్ని వదిలి చిన్న కప్‌కు మాత్రమే పరిమితం చేసుకోండి. లో కేలరీలున్న స్నాక్స్‌, పెరుగు, తాజా పండ్లు, తీపిగా లేని హోల్‌ గ్రెయిన్‌ బిస్కెట్లు, వేయించిన శనగలు, పన్నీరు మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీంతోపాటు కనీసం వారంలో అయిదురోజులు రోజుకు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం తప్పనిసరి. ఇలా చేస్తే ఆరు వారాల్లో మీకు ఫలితం కనిపిస్తుంది.
 
కార్న్‌ఫ్లేక్స్‌, ఓట్స్‌, గోధుమలు కలిపి తింటే ఓట్స్‌ యొక్క ప్రభావం తగ్గిపోతుందా? 
ఓట్స్‌ను ఇతర ఆహార పదార్థాలతో కలిపితే ఓట్స్‌ ప్రభావం తగ్గిపోతుంది. అయితే వారానికో రోజు వినూత్న రుచితో కూడిన ఆహారం తీసుకునేందుకు ఇలా ఓట్స్‌ను కార్న్‌ఫ్లెక్స్‌, గోధుమలతో కలిపి తీసుకోవచ్చు. 
 
నా వయసు 33 సంవత్సరాలు. నేను శాకాహారిని. ఎత్తు అయిదు అడుగుల ఆరు అంగుళాలు. బరువు 58 కిలోలు. నాకు దయచేసి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సూచించండి. నా వయసులో ఆహారానికి ప్రత్యామ్నాయాలు తీసుకోవచ్చా తెలుపగలరు? 
మీకు మూడు పూటలా భోజనంతోపాటు రోజుకు రెండు సార్లు కొద్దిగా స్నాక్స్‌ తీసుకోవటం మేలు. అతిగా తినకండి. మెల్లగా తినటంతోపాటు కడుపు నిండుతుండగా ముందే తినడం ఆపండి. సమతుల ఆహారంలో తృణధాన్యాలు, పప్పులు, పాలు, పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. మాంసం, కోడిగుడ్లు, చక్కెర, సుగంధద్రవ్యాలు మితంగా ఉండేలా చూసుకోండి. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో తప్ప ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకోకండి. మీ తినే పళ్లెంలో కార్బోహైడ్రేట్‌లు, ప్రోటీన్‌లు ఉండాలి. అంటే అన్నం, పప్పు లేదా పన్నీర్‌, రోటి, కూరగాయలు, తక్కువ కేలరీలున్న పెరుగు, హోల్‌ గ్రెయిన్‌ బిస్కెట్లు, వేయించిన శనగలు తీసుకోవచ్చు. జంక్‌ ఫ్యాటీ ఫుడ్‌ను నివారించండి. దీంతోపాటు వాకింగ్‌, జాగింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, బ్యాడ్మింటన్‌ ఆడటం లాంటి వ్యాయామాలు తప్పనిసరి. వీటిలో వాకింగ్‌ మంచి వ్యాయామం. దీంతోపాటు వారానికి రెండు లేదా మూడు రోజులు 20 నిమిషాల పాటు యోగా చేయడం మేలు. మీ వయసు వారికి న్యూట్రిషనల్‌ సప్లిమెంట్లు తీసుకోవటం మంచిది. అయితే వీటిని తీసుకునే ముందు మీ డాక్టర్‌ను సంప్రదించాలి.
 

తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ?

తిరుమల హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం. వెంకటేశ్వర స్వామి నడియాడిన తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మన పూర్వీకులు చెబుతుంటే ఇప్పటికీ నమ్మరు. అయితే పురాణాల్లో మాత్రం తిరుమల ప్రశస్తి గురించి, అక్కడ ఉన్న ఎన్నో అద్భుతాల గురించి పేర్కొన్నారు. మరి అటువంటి అద్భుతాలలో ఒకటి రహస్య వైకుంఠం గుహ …. !


ఎంతో మంది కవులు, రచయితలు స్వామివారు కొలువై ఉన్న తిరుమల గురించి తమ తమ కావ్యాలలో, సాహిత్యాలలో రాశారు .. రాస్తున్నారు .. రాస్తూనే ఉంటారు కూడా. అసలు తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదని స్వయానా మఠాధిపతులు, పీఠాధిపతులు చెబుతూ వస్తున్నారు.



వైకుంఠ గుహ

ఇంతకీ … ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే, తిరుమల కొండలలో అతి పురాతనమైన వైకుంఠ గుహ ఉందని పురాణాలలో చెప్పబడటం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామే ఆ గుహలో దాక్కునేవారట.
వైకుంఠ గుహ చరిత్ర
ఇక్కడ చెప్పబోయే గాధ అప్పుడెప్పుడో త్రేతాయుగం నాటిది. అదేమంటే, రావణాసురుడు అపహరించుకొని పోయిన సీతాదేవిని వెతుక్కుంటూ రామలక్ష్మణులు వానర సేనతో కలిసి అడవిబాట పట్టారు. అప్పుడు వారు వెంకటాద్రి అనే దివ్య గిరికి చేరుకున్నారు. అప్పుడు అక్కడ వారికి ఆంజనేయుని తల్లి అంజనాదేవి తపస్సు చేస్తూ కనిపించింది. రాముణ్ణి చూసిన అంజనాదేవి ఆనందపడుతూ .. నమస్కరిస్తూ … రండి అని ఆహ్వానించింది.



ఆకాశగంగ తీర్థంలో స్నానం చేసిన రామలక్ష్మణులు అంజనాదేవి కుటీరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. అయితే వెంట వచ్చిన వానరసేన మాత్రం వేంకటాద్రిలోని అన్ని ప్రదేశాలను తిరుగుతూ ఉండగా, శ్రీవారు ప్రస్తుతం ఉన్న కొలనుకు ఈశాన్య దిశలో ఒక గుహ కొంత మంది వానరుల కంటపడింది. వెలుగులు చిమ్ముతూ ఈ గుహ కనిపించడంతో వానరులందరూ అందులోకి వెళ్లి చూడగా ప్రకాశిస్తున్న మహానగరం కనిపించింది.




అక్కడ వానరులకు ఎంతోమంది స్త్రీ, పురుషులు కనిపించారు. వారందరూ శంఖు చక్రాలను ధరించి మల్లెపూవువలె తెల్లని వస్త్రాలను ధరించి ఉన్నారు. ఇంకాస్త లోపలికి వెళ్ళి చూడగా నగరం మధ్యలో సూర్యకాంతిలో వెలిగిపోతున్న ఒక దివ్యవిమానం కనిపించింది.


సూర్యకాంతిలో ప్రకాశిస్తున్న ఆ దివ్య విమానం నడుమ భాగాన ఉన్న ఆదిశేషుని వేయి పడగల పై పడుకొని ఉన్న శ్రీ మహావిష్ణువు వానరులకు దర్శనమిచ్చారు.
ఇదంతా చూసిన వానరులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వారు ఆ ఆశ్చర్యము నుండి తెరుకొనే లోపే ఆ గుహ మాయమయింది.. జరిగిన విషయాన్ని మిగితా వానరసేనలకు చెప్పగా, సరేనని అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. అయితే వారికి అక్కడ ఎంత వెతికినా ఆ గుహ జాడ తెలియలేదు


.
వెంటనే జరిగిన విషయాన్ని శ్రీరామచంద్రులకు చెప్పుకున్నారు. అప్పుడు వానరులతో రాముడు – ‘మీరు తిరుమల కొండలను చూడడమే మహా అదృష్టం. శ్రీనివాసుడు తిరుమల గిరులలో ఏ సమయంలో ఎక్కడైనా ఉంటారు. కేవలం ఆ గుహ ఒక్కటే కాదు ఇలాంటి గుహలు తిరుమలలో ఎన్నో ఉన్నాయి. ఆయన అన్ని చోట్లా ఉంటాడు. ఆయన లేని చోటంటూ లేదు.’ అని అన్నాడు.
‘విశ్రాంతి కోసం అప్పుడప్పుడు శ్రీనివాసుడు వైకుంఠ గుహలో సేదతీరుతుంటారు. అలాంటి గుహలోకి వెళ్ళడం ఎవరికైనా అసాధ్యమే’ అని శ్రీరాముడు వివరిం
షేర్ చేయండి share this

చాడట. తిరుమల కొండలలో ఇప్పటికీ అలాంటి ఎన్నో గుహలు ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు.
పురాణాలు కూడా తిరుమల గిరులలో ఉన్న గుహల గురించి పేర్కొన్నాయని . . మఠాధిపతులు, స్వామీజీ లు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో వీటి గురించి ప్రస్తావించారని చెబుతుంటారు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఏ గుహలో రహస్యంగా సేదతీరుతాడో ఆయనకొక్కరికే తెలుసని … ఇది వినటం తప్ప, చూడటానికి ఆ భాగ్యము కలగదని, ఒకవేళ కలిగిన ఎవరికి ఎప్పుడు కలుగుతుందో చెప్పడం కష్టమని అంటారు.