Thursday, 29 December 2016

ఒక్క ఇన్విటేషన్, 10వేల మంది గెస్టులు..! అంతా ఫేస్ బుక్ మహిమ..!

ఏదైనా శుభ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఆహ్వాన పత్రికలపై ‘అందరూ ఆహ్వానితులే’ అని రాస్తుంటారు.  మెక్సికోలో ఓ కుటుంబం కూడా ఇలాంటి ఆహ్వానాన్నే అందించింది. అయితే ఆ ఆహ్వానానికి అనూహ్య స్పందన లభించింది. వేల సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. అందరినీ షాక్ కు గురిచేశారు. 
లాటిన్‌ అమెరికాలో అమ్మాయిల 15వ జన్మదినాన్ని ‘క్విన్సీనెరా’ పేరుతో ఘనంగా జరుపుతుంటారు. మెక్సికో వాసి క్రెసెన్సియో తమ కుమార్తె రూబీ ఇబర్రా ‘క్విన్సీనెరా’ వేడుకను నిర్వహిస్తున్నామని, అందరూ ఆహ్వానితులేనని పేర్కొంటూ వీడియో రూపంలో ఆహ్వానాన్ని ఫేస్‌ బుక్‌ లో ఉంచారు.
దాదాపు 13 లక్షలమంది  రూబీ క్విన్సీనెరా వేడుకకు హాజరుకాబోతున్నట్లు ప్రకటించారు. ఓ విమానయాన సంస్థ అయితే వేడుకకు హాజరయ్యేవారి కోసం టిక్కెట్లపై రాయితీ కూడా ప్రకటించింది. దీంతో కేవలం 200 మంది నివసించే కుగ్రామమైన లా జోయాలో పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. వేడుకకు దేశం నలుమూలల నుంచి దాదాపు 10 వేలమంది అతిథులు హాజరయ్యారు.
వాయిస్: రూబీ క్వీన్సీనెరా వేడుకను చూసి అందరూ షాక్ కు గురయ్యారు. ఒక్క ఫేస్ బుక్ ఇన్విటేషన్ కు ఇంత భారీ స్పందనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణకు సన్నిహితుడైన డాక్టర్ గుణశేఖర్ యాదవ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. తిరుపతిలోని ఆయన నివాసంలో గత మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సుమారు 400 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను గుర్తించినట్టు సమాచారం. అయితే ఈ వివరాలను సంబంధిత శాఖాధికారులు గోప్యంగా ఉంచారు. అయితే మంత్రి నారాయణకు గుణశేఖర్ బినామీగా 
 ఉన్నారనే వార్త ప్రచారంలో ఉంది. 

బ్రేకింగ్ : విరాట్ – అనుష్క ఎంగేజ్ మెంట్

మ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్కశ‌ర్మ‌ల‌కు ఎంగేజ్‌మెంట్ అయింద‌న్న వార్త షికారు చేస్తోంది. ఇందుకు డెహ్రాడూన్ వేదిక‌గా నిలిచిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని లైవ్ హిందుస్తాన్ .కామ్ అనే వెబ్‌సైట్ తెలిపింది. తెహ్రీలో ఉన్న అనుష్క త‌ల్లిదండ్రుల‌ను క‌లిసేందుకు విరాట్-అనుష్క జంట వెళ్లిన‌ట్లు ముంబై మిర్ర‌ర్ ప‌త్రిక వెల్ల‌డించింది. కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల్లో పాల్గొనేందుకు విరాట్ త‌ల్లి కూడా అక్క‌డికి వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.
ప్ర‌స్తుతం విరాట్- అనుష్క‌లు ఉత్త‌రాఖండ్‌లోని న‌రేంద్ర‌న‌గ‌ర్‌లో ఉన్న ఆనందా హోట‌ల్‌లో బ‌స‌చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి ఓ పార్టీ ఇవ్వ‌నున్నార‌ని ఈ పార్టీకి బిగ్‌బీ అమితాబ్‌తో పాటు కుటుంబ‌స‌భ్యులు, అనిల్ అంబానీ కుటుంబ స‌భ్యులను ఆహ్వానించిన‌ట్లు లైవ్‌ హిందుస్తాన్ ప‌త్రిక తెలిపింది. ఇందులో భాగంగానే అమితాబ్ బ‌చ్చ‌న్‌, జయా బ‌చ్చ‌న్‌, అనిల్ అంబానీ, టీనా అంబానీలు డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఫోటోల‌ను పోస్ట్ చేసింది.
సోష‌ల్ మీడియాలో అనుష్క పోస్ట్ చేసిన ఓవీడియో హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌టం, వీరిద్ద‌రికీ ఎంగేజ్‌మెంట్ అయిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది. అంతేకాదు ఓ పూజారితో విరాట్ – అనుష్క‌ల జంట దిగిన ఫోటో లీక్ అవ‌డంతో క‌చ్చితంగా వీరిద్ద‌రికీ ఎంగేజ్‌మెంట్ అయిఉంటుంద‌నే వార్త  ప్ర‌చారంలో ఉంది.

పెద్ద‌ప‌ల్లి – నిజామాబాద్ రైల్ స‌ర్వీస్ స్టార్ట్

ద‌శాబ్దాలుగా ఎదురుచూస్తున్న పెద్ద‌ప‌ల్లి, నిజామాబాద్ జిల్లాల ప్ర‌జ‌ల క‌ల ఫ‌లించింది. సికింద్రాబాద్ నుంచి పెద్ద‌ప‌ల్లి-నిజామాబాద్ రూట్లో రైలు స‌ర్వీసును రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్ర‌భు ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు. మ‌రో రైలు స‌ర్వీసును క‌రీంన‌గ్‌-లింగంపేట్- జ‌గిత్యాల నుంచి మోర్తాడ్ వ‌ర‌కు పొడ‌గించారు. ఈ మార్గానికి మ‌రో 25 కిలోమీట‌ర్లు మార్గం పూర్త‌యితే ఐదు జిల్లాల ప్ర‌జ‌ల‌కు లాభం చేకూర‌నుంది. ఢిల్లీలో రైలు స‌ర్వీసును రిమోట్ ద్వారా సురేష్ ప్ర‌భు ప్రారంభించిన కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి ద‌త్తాత్రేయ,నిజామాబాద్ ఎంపీ క‌విత పాల్గొన్నారు. ద‌శాబ్దాల క‌ల నెర‌వేర‌డంతో ఆ ప్రాంత ప్ర‌జ‌ల్లో ఆనందం వెల్లివిరిసింది.

దుబాయ్‌లో ఈ 12 పొరపాట్లు తెలియక చేసినా.

విదేశాలకు వెళ్లేవారు ఆయాదేశాలలో పాటించవలసిన పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి. అవగాహనలేకపోతే ఏం జరుగుతుందో దుబాయ్‌ జైళ్లలో ఉన్న విదేశీ ఖైదీలను అడిగితే తెలుస్తుంది. ప్రపంచంలోనే అత్యంతవిలాసవంతమైన ప్రాంతం దుబాయ్. అక్కడి పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందింది. ఉపాధి కోసం  విదేశాల నుంచి వచ్చేవారి సంఖ్య కూడా బాగా పెరిగింది. దీంతో దుబాయ్‌లో విదేశీయుల సంఖ్య బాగా పెరిగింది. కానీ అక్కడ అమలు చేసే నియమనిబంధనలపై సరైన  అవగాహన లేకపోవడంతో చిన్నచిన్న పొరపాట్లు చేసి జైళ్ల పాలవుతున్నారు. దుబాయ్ నివసిస్తున్న వారు ఈ 12 చిన్న విషయాలపై అవగాహన పెంచుకుంటే నేరాలకు దూరంగా ఉన్నట్టుగా భావించవచ్చు.  
 
1. డ్రగ్స్ వాడకం దుబాయ్‌లో పూర్తిగా నిషిద్ధం. డ్రగ్స్ అమ్మినా, కొన్నా నేరమే. జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందే. డాక్టర్లు సూచించిన మందులను పొందడం మాత్రమే అక్కడ సాధ్యమవుతుంది.
 
2. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపని మటాషే. కేవలం బార్లలో, ఇంట్లో, కేటాయించిన ఇతర ప్రదేశాల్లో మాత్రమే తాగాలి. లేదంటే ఫలితం తీవ్రంగా ఉంటుంది.
 
3. అశ్లీలంగా దుస్తులు ధరించడం, బీచ్‌లలో పొట్టి దుస్తులు ధరించడం దుబాయ్‌లో పూర్తీగా నిషిద్ధం. మహిళలు శరీరాన్ని కనిపించకుండా దుస్తులు ధరించాలి. పురుషులు కూడా వీదులలో తిరిగేటప్పుడు శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.
 
4. వీదులలో పెద్దపెద్ద శబ్ధాలతో పాటలు పెట్టడం, డ్యాన్స్‌లు చేయడం నేరం. కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే పాటలు వినాలి, డ్యాన్స్‌లు చేయాలి. లేదంటే శిక్ష తీవ్రంగా ఉంటుంది. 
 
5. నిబంధనల గురించి తెలియని ఓ బ్రిటిష్ దంపతులు ఓ బీచ్‌లో సెక్స్‌లో పాల్గొన్నారు. ఇద్దరూ జైలు పాలయ్యారు. అంతేకాదు పబ్లిక్ ప్రదేశాల్లో ముద్దుపెట్టుకున్నా సరే నేరమే.
 
6. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా దూషణలు చేయకూడదు. తెలిసీతెలియని మాటలు ఇస్లాంను కించపరిచేలా ఉంటే నేరం చేసినట్టే. శిక్షార్హులు అవుతారు.
 
7. దుబాయ్ పెద్ద కాస్మోపాలిటన్ నగరమే. కానీ అక్కడ డ్రెసింగ్ స్టైల్ మాత్రం కట్టుబాట్లకు విరుద్ధంగా ఉండకూడదు. మహిళలు టైట్ జీన్స్, షార్ట్స్, స్కట్స్ ధరించడం నిషేదం. నిబంధనలను జవదాటితే శిక్షఅనుభవించాల్సిందే.
 
8. అనుమతి లేకుండా ఏది కనబడితే అది, ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీస్తే తగిన మూల్యం చెల్లించాల్సిందే. ముఖ్యంగా మహిళల ఫోటోలు తీసేటప్పుడు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.
 
9. దుబాయ్‌లో నేరాల రేటు తక్కువగానే ఉంటుంది. కానీ జేబు దొంగతనాలు ఎక్కువగా ఉంటాయి. కాబ్బట్టి పర్స్‌ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
 
10. పెళ్లి కాకుండా అక్రమసంబంధాన్ని కలిగిఉండడం నేరం. శిక్ష ఘోరంగా ఉంటుంది. జైలు కూడు తినాల్సిందే.
 
11. ముస్లింలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పడు పబ్లిక్ ప్రదేశాల్లో తినడం, మద్యంతాగడం, ధూమపానం చేయడం నేరం. చీవింగమ్‌లాంటివి నమలడం కూడా నేరమే.
 
12. ఎడమచేతిని ఉపయోగించడం తగ్గించాలి. ఎందుకంటే.. ముస్లిం సంస్కృతిలో ఎడమచేతిని అపరిశుభ్రతకు చిహ్నంగా భావిస్తారు. కావున ఎడమ చేతితో నమస్కారం చేయడం, కరచాలనం చేయడం, భోజనం చేసేటప్పుడు ఎడమచేతిని ఉపయోగించకూడదు. భోజనం చేసేటప్పుడు ఎడమ చేతితో ఆహారపదార్థాలను ముట్టుకోవడం, అందించడం తప్పు.
 
పైన తెలిపిన 12 విషయాలలో జాగ్రత్తలు పాటిస్తే దుబాయ్‌లో జైళ్ల పాలయ్యే విదేశీయుల సంఖ్య తగ్గేఅవకాశం ఉంటుంది.

అభిమానం కలవరపరిచింది

: తమకిష్టమైన నటీనటులను చూడాలని, వారి ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. కానీ ఈ అభిమానం హద్దులు దాటితే?.. ఫ్యాన్స్‌ తమను తాము ఇష్టపడేదానికన్నా ఎక్కువగా నటీనటులను ఇష్టపడితే దాని పరిణామాలు వేరుగా ఉంటాయి. తాజాగా ఇలాంటి అనుభవమే ‘రన్‌ రాజా రన్‌’, ‘కొలంబస్‌’, ‘టైగర్‌’ చిత్రాల్లో నటించిన నటి సీరత్‌ కపూర్‌కు ఎదురైంది. ఓ అభిమాని ఆమెపై ఉన్న ప్రేమను తెలుపుతూ.. తన చేయిపై ‘ఎస్‌’ ఆకారంలో గాటు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఆమెకు తెలుపుతూ.. ఫొటోను పంపాడు. దీన్ని చూసిన తర్వాత తనకు మాటలు రాలేదని సీరత్‌ ఆవేదన చెందారు. తన ట్విట్టర్‌లో ‘ముందు మిమ్మల్ని మీరు ప్రేమించండి’ అని ఒక పోస్ట్‌ చేశారు. జీవితం చాలా విలువైనది.. అలాగే మీరు కూడా. ఎవరి కోసమో మీకు మీరు హాని చేసుకోవద్దు.. అంటూ ఫ్యాన్స్‌కు సూచించారు. దీనిని రకుల్‌ రీట్వీట్‌ చేస్తూ ఇది చాలా కలవరపరిచే విషయమని పేర్కొన్నారు.

కుమారులు, మాజీ భార్యతో హృతిక్‌ ట్రిప్‌

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ తన భార్య సూసన్‌ నుంచి రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు తమ పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉండాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడూ కలుస్తున్నారు. ఇటీవల దుబాయ్‌ రెస్టారెంట్‌లో ఇద్దరు కుమారులతో సహా కనిపించిన హృతిక్‌, సూసన్‌ తాజాగా విహారయాత్రకు దుబాయ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా బీచ్‌లో దిగిన ఫొటోను సూసన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. చాలా సంతోషకరమైన రోజని పోస్ట్‌ చేశారు.
హృతిక్‌ క్రిస్మస్‌ వేడుకలను తన ఇద్దరు పిల్లలతో కలిసి ఫ్రెంచ్‌ ఆల్ప్స్‌లో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మంచు కొండల్లో దిగిన ఫొటోను ఆయన ట్విట్టర్‌ ద్వారా పంచుకుంటూ.. క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఇప్పుడీ కుటుంబం దుబాయ్‌ చేరింది.