Friday, 30 December 2016

డేంజర్ : 3 గంటల్లోనే కోట్ల అకౌంట్స్ హ్యాక్

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత క్యాష్ లెస్ ట్రాన్సాక్ష‌న్స్ చేయాలంటూ కేంద్రం విప‌రీతంగా ప్ర‌మోట్ చేస్తోంది. అయితే కార్డ్‌తో లావాదేవీలు జ‌ర‌ప‌డం ఎంత‌వ‌ర‌కు సుర‌క్షితం అనేదే పెద్ద ప్ర‌శ్న‌గా మిగులుతోంది. అంతేకాదు కార్డుతో లావాదేవీలు జ‌రిపితే బ్యాంక్ అకౌంట్ల‌నే హ్యాక్ చేసే కేటుగాళ్లు త‌యార‌య్యారు. ఆ త‌ర్వాత మ‌న‌కు తెలియ‌కుండానే ఖాతాలోని డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తూ ఆన్‌లైన్ చోరీల‌కు పాల్ప‌డుతున్నారు హ్యాక‌ర్స్‌.
తాజాగా ఓ ప్ర‌ధాన బ్యాంక్‌నుంచి ప‌లువురి ఖాతాలు హ్యాక్ చేశారు ఐదుగురు యువ‌కులు. ఢిల్లీ ప‌రిస‌రాల్లో ఉన్న గురుగ్రామ్ సాఫ్ట్‌వేర్ కంపెనీల‌కు పెట్టింది పేరు. అక్క‌డే బ‌గ్స్ బౌంటీ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఓ ఐదుగురు యువ‌కుల‌ను నియ‌మించుకుంది. ఈ ఐదుగురు ఏమి చేస్తారో తెలిస్తే నోళ్లెళ్ల బెడ‌తారు. వారి ప‌ని ఓ ప్ర‌ధాన బ్యాంకు అకౌంట్ల‌ను హ్యాక్ చేయ‌డ‌మే. ఎవ‌రైతూ బ్యాంక్ ఖాతాల‌ను ముందుగా హ్యాక్ చేస్తారో వారికి ల‌క్ష రూపాయ‌లు బ‌హుమ‌తి కూడా ప్ర‌క‌టించింది ఆ కంపెనీ. ఇక రేస్ మొద‌లైంది. ఐదుగ‌రు ఐదు ల్యాప్‌టాప్‌లు తీసుకుని ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. కేవ‌లం 3 గంట‌ల్లోనే ఓ ప్ర‌ధాన బ్యాంకుకు సంబంధించిన వివ‌రాల‌న్నిటినీ రాబ‌ట్టి వంద‌ల కోట్ల రూపాయ‌లు తారుమారు చేసేందుకు రూట్ క‌నుగొన్నారు. అంటే అకౌంట్ల‌ను హ్యాక్ చేశారు.
కంగారు ప‌డ‌కండి. బ‌గ్స్ బౌంటీ కంపెనీ నియ‌మించుకుంది నిజ‌మైన కేటుగాళ్ల‌ను కాదు. మ‌న బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ఎంత ప‌టిష్టంగా ఉందో ఆన్‌లైన్ సెక్యూరిటీ ఎంత సుర‌క్షితంగా ఉందో తెలిపేందుకు ఈ ఐదుగురు యువ‌కుల‌ను రిక్రూట్ చేసుకుంది. ఈ కుర్రాళ్లు కేవ‌లం 3 గంట‌ల్లోనే మ‌న బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో ఉన్నఆన్‌లైన్‌ లొసుగుల‌ను బ‌య‌ట‌పెట్టారు. హ‌ర్జీత్ అనే వ్య‌క్తి ఓ ప్ర‌ధాన బ్యాంక్‌కు సంబంధించిన రౌట‌ర్‌ను హ్యాక్ చేశాడు.
బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల‌కు ఏదైనా లావాదేవీల‌పై ఏమైనా సందేహం క‌లిగినా అది రౌట‌ర్ ద్వారానే జ‌రుగుతాయి. ఇప్పుడు పాస్‌వ‌ర్డ్, రౌట‌ర్‌పై నియంత్ర‌ణ నా చేతుల్లో ఉంది. ఇప్పుడు బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల లావాదేవీలను నేను ఓ ఫేక్ సైట్ క్రియేట్ చేసుకుని అందులోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేయొచ్చు. వారు లావాదేవీలు జ‌ర‌పాలంటే లాగిన్ ఐడీ పాస్ వ‌ర్డ్‌లు త‌ప్ప‌కుండా ఇవ్వాలి గ‌న‌క‌.. ఈ ప్రాసెస్‌లో లాగిన్ ఐడీ పాస్‌వ‌ర్డ్‌ను హ్యాక్ చేసేస్తా అని హ‌ర్జీత్ తెలిపాడు.
ఇదే ప‌ద్ధ‌తిని క్రిమిన‌ల్స్ అవ‌లంబిస్తే కొన్ని ల‌క్ష‌ల కోట్లు తారుమార‌య్యే ఆస్కారం ఉంద‌ని హ‌ర్జీత్ తెలిపాడు. త‌మ వెబ్‌సైట్ ఎంత సుర‌క్షితంగా ఉందో ప‌రీక్షించి,  అన్ని ప‌ద్ద‌తుల్లో త‌మ సైట్ల‌ను హ్యాక్‌ చేసి వాటికి ప‌రిష్కారం ఇవ్వాల‌ని చాలా కంపెనీలు ఆహ్వానం పంపుతాయ‌ని హ‌ర్జీత్ పేర్కొన్నాడు.
ఇంట్లో కూర్చొనే చాలా వెబ్‌సైట్ల‌ను హ్యాక్ చేయొచ్చు కానీ అలా చేయ‌మ‌ని,  దేశ‌భ‌ద్ర‌తే త‌మ‌కు ముఖ్య‌మ‌ని క్రిమిన‌ల్ హ్యాక‌ర్స్ నుంచి మ‌న ఆన్‌లైన్ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ట‌ప‌ర‌చ‌డ‌మే త‌మ ప‌ని అని మ‌రో కుర్రాడు జోరీ చెప్పాడు.

రాష్ట్రపతి నిలయంలో గ్రాండ్ గా ఎట్ హోం ఫంక్షన్

రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. నేతలు, ప్రముఖుల రాకతో ప్రెసిడెంట్ హోం సందడిగా మారింది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన  ప్రణబ్ … ఇవాళ సాయంత్రం రెండు రాష్ట్రాల నేతలకు విందును ఏర్పాటు చేశారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, మాజీ గవర్నర్ రోశయ్య, డిప్యూటీ సీఎం  మహమూద్ అలీ,  స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు జి.వివేక్, విపక్ష నేతలు, అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.  రాష్ట్రపతిని కలిసేందుకు ప్రముఖులు కూడా వచ్చారు. ఈ నెల 22న నగరానికి వచ్చిన రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. హైదరాబాద్ తో పాటు తిరువనంతపురం, మైసూర్, బెంగళూర్, ఏపీలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ్టితో ప్రెసిడెంట్ వింటర్ టూర్ ముగిసింది. దీంతో రేపు ఉదయం ఆయన స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లనున్నారు.

జియో కస్టమర్లకు శుభవార్త

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన కస్టమర్లకు అభయమిచ్చింది. టెలికం రంగం చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా బంపర్ ఆఫర్స్ ప్రకటించింది జియో. కస్టమర్లకు మూడునెలల పాటు ఉచిత వాయిస్, డాటా, ఎస్ ఎమ్ ఎస్ లను ప్రకటించిన సంగతి తెలిసిందే. హ్యాపి న్యూ ఇయర్ పేరుతో మరో మూడు నెలలు ఉచిత సేవలు అందిస్తున్నట్టు డిసెంబర్ మొదటి వారంలో వెల్లడించారు ముఖేష్ అంబానీ. దీనిపై ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ కంపెనీలు మండిపడ్డాయి. జియో దెబ్బకు కొన్ని కంపెనీలు మూత పడ్డాయి.
హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్  పేరుతో మరో 90 రోజులు పొడిగించిన ఆఫర్ పై ట్రాయ్ లో ఫిర్యాదు చేశాయి రైవల్ కంపెనీలు.  ఈ ఆఫర్ పొడిగింపు నిబంధనల ఉల్లంఘన కిందకు ఎందుకు రాదో వివరణ ఇవ్వాలని రిలయన్స్‌ను కోరింది టెలికం రెగ్యులేటరీ అథారిటీ(TRAI).
హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పై వివరణ ఇచ్చింది జియో. తాము ప్రకటించిన రెండు ఫ్రీ ప్యాకేజీలు వేర్వేరని తెలిపింది. వెల్ కం ఆఫర్ ముగిసినా..దానికి రీచార్జ్ చేసుకునే అవకాశం లేదని ప్రకటించింది. హ్యాపి న్యూ ఇయర్ ఆఫర్ లో ఈ అవకాశం ఉందన్నారు. కస్టమర్లు కొనసాగాలనుకుంటే.. మళ్లీ రీఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. ట్రాయ్ నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చింది జియో.
యమలోకం టు భూలోకం...
* యమలోకంలో హైఅలర్ట్...
* యమపాశము, కాలపాశము, దున్నపోతులు మరిన్నికొనుగొలు...
* యమపూరి సిబ్బందికి సెలవులు రద్దు..
* సెలవుల్లో వున్నవారు తక్షణమే విధులకు హాజరు కావాలని ఆదేశాలు..
* ఉన్నతాధికారులతో యముడు సమీక్ష...

డిసెంబర్ 31 రద్దీ నేపథ్యంలో యమలోకం అప్రమత్తమయ్యింది ..ఉన్నతాధికారులతో శుక్రవారం యముడు సమీక్ష నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్ప తాగి ప్రమాదాల్లో పోయే కుర్రాళ్ళను ఎప్పటికప్పుడు తీసుకువచ్చేందుకు సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు..అవసరమైతే దినసరి వేతనానికి అదనపు సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు...మద్యం అలవాటు వున్న భటులను భూలోకానికి పంపించవద్దని సూచించారు.
.
ఆసుపత్రులు..గొడవలు జరిగే ఏరియాల్లో ప్రత్యేక దళాలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ..మద్యం దుకాణాల వద్ద గస్తీ ముమ్మరం చేయాలని చెప్పారు ...ఎక్కువుగా తాగే కుర్రాళ్ళను గుర్తించి అవసరమైతే వాళ్ళ బండ్లు వెనక భటులను పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు...రాత్రి 12 దాటిన తర్వాత భటులకు పనిభారం పెరుగుతుందని అయినా అలసట చెందకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు...ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడి జాబితా సిద్దం చేయాలన్నారు...ఎంతమందిని తీసుకువచ్చినా ఇబ్బంది లేదని యమలోకంలో రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేసామని చెప్పారు..
.
కుర్రాళ్ళు ఎక్కువుగా వుండే అవకాశం వున్నందున వారి కోసం ఇంటెర్నెట్ సదుపాయం కల్పించామని చెప్పారు...రావడానికి మారం చేసే వాళ్ళపై కటినంగా వ్యవహరించాలన్నారు..గత యేడాది మందు ఎక్కువై కాలవల్లో పడిపోయిన వారిని కూడా భటులు పొరపాటున తెచ్చి తొక్కిసలాటకు కారణం అయ్యారని గుర్తు చేసారు..
.
ఈ సారి అలాంటి తప్పిదం జరగకుండా చూడాలని అన్నారు...కొంత మంది అమ్మ కావాలి నాన్న కావాలి చెల్లిని అక్కని చూడాలి అని ఇబ్బంది పెడతారని వాళ్ళ మాటలు నమ్మవద్దని అన్నారు..వాళ్లకి నిజంగానే ప్రేమ వుంటే అంతలా తాగి బండి నడపరని ఈ విషయాన్ని భటులు గుర్తించాలన్నారు....లక్కీ డ్రాప్ అంటూ వాళ్ళు తాగే చివరి మందు చుక్కలు వాళ్ళ అమ్మ నాన్న కన్నీటి చుక్కలని ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పొద్దని అన్నారు...ఒక్క రాత్రి వారి ఆనందం అయినవారికి ఎన్నో రాత్రుల విషాదమనే విషయాన్ని ఎట్టి పరిస్తితుల్లో వారికి తెలియనివ్వోద్దని యముడు ఆదేశించారు..ఈ సమీక్షలో చిత్రగుప్తుడు, యమలోక ఉన్నతాధికారులు, సీనియర్ పాపులు పాల్గున్నారు...

శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం” ఎక్కడవుందో..?

శ్రీ లక్ష్మీ నారాయణి “స్వర్ణ దేవాలయం” తమిళనాడు రాష్ట్రంలో వేలూరు “మలైకుడి” అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది. చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
దీని నిర్మాణసారధి “నారాయణి అమ్మ” అనే స్వామి. ఆయనను “శక్తి సిద్ధ” అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ స్వర్ణ దేవాలయం 55,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది. దీని “గర్భ గుడి” సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలు సిసలైన “బంగారం”తో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం వలన దీనికి “స్వర్ణ దేవాలయం”అని పేరు వచ్చింది. ఆలయ ఆవరణం “నక్షత్రం” ఆకారంలో ఉంటుంది. గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహిబ్ నుండి సేకరించిన శ్లోకాలతో పొందుపరచ బడి ఉంటాయి.
ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ “ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు”. కాని “శ్రీ విద్య” అనే ప్రాచీనమైన, అరుదైన “శక్తి పూజా” విధానాన్ని అనుసరిస్తారు.
నారాయణి అమ్మ స్వామి ఏర్పాటు చేసిన సంస్థకు సుమారు ఆరు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు దీని ద్వారానే లభించాయని ఆయన తెలియజేశారు. ఆయన అంతకు మునుపే పేదరిక నిర్మూలనకూ, వికలాంగులకూ సహాయం చేశారు. మూడు కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్న దాదాపు 600 దేవాలయాలను “జీర్ణోద్ధరణ” కూడా కావించారు.
ఇక్కడ విశేషమేమంటే, ఈ దేవాలయములో గర్భగుడికి “మూడు వైపులా” నీరు, ఒకవైపు ద్వారం వుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఆ నీటిని పవిత్రమైనదిగా భావిస్తారు.
శుభం భూయాత్.!

స్థిరమైన ఐశ్వర్యం కోసం…..

ఆకుపచ్చ చీర కట్టుకున్న శ్రీ మహాలక్ష్మికి ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టు ఉండే చిత్రపటాన్ని తూర్పు వైపు ఉంచి, రోజూ మహాలక్ష్మి అష్టకం చదవాలి. ప్రతి శుక్రవారం తులసిమాల వెయ్యాలి. దీనివల్ల లక్ష్మి చాంచల్యం తగ్గి స్థిరమైన ఐశ్వర్యం లభిస్తుంది.

మనసులోని కోరిక నెరవేరాలంటే……

ఏదైనా మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి 21 రోజులు ఆంజనేయస్వామి చిత్రపటం ముందు సీతారామస్తోత్రాన్ని 11 మార్లు పారాయణ చేయాలి. చివరిరోజు హనుమంతుడికి అప్పాలు నైవేద్యంగా పెట్టాలి.
శ్రీ సీతారామ స్తోత్రమ్
——————-
అయోధ్యా పుర నేతారం మిథిలా పుర నాయికాం !
రాఘవాణాం అలంకారం వైదేహీనాం అలంక్రియాం !!
రఘూణం కుల దీపం చ నిమీనం కుల దీపికం !
సూర్య వంశ సముద్భూతమ్ సోమ వంశ సముద్భవాం !!
పుత్రం దశరథస్యాద్యమ్ పుత్రీం జనక భూపతే!
వసిష్టాను మతాచారం శతానంద మతానుగం !!
కౌసల్యా గర్భ సంభూతం వేడి గర్భోదితం స్వయం !
పుండరీక విశాలాక్షం స్ఫురదిందీ వరేక్షణాం !!
చంద్రకాంతాననాంభోజం చంద్ర బింబోపమాననం !
మత్త మాతంగ గమనం మత్త హంస వధూ గతాం !!
చందనార్ద్ర భుజా మధ్యం కుంకుమార్ద్ర కుచస్థలీం !
చాపాలంకృత హస్తాబ్జం పద్మాలంకృత పాణికాం !!
శరణాగత గోప్తారం ప్రణిపాత ప్రసాదికాం !
కాలమేఘ నిభం రామం కార్త స్వర సమ ప్రభాం !!
దివ్య సింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్ర భూషణాం !
అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్య క్షణ కాంక్షిణూ !!
అన్యోన్య సదృశాకారౌ త్రిలోక్య గ్రహ దంపతి !
ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం !!
అనేన స్తోతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః !
తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !!
ఏవం శ్రీరామ చంద్రస్య జానక్యాశ్చ విశేషతః !
కృతం హనుమతా పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదం
యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వాన్ కామనవాప్నుయాత్ !!
ఇతి శ్రీ సీతారామస్తోత్రం సంపూర్ణం.