Friday, 30 December 2016

లక్ష్మి దేవి మిమ్మల్ని మెచ్చి మీకు సంపదలు ఇవ్వాలంటే. ?

లక్ష్మి దేవి మిమ్మల్ని మెచ్చి మీకు సంపదలు ఇవ్వాలంటే. ?????
“ధనం మూలం ఇదం జగత్” అన్నారు మన పెద్దలు,అయితే లక్ష్మి దేవికి చెంచు లక్ష్మి అని కూడా పేరు ఉంది, అంటే ఆవిడా ఒక చోట స్తిరంగా ఉండదు.అందుకే ఆవిడా అనుగ్రహం పొందాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయ్,అవేమిటో ఇపుడు చూద్దాం.
లక్ష్మి గణపతిని పూజించడం:-
లక్ష్మి గణపతి అంటే లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం అయితే ఎక్కడైతే అయన పూజింపబదాతాడో,అక్కడ లక్ష్మి అమ్మవారు స్థిరంగా ఉంటుంది,అంతే కాదు గణపతి పేరు కూడా లక్ష్మి గణపతి అని వచ్చింది.
తామర పువ్వులతో:-
లక్ష్మి అమ్మవారు పాలా సముద్రం నుండి తామర పువ్వుతో బైటకి వచ్చింది,అందుకే ఆవిడకి తామర పువ్వు తో ఆవిడను పూజిస్తే ఎంతో సంతోషించి మనల్ని అనుగ్రహిస్తుంది.
ఇంటిని,ఇంటి వాకిలిని శుభ్రంగా ఉంచాలి
హిందూ ధర్మం ప్రకారం గుమ్మము పైన భాగం శక్తి స్వరుపినిగ పూజిస్తే గుమ్మమ్ కింద భాగాన్ని లక్ష్మి దేవిగా పూజిస్తారు అటువంటి గుమ్మానికి మరియు ఇంటి ప్రధాన ద్వారాన్ని మనం పూజిస్తే,అమ్మవారికి మనం స్వాగతం పలికినట్టే.
సాయంత్రం వేళలో నిద్రపోవడం
సాయంత్రం నిద్రపోవడం వల్ల అమ్మవారి కోపానికి గురికావడం ఖాయం అంతే కాకుండా లక్ష్మి దేవి సోదరి ఐన జ్యేష్ట దేవి( ఎవరైతే దరిద్రాన్ని ఇస్తుందో) ఆ దేవతా మన ఇంటికి వస్తుంది,అందుకే సంధ్య వేళల్లో నిద్ర అనేది ఎప్పుడు పోరాదు.

శుక్రవారం రోజు లక్ష్మీ దేవిని ఈ చక్రంతో ఇలా పూజిస్తే..అమ్మ వారి అనుగ్రహం తో పాటు సిరిసంపదలకు లోటు ఉండదు.

లక్ష్మి దేవి అనుగ్రహం, చక్కటి ఆరోగ్యం కోసం శుక్రవారం రోజు గోమతి చక్రాన్ని పూజా మందిరంలో ఉంచుకోవాలి. ఈ గోమతి చక్రం చూడటానికి శ్రీ మహా విష్ణువు యొక్క ఆయుధమైన శుదర్సన చక్రం ఆకారంలో ఉంటుంది కాబట్టి, లక్ష్మి దేవి యొక్క జన్మ స్థానం అయినటువంటి నీటిలో లభిస్తుంది కాబట్టి లక్ష్మి దేవికి గోమతి చక్రం అంటే ఎంతో ప్రీతీ దాయకమైనదని శాస్త్రాలు వర్ణించడం జరిగింది.
ॐ ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతుంటే.. వాళ్ళందరూ తప్పనిసరిగా గోమతి చక్రాన్ని ఉపయోగిస్తే మంచిది. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో గోమతి చక్రాన్ని వేసి, ‘ఓం వం ఆర్యోనికరీ రోగానశేషా నమః’ ఈ మంత్రాన్ని 21 సార్లు జపించిన తరువాత గ్లాసులో నుంచి గోమాతిచాక్రాన్ని తీసివేసి ఆ నీటిని తీసుకుంటే అనారోగ్యం నుండి బయటపడి ఆరోగ్యవంతులం కావడానికి ఎంతో ఆశ్కారం ఉంది.
ॐ రాహు, కేతు, సర్ప దోషాలు ఉన్న వారు శుక్రవారం రోజు పూజ మందిరం లో గోమతి చక్రాలను ఉంచి దానికి పసుపు కుంకుమలను అలంకరిస్తే ఈ దోషాల నుంచి బయట పడవచ్చు.
ॐ చిన్న పిల్లలు దృష్టి దోషంతో బాధ పడతున్నట్టు అయితే గోమతి చక్రాన్ని ఒక వెండి తాయిత్తులో ఉంచి, పిల్లల మేడలో వేస్తే దృష్టి దోషం నుంచి బయట పడవచ్చు.
ॐ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా సంభవించి బాధలు పడే వారు వ్యాపారంలో సింహ ద్వారం ముందు, రెండు గోమతి చక్రాలను ఒక ఎరుపు రంగు వస్త్రంలో అలా వేలాడదియ్యటం ద్వారా, వాటి కిందనుంచి నడవటం వలన వ్యాపారంలో లాభాలు పొందటానికి ఆశ్కారం ఉంది.
ॐ స్త్రీలకు తరచు అబార్షన్లు లాంటివి అవుతుంటే అటువంటి వారు రెండు గోమతి చక్రాలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ధరించడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
ॐ కోర్టు పనులు అలాగే ఏ ఇతర ముఖ్యమైన పనులు మీద బయటకు వెళ్ళినా గోమతి చక్రాని దగ్గర ఉంచుకుంటే మంచి ఫలితం వస్తుంది. గృహ నిర్మాణంలో పునాదులలో నాలుగు వైపులా 11 గోమతి చక్రాలను పెడితే ఎలాంటి వాస్తు దోషం ఉండదు.

ధనప్రాప్తికి శ్రీలక్ష్మీ ద్వాదశ నామస్తోత్రం

ధనప్రాప్తికి శ్రీలక్ష్మీ ద్వాదశ నామస్తోత్రం
త్రైలోక్య పూజితే దేవి కమలే విష్ణు వల్లభే
యధాత్వం సుస్థిరా కృష్ణే తధాభవ మయిస్థిరా
ఈశ్వరీ లక్ష్మీ శ్చలాభూతి ర్హరిప్రియా
పద్మా పద్మాలయా సంప్రదమా శ్రీ: పద్మధారిణీ
ద్వాదశైతాని నామాని లక్ష్మీం సంపూజ్య యః పఠేత్
స్థిర లక్ష్మ్యర్చనే తేస్తు పుత్రదారాదిభి: సహ

లక్ష్మీ దేవి కటాక్షం పొందడానికి ఏం చెయ్యాలి.

రోజు రాత్రి పడుకునే ముందు మీ మంచం కింద రాగి చెంబు పెట్టి అందులో నీరు పోసి ఉంచాలి. ఉదయం లేచిన తర్వాత లక్ష్మీ దేవిని తలుచుకుని ఆ నీటిని గుమ్మం ముందు పారపోయాలి.
మీరు ఇంటికి తడిబట్ట సమయంలో ఆ నీటిలో కొంచెం కళ్ళు ఉప్పును కలపాలి. ఇలా కనీసం నెలలో ఒకసారి చేసినా చాలా మంచి ఫలితం వస్తుంది.
బయట ఎక్కడ నల్ల చీమలు కానీ, తెల్ల చీమలు కానీ ఉన్నచోట వాటికి పంచధార కానీ, బియ్యం పిండి కానీ చల్లాలి.
శ్రీచక్రం..
శ్రీచక్రంలో అమ్మవారికి చుట్టూ ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది మాతృకలు స్థాపించబడ్డారు..వీరు అమ్మవారికి అష్టదిగ్భంధనగా ఉన్న రక్షణ కవచాలు
.. వీరినే అష్టమాతృకలు అని పిలుస్తాం.. వీరిలో తూర్పువైపున బ్రాహ్మీ, దక్షిణమున మహేశ్వరి, పశ్చిమం కౌమారి, ఉత్తరం వైష్ణవి, ఆగ్నేయం వారాహీ, నైరుతి మాహేంద్రి, వాయువ్యం చాముండి, ఈశాన్యం మహాలక్ష్మి అమ్మవార్లు ఉంటారు.. అష్టమాతృకలతో శ్రీయంత్రం అష్టదిగ్భంధనగా చేయబడింది.. దీనికి తంత్రమార్గంలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది.. శ్రీచక్ర తంత్రం తెలిసిన వారు సిద్ది పొందినవారికి లోకంలో ఎటువంటి ఎదురు ఉండదు.. వారే గొప్ప శక్తివంతులు, వారిని ఎంతటి క్షుద్రప్రయోగాలు ఏమీ చేయలేవు..ఈ శ్రీచక్రంతో అష్టదిగ్భంధనం చేయబడిన గృహానికి ఆ గృహంలో నివసించే వారికి ఎటువంటి ఆపదలు, ఆర్థిక బాధలు, క్షుద్ర ప్రయోగాలు దరిచేరలేవు.. ఇలా జరగాలంటే గృహస్థు కూడా ఇంటిలో ప్రతిష్టించబడిన శ్రీచక్రానికి విధిగా పూజాధికాలు నిర్వహిస్తూ నైవేద్యం సమర్పించాలి.. మళ్ళీ కలుద్దాం..శివోహం..
మీకు ఎన్నో రహస్య విద్యలు చెప్పాలని ఉంది..కానీ మాకు సమయం చాలడంలేదు శివా..అందువలననే ఎక్కువగా చెప్పలేకపోతున్నాం... కానీ అన్ని విద్యలు తెలుపుతాం...శివోహం
English language...
Sri chakra...

Sri chakra is a form of mystical diagram, this is formed by 9 interlocking triangles that surround and radiant from a central point.
Sri chakra is a symbol of hindu tantra. In this 8 directions are covered by 8 matrikas(goddesses) to protect sri vidya.
All the 8 sides are covered by....
Braahmi, maheshwari, koumari, vaishnavi, vaarahi, maahendri, chamundi, mahalakshmi.
siddhas who acqire the power of srichakra dont have equallent power opposite. They are very strong and no enchantments will harm them.
Any house or any place protected by ashtadigbandhana of srichakra is safe always. For this head of the house should perforn srichakra pooja daily with some offerings.
****om shivai paramatmane namag****

లక్ష్మీదేవిని ఉసిరికాయ దీపాలతో పూజిస్తే

శ్రీరంగేశహృత్కమలస్థితతేజోవిరాజితసురుచిరపావనాకృతిం
స్వీయాలంకృతబ్రహ్మానందభరితమనోహరాముక్తమాల్యదాం
కలికల్మషఘ్నభక్తమనోరధఫలదాయకకరుణాంతరంగిణీం
శ్రీ గోదాదేవి మమ దేహి కరావలంబం

 క్ష్మీదేవిని ఉసిరికాయ దీపాలతో పూజిస్తే ……….!!
👉�శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది. శుక్రవారం సాయంత్రం ఉత్తర భారతదేశంలో శీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు. దీనివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలు, అనుగ్రహం కలుగుతుంది అని వారి ప్రగాఢ విశ్వాసం.
👉�శంకరాచార్యులవారు విరచించిన కనకధారా స్తోత్రం పఠించిన తరువాత ఉసిరికాయ బొబ్బట్టు లేదా గుజ్జును శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించడం వల్ల శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.
👉�ఉసిరికాయ దీపంతో శ్రీమహాలక్ష్మీదేవికి హారతి సమర్పిస్తే ఇంట్లో ఉన్న దారిద్ర్యం నివారింపబడుతుంది.
👉�అష్టనిధి ప్రాప్తి కోసం కార్తీకమాసంలో ధాత్రి హవనం తరువాత ఉసిరికాయను హోమం పూర్ణాహుతికి సమర్పించండి.
👉�అప్పుల బాధనుండి బయటపడాలంటే ఉసిరికాయ దీపాన్ని శ్రీమహాలక్ష్మీదేవి చక్రానికి ఎనిమిది దిక్కులలో పెట్టి చక్రపూజ చేయాలి.
👉�ఉసిరికాయ గుజ్జు, ఉసిరికాయ పచ్చడి శ్రీమహాలక్ష్మీదేవికి నైవేద్యంగా నివేదించిన తరువాత ముత్తైదువులకు వాయనం ఇస్తే మొండి బకాయిలు వసూలు అవుతాయి.
👉�ఉసిరికాయను శ్రీలక్ష్మీదేవి ‘శ్రీ’ చక్రానికి నైవేద్యంగా నివేదించిన తరువాత దాన్ని అందరికీ పంచితే ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.
👉�శ్రీమహాలక్ష్మీదేవి కవచం లేదా లక్ష్మీదేవి హృదయ స్తోత్రాన్ని పఠించిన తరువాత ఉసిరికాయను దానం చేస్తే నిత్య దారిద్ర్యం నుండి విముక్తి పొంది లక్ష్మీ కటాక్షానికి నోచుకుంటారు.
👉�శ్రీసూక్తం పఠించిన తరువాత శ్రీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ, పాలు నైవేద్యంగా నివేదిస్తే ఇంట్లో ఖర్చు తగ్గిపోయి ఆదాయం వృద్ధి చెందుతుంది.
👉�ఉసిరికాయ చెట్టుకి ప్రతిరోజూ పూజ చేసిన తరువాత నీళ్ళు పోస్తూ నమస్కరిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.
👉�ప్రతిరోజూ రోజూ పూజా చేసే ప్రదేశంలో శంఖం ప్రక్కన ఈశాన్య దిశగా ఉసిరికాయని పెట్టినట్లయితే కుటుంబంలో ప్రశాంతత, శాంతి కలిగిస్తుంది.
👉�ఉసిరికాయ ఊరగాయ పక్కన నివశిస్తున్నవారికి లేదా బంధువుల ఇళ్ళకి పంచితే ఇంట్లోని కలహాలు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి చేకూరి ప్రశాంతవంతమైన జీవనాన్ని సాగిస్తారు.
👉�ఉసిరికాయను చేతపట్టుకుని సంగమ తీరాలలో రెండు లేదా ఎక్కువ నదులు సంగమించే స్థలంలో ప్రాయశ్చిత్త సంకల్పం చెప్పుకున్న తరువాత శివాలయంలో అర్చకులకు దానం ఇస్తే గత కర్మదోషాల నుండి విముక్తి పొందుతారు.
👉�ఉసిరికాయను కాలితో తొక్కిన వారు నిత్య దారిద్ర్యం అనుభవిస్తారు.
👉�ఉసిరికాయను డబ్బులు భద్రపరిచే స్థలంలో ఉంచినట్లయితే ధనం స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది.
👉�ఉసిరికాయ దీపాలను తులసికోట ముందు వెలిగించినట్లయితే దైవ భక్తి వృద్ధి చెందడంతో పాటు అపమృత్యువు నివారింపబడి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
👉�కన్యలు ఉసిరికాయను శుక్రవారం ముత్తైదువులకు పంచిపెట్టినట్లయితే ఇష్టమైన కోరుకున్న కోరికలు ఫలిస్తాయి.
👉�శ్రీ గణపతి హోమంలో శక్తిగణపతిని ధ్యానించి ఉసిరికాయను హోమగుండంలో వేస్తె అన్ని కార్యాలలో జయం మరియు వ్యాపారాలలో అధిక లాభాలు సిద్ధిస్తాయి.
👉�కమలాక్షి మణితో శ్రీమహాలక్ష్మీదేవి జపాన్ని చేసిన తరువాత పండు ముత్తైదువుకి (60 సంవత్సరాలు పైబడిన) తాంబూలంలో పెట్టి దానం చేస్తే శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు…..�
లోకాస్సమస్తాస్సుఖినోభవంతు ,

శబాష్ శ్రీలక్ష్మి....వాట్సప్‌ వేధింపులపై పవర్‌పంచ్!

‘నన్ను ఎప్పుడు రమ్మంటావు? నీ ‘‘రేటు’’ ఎంత’’?.... ‘‘రూ.3000 సరిపోతుందా? ఏదైనా హోటల్ రూమ్ బుక్ చేయమంటావా?’’... కేరళలలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సీఈవో, మోటివేషనల్ స్పీకర్ శ్రీలక్ష్మి సతీష్‌కు గుర్తు తెలియని ఓ వ్యక్తి నుంచి తరచూ వస్తున్న కాల్స్ ఇవి... అది మొదలు అనేక మంది మానవ మృగాల నుంచి ‘‘రేటు’’ అడుగుతూ వరుసగా కాల్స్, మెసేజ్‌లు రావడం మొదలైంది. మరొకడు రూ.25వేలు ఇస్తాను రమ్మంటూ వేధించాడు. దీంతో శ్రీలక్షి తన ఫోన్ స్విచ్చాఫ్ చేసేశారు. అయితే మరో గంటలోనే షాక్ నుంచి తేరుకుని ఎవరైతే ఫోన్లు చేశారో వారిలో ఒకరి నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆమె తన హోదా గురించి చెప్పే సరికి అతగాడు గజగజ వణికిపోయాడు. క్షమించమంటూ వేడుకున్నాడు. ఇతనొక్కడికే కాదు... సదరు వాట్సాప్ గ్రూప్‌లోని సంభాషణల ద్వారా ఈ మొత్తానికి కారణమైన మృగాడి ఫోన్ నంబర్ కూడా కనిపెట్టారామె. ఆయా సంభాషణలను స్క్రీన్‌షాట్ తీసి ఫొటోలు సంపాదించారు. ఈ గ్రూప్‌లో తన ఫోన్ నంబర్ పోస్టు చేసిన వ్యక్తి... ఓ జాతీయ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడని గుర్తించారు. బయటికి మంచి వ్యక్తిలా నటిస్తూ... నీచంగా ప్రవర్తిస్తున్న అతడిపై ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ విషయం పసిగట్టిన సదరు పార్టీ కార్యకర్తలు ఆమెకు ఫోన్ చేసి కాళ్లబేరానికి వచ్చారు. క్షమాపణ చెబుతూ.. కోర్టుబయటే రాజీ కుదుర్చుకుందామని బతిమాలారు. అయితే అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలని, బహిష్కరించినదానికి రుజువుగా పార్టీ సమావేశం మినిట్స్‌ను తనకు అప్పగించాలని శ్రీలక్ష్మి డిమాండ్ చేశారు. దీంతో ఆ యువనేత తండ్రి శ్రీలక్ష్మిని కలుసుకుని పోలీసుకు ఫిర్యాదు చేయవద్దంటూ వేడుకున్నారు. దీంతో ఏదయినా స్వచ్ఛంద సేవా సంస్థకు రూ.25 వేల విరాళం ఇచ్చి... రసీదు తనకు అప్పగించాలని శ్రీలక్ష్మి వారికి సూచించారు. అలా చేసినప్పటికీ శ్రీలక్ష్మి తన కోపం చల్లారక ఈ వృత్తాంతం మొత్తాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో... నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే 1300 మందికి పైగా షేర్ చేసుకోగా 1200 మంది ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు. 4500 మంది లైక్ చేశారు.