Tuesday, 29 November 2016

 శివ శబ్దం….
శివ సహస్రనామంలో వేయి నామాలున్నాయి. శివ శబ్దానికి 48 పర్యాయపదలున్నాయి. అవి:
శంభు రీశ: పశుపతి: శివ: శూలీ: మహేశ్వర: భూతేశ: ఖండ పరశు: గిరీశో గిరిశోమృడ: ఈశ్వర: శర్వ ఈశాన: శంకర: చంద్రశేఖర: మృత్యుంజయ: కృత్తివాసా; పినాకీ ప్రమధాదిప: ఉగ్ర: కపర్దీ శ్రీకంఘ: శితి కంఠ: కపాలభృత్


వామదేవో మహాదేవ: విరూపాక్ష: త్రిలోచన:
కృతానురేతా: సర్వజ్ఞో ధూర్జటి: నీలలోహిత
స్మరహరో, భర్గ: త్ర్యబకం త్రిపురాంతక:



గంగాధరోంధకరిపు: క్రతుధ్వంసీవృషధ్వజ:
వ్యోమకేశ: భవోభీమ: స్థాణు: రుద్ర ఉమాపతి:
శివుడు ఎప్పుడు మంగళకారుడుగా ఉంటాడో, అప్పుడు ‘శంకరుడు’ అనబడుతున్నాడు. ప్రాణులకు రక్షణ కలిగించేటపుడు రక్షకుడు అనబడుతున్నాడు. ఎప్పుడు పర్వతేశుడో అప్పుడు గిరీశాఅని, కైలాసంలో ఉన్నప్పుడు గిరీశ: అని పిలుస్తారు. సంహారం కావిస్తున్నప్పుడు రుద్రుడని పిలువబడుతున్నాడు. ఇలా శివ నామానికి పర్యాయపదాలు ఉన్నాయి. ఆ స్వామిని ఏ పేరుతో పిలిచినా తన భక్తులను కాపాడుతుంటాడు....ఓం నమః శివాయః


అశ్వినీ నక్షత్రం వారు హవిష్యాన్నమును
భరణీ నక్షత్రంవారు కూరగాయలతో కలిపిన అన్నము
కృత్తిక వారు బెల్లపు ఉండలను
రోహిణి వారు వెన్నతో చేసినవి



మృగశిర వారు ఘాటైన వంటలు
ఆర్ద్ర వారు బెల్లముతో చేసిన కుడుములను
పునర్వసు వారు దోసపళ్ళను
పుష్యమి వారు నేతి పాయసము
ఆశ్రేష నక్షత్రం వారు ఘాటయిన వంటలను
మఖా నక్షత్రం వారు పండ్లను



పుబ్బ నక్షత్రం వారు పాయసమును
ఉత్తర వారు ఆవుపాలను
హస్తా వారు యవాన్నము
చిత్తా వారు మృష్ఠాన్నము
స్వాతి వారు నువ్వుల వడలను
విశాఖ వారు పరమాన్నమును
అనూరాధ వారు బియ్యపు పేలాలు
జ్యేష్ఠ వారు నువ్వుల లడ్లు




పూర్వాషాఢ వారు వృక్షం పండ్లను
ఉత్తరాషాఢ వారు జలాన్ని
శ్రవణం వారు పెరుగన్నమును
ధనిష్ఠ వారు శాల్యన్నమును
శతభిషం వారు ఆరు ఎర్రని అన్నము అనగా గవాన్నము




పూర్వాభాద్ర వారు ఆయా నెలల్లో వచ్చే పండ్లనూ
ఉత్తరాభాద్ర వారు పెరుగుతో చేసిన వాటిని
రేవతి నక్షత్రంలో జన్మించిన వారు పెఎసర లడ్లనూ
ఇష్ట దైవానికి నివేదించి పదుగురికి పంచడం ద్వారా దోషాలు పోతాయి.కుటుంబంలో శాంతి నెలకొంటుంది.వారి వారి కోరికలు సత్వరమే తీరుతాయి.

రోజుకు ఒక ఖర్జూరం తినండి., రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు

ఖర్జూరం ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని మనందరికి తెలుసు.సాధారణ ఆహార ప్రణాళికలో రోజు ఖర్జూరాన్ని భాగం చేసినట్లయితే ఆశ్చర్యకరమైన ఫలితాలను గమనించవచ్చు.మిమ్మల్ని చురకుగా ఉంచడంలోనే కాదు అంతర్గతంగా మన శరీర ప్రక్రియలను మెరుగుపరుస్తుంది.



¼ కప్ ఖర్జూరాలని తీస్కుంటే అధిక బరువునుండి విముక్తి అవొచ్చు
మాంగనీస్, రాగి, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B-6 మరియు ఫైబర్ ఇవి అన్నీ మనకు ఖర్జూరంలో లభిస్తాయి. సో, మీరు వాటిని తింటే ఈ పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి.
విటమిన్ B-6 సమ్రుద్దిగా కర్జూరంలో ఉంటుంది.ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
అజీర్ణం ,ఇతర జీర్ణాశయ సంభంద సమస్యలను దూరం చేస్తుంది.
డెలివరీకి నాలుగువారాల ముందుగా రోజు కర్జూరాన్ని తీస్కున్నట్టయితే డెలివరీ సమయంలో కొంచెం సులభంగా ఉంటుంది.
కొలన్ క్యాన్సర్ వచ్చే చాన్సెస్ తక్కువ చేయడంలో కూడా ఖర్జూర సహకరిస్తుంది.
ఖర్జూరం తీస్కోవడం వలన హెమరాయిడ్స్ (మొలలు)ముప్పునుండి తప్పించుకోవచ్చు.
కర్జూరం తినడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్త అద్బుతంగా పనిచేస్తుంది.అధిక రక్తపోటుని తగ్గిస్తుంది.హార్ట్ అటాక్ వంటి వాటి నుండి రక్షణ ఉంటుంది.దీనికి కారణం కర్జూరంలో సమ్రుద్దిగా లభించే మెగ్నీషియం,పోటాషియం .
శ్వాస సంభందిత ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో కర్జూరం తోడ్పడుతుంది.
కర్జూరం తినడం వల్ల వాపు,నొప్పి వంటివాటినుండి ఉపశమనం ఉ:టుంది


500/1000 నోట్ల రద్దు వెనుక అసలు రహస్యం ఇది!

తెలియకపోతే వినండి. దాని అర్ధం ఏంటంటే RBI గవర్నర్ గారు మనకి ప్రమాణం చేస్తున్నారు, ఒకవేళ మీకు ఈ వంద రూపాయలు అవసరం లేదనుకోండి , మీరు మీ డబ్బుని భారత ప్రభుత్వానికి ఇచ్చేదాం అనుకుంటున్నారు అనుకుందాం, ఆ సందర్భంలో RBI మనకి 100రూపాయలకు సరిపడా బంగారం ఇస్తుంది.


మీ దగ్గర 1 రూపాయి ఉన్నా, 100 కోట్లు ఉన్నా, ఆ డబ్బు మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేసి ఆ డబ్బుకి సరిపడా బంగారం తీసుకోవచ్చు.


ఈ సుత్తి అంతా ఎందుకు చెప్తున్నావురా బాబు అనుకుంటున్నారా? ఆగండి ఇక్కడే అసలు విషయం దాగి ఉంది.


మన దేశ ఆర్ధిక పరిస్తితిని మన ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారంతో కొలుస్తారు. ప్రభుత్వం దగ్గర ఎంత ఎక్కువ బంగారం ఉంటే అన్ని ఎక్కువ డబ్బులు ముద్రించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనలో ఎవరైనా మాకు డబ్బు వద్దు , ఈ డబ్బు మీరు తీసేసుకోండి అన్నప్పుడు, ప్రభుత్వం దగ్గర డబ్బుకి సరిపడా బంగారం ఉండాలి కదా మనకి ఇవ్వడానికి. అర్ధం అవుతుంది కదా?


అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి సరిపడా డబ్బుని ముద్రిస్తారు అని.


ఈ బంగారానికి నల్ల డబ్బుకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? హా అక్కడికే వస్తున్నా.


మన ప్రభుత్వం డబ్బు ఎన్నో సంవత్సరాల నుండి ముద్రిస్తూ ఉంది. బంగారం నిల్వలు పెరిగిన కొద్ది డబ్బు ముద్రించడం కూడా పెరిగింది. ఆ డబ్బు అంతా బ్యాంకుల ద్వారా సామాన్య ప్రజలకు చేరుతుంది. అయితే ఈ డబ్బు సామాన్యులకి ఉపయోగపడకుండా బడా బాబుల బీరువాల్లోకి చేరిపోయింది.


పెద్ద పెద్ద నల్ల బాబులంతా దేశం లో ఉన్న డబ్బులో చాలా మటుకు ఏదో విధంగా సంపాదించి, సంపాదించిన దానికి టాక్స్ కట్టకుండా, దాచి పెట్టేసారు. ఇలా టాక్స్ కట్టకుండా, బ్యాంకులో వేయకుండా డబ్బుని దాచినందువల్ల ఎవరికీ ఉపయోగం లేదు. వాళ్ళంతట వాళ్ళు ఖర్చు పెట్టకపోతే, ఆ డబ్బుకి చిత్తు కాగితాలకి తేడా లేదు.


ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే, ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెడుతుంది. బడ్జెట్ లో ఏముంటుంది అంటే ఈ సంవత్సరానికి మన దేశ ఆదాయం ఎంత ? ఎంత ఖర్చు చేసుకోవచ్చు ?, ఎంత అప్పు చేయాలి ? , వచ్చే ఏడాది మన ఆదాయం ఎంత ఉండాలి ? ఇలాంటి లెక్కలు ఉంటాయి.


గత కొన్ని సంవత్సరాల బడ్జెట్ గనుక మనం చూసినట్లయితే మనకి తెలిసే విషయం ఏంటంటే మన ఆదాయం కంటే మన ఖర్చులు ఎక్కువ. తరతరాలుగా మన దేశ పరిస్తితి ఇలానే ఉంది. మన ఆదాయం కంటే మన ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల మనది ఎప్పుడూ లోటు బడ్జెట్ అంటారు. అంటే మన దగ్గర దేశాన్ని నడపడానికి సరిపడా డబ్బు లేదని అర్ధం. సరిపడా డబ్బు లేనందువల్ల ప్రతి ఏడాది మనం ప్రపంచ బ్యాంకు దగ్గర, మరియు ఇతర దేశాల దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. ఇలా డబ్బు లేకపోవడాన్ని ఆర్ధిక లోటు అని కూడా అంటారు.


మన మోడీ గారు ఈ ఆర్ధిక లోటుని పూడ్చడానికి అయన పదవిలోకి వచిన్నప్పటినుంచి కష్టపడుతూనే ఉన్నారు. అందరూ చూస్తూనే ఉన్నారుగా, ఆయన దేశ దేశాలు తిరిగి ఆ దేశాల వాళ్ళని మన దేశం లో పెట్టుబడులు పెట్టమని కోరుతున్నారు. అదే కాకుండా ఎన్నో ఆర్ధిక సంస్కరణలు తీసుకువచ్చి మన దేశం లో పెట్టుబడులు పెట్టడానికి బయట దేశాలకు ఎర్ర తివాచి పరిచారు.


అయితే అందరికి తెలిసిన రహస్యం ఏంటంటే, మన దేశంలో నల్ల బాబుల దగ్గర ఉన్న డబ్బు అంతా బయటకి తీస్తే వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం మనకి లేదు అని. డబ్బు బయటకి తీయడం అంటే ఆ డబ్బుని బ్యాంకులో వేయడం ఒకదారి.


మోడీ గారు నల్ల బాబులకి ఒక ఆఖరి అవకాసం ఇచ్చారు. సెప్టెంబర్ ౩౦ లోగా మీ డబ్బుని లెక్కల్లో చూపి టాక్స్ కట్టి తెల్ల డబ్బుగా మార్చుకోమని. కానీ ముందుకు వచ్చింది చాలా తక్కువమంది. ఇక వేరే దారి లేక 500/1000 నోట్లు మార్చాల్సిందే అని ఆదేశించారు.


ఈ విషయం మాకు తెల్సిందే కదరా అనుకుంటున్నారా? ఆగండి ఆగండి ఇక్కడే ఉంది అసలు సిసలైన కిక్కు ఇచ్చే మోడీ పంచ్.


రోజూ మనం టీవీ లో చూస్తున్నాం, రెండున్నర లక్షలు దాటితే మీ పని అయిపోయింది అని ప్రభుత్వం అందరినీ భయపెడుతుంది. మనలో చాలా మందికి ఒక సందేహం వచ్చే ఉండాలి, ఏమని అంటే, "ఇలా భయపెడ్తే డబ్బులు ఎవరు వేస్తారు బ్యాంకులో? బ్యాంకులో వేస్తే జైల్లో పెడతారన్న భయంతో  నల్ల బాబులు డబ్బుని చెత్తలో, కాలవల్లో పారేస్తున్నారు. కొంత మంది కాల్చేస్తున్నారు. మొత్తం డబ్బు అంతా ఎవరికీ ఉపయోగపడకుండా పోతుంది కదా ?" అని.


అసలు నల్ల బాబులు డబ్బులు బ్యాంకులో వేయకూడదు అనేదే ప్రభుత్వం ఆలోచన. ఎందుకంటే డిసెంబర్ 30 తారీకు లోపు డబ్బులు బ్యాంకులో వేయకపోతే ఇక అవి చిత్తు కాగితాలతో సమానం అని మనకి తెలుసు. కాబట్టి అక్రమంగా సంపాదించిన సొమ్ము మొత్తం ఒక్క దెబ్బతో నాశనం అయిపోతుంది.


జనవరి 1వ తేదీకి మన ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బుకి, ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి చాలా తేడా వస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారానికి సరిపడా డబ్బు ఉండదు కాబట్టి, ప్రభుత్వం మళ్ళీ కొత్త నోట్లు ముద్రిస్తుంది. వహ్రే వా మోడీ గారూ... మీ ఆలోచనకి పాదాభివందనం అయ్యా. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.


కొత్త నోట్లు ముద్రించుకోడం వల్ల నల్ల బాబులు బ్యాంకులో వేయలేని డబ్బు మొత్తం మళ్ళీ ప్రభుత్వం దగ్గరకు రాజమార్గంలో వచ్చేస్తుంది. అవినీతిపరుల పని ఖతం.


అన్ని లక్షల కోట్లు ప్రభుతం వద్దకు వచ్చేసరికి మన దేశ ఆర్ధిక పరిస్తితి ఒక్కసారిగా లోటు నుంచి మిగులులోకి వచ్చేస్తుంది.


ప్రభుత్వం వద్ద ఉన్న అధిక డబ్బు తో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యొచ్చు. మన దేశ రూపం ఒక్కసారిగా మారిపోతుంది.




ఇప్పుడు కూడా మీరు లైన్లో నుంచున్నందుకు బాధ పడుతున్నారా? బాధ పడకండి మనం లైన్ లో నుంచుని మన దేశాన్ని బాగు చేసుకుంటున్నాం. ఈ కష్టానికి వేల రెట్లు ఫలితాలు పొందుతాం.




ఈ విషయం తెలియని వాళ్ళందరికీ తెలిసేలా ఈ పోస్టుని షేర్ చేయండి. మన దేశం బాగుపడబోతుంది , దయ చేసి సహకరించండి.





నల్లధనంపై సర్జికల్ స్ట్రయిక్స్ జస్ట్, ఇప్పుడే ప్రారంభమైందనీ, అసలు నిర్ణయాలు త్వరలో ఉంటాయనీ ప్రధాని మోడీ ప్రకటించాడు కదా..

నల్లధనంపై సర్జికల్ స్ట్రయిక్స్ జస్ట్, ఇప్పుడే ప్రారంభమైందనీ, అసలు నిర్ణయాలు త్వరలో ఉంటాయనీ ప్రధాని మోడీ ప్రకటించాడు కదా…అది ఏకంగా స్థిరాస్తులపై పడనుంది… నిజానికి అవినీతి పరులు, నల్లకుబేరులు తమ ధనాన్ని భూములపై, భవనాలపై, ఇతర స్థిరాస్తులపై పెట్టారనేది బహిరంగ రహస్యం.. ఇప్పుడు ఆ కోటల్ని బద్ధలు కొట్టే ఆలోచనలో ఉన్నాడట….

అన్ని రకాల స్థిరాస్తుల్ని ‘ఇన్ వాలిడ్’ గా ప్రకటించాలనేది మోడీ ఆలోచనగా చెబుతున్నారు… అంటే చెలామణీలో ఉన్న నగదును ఏరకంగానైతే ‘ఇన్ వాలిడ్’ అని ప్రకటించారో అలాగే ప్రకటిస్తారన్నమాట… అర్థం కాలేదు కదా… వివరంగా చెప్పుకుందాం…. ఈ-ప్రాపర్టీ పాస్ బుక్ లో మీ ఆస్తులు రిజిష్టర్ చేసుకుంటే తప్ప, ఆ ఆస్తుల్ని అమ్మటానికి, కొనటానికి వీల్లేకుండా చేయబోతున్నారు అన్నమాట… ఇంకా వివరంగా చెప్పాలంటే..  EPPB… అంటే ఈ- ప్రాపర్టీ పాస్ బుక్… దీన్ని పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఆన్ లైన్ తో లింక్ చేయబోతున్నారు… యజమాని వ్యక్తిగతంగా తన ఆస్తుల్ని డిక్లేర్ చేయాలి… సబ్ రిజిష్ట్రార్ ఆఫీసుల్లోని స్పెషలాఫీసర్లు మీ ఆస్తుల్ని తనఖీ చేశాక, ఈపీపీబీలో ఎంటరయ్యాక, ఆ ఆస్తులు మీవి అవుతాయి… అంతే…

అర్జెంటుగా అమ్మాలనుకునేవాళ్లు, కొనేవాళ్లు, తనఖా పెట్టేవాళ్ల కోసం ప్రత్యేక కౌంటర్లు ఉంటాయన్నమాట… 2018 మార్చి నెలాఖారుకు ఈపీపీబీలో ఎంటర్ కాని ఆస్తులను ప్రభుత్వం నేరుగా స్వాధీనం చేసుకునేలా ఏకంగా చట్టమే తీసుకురానున్నారట… ఇదండీ నల్ల ఆస్తులపై అసలు సిసలు సర్జికల్ స్ట్రయిక్స్. అయితే, ఇందులో సాధ్యాసాధ్యాలు, పరిమితులపై చాలా సందేహాలున్నాయి…. రిజిస్ట్రేషన్లు గట్రా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నాయి… ఆ ప్రభుత్వాల మార్గదర్శకాలు, నిబంధనలు, చట్టాలను అధిగమించి, అల్టిమేట్ గా కేంద్ర నిర్ణయాలే చెల్లుబాటు అయ్యేలా చట్టపరంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట…. ఈపీపీబీలో తెలిపిన ఆస్తులే వారివి అనే స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలంటే… ఇప్పుడు నోట్ల చలామణీ రద్దు అని హడావుడిగా నిర్ణయం తీసుకున్నంత సులభం కాకపోవచ్చు… సంకల్పం మంచిదే కానీ ఆచరణ పక్కాగా ఉంటే నిజంగానే అది నల్లధనంపై బ్రహ్మాస్త్రమే కాబోతున్నది… అది మాత్రం నిజం.

పుత్ర సంతానం కోసం “పుత్ర గణపతి వ్రతం

పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు . మంచి సంతానం కోసం, సంతానం లేని వల్లూ సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలూ చెబుతున్నాయి.



చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వాళ్ళ సంతానం కలుగుతుంది అని నమ్మకం.
పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ఫాల్గుణ శుద్ధ చవితి ప్రత్యేకతగ కనిపిస్తూ వుంటుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. పుత్ర సంతానం కావాలనుకునే వాళ్లు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ‘పుత్రగణపతి వ్రతం’ ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.



వారసుడు కావాలనే కోరిక … తమ తరువాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికిగాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ వుంటుంది. ఈ విషయంగా ఎక్కువకాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు, పుత్ర గణపతి వ్రతం జరుపుతుంటారు. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి … గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది .. గుమ్మానికి తోరణాలుకట్టి .. పూజామందిరాన్ని అలంకరించాలి.



ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను … పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.



పూర్వం మహారాజులు … చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్లంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించేవాళ్లు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్లు పుత్ర సంతానం కోసం ఆరాటపడే వాళ్లు. ఇందుకోసం వాళ్లు ‘ఫాల్గుణ శుద్ధ చవితి’ రోజున ‘పుత్ర గణపతి’ వ్రతాన్ని ఆచరించే వాళ్లు.



అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.
ఇక రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా … రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా ‘పుత్రగణపతి వ్రతం’ మాత్రం నాటి నుంచి నేటి వరకూ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి, పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశస్థాపన చేసి … శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.
ఇంచుమించు వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి. బుద్ధిమంతుడు … జ్ఞానవంతుడు … ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతికాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు.
ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకితభావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

RBI గవర్నర్ ఉర్జిత్ పటేల్ , ముకేశ్ అంబానీ తోడల్లుళ్ళ ? నీతా అంబానీ చెల్లెలు భర్తేనా ఉర్జిత్ పటేల్ ? అసలు నిజ నిజాలు మీకోసం..,.

ప్రధాని మోడీ నోట్ల రద్దుపై చరిత్రాత్మక నిర్ణయం ప్రకటించారు… ఈ నిర్ణయం నిజానికి ఆర్బీఐ గవర్నర్ గా రఘురామరాజన్ ఉన్నప్పుడే ఆలోచించారు… కానీ ఆయన వెళ్లిపోయాక, తనకు అత్యంత అనుకూలుడైన ఓ గుజరాతీ ఉర్జిత్ పటేల్ ను ఆర్బీఐ గవర్నర్ గా తెచ్చుకున్నాక మాత్రమే ఈ నిర్ణయం ప్రకటించారు… నిజానికి దీనివెనుక ఉన్నది ముఖేష్ అంబానీ… ఉర్జిత్ ఎవరో తెలుసా…? గతంలో రిలయెన్స్ లో పనిచేసిన ఉర్జిత్ స్వయానా ముఖేష్ భార్య నీతా అంబానీకి మరిది… ఉర్జిత్, ముఖేష్ తోడల్లుళ్లు… నీతా చెల్లెనే ఉర్జిత్ పెళ్లిచేసుకున్నాడు… ముఖేష్ ఆలోచన మేరకే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నాడు…’’ ఇదండీ కొద్దిరోజులుగా సోషల్ మీడియా మొత్తుకుంటున్న వార్తలు, విశేషాలు, ప్రచారాలు, కథలు, కథనాలు, కాకరకాయలూ…. కానీ అసలు నిజాలు ఏమిటో తెలిస్తే మీరే విస్తుపోతారు… ఆ అసలు నిజాలు మీ కోసం… అసలు నిజం తెలిసిన తర్వాత తప్పకుండా షేర్ చేయండి...

ముందు ఉర్జిత్ ఎవరో చూద్దాం… తను గుజరాతీ, ప్రభావం చూపే పటేల్ సామాజికవర్గం… తను 1963లో పుట్టింది ఎక్కడో తెలుసా… కెన్యాలోని నైరోబీలో…!! నిజం… తరువాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో డిగ్రీ, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎంఫిల్, యాలె యూనివర్శిటీలో డాక్టరేట్ చేశాడు…, మొదట్లో ఐఎంఎఫ్ లో పనిచేసిన ఆయన డిప్యుటేషన్ పై ఆర్బీఐకి వచ్చాడు…, తరువాత కేంద్ర ఆర్థిక శాఖ కన్సల్టెంటుగా పనిచేసి…, రిజర్వ్ బ్యాంకుకు డిప్యూటీ గవర్నర్ అయ్యాడు…, మొన్నమొన్న రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్ అయ్యాడు… తను గతంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ బిజినెస్ డెవలప్ మెంట్ విభాగానికి ప్రెసిడెంటుగా చేసింది నిజమే…, గుజరాత్ ప్రభుత్వానికి చెందిన చమురు సంస్థ జీఎస్పీఎస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా చేశాడు…, అప్పుడే మోడీ తన పనితీరు గమనించి, ఆర్బీఐ గవర్నర్ విషయంలోనూ తనపట్ల మొగ్గు చూపించాడు… ఇదీ ఉర్జిత్ కథ…

ఇక ఉర్జిత్ వదినగా చెబుతున్న ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి చూద్దాం… వాళ్లూ గుజరాతీలే… ముంబై శివార్లలో ఉండే కుటుంబం… తల్లి ఓ శాస్త్రీయ నాట్యగత్తె… నీతాకు కూడా నేర్పింది… నీతా దలాల్ కూడా మంచి డేన్సర్… తరువాత ఆమె ధీరూభాయ్ అంబానీ ఇంట్లోకి ముఖేష్ భార్యగా అడుగుపెట్టింది… ఆమెకు ఒకతే చెల్లెలు… పేరు మమతా దలాల్… ఇదే ధీరూభాయ్ అంబానీ బాంద్రాలో పెట్టిన స్కూల్ లో టీచర్… షారూఖ్, సచిన్ పిల్లలు సుహానా, సారాలకూ పాఠాలు చెప్పింది…

పైన ఫోటోలో నీతా అంబానీతో ఉన్నది ఆమే… ఇక అసలు విషయం చెప్పనే లేదు కదూ… ఉర్జిత్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు అనేది పచ్చి అబద్ధం… ముంబైలోనే నీతాకు పది మంది కజిన్స్ ఉన్నారు… వాళ్లలో ఒకర్ని చేసుకున్నాడేమో అనే డౌట్లూ కొందరు వెలిబుచ్చారు…
అసలు నిజం ఏమిటంటే… అసలు ఉర్జిత్ పెళ్లే చేసుకోలేదు… 53 ఏళ్ల బ్రహ్మచారి…!!

న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను పెంచాలంటే..నోటుకు తాళం వేయాలి. మోడీ సూపర్ ప్లానింగ్.. కావాలనే కొత్త నోట్లు వదలట్లే.. ఎందుకో తెలుసా ?

రాజు త‌లుచుకుంటే, దెబ్బ‌ల‌కు కొద‌వా? మోదీ త‌లుచుకుంటే, కొత్త నోట్ల‌కు కొద‌వా? ఎప్ప‌టి నుంచో ప్లానింగ్‌లో ఉన్న ప్ర‌ధానికి భారీగా కొత్త నోట్ల‌ను డంప్ చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.. కానీ, కావాల‌నే నోట్ల పంపిణీలో జాప్యం చేస్తున్నార‌ని తెలుస్తోంది. న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను పెంచాలంటే, నోటుకు తాళం వేయాలి... వాటి పంపిణీలో జాప్యం చేయాలి. అప్పుడే ఆన్ లైన్ మ‌నీ ట్రాన్స్ఫ‌ర్ పెరుగుతుంది. ఆన్ లైన్ లావాదేవీలు పెరుగుతాయి... మోదీకి కావాల్సింది కూడా అదే. అందుకే ఇంత జాప్యం.

పెద్దనోట్లను రద్దు చేసి ఇప్పటికి ఇది పద‌కొండు రోజుల దాటిపోయాయి. మరి... పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన మొత్తం ఎంతో తెలుసా? సుమారు నాలుగు లక్షల కోట్లు! అదే సమయంలో బ్యాంకుల ద్వారా ప్రజలకు వచ్చిన మొత్తం రూ.75 వేల కోట్లకు లోపే! టోట‌ల్‌గా జ‌నం సొమ్ము బ్యాంకుల్లో ఇరుక్కుపోయింది. ఎంతైనా బ్యాంకుల్లో జ‌మ చేసుకోవ‌చ్చు... కానీ, తిరిగి తీసుకునేది మాత్రం కొంచెం కొంచెమే! అదే మోదీ మార్కు టెక్నిక్. చివ‌రికి చిరాకు పుట్టి... అంతా చెక్కులు, మ‌నీ ట్రాన్స‌ఫ‌ర్ల తోవ‌కు రావాల్సిందే.

ఈ ఇబ్బందులు కొన్నాళ్లే... అని ప్రధాని మోదీ అన్నారు. రెండు, మూడు వారాలే అని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెబుతున్నారు. కానీ... ‘కరెన్సీ కటకట’ ఇప్పట్లో తీరేది కాదని, ఆరు నెలలకుపైగానే పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ‘నోటు’కు తాళం వేసేదిశగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే... రద్దయిన నోట్లకు సమానంగా కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశమే కేంద్రానికి లేదు. నగదు లావాదేవీలపై పూర్తి స్థాయిలో పట్టు బిగించడం, తద్వారా నల్ల ధనాన్ని నియంత్రించడం ఇందులో అత్యంత కీలకం! అదే సమయంలో... సామాన్య జనం కరెన్సీ కోసం ఇక్కట్లు పడక తప్పదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం వేస్తున్న ఒక్కో అడుగును నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ప్రజలు సుమారు 4 లక్షల కోట్ల విలువైన 500, వెయ్యి నోట్లను బ్యాంకులకు తిరిగి ఇచ్చేశారు. బ్యాంకుల ద్వారా జనానికి పంపిణీ అయిన మొత్తం కేవలం 75 వేల కోట్లకు లోపే! అంటే... జనం సొమ్ములు భారీ స్థాయిలో బ్యాంకుల వద్ద జమ అయ్యాయన్నమాట. అదే సమయంలో, లక్షలు బ్యాంకుకు జమ చేసిన వారు సైతం వేల కోసం బ్యాంకుల ముందు క్యూల్లో పడిగాపులు కాస్తున్నారు. ‘ఇది పెద్ద నోట్ల రద్దు కాదు. వాటి మార్పిడి మాత్రమే’... అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్‌ చెప్పారు.

నిజానికి... ఇది పాక్షికంగానే నిజం! ఎందుకంటే... కేంద్రం ‘రద్దు’ చేసిన 500, వెయ్యి నోట్ల విలువ 14,17,950 కోట్లు! ఆర్థిక శాఖ చెబుతున్నట్లు ఇది ‘మార్పిడి’ మాత్రమే అయితే... ఇప్పటికే అందుకు సమానమైన కొత్త నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కానీ, అలా చేయడంలేదు. రూ.14.17 లక్షల కోట్ల విలువైన నోట్లు రద్దుకాగా... కేంద్రం ఇప్పటికి రూ.3 లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు, 750 కోట్ల విలువైన 500 నోట్లు... వెరసి నాలుగు లక్షల కోట్లలోపు కరెన్సీ మాత్రమే ముద్రించింది. ఇంకా... 7 లక్షల కోట్ల విలువైన 2 వేలు, 20వేల కోట్ల విలువైన 500 నోట్లు ముద్రించాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది! కానీ... ఇది ఇప్పటికిప్పుడు జరిగేది కాదని స్పష్టమవుతోంది.
మ‌రో 6 నెల‌లు ఇదే దుస్థితి!
రద్దయిన పాత 500 నోట్ల సంఖ్య 1570 కోట్లు! అదే స్థాయిలో కొత్త 500ల నోట్లు ముద్రించేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని అంచనా. కొత్త 500 నోట్ల ముద్రణ ఈనెల 10వ తేదీ నుంచే మొదలైంది. సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లలో పగలూ రాత్రి నోట్లు ముద్రించినా... అవసరమైన మేరకు నోట్లు అందుబాటులోకి రావడంలో ‘జాప్యం’ తప్పదు. ఈ విషయాన్ని మన్మోహన్‌కు సలహాదారుగా వ్యవహరించిన ఆర్థిక నిపుణుడు సౌమిత్రా చౌద‌రి కూడా చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆకస్మికంగా ప్రకటించినదే కానీ... ఆకస్మికంగా తీసుకున్నదేమీ కాదు. ప్రభుత్వం అనుకుని ఉంటే... రద్దు నిర్ణయం అమలులోకి వచ్చేనాటికే కావాల్సినన్ని కొత్త 500 నోట్లను ముద్రించి ఉండేది. కానీ, అలా చేయలేదు. దీనికి వెనుక వ్యూహాత్మక కారణాలున్నాయి. 




బ్యాంకులకు వెళ్లిన సొమ్ము సాధారణ రైతులు, కర్షకులు, కార్మికులకు ఎట్టి ప‌రిస్థితుల్లో అంద‌దు. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ‘రుణ పరపతి’లేక ఆగిపోయాయి. తాజాగా వస్తున్న సొమ్ములు ఆ దిశగానే మళ్లే అవకాశముంది. ‘మున్ముందు మరిన్ని చర్యలుంటాయి’ అని ప్రధాని ప్రకటించారు. దీనిని బ‌ట్టి ప్రజలు తాము ఉంచుకునే నగదు నిల్వలపై గరిష్ఠ పరిమితి విధించే అవకాశం ఉంది. ఇక‌ బ్యాంకుల్లోనూ భారీ మొత్తంలో ‘విత డ్రాయల్స్‌’కు అంగీకరించరు. చెక్కులు, డీడీల రూపంలో చెల్లింపులు చేసుకోవాల్సిందే. దీనివల్ల ‘నల్ల లావాదేవీల’లకు చెక్‌ పడుతుంది.




మార్కెట్‌లో తగిన స్థాయిలో నగదు చెలామణీలో ఉండదు. దీంతో జనం అనివార్యంగా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌యాక్షన్స్‌పై ఆధారపడాలి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఓ మోస్తరు దుకాణాలు కూడా ‘కార్డులను స్వైప్‌’ చేసే మిషన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మున్ముందు ప్రతి షాపులోనూ స్వైపింగ్‌ మిషిన్లే దర్శనమివ్వనున్నాయి. వెరసి... చిన్నస్థాయి లావాదేవీలు కూడా ‘పన్ను’ కన్నుకప్పలేవన్న మాట! పెద్ద నోట్ల రద్దు వల్ల బ్లాక్‌ మనీ వంద శాతం రద్దు కాకపోవచ్చు. కానీ... 500, వెయ్యి నకిలీ కరెన్సీ మాత్రం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లే. ఇదీ మ‌న ఆర్దిక నిపుణుల టెక్నిక్.