Tuesday, 29 November 2016

తలక్రిందులుగా తపస్సు చేస్తున్నట్లు ఉండే ఏకైక శివలింగం ఎక్కడ ఉందొ మీకు తెలుసా?

దేశంలో ఎక్కడా లేని విధమైన శివలింగం భీమవరం యనమదుర్రు గ్రామంలో ఉంది. తలక్రిందులుగా తపస్సు చేస్తున్నట్లుగా లింగంపై ముద్రలు ఉండటం ఇక్కడి విశేషం . ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు వున్నాయి. ప్రపంచానికి శివ, శక్తుల సమానత్వాన్ని నిరూపించటానికి ఒకే పీఠంపై నెలకొన్న శివుడు, పార్వతి, కుమార స్వామి విగ్రహాలు బయల్పడ్డాయి. పార్వతీ దేవి శక్తి. ఆ శక్తితో కూడుకున్న ఈశ్వరుడు శక్తీశ్వరుడు. జగన్మాత అయిన ఆ పార్వతీదేవి నెలల పిల్లాడయిన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్న రూపం ఇక్కడ అమ్మది.



అలాగే శివుడుకూడా ఒక ప్రత్యేక భంగిమలో వెలిశారు. సాధారణంగా దర్శనమిచ్చే లింగ రూపాన్ని వదిలెయ్యటమేకాక సాకార రూపంలో కూడా వైవిధ్యం చూపించారు మహాశివుడు. ఇక్కడ శీర్షాసనంలో తపో భంగిమలో కనబడతారు. శివుని జటాజూటం భూమికి తగులుతుంటుంది. ఆ పైన ముఖం, కంఠం, ఉదరం, మోకాళ్ళు, పాదాలు. పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ వెలియటానికి కారణంగా ఒక కధ కూడా చెప్తారు.




యమధర్మరాజుకి ఒకసారి తను చేసే పని మీద విసుగు వచ్చిందిట. పైగా ప్రజలంతా ఆయన పేరు చెప్తేనే భయపడుతున్నారు. అందుకని శివుడు కోసం ఈ ప్రాంతంలోనే తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై భవిష్యత్తులో యమధర్మరాజు ఒక రాక్షసుడిని చంపిన తర్వాత తమని ఇక్కడ ప్రతిష్టిస్తాడనీ, తమని దర్శించిన వారికి దీర్ఘరోగాలు వుంటే సత్వరం నయమవుతాయని, ఆరోగ్యంగా వుంటారనీ, తద్వారా యముడంటే ప్రాణాలు తీసేవాడేకాదు, దీర్ఘకాల రోగాలను నయంచేయగలవాడు కూడా అని ప్రజలచేత కొనియాడబడతాడు అని వరమిచ్చారు.



పూర్వం ఈ ప్రాంతం పేరు యమునాపురం. ఇక్కడ శంబిరుడనే రాక్షసుడుండేవాడు. శంబిరుడు తపస్సు చేసుకుంటున్న మునులను హింసిస్తూ పలు అకృత్యాలకు పాల్పడేవాడు. ఆ మునులు ఇవ్వన్నీ పడలేక యమధర్మరాజు దగ్గరకెళ్ళి వాణ్ణి చంపెయ్యమని మొరబెట్టుకున్నారు. యముడు కూడా మునులను రక్షించడానికి ఆ రాక్షసుడిని చంపటానికి చాలా ప్రయత్నం చేసి, అతని చేతిలో చాలా సార్లు ఓడిపోయాడు. అప్పుడు శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు ఆ సమయంలో యోగనిష్టలో వుండటంతో ప్రత్యక్షంకాలేదు.



పార్వతీదేవి యముని తపస్సుకి మెచ్చి, తనలోని శక్తి అంశను యమునికిచ్చి శంబరుని వధించేటట్లు చేస్తుంది. తన విజయానికి చిహ్నంగా ఆ ప్రాంతానికి యమపురి అని నామకరణం చేశాడు యమధర్మరాజు. అమ్మవారు తనపై చూపించిన కరుణకు యముడు ఉప్పొంగిపోయి, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాక్షసులు సంచరించటానికి వీలులేకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్ర సమేతంగా అక్కడ వెలియమని కోరాడు. యముని కోరికమేరకు బాలింతరాలైన పార్వతీదేవి తన మూడు నెలల పసిబిడ్డతో, యోగనిష్టలో వున్న ఈశ్వరుడితో ఇక్కడ సాక్షాత్కరించింది.
ఆలయానికి ఎదురుగా శక్తికుండము అనే మంచినీటి సరస్సు వుంది. స్వామివారి అభిషేకానికి, నైవేద్యానికీ ఈ నీటినే వినియోగిస్తారు. ఒకసారి చెరువుచుట్టూ ప్రాకారం నిర్మించాలని చెరువుని ఎండబెట్టారు. ఆ సమయంలో స్వామివారి నైవేద్యంకోసం వేరే చెరువు నీటిని వాడగా ఆ నైవేద్యం వుడకలేదుట. అప్పుడు పూజారి ఎండగట్టిన చెరువులో గుంట త్రవ్వగా నీరు వచ్చిందిట. ఆ నీటిని పోసి వండగా ప్రసాదం వెంటనే వుడికిందట. అప్పటినుంచీ స్వామి నైవేద్యానికి వేరే నీరు వాడరు. ఈ శక్తికుండములోని నీరు మామూలు నీరు కాదు. కాశీలోని గంగానదిలోని ఒక పాయ అంతర్వాహినిగా వచ్చి ఇక్కడ ప్రవహిస్తున్నదని జియాలజిస్టులు చెప్పారంటారు. అందుకే ఈ సరస్సు గంగానదితో సమానమైనదంటారు.
దక్షిణకాశీగా పిలవబడే ఈ క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి. అంటే సర్పం. ఈ ఆలయానికి, చెరువుకు కాపలాగా రెండు నాగుపాములు వుండేవట. ఉదయం బ్రహ్మముహూర్తంలో ఈ నాగుపాములు చెరువులో వలయాకారంగా మూడుసార్లు తిరిగి, స్వామి దర్శనం చేసుకుని తిరిగి చెరువులోకెళ్ళిపోవటం చూసినవారున్నారు. ఇప్పుడు కూడా ఆ ప్రాంగణంలో రెండు నాగుపాము పిల్లలు తిరుగుతుంటాయి. ఇవి ఒక్కొక్కసారి స్వామి విగ్రహాన్ని చుట్టుకుని వుంటాయట. అయితే అవి ఎవరినీ ఏమీ చేయవు.




ఆలయ తూర్పు ద్వారానికి ప్రక్కగా వున్న నందీశ్వరుని మూతి, ఒక కాలు విరిగి వుంటాయి. తురుష్కులు ఈ ఆలయం మీద దాడి చేసినప్పుడు వారి ప్రభువు తన కరవాలం పదును చూసుకోవడానికి అక్కడున్న నంది మూతిని, కాలిని నరకగా అందులోనుండి రత్నాలు బయటపడ్డాయిట. ఒక జంతువు విగ్రహంలోనే ఇన్ని రత్నాలు వుంటే ఆలయంలో విగ్రహంలో ఎన్ని ఉన్నాయోనని ఆలయంలోకి వెళ్ళబోగా ఆలయం కప్పుకూలి అతనిమీద పడి మరణించాడుట. ఆ శిధిలాలు ఆలయం వెనక వున్నాయి. 



పంచారామాలకన్నా పురాతనమైనదని చెప్పబడే ఈ ఆలయంగురించీ, శక్తీశ్వరుని గురించీ, మహాకవి కాళిదాసు తన మహాకావ్యం కుమార సంభవంలో 68 శ్లోకాలలో స్తుతించాడుట. భోజరాజు ఇక్కడికి వచ్చి పూజలు సల్పినట్లూ, మహాకవి కాళిదాసు పలుమార్లు ఇక్కడికి వచ్చి శక్తిని పూజించినట్లు కూడా ఆ గ్రంధంలో స్పష్టంగా వుందిట. శ్రీనాధ మహాకవి వ్రాసిన కాశీఖండం కావ్యంలోకూడా ఈ ఆలయ ప్రశస్తి వున్నది




శంబరుని వధానంతరం యమునికి పార్వతీదేవి ఇచ్చిన వర ప్రభావంతో ఇక్కడ శక్తికుండంలో స్నానం చేసినవారికి అపమృత్యు భయం వుండదనీ, అకాల వ్యాధులు రావనీ, దీర్ఘకాలంగా పీడిస్తున్న రోగాలున్నవాళ్ళు ఈ కుండంలోని నీరు మంచినీటితో కలిపి సేవించటంవల్ల ఆ రోగాలు నయమవుతాయని నమ్మకం.

స్త్రీ తన కన్నా వయసు ఎక్కువ ఉన్న మగవారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి?

क्यों पुरुषों औरत वह शादी कर लेनी चाहिए की उम्र की तुलना में अधिक कर रहे हैं?


తన కన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంభోగం వలన పురుషునికి శక్తి తగ్గిపోతుందనేది అసత్యం. స్త్రీకి సిగ్గు ఎక్కువ. కనుక ప్రేమతోలాలించి, బుజ్జగించాలంటే తనకన్నా చిన్నదావ్వాలి.




 స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు. కనుక సంసారాన్ని మోయలేదు. కష్టపడలేదు. పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబం యొక్క భారం స్త్రీ మీదే పడుతుంది. మగవాడిదే కుటుంబ భారమని చెప్పటానికే అనాదిగా ఈ ఆచారం. అందువల్లే భార్యకంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది మన పెద్దలు నియమం పెట్టారు.



 Sexual intercourse with a woman over the age of the man-power leasing taggipotundanedi. Woman of shame. So prematolalinci, bujjagincalante cinnadavvali of himself. The woman is not naturally powerful than man. So whatever intolerable.  




Hard in. The bigger the family of the woman to take on the burden of the woman. Magavadide say the ancient tradition of the family burden. Hence, our elders that rule, named after the wife bhartaki age.


 मानव शक्ति पट्टे taggipotundanedi साल की उम्र में एक औरत के साथ संभोग। शर्म की बात है की महिला। तो prematolalinci, खुद की bujjagincalante cinnadavvali। औरत आदमी की तुलना में स्वाभाविक रूप से शक्तिशाली नहीं है।





 तो असहनीय जो भी हो। में मुश्किल है। बड़ी महिला के परिवार महिला के बोझ पर लेने के लिए। Magavadide परिवार बोझ की प्राचीन परंपरा का कहना है। इसलिए, हमारे बुजुर्गों कि शासन, पत्नी bhartaki उम्र के बाद नाम दिया है।





షేర్ చేయండి share this

పూజలో కొబ్బరికాయ క్రుళ్ళితే మంచిదా?

పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదు. అపచారం అంతకన్నా కాదు తెలిసి పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదేకాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్నితీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి.

రుద్రాష్టకం
నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపమ్ |
అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేఽహమ్ || ౧ ||
నిరాకారమోంకారమూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్ |
కరాలం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోఽహమ్ || ౨ ||
తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్ |
స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్భాలబాలేందు కంఠే భుజంగా || ౩ ||
చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుమ్ |
మృగాధీశచర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి || ౪ ||
ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటిప్రకాశమ్ |
త్రయీ శూల నిర్మూలనం శూలపాణిం భజేఽహం భవానీపతిం భావగమ్యమ్ || ౫ ||
కళాతీత కళ్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ |
చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ || ౬ ||
న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్ |
న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాసమ్ || ౭ ||
న జానామి యోగం జపం నైవ పూజాం నతోఽహం సదా సర్వదా దేవ తుభ్యమ్ |
జరా జన్మ దుఃఖౌఘతాతప్యమానం ప్రభో పాహి శాపన్నమామీశ శంభో || ౮ ||
రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే |
యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి ||



శ్రీ అప్పయ్య దీక్షితులు రచించిన మహిమాన్విత ’దేవీ చన్ద్రకళాస్తుతీ

శ్రీ అప్పయ్య దీక్షితులు రచించిన మహిమాన్విత ’దేవీ చన్ద్రకళాస్తుతీ’
౧. వేధోహరీశ్వరస్తుత్యాం విహర్త్రీం వింధ్య భూధరే!
హర ప్రాణేశ్వరీం వన్దే హన్త్రీం విబుధవిద్విషామ్!!
బ్రహ్మ విష్ణు రుద్రులచే స్తోత్రింపబినది - వింధ్య పర్వతమున విహరించునది, శివుని ప్రాణేశ్వరి, దేవ ద్రోహులైన (సత్త్వ విరోధులైన) రాక్షసులను సంహరించు జగదంబకు వందనములందజేస్తున్నాను.
౨. అభ్యర్థనేన సరసీరుహ సంభవస్య
త్యక్త్వోదితా భగవదక్షిపిధాన లీలామ్!
విశ్వేశ్వరీ విపదపాగమనే పురస్తా-
న్మాతా మమాsస్తు మధుకైటభయోర్నిహన్త్రీ !!
బ్రహ్మ ప్రార్థన మేరకు, యోగనిద్రితుడైన భగవానుని కనులు విప్పి, మధుకైటభులను సంహరిం(పజేసిన)చిన విశ్వేశ్వరీ (మహాకాళీ) మాత విపత్తులలో నాముందు నిలచుగాక!
౩. ప్రాజ్ నిర్జరేషు నిహతైర్నిజశక్తి లేశై -
రేకీ భవద్భిరుదితాsఖిలలోక గుష్యై!
సంపన్న శస్త్ర నికరాచ తదాయుధస్థై-
ర్మాతా మమాsస్తు మహిషాంతకరీ పురస్తాత్!!
దేవతల తేజస్సులన్నిటి ఏకరూపమై, లోకరక్షణకై ఉదయించి, వివిధ సంపదలను శస్త్రాది ఆయుధాలను ధరించిన మహషాంతకరి (మహాలక్ష్మి) నా ముందుండుగాక!
౪. ప్రాలేయశైలతనయా తనుకాంతి సంపత్ -
కోశోదితా కువలయచ్ఛవి చారుదేహా!
నారాయణీ నమదభీప్సిత కల్పవల్లీ
సుప్రీతి మావహతు శుంభనిశుంభహన్త్రీ!!
హిమవత్పర్వత రాజపుత్రి గౌరిదేవి శరీరకాంతి సంపద అనెడి కోశమునుండి ఉదయించిన, నల్లకలువ వంటి దేహముగల తల్లి, నారాయణి, మహాసరస్వతి, నమస్కరించిన వారి అభీష్టాలను తీర్చే కల్పవల్లి, శుభనిశుంభ సంహారిణి చక్కని ప్రీతిని కలిగించుగాక!
౫. విశ్వేశ్వరీతి మహిషాన్తకరీతి యస్త్యా
నారాయణీత్యపిచ నామభిరంకితాని!
సూక్తాని పంకజభువాచ సురర్షిభిశ్చ
దృష్టాని పావకముఖైశ్చ శివాం భజేతామ్!!
బ్రహ్మచే ’విశ్వేశ్వరీసూక్తం’తో, దేవతలచే ఋషులే అగ్ని ముఖుగా, ’మహిషాన్తకరీ’, ’నారాయణీ సూక్తముల’తో దర్శింపబడి కీర్తించబడిన (దేవీ మహాత్మ్యంలోని సూక్తాలివి) శివాదేవిని ఆశ్రయిస్తున్నాను.
౬. ఉత్పత్తి దైత్య హనన స్తవనాత్మకాని
సంరక్షకాణ్యఖిల భూతహితాయ యస్యాః!
సూక్త్యాన్యశేష నిగమాంత విదః పఠన్తి
తాం విశ్వమాతరమజస్ర మభిష్తవీమి!!
పరాశక్తి యొక్క ఆవిర్భావం, రాక్షససంహారం, స్తోత్రములు, జీవకోటి హితానికై చేసిన సంరక్షణ కృత్యములను, అగ్నిసూక్తములను వేదాంతవేత్తలు పఠిస్తున్నారు. అట్టి విశ్వమాతను ఎల్లప్పుడు స్తోత్రిస్తున్నాను.
౭. యం విప్రచిత్త పునరుత్థిత శుంభ ముఖ్యైః
దుర్భిక్ష ఘోర సమయేన చ కారితాసు!
ఆవిష్కృతాస్త్రిజగదార్తిషు రూపభేదా -
స్తైరంబికా సమభిరక్షతు మాం విపద్భ్యః!!
విప్రచిత్తునకు తిరిగి జన్మించిన శుంభాది రాక్షసులను నందా, రక్తదంతాది నామరూపములు ధరించి సంహరించి, కరవువంటి ఘోర సమయాలను తొలగించిన అంబిక ఆయా వివిధ నామరూపాలతో నన్ను విపత్తులనుండి సంపూర్ణముగా రక్షించుగాక!
౮. సూక్తం యదీయమరవింద భవాది దృష్ట -
మావర్త్య దేవ్యనుపదం సురథః సమాధిః!
ద్వావప్యవాపతురభీష్ట మనన్యలభ్యం
తామాదిదేవతరుణీం ప్రణమామి మూర్ధ్నా!!
బ్రహ్మాదులచే దర్శింపబడిన దేవీసూక్తములను నిరతము పఠించిన సురథుడు, సమాధి అను భక్తులు ఇతరులకు లభ్యము కాని దివ్య పదములను పొందారు. అలా పొందింపజేసిన ఆదిదేవుని తరుణియైన దేవికి శిరస్సుతో ప్రణామములు చేస్తున్నాను.
౯. మహిష్మతీ తనుభవంచ రురుంచ హంతుం
ఆవిష్కృతైర్నిజరసాదవతరభేదైః!
అష్టాదశాహత నవాహత కోటి సంఖ్యై -
రంబా సదా సమభిరక్షతు మాం విపద్బ్యః!!
మహిష్మతి పుత్రులైన మహిషాసురుని, రురుని సంహరించడానికై వివిధ అవతారములతో పద్దెనిమిది కోట్ల శక్తులతో, తొమ్మిదికోట్ల శక్తులతో బయలువెడలిన అమ్మ నన్ను విపత్తుల నుండి సమగ్రంగా రక్షించుగాక!
౧౦. ఏతచ్చరిత్ర మఖిలం లిఖితంహి యస్యాః
సంపూజితం సదన ఏవ నివేశితంవా!
దుర్గంచ తారయతి దుస్తర మప్యశేషం
శ్రేయః ప్రయచ్ఛతి చ సర్వముమాం భజేతామ్!!
ఈ దేవీ చరిత్రనంతటినీ వ్రాసి, ఎవరి యింట ఉంచి పూజించుతారో వారు భయంకరమైన దుర్గతులన్నిటి నుండి దాటబడి, శ్రేయస్సులను పొందుతారు. అట్టి మహిమగల ఉమాదేవిని భజిస్తున్నాను.
౧౧. యత్పూజన స్తుతి నమస్కృతిభిర్భవన్తి
ప్రీతాః పితామహ రమేశ హరాస్త్రయోపి!
తేషామపిస్కుణైర్దదతీ వపూంషి
తామీశ్వరస్య తరుణీం శరణం ప్రపద్యే!!
ఏ తల్లిని పూజించడం చేత, స్తుతించడం చేత, నమస్కరించడం చేత బ్రహ్మవిష్ణురుద్రులు మువ్వురూ ప్రీతులౌతారో, ఆ మువ్వురికీ గుణములను తనువులను ఇచ్చినదెవరో ఆ ఈశ్వర తరుణిని శరణు వేడుతున్నాను.
౧౨. కాంతారమధ్య దృఢలగ్నతయావసన్నా
మగ్నాశ్చ వారిధిజలే రిపుభిశ్చ రుద్ధాః!
యస్యాః ప్రపద్య చరణౌ విపదస్తరంతి
సా మే సదాస్తు హృది సర్గజగత్సవిత్రీ!!
అరణ్యమధ్యంలో చిక్కుపడినవారు, సముద్రాది జలములలో మునిగిన వారు, శత్రువుల చేత బంధింపబడిన వారు ఎవరి చరణాలను శరణువేడి విపత్తుల నుండి దాటుతున్నారో ఆ సృష్టికారిణి ఎల్లవేళలా నా హృదయమందుండు గాక.
౧౩. బంధేవధే మహతి మృత్యుభయే ప్రసక్తే
చిత్తక్షయే చ వివిధేచ మహోపతాపే!
యత్పాదపూజ నమిహ ప్రతికారమాహుః
సా మే సమస్త జననీ శరణం భవానీ!!
బంధమునందు, వధమునందు, మహామృత్యుభయములందు, మనస్తాపములందు, వివిధ వేదనలందు ఎవరి పాదపూజనము పరిష్కారముగా చెప్పబడుచున్నదో ఆ సమస్త జనని భవాని మాకు శరణు.
౧౪. బాణాసురప్రహిత పన్నగబంధమోక్ష -
స్తద్బాహుదర్ప దళనాదుషయాచ యోగః!
ప్రాద్యుమ్నినా ద్రుతమలభ్యత యత్ప్రసాదాత్
సా మే శివాసకలమప్యశుభం క్షిణోతు!!
బాణాసురునిచే నాగపాశముల బంధితుడైన ప్రద్యుమ్న పుత్రుడైన అనిరుద్ధుని ఆ నాగపాశముల నుండి విడిపించి, అసురుని బాహు దర్పమును ఖండించడం, ఉషారాణితో కలయిక ఎవరు కృపతో వెంటనే లభింపజేశారో ఆ శివస్వరూపిణి నాకు అన్ని అశుభములను నశింపజేయుగాక!
౧౫. పాపః పులస్త్య తనయో పునరుత్థితో మా -
మద్యాపి హర్తు మయమాగత ఇత్యుదీతమ్!
యత్సేవనేన భయమిందిరయావధూతం
తామాదిదేవతరుణీం శరణం గతోస్మి!!
’పులస్త్యుని సంతానమైన పాపాత్ముడైన రావణుడు మరల (శిశుపాలునిగా) జన్మించి, ఈ జన్మో నన్నపహరించడానికై వచ్చినాడ’ని లక్ష్మీరూపిణి రుక్మిణి ప్రార్థించగా విని భయమును పోగొట్టిన ఆదిదేవుని తరుణిని శరణువేడుతున్నాను.
౧౬. యద్ ధ్యానజం సుఖమవాప్యమనన్త పుణ్యైః
సాక్షాత్ తమచ్యుతపరిగ్రహ మాశ్వవాపుః!
గోపాంగనాః కిల యదర్చన పుణ్యమాత్రాః
సా మే సదాభగవతీ భవతు ప్రసన్నా!!
ఎవరిని అర్చించిన పుణ్యమాత్రమున -అనంత పుణ్యలభ్యమైన ధ్యాన సౌఖ్యమును అచ్యుతుని పొందుట ద్వారా గోపాంగనలు బడిసిరో ఆ భగవతి నాకు ప్రసన్నయగుగాక!
౧౭. రాత్రిం ప్రపద్య ఇతి మంత్ర విదః ప్రపన్నా -
నుద్బోధ్య మృత్యవధి మన్యఫలైః ప్రలోభ్య!
బుద్ధ్వా చ తద్విముఖతాం ప్రతనం నయంతీ -
మాకాశమాది జననీం జగతాం భజేతామ్!!
’రాత్రిం ప్రపద్యే’ అనే వైదిక రాత్రి సూక్త మంత్రములను శరణాగతితో జపించినవారిని, జాగృతపరచి, ఇతర ఫలములను ప్రలోభపరచి, జ్ఞానముొసగి, ఆ లోకఫలితములందు విముఖతను కలిగింధి, కైవల్యమునొసగు ఆకాశస్వరూపిణియైన జగతికి ఆదిజననిని భజిస్తున్నాను.
౧౮. దేశకాలేషు దుష్టేషు దేవీ చంద్రకళాస్తుతిః
సంధ్యయోరనుసంధే యా సర్వామద్వినివృత్తయే!!
దేశకాలములు దుష్టములై ప్రతికూలములైనప్పుడు అన్ని ఆపదలను తొలగించడానికై ’దేవీ చంద్రకళాస్తుతి’ సంధ్యలలో నిత్యం పారాయణ చేయాలి.
ఇతి శ్రీ మద్భరద్వాజ కులజలధికౌస్తుభ శ్రీకంఠ మత -
ప్రతిష్ఠాపనాచార్య చతురధిక శత ప్రబంధ నిర్వాహక మహావ్రత
యాజి శ్రీమదప్పయ దీక్షితేంద్రస్య కృతిష్వన్యతమా
దుర్గాదేవీ చంద్రకళాస్తుతిః సంపూర్ణా.

వేదసారశివస్తోత్రం

పశూనాం పతిం పాపనాశం పరేశం – గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యమ్ |
జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం – మహాదేవమేకం స్మరామి స్మరారిమ్ || ౧ ||
మహేశం సురేశం సురారాతినాశం – విభుం విశ్వనాథం విభూత్యంగభూషమ్ |విరూపాక్షమింద్వర్కవహ్నిత్రినేత్రం – సదానందమీడే ప్రభుం పంచవక్త్రమ్ || ౨ ||
గిరీశం గణేశం గళే నీలవర్ణం – గవేంద్రాధిరూఢం గుణాతీతరూపమ్ |
భవం భాస్వరం భస్మనా భూషితాంగం – భవానీకలత్రం భజే పంచవక్త్రమ్ || ౩ ||
శివాకాంత శంభో శశాంకార్ధమౌళే – మహేశాన శూలింజటాజూటధారిన్ |
త్వమేకో జగద్వ్యాపకో విశ్వరూపః – ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప || ౪ ||
పరాత్మానమేకం జగద్బీజమాద్యం – నిరీహం నిరాకారమోంకారవేద్యమ్ |
యతో జాయతే పాల్యతే యేన విశ్వం – తమీశం భజే లీయతే యత్ర విశ్వమ్ || ౫ ||
న భూమిర్న చాపో న వహ్నిర్న వాయుర్న చాకాశమాస్తే న తంద్రా న నిద్రా |
న చోష్ణం న శీతం న దేశో న వేషో – న యస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే || ౬ ||
అజం శాశ్వతం కారణం కారణానాం – శివం కేవలం భాసకం భాసకానామ్ |
తురీయం తమఃపారమాద్యంతహీనం – ప్రపద్యే పరం పావనం ద్వైతహీనమ్ || ౭ ||
నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే – నమస్తే నమస్తే చిదానందమూర్తే |
నమస్తే నమస్తే తపోయోగగమ్య – నమస్తే నమస్తే శ్రుతిజ్ఞానగమ్య || ౮ ||
ప్రభో శూలపాణే విభో విశ్వనాథ – మహాదేవ శంభో మహేశ త్రినేత్ర |
శివాకాంత శాంత స్మరారే పురారే – త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః || ౯ ||
శంభో మహేశ కరుణామయ శూలపాణే – గౌరీపతే పశుపతే పశుపాశనాశిన్ |
కాశీపతే కరుణయా జగదేతదేకస్త్వం హంసి పాసి విదధాసి మహేశ్వరోఽసి || ౧౦ ||
త్వత్తో జగద్భవతి దేవ భవ స్మరారే – త్వయ్యేవ తిష్ఠతి జగన్మృడ విశ్వనాథ |
త్వయ్యేవ గచ్ఛతి లయం జగదేతదీశ – లింగాత్మకే హర చరాచరవిశ్వరూపిన్ || ౧౧ ||



ఆపాతాళనభఃస్థలాన్త భువన బ్రహ్మాండ మావిస్ఫురత్
జ్యోతిః స్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు వాన్తామృతైః
అస్తోకాప్లుతమేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్
ధ్యాయేదీప్సితసిద్ధయేత్ ధ్రువపదం విప్రోభిషించే ఛ్ఛివమ్!!
బ్రహ్మాండ వ్యాప్తదేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగైః
కంఠే కాలాః కపర్దాః కలితశశికలాశ్చండ కోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్షమాలాః సలలితవపుషాశ్శాంభవామూర్తిభేదాః
రుద్రాః శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవాః నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్!!



  •  मक्खन और सप्ताह के सौंदर्य में वृद्धि
  • మజ్జిగ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో కెలోరీల సంఖ్య తక్కువగా ఉండి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది.


  • మజ్జిగను మన కురులకు పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత తలా స్నానం చేస్తే కురులు నిగనిగలాడుతాయి.
  • మజ్జిగను చర్మానికి రాసుకొని ఒక అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.
  • అలాగే మజ్జిగను చర్మానికి రాసుకోవడం వలన చర్మం కూడా చాలా మృదువుగా మెరిసిపోతుంది.



  • ఈ మధ్య చాలా మంది బ్యూటిషియన్లు కురులకు, చర్మానికి… అందం పెంపొందించే విషయంలో వారి కష్టమర్లకు మజ్జిగను వాడుతున్నట్టు చాలా మంది తెలియజేశారు.
  • శీతాకాలంలో, వర్షాకాలం లో పెరుగు కానీ మజ్జిగ కానీ మనం ఆహారంలో తీసుకుంటే జలుబు చేస్తోంది అనుకుంటారు కాని మజ్జిగ వలన జలుబు తొందరగా తగ్గుతుంది.



  • మజ్జిగలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.
  • ప్రతిరోజూ మజ్జిగని మొహానికి రాసుకోవడం వల్ల మొహంపై ఉండే నల్లటి మచ్చలు వారం రోజుల్లో తొలగిపోతాయి.
 छाछ त्वचा बहुत अच्छा बनाता है। यह संख्या कम है क्योंकि प्रतिरोधक क्षमता कैलोरी में उच्च है।
    
20 मिनट के बाद, अगर हम अंततः niganigaladutayi प्राप्त छाछ में से प्रत्येक पर एक स्नान ले लिया।
    
त्वचा रोगों में गिरावट के आधे घंटे के बाद छाछ का एक स्नान में त्वचा के लिए रास्ता है।




    
छाछ भी त्वचा के साथ ही त्वचा और स्पार्कलिंग लिखने के लिए बहुत नरम है।
    
यह सबसे byutisiyanlu आखिरकार, आपकी त्वचा की सुंदरता को बढ़ाने के बीच में है ... छाछ उनकी kastamarlaku के कई में प्रयोग किया जाता है कहा।



 सर्दियों में, बरसात के मौसम में वृद्धि हुई है, लेकिन ठंड छाछ पर है, लेकिन हम भोजन नहीं लेना चाहते हैं, लेकिन ठंड छाछ जल्दी गिरने की वजह से।
    
छाछ सुनिश्चित करने के लिए काम करेंगे पाचन तंत्र में पोषक तत्वों है कि।
    
सप्ताह के दौरान छाछ का चेहरा हर दिन पर काले धब्बे और चेहरे विनिमय हटा।