Friday, 30 December 2016

యమలోకం టు భూలోకం...
* యమలోకంలో హైఅలర్ట్...
* యమపాశము, కాలపాశము, దున్నపోతులు మరిన్నికొనుగొలు...
* యమపూరి సిబ్బందికి సెలవులు రద్దు..
* సెలవుల్లో వున్నవారు తక్షణమే విధులకు హాజరు కావాలని ఆదేశాలు..
* ఉన్నతాధికారులతో యముడు సమీక్ష...

డిసెంబర్ 31 రద్దీ నేపథ్యంలో యమలోకం అప్రమత్తమయ్యింది ..ఉన్నతాధికారులతో శుక్రవారం యముడు సమీక్ష నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్ప తాగి ప్రమాదాల్లో పోయే కుర్రాళ్ళను ఎప్పటికప్పుడు తీసుకువచ్చేందుకు సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు..అవసరమైతే దినసరి వేతనానికి అదనపు సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు...మద్యం అలవాటు వున్న భటులను భూలోకానికి పంపించవద్దని సూచించారు.
.
ఆసుపత్రులు..గొడవలు జరిగే ఏరియాల్లో ప్రత్యేక దళాలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు ..మద్యం దుకాణాల వద్ద గస్తీ ముమ్మరం చేయాలని చెప్పారు ...ఎక్కువుగా తాగే కుర్రాళ్ళను గుర్తించి అవసరమైతే వాళ్ళ బండ్లు వెనక భటులను పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు...రాత్రి 12 దాటిన తర్వాత భటులకు పనిభారం పెరుగుతుందని అయినా అలసట చెందకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు...ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడి జాబితా సిద్దం చేయాలన్నారు...ఎంతమందిని తీసుకువచ్చినా ఇబ్బంది లేదని యమలోకంలో రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేసామని చెప్పారు..
.
కుర్రాళ్ళు ఎక్కువుగా వుండే అవకాశం వున్నందున వారి కోసం ఇంటెర్నెట్ సదుపాయం కల్పించామని చెప్పారు...రావడానికి మారం చేసే వాళ్ళపై కటినంగా వ్యవహరించాలన్నారు..గత యేడాది మందు ఎక్కువై కాలవల్లో పడిపోయిన వారిని కూడా భటులు పొరపాటున తెచ్చి తొక్కిసలాటకు కారణం అయ్యారని గుర్తు చేసారు..
.
ఈ సారి అలాంటి తప్పిదం జరగకుండా చూడాలని అన్నారు...కొంత మంది అమ్మ కావాలి నాన్న కావాలి చెల్లిని అక్కని చూడాలి అని ఇబ్బంది పెడతారని వాళ్ళ మాటలు నమ్మవద్దని అన్నారు..వాళ్లకి నిజంగానే ప్రేమ వుంటే అంతలా తాగి బండి నడపరని ఈ విషయాన్ని భటులు గుర్తించాలన్నారు....లక్కీ డ్రాప్ అంటూ వాళ్ళు తాగే చివరి మందు చుక్కలు వాళ్ళ అమ్మ నాన్న కన్నీటి చుక్కలని ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పొద్దని అన్నారు...ఒక్క రాత్రి వారి ఆనందం అయినవారికి ఎన్నో రాత్రుల విషాదమనే విషయాన్ని ఎట్టి పరిస్తితుల్లో వారికి తెలియనివ్వోద్దని యముడు ఆదేశించారు..ఈ సమీక్షలో చిత్రగుప్తుడు, యమలోక ఉన్నతాధికారులు, సీనియర్ పాపులు పాల్గున్నారు...

శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం” ఎక్కడవుందో..?

శ్రీ లక్ష్మీ నారాయణి “స్వర్ణ దేవాలయం” తమిళనాడు రాష్ట్రంలో వేలూరు “మలైకుడి” అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది. చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
దీని నిర్మాణసారధి “నారాయణి అమ్మ” అనే స్వామి. ఆయనను “శక్తి సిద్ధ” అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ స్వర్ణ దేవాలయం 55,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది. దీని “గర్భ గుడి” సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలు సిసలైన “బంగారం”తో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం వలన దీనికి “స్వర్ణ దేవాలయం”అని పేరు వచ్చింది. ఆలయ ఆవరణం “నక్షత్రం” ఆకారంలో ఉంటుంది. గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహిబ్ నుండి సేకరించిన శ్లోకాలతో పొందుపరచ బడి ఉంటాయి.
ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ “ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు”. కాని “శ్రీ విద్య” అనే ప్రాచీనమైన, అరుదైన “శక్తి పూజా” విధానాన్ని అనుసరిస్తారు.
నారాయణి అమ్మ స్వామి ఏర్పాటు చేసిన సంస్థకు సుమారు ఆరు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు దీని ద్వారానే లభించాయని ఆయన తెలియజేశారు. ఆయన అంతకు మునుపే పేదరిక నిర్మూలనకూ, వికలాంగులకూ సహాయం చేశారు. మూడు కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్న దాదాపు 600 దేవాలయాలను “జీర్ణోద్ధరణ” కూడా కావించారు.
ఇక్కడ విశేషమేమంటే, ఈ దేవాలయములో గర్భగుడికి “మూడు వైపులా” నీరు, ఒకవైపు ద్వారం వుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఆ నీటిని పవిత్రమైనదిగా భావిస్తారు.
శుభం భూయాత్.!

స్థిరమైన ఐశ్వర్యం కోసం…..

ఆకుపచ్చ చీర కట్టుకున్న శ్రీ మహాలక్ష్మికి ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టు ఉండే చిత్రపటాన్ని తూర్పు వైపు ఉంచి, రోజూ మహాలక్ష్మి అష్టకం చదవాలి. ప్రతి శుక్రవారం తులసిమాల వెయ్యాలి. దీనివల్ల లక్ష్మి చాంచల్యం తగ్గి స్థిరమైన ఐశ్వర్యం లభిస్తుంది.

మనసులోని కోరిక నెరవేరాలంటే……

ఏదైనా మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి 21 రోజులు ఆంజనేయస్వామి చిత్రపటం ముందు సీతారామస్తోత్రాన్ని 11 మార్లు పారాయణ చేయాలి. చివరిరోజు హనుమంతుడికి అప్పాలు నైవేద్యంగా పెట్టాలి.
శ్రీ సీతారామ స్తోత్రమ్
——————-
అయోధ్యా పుర నేతారం మిథిలా పుర నాయికాం !
రాఘవాణాం అలంకారం వైదేహీనాం అలంక్రియాం !!
రఘూణం కుల దీపం చ నిమీనం కుల దీపికం !
సూర్య వంశ సముద్భూతమ్ సోమ వంశ సముద్భవాం !!
పుత్రం దశరథస్యాద్యమ్ పుత్రీం జనక భూపతే!
వసిష్టాను మతాచారం శతానంద మతానుగం !!
కౌసల్యా గర్భ సంభూతం వేడి గర్భోదితం స్వయం !
పుండరీక విశాలాక్షం స్ఫురదిందీ వరేక్షణాం !!
చంద్రకాంతాననాంభోజం చంద్ర బింబోపమాననం !
మత్త మాతంగ గమనం మత్త హంస వధూ గతాం !!
చందనార్ద్ర భుజా మధ్యం కుంకుమార్ద్ర కుచస్థలీం !
చాపాలంకృత హస్తాబ్జం పద్మాలంకృత పాణికాం !!
శరణాగత గోప్తారం ప్రణిపాత ప్రసాదికాం !
కాలమేఘ నిభం రామం కార్త స్వర సమ ప్రభాం !!
దివ్య సింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్ర భూషణాం !
అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్య క్షణ కాంక్షిణూ !!
అన్యోన్య సదృశాకారౌ త్రిలోక్య గ్రహ దంపతి !
ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం !!
అనేన స్తోతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః !
తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !!
ఏవం శ్రీరామ చంద్రస్య జానక్యాశ్చ విశేషతః !
కృతం హనుమతా పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదం
యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వాన్ కామనవాప్నుయాత్ !!
ఇతి శ్రీ సీతారామస్తోత్రం సంపూర్ణం.
శ్రీరామ మంత్రం.. పవిత్రం !
|| శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||
సాక్షాత్తు వైకుంఠనాధుడైన శ్రీమన్నారాయణుడు.. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్ధం స్వయంగా త్రేతాయుగాన ఎత్తిన అవతారమే శ్రీరామావతారం. సకల దేవతలకు ఆదిమూలం.. సకల జగాలకు ఆరాధ్యదైవం అయిన అంతటి శ్రీహరిమూర్తియే స్వయంగా శ్రీరామునిగా భువికి యేతెంచినాడని పురాణాలు తెలుపుతున్నాయి.
భువిలో నరుడి వలే తనే స్వయంగా కష్టసుఖాలను అనుభవించినట్లు ఈ రామావతారంలోని అంశాలు మనకు తెలుపుతాయి. అంతటి మహిమాన్వితుడైన శ్రీరాముడ్ని పూజిస్తూ జపించే ధ్యానమే ఈ మంత్రం. ఈ మంత్రం అందరికి శుభాలను చేకూర్చడమే కాకుండా.. అన్యాయం కాని.. ఎలాంటి విషయాలైనా సరే మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని జపించి కోరుకుంటే అది నేరవేరుతుందని భక్తుల విశ్వాసం.
సహస్రనామార్చనలకు... సకల మంత్రాలకు ఈ మంత్రం సమానమైనదని భావిస్తారు. ఒక్క శ్రీరామ మంత్రం చాలు ఎన్ని అడ్డంకులనైనా సంతోషంగా, తేలికగా ఛేదించగలరని.. ప్రతీతి.

శనివారం స్వామిని ఇలా పూజిస్తే మీకు పట్టిన శని వదిలి అన్ని పనుల్లో విజయం సాధిస్తారు..

శనిదోష నివారణ కోసం శనివారం ఆంజనేయ స్వామి పూజ.!
శనిదోషం ఉన్నవారు సదరు దోష నివారణ కోసం ఆంజనేయ స్వామి పూజ చేస్తే ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణకథ ప్రకారం, ఓసారి శని, ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడట.
అప్పుడు శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర ఏళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది.
ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు – శనివారం, మంగళవారం మరియు గురువారం.

శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోను మందవారం అని పిలువబడే.. శనివారం శ్రేష్టమైనది. “సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః
హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః”
అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడు అని అర్ధం. శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారంనాడు రుద్రమంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధసింధూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడు అని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రు జయం కల్గి మిత్ర సమృద్ధి హెచ్చి, యశోవంతులైన పుత్రులు కలుగుతారు.
మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో ఏ మాసంలోనైనా కాని, కార్తీక శుద్ధ ద్వాదశినాడు కాని శనివార వ్రతం చేయాలి. శనివారవ్రత విధానం : ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని, కొత్త పాత్రలతో బయటి నుండి నీరు తెచ్చుకొని హనుమంతునికి అభిషేకం చేయాలి. అన్ని వర్ణాలవారు, స్త్రీలు కూడా చేయవచ్చు. నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి. అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యథావిధిగా జపించాలి. దీనివల్ల జనవశీకరణ కలుగుతుంది. ధనలాభం, ఉద్యోగప్రాప్తి, కారాగృహ విమోచనం లభిస్తాయి.

ఐశ్వర్యా రాయి ఆత్మహత్యాయత్నం గురించి లీక్ చేసింది ఎవరో తెలుసా?

ఐశ్వ‌ర్య రాయ్ రీసెంట్‌గా ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేశార‌నే వార్త హల్చల్ చేస్తుంది. కారణం కుటుంబ సభ్యులతో సమస్యల వలనే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందని వార్తలు వస్తున్నాయి. ఈమె సినిమాలో రీ ఎంట్రీ అంత సక్సెస్ కాకపోవడమే కాకుండా, ఇటీవల నటించిన యే దిల్ హై ముష్కిల్‌ సినిమాలో హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో కలిసి కొన్ని ఇంటిమేట్ సీన్‌ల‌లో న‌టించడంతో ఇది వివాదాస్ప‌దంగా మారింది. ఈ విషయంలో అమితాబ్ భార్య జయాబచ్చన్ చలా సీరియస్ గా తీసుకున్నారంట.
 అక్కడ నించి అత్తాకోడళ్ళు ఇద్దరికీ సరిగ్గా పడటం లేదని, ఈ ప్రెజర్ తట్టుకోలేక ఐషూ ఇలా చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇంట్లో అంద‌రూ ఉండ‌డంతో ఆమె సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డింద‌ని బాలీవుడ్ మీడియా క‌బురు. ఆ త‌ర్వాత డాక్ట‌ర్‌ల‌ను పిలిచి ఆమెకు ట్రీట్‌మెంట్ ఇప్పించార‌ట‌. ఇప్పుడు ఆడాక్టర్ తను ట్రీట్మెంట్ చేసిన సంగతి లీక్ చెయ్యడంతో ఈమేటర్ బయటపడిందని సోషల్ మీడియాలోనూ, వెబ్సైట్స్లోను న్యూస్ వస్తుంది… అయితే ఇంతవరకు ఏపెద్దమీడియా ఈన్యూస్ జోలికి వెళ్లలేదు.